Sunday 25 October 2015

తవ్వతో

ఎండన బడి ఇంటికొచ్చి మమ్మాయి చేసిన మైదా అన్నం లో మజ్జిగ పులుసు వేసుకి తిని అలా నడుం వాల్చానో లేదో .. మా గుండమ్మ ఒక కారీ బాగ్ తీసుకొచ్చి మంచం మీద కుప్పగా పోసింది. 
రంగు రంగుల గుడ్డలు ఉన్నాయి అందులో.
మనం గమనించ కుండా అటు తిరిగి పడుకున్నామనుకో ..
అదేం ఖర్మో అప్పుడే దోమ వాలుద్ది మన వీపు మీద...
నిలువు గుడ్లు వేసుకుని చూస్తా ఉంటే.. 
"జాకెట్టు ముక్కలండి ఈ మధ్య వెళ్ళిన పెళ్లిళ్ల లోనూ, మన ఫ్రెండ్స్ ఇళ్లకెళ్లినప్పుడు తాంబూలాలతో పాటు వచ్చినవి. మొత్తం పద్నాలుగు"
నాకు పద్నాలుగు లోకాలు చూపించే వ్యవహారం ఏదో ఉందని మనసు హెచ్చరిస్తున్నా
నాలుక ఉంది చూసారూ ..
"ఈ రెండు కలర్స్ బలే ఉన్నాయి " నోటి దూల మనం ఊరుకోముగా?
"లేవండి బజారు కెళ్ళి మాచింగ్ చీరలు తచ్చుకుందాం. మీకు నచ్చాయిగా ఈ రెండు "
దీన్నే ఇంగ్లీష్ లో తవ్వతో .... డాష్ ... అంటారని రఘురాం చెప్పాడు మొన్నో సారి.

No comments:

www.susri.home.blog

  అందరికీ నమస్తే 66o పోస్టులు పైగా వ్రాసిన ఈ బ్లాగ్ లోని నా పోస్ట్ లలో  చాలా అచ్చుతప్పులు ఉండటం గమనించాను.  వాటన్నిటినీ ఎడిట్ చేస్తూ, modify...