అగర్వాల్ గారి ఇంటి మీద Income tax అదికార్ల రైడ్ జరిగింది.
పొద్దుటే 5.00 గంటలకి కాలింగ్ బెల్ కొట్టి, మఫ్టీలో ఇంట్లో కొచ్చిన అదికార్లు
ఫోన్ కట్ చేశారు. అందరి వద్ద నుండి సెల్ ఫోను లు స్వాదినం చేసుకున్నారు.
పొలైట్ గా మాట్లాడారు తమతో వచ్చిన డాక్టర్ గారి చేత వైద్య పరీక్షలు చేయించారు. బిపి కి మాత్రలు ఇచ్చారు. టిఫిన్ తెప్పించి పెట్టారు. అది వాళ్ళ సర్వీస్ రూలు.
ఎటువంటి మెడికల్ అవాంఛనీయ సంఘటనలు జరగ కుండా జాగర్తలు తీసుకున్నారు.
సోదా మొదలెట్టారు. ఏక సమయం లో ఆయన షాపు మూడు ఇండ్ల మీద జరిగిన దాడి లో మొత్తం పద్దెనిమిది మంది అదికారులు ఎనిమిది గంటల పాటు శోదించారు.
అనుభవజ్ఞుడయిన అగర్వార్ ఆడిటర్ చూపించిన వాటికి, వాస్తవానికి చెప్పుకోదగ్గ తేడాలు ఏమి లేవు.
చివరాఖరు ఫైనల్ గా కుక్కలకి 40000 రూపాయల జిలేబి తినిపించినట్లు చూపిన ఖర్చు కింద రెడ్ ఇంకు తో అండర్లైన్ చేశారు.
"ఇది వింతగా లేదు? కుక్కలకి జిలేబినా? "
***
***
***
"అగర్వాల్ జీ ఒక యాబై వేలు ఖర్చులకి ఇస్తే .. అంతా సవ్యంగా ముగుస్తుంది" డ్రైవరు చేత చెప్పించారు.
అగర్వాల్ అంగీకరించాడు.
అనుకున్నది కాగితం లో చుట్టి చేతులు మారాక రైడ్ పూర్తి అయ్యింది.
ఎవరి ఫోన్ లు వారి కిచ్చారు.
అగర్వాల్ వెంటనే ఒక కాల్ చేసి " ఆడిటర్ గారు కుక్కలు మరో యాబై వేల రూపాయల జిలేబి తిన్నట్లు ఇవాళ ఖర్చు లో రాయండి "
#susri

1 comment:
అద్భుతం. కరప్షన్, కరప్షన్ని పెంచి పోషిస్తుంది.కుక్కలు జిలేబీలు తింటూనే ఉంటాయి.
Post a Comment