Friday, 26 August 2016

లేటు ..వయసు

1970 పి‌వి‌ఆర్ హై స్కూల్ లో పదో తరగతి చదివిన వాళ్ళందరూ గెట్ టు గెదర్ ఏర్పాటు చేసుకున్నారు.
చాలా దూర ప్రాంతాలనుండి, 45 ఏళ్ల తర్వాత అందరూ కలిశారు. వివిద ఉద్యోగాలు చేసి రిటైల్ అయ్యి సీనియర్ సిటిజన్స్ దశలో ఉన్నారు అందరూ.
ప్రారంభం లో తమ నుండి వెళ్ళిపోయిన సహచరులకి నివాళి ఘటించారు. 
రెండు రోజుల పాటు పాత జ్నాపకాలు తవ్వి పోసుకున్నారు.
అప్పటి నిక్ నేమ్స్ తో ప్రేమగా పలకరించుకున్నారు. 
ఆంజనేయులు, రాజ్యం మళ్ళీ కలిశారు. అప్పట్లో మూగ ప్రేమ గురించి మాట్లాడు కున్నారు. ఇద్దరు ఒంటరిగా మిగిలి పోయిన విషయాన్ని పంచుకున్నారు. 
ఒకరి నొకరు ఓదార్చుకున్నారు. 
మనం మళ్ళీ పెళ్లి చేసుకుందాంఅన్నాడు ఆంజనేయులు.
రాజ్యం చొట్ట బుగ్గలు లోకి గాలి నింపుకుని నవ్వింది. 
అలాగేఅంది ఎక్కువ సేపు ఆలోచించకుండా.
ఆ రాత్రి 'కాంటినెంటల్ హోటల్' లో బస చేసిన ఆంజనేయులు కి నిద్ర పట్టలేదు. 
ఉదయం బెడ్ కాఫీ తాగేటప్పుడు రాత్రి తను రాజ్యానికి ప్రపోసే చేసిన విషయంగుర్తొచ్చింది. 
ఆమె అవునుఆందో కాదుఆందో మాత్రం ఎంతమాత్రం గుర్తుకు రాలేదు. 
చాలా సేపు తర్జన బర్జన పడి ఫోన్ లో వాయిస్ సర్చ్ లో కాల్ స్వీట్ హార్ట్ రాజీ అని చెప్పాడు. ఫోన్ కనెక్ట్ అయింది. 
సారి రాజీ రాత్రి నేను ప్రపోజ్ చేసినప్పుడు నువ్వు యెస్అన్నావో నోఅన్నావో గుర్తుకురాక ఫోన్ చేశాను.
నువ్వేమి మారలేదు అంజీ యెస్అని మనస్ఫూర్తిగా చెప్పాను
ఆంజనేయులు ఆనందం గా ఫోన్ కట్ చెయ్యబోతుంటే రాజ్యం అంది.
నువ్వు ఫోన్ చెయ్యటం మంచిదయింది. రాత్రి ఎవరు ప్రపోజ్ చేశారో గుర్తుకురాక నిద్ర లేచినప్పటినుండి బుర్ర బద్దలు కొట్టుకుంటున్నాను


No comments:

www.susri.home.blog

  అందరికీ నమస్తే 66o పోస్టులు పైగా వ్రాసిన ఈ బ్లాగ్ లోని నా పోస్ట్ లలో  చాలా అచ్చుతప్పులు ఉండటం గమనించాను.  వాటన్నిటినీ ఎడిట్ చేస్తూ, modify...