రాత్రి ఆఫీసునుండి ఇంటికి వచ్చి స్నానం చేసి, కాలనీ కమిటీ మీటింగు కి అటెండయ్యాను.
..
అనేక విషయాలు చర్చకి వచ్చాయి,
సిమెంట్ రోడ్డు ప్రతిపాదన, గుడి అభివృద్ది, గుళ్ళో మంచి నీటి సౌకర్యం,
సేవా టికెట్లు, ఫలహారాలు,
పరిశుబ్రత, కొబ్బరికాయల అమ్మకం,
ఆదాయవనరులు పెంచడం.. ఇలా అనేకం..
..
రాత్రి 11 దాటింది.
సభ్యులు కొంత మంది నిద్రకి అవులిస్తున్నారు..
పగలు
పనులకి వెళ్ళిన ఒకాయన గోడకి ఆనుకుని కునికిపాట్లు పడుతున్నాడు.
అప్పటికే ‘ఏమన్నా ఉంటే మరో మీటింగులో మాట్లాడుకుందాం.’ అని ఒక
బాడీ మెంబరు నన్ను గీరుతున్నాడు.
..
“అన్నీ చర్చించాల్సిందే నని, ఎలాటి రాజీ లేదు” అని నిర్మొహమాటంగా చెప్పాను.
**
మరో పావుగంటకి నాకు Whats
app లో మా పెద్దమ్మాయి నుండి సందేశం వచ్చింది.
“నాన్నా అమ్మ అలక అయిపోయింది. మీరు ఇంటికి
రావచ్చు”
..
మీటింగు వెంటనే ముగిసింది.
No comments:
Post a Comment