బాగా రద్దీగా ఉండే
ప్రాంతం లో ఉన్న ఇరుకయిన దారులతో ఉన్న చిన్న చిన్న షాపుల సముదాయం.
చెన్నై లో పారిస్ సెంటర్
ని గుర్తుకు తెస్తూ..
ఒక్క దుకాణం లో ఒక్కో
రకం వస్తువులు.
కమర్షియల్ టాక్స్ ఆఫీసు
లో పనిచేసే మాధవరావు ఆఫీసుకి కొత్తగా లీజు కి తీసుకున్న గోదాముకి తాళాలు కొనటానికి వెళ్ళాడు. ఇస్మాయిల్ షాపు
ఫేమస్ అని విని, ఫిక్షెడ్ రేట్లు కి మన్నికయిన వస్తువులు దొరుకుతాయి అని వెతుక్కుంటూ
వచ్చాడు.
ఆఫీసుకి అవసరం అయినవి
కొని నెలాఖరు లోగా కంటింజెంటు బిల్లు
పెట్టుకుంటుంటాడు.
రద్దీగా ఉన్న షాపు కి వెళ్లి తనని తానూ పరిచయం ఒక
మెట్టు ఎక్కువగానే చేసుకున్నాడు.
నాణ్యమయిన తాళాలు మొత్తం ఎనిమిది తీసుకున్నాడు.
కొత్తగా వచ్చిన మాగ్నెటిక్ తాళం ఒకటి చూయించాడు షాపులో కుర్రాడు. తాళం చెవి కప్పకి
అంటించి ఉంచితే చాలు తాళం తెరుచుకునుంది. చీకట్లో తాళం తీయటం సులువు.
“ఇది ఒకటి ఇవ్వండి. ఊర్లో ఉన్న మా అమ్మ కి ఇస్తాను.
ఆవిడ కి సులువుగా ఉంటుంది.”
ఒక పదినిమిషాల్లో అతని షాపింగ్ ముగిసింది. ఇస్మాయిల్
బిల్లు వ్రాయబోతుంటే.. “ఇరవై పర్సెంట్ రేటు ఎక్కువ కి బిల్లు తయారు చేయండి”
చెప్పాడు మాధవరావు.
“మన్నించండి. అలా ఇవ్వను. ఎంత తీసుకుంటానో దానికే
బిల్లు ఇస్తాను” పుస్తకం మూస్తూ చెప్పాడు ఇస్మాయిల్.
“నేను ఎవరో తెలుసా?” అడిగాడు మాధవరావు.
“అంతదూరం ఎందుకండీ? మా పద్దతి నచ్చకుంటే మరొ చోట
తీసుకోండి.” ఇస్మాయిల్ సౌమ్యంగా చెప్పాడు.
పది నిమిషాలు వాదన జరిగాక మాధవరావు ఓడిపోయి
బిల్లు చెల్లించి తాళాలు తీసుకుని వచ్చేసాడు.
మర్నాడు సెక్షన్ హెడ్ కి బిల్ల్స్, తాళాలు
సబ్మిట్ చేస్తుంటే.. “ఓహ్ ఇస్మాయిల్ షాపు లోనా? క్వాలిటీ ఉంటాయి.” అన్నాడాయన.
“బిల్లు మనకి కావలసినట్లు ఇవ్వలేదు.” మాధవరావు
అసంతృప్తిగా చెప్పాడు.
“ఆతను ఇవ్వడు. ఎథిక్స్ ఉన్న మనిషి. నాకు బాగా
పరిచయం .. మా వీధిలో ఆంజనేయ స్వామి వారి దేవాలయానికి తాళాలు కొనటానికి వెళ్ళినపుడు
పరిచయం అయింది.” మాధవరావుని చూస్తూ
చెప్పాడు సెక్షన్ హెడ్.
“ఇంకో విషయం. దేవాలయాలకి, వ్రుద్దాశ్రమాలకి ,
మసీదులకి, స్కూల్స్ కి డబ్బు తీసుకోడు.”
మాధవరావు కి తను చాటుగా తెచ్చుకున్న మాగ్నెటిక్ తాళం కి ఇస్మాయిల్ బిల్
ఎందుకు వేయలేదో అర్ధం అయింది.
#susri 01_02_2018
No comments:
Post a Comment