Friday, 5 August 2016

మరో ఏడు జన్మలు

స్వర్గం లో 'జనరల్ బాడీ' మీటింగు జరుగుతుంది. 
ఒక జటిలమయిన సమస్య చర్చకి వచ్చింది.
చిత్రగుప్తుడు ఈ సమస్యని ప్రవేశ పెట్టాడు. 
పునర్జన్మ సమస్య గురించి.
శ్రావణ మాసం, కార్తీక మాసం మహిళామణులు, మరో ఏడు జన్మల వరకు ఇదే భర్త కావాలని, బొల్దెంత టైమ్ & టెక్నిక్స్ వాడి ఈ జన్మలో తాము ట్రైన్ అప్ చేసుకున్నామని, కనీసం మరో ఏడు జన్మల వరకు వారి సేవలు అనుభవించే హక్కు తమకి ఉందని ఉమ్మడి ఏజండా తో ఉన్నారు.
ఇందులో సమస్యేముంది?” బ్రహ్మ ఆశ్చర్యం.
మగాళ్ల ప్రతినిధిగా చలసాని కిశోర్ దీనికి వప్పుకోవటం లేదు. పండగ నాడు కూడా పాత పెళ్లామేనా? మేం వప్పుకోము అంటున్నాడు. జేబులో ఆల్రెడీ నెక్స్ట్ జన్మ ఛాయిస్ పోటో పెట్టుకు తిరుగుతున్నాడు
సమస్య జఠిలమయ్యింది. అనేక వాదోపవాదాలు, సలహాలు , సూచనలు మైక్ లు విరగ్గొట్టుకోటాలూ, పత్రాలు విసురుకోటాలూ జరిగాయి. 
వెనుక బెంచీ నుండి చాణుక్యుడు లేచి నిలబడ్డాడు. అతని మీద గౌరవం తో అంతా ఒక్క నిమిషం లో సర్దుకుని అతనికి మాట్లాడే అవకాశం ఇచ్చారు. 
వచ్చే ఏడు జన్మలకి ఇదే బర్త ని అంగీకరించండి..
మగాళ్ల అల్లరి మళ్ళీ మొదలయింది. చాణుక్యుడు ఆగమన్నట్లు చూసి అదే అత్త, వాళ్ళే ఆడబిడ్డలు కామన్ పాకేజీ అనౌన్స్ చేద్దాం
ఆడాళ్ళ గొడవ మొదలయింది. వాళ్ళని సముదాయించడం ఎవడివళ్ళా కాదు. 
వాళ్ళు మాట్లాడుతూనే ఉంటారు కానీ మీరు రెడీ అయ్యి ఆఫీసుకి బయలుదేరండి. 
శుబోదయం. మిత్రులందరికి.

No comments: