Sunday, 14 August 2016

ఒక్క రూపాయి.

అయిదారేళ్ళ క్రితం ఒక రోజు ఉద్యోగరీత్యా పర్చూరు శాసన సబ్యులు దగ్గుబాటి వేంకటేశ్వర రావు గారిని కలవటానికి పర్చూరు వెళ్లాల్సి వచ్చింది. ఒంగోలు నుండి చీరాల వరకు కృష్ణ ఎక్స్ ప్రెస్  లో వెళ్ళాను. అక్కడ దిగి పక్కనే ఉన్న బస్ స్టాండ్ లో బయలుదేరిన బస్సు రన్నింగ్ లో ఎక్కాను. బస్సులో మిగిలిన ఒక్క సీట్లో కూర్చున్నాను.
కొద్ది దూరం వెళ్ళాక బస్సు ఆపి కండెక్టర్ ఒక ముసలావిడ ని ఎక్కించాడు. ఆమె వద్ద ఉన్న మెత్తాళ్ళ(ఎండబేట్టిన చిన్న రొయ్యలు) గోతం ముక్కు పుటాలు అదరేస్తుంది. ఎవరయినా లేచి సీటు ఇస్తారేమో నని చూసా గాని ఎవరూ ఇవ్వలేదు. అందాకా ట్రైన్ లో నిలబడే ప్రయాణం చేశాను. లేచి నిలబడాలని పించలేదు. పైగా ఎం‌ఎల్‌ఏ గారి తో మాట్లాడటానికి కొంత ప్రిపేర్ అవాల్సి ఉంది. ఆవిడ అక్కడే కొద్దిగా స్థలం చూసుకుని కింద కూర్చుండి పోయింది.
కొద్దిసేపట్లో నేను డైరీ చూసుకుంటుండగా కండెక్టర్ టికెట్ అడిగాడు. వాలేట్ తీశాను. ఒక అయిదువందల నోటు మరో పది నోటు మిగిలింది. టికెట్ 11 రూపాయలు. జేబులు ఎంత వెతికినా చిల్లర లేదు జేబులో ..
500 కి చిల్లర లేదు. ఒక్క రూపాయి కావాలి.
అప్పుడు ఆమె తన నడుముకి ఉన్న చిన్న సంచి లోంచి చిల్లర వెతికి రూపాయి ఇచ్చింది. నేను చూస్తూ ఉండిపోయాను. దిగి మరో బస్సు ఎక్కే టంత టైమ్ లేదు. ఏదో తెలీని గిల్టీ ఫీలింగ్.
తీరా కారంచేడు చేరబోయేటప్పటికి వాలేట్ లోని జిప్ కవర్లో ఒక రెండు రూపాయల కాయిన్ ఉండటం గుర్తుకొచ్చింది. అది తీసి ఆమె కి ఇవ్వబోయాను. ఆమె తీసుకోలేదు. వద్దు” అంది. నాకేం చెయ్యాలో పాలు పోలేదు.
బస్సు దిగాను.

విషయం చాలా చిన్నదయినా చాలా సార్లు గుర్తుకొస్తుంది.
..
చిల్లర గురించి మళ్ళీ ఇంత వరకు ఇబ్బంది పడలేదు. ఎప్పుడు బాగ్ లో కొన్ని కాయిన్స్ వేసుకోవటం అలవాటు అయింది.

No comments:

www.susri.home.blog

  అందరికీ నమస్తే 66o పోస్టులు పైగా వ్రాసిన ఈ బ్లాగ్ లోని నా పోస్ట్ లలో  చాలా అచ్చుతప్పులు ఉండటం గమనించాను.  వాటన్నిటినీ ఎడిట్ చేస్తూ, modify...