Monday, 15 August 2016

శాంతి దూత

సాయిబాబా ఛారిటీ స్కూల్ లో 70 వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి.
కమిటీ సభ్యులు దాతలు అతిదులు (నేనున్నానని చెప్పక్కర్లేదుగా J ) పిల్లలని ఉత్తేజ పరుస్తూ చక్కటి మాటలు వారి భాషలో చెప్పారు. జాతి నిర్మాణానికి ఇప్పటి నుండే పిల్లలు నిర్వహించాల్సిన భాద్యతలు గుర్తు చేశారు. ప్రత్యేకంగా వచ్చిన ఒక అతిది శాంతి దూత లా  “శాంతి గురించి చాలా చక్కగా చెప్పారు. అహింస గురించి ఓపికగా వివరించారు, వ్యక్తిగత హింసకి పాల్పడినప్పటికి శాంతి యుతంగా గాంధీ మార్గంలో ప్రజలు నడిచి నట్లయితే స్వాతంత్ర మనకి ఇంకా ముందే వచ్చి ఉండేది అని నమ్మకంగా చెప్పారు”

చక్కగా తయారయి, యూనిఫార్మ్ ల లో ఉన్న చిన్న పిల్లలు చక్కటి శ్లోకాలు, సామెతలు, పాటలు, ప్రార్ధనలతో వేదిక పులకించింది. పిల్లలకి కొన్ని ప్రోత్సాహక బహుమతులు పంపిణీ చేశారు. అందరికీ తినుబండారాల పాకెట్లు ఇవ్వబడ్డాయి. వందన సమర్పణ సరిగ్గా 11-00 కి పూర్తి అయ్యింది. విసురుగా గాలి మొదలయింది.
స్కూల్ పక్క నున్న మేడ మీద పక్షుల ఆహారం కోసం ఉంచిన ప్లాస్టిక్ గిన్నె ఒకటి గాలికి ఎగురుకుంటూ వచ్చి, శాంతి దూత గారి తలకి తగిలింది. మేడ మీద నుండి ఒకతను తొంగి చూశాడు.
“ఎవడ్రా అది .. పుండాకోర్ గిన్నె విసిరింది “ అంటూ అతని మీద విరుచుకు పడ్డాడు అతిది.

పిల్లల మనసుల్లో కొత్త ప్రశ్నలు మొలకెత్తకుండా నేను, ఓబులరెడ్డి మాస్తారు అడ్డుగా నిలబడ్డాము.

No comments:

www.susri.home.blog

  అందరికీ నమస్తే 66o పోస్టులు పైగా వ్రాసిన ఈ బ్లాగ్ లోని నా పోస్ట్ లలో  చాలా అచ్చుతప్పులు ఉండటం గమనించాను.  వాటన్నిటినీ ఎడిట్ చేస్తూ, modify...