Friday, 30 October 2015

రోజ్ కలర్ శాండిల్

ఒక్క క్షణం నా బుర్ర పని చేయలేదు.
డ్రైవింగ్ చేస్తున్న నాకు కాళ్ళ మధ్య కనబడిందా శాండిల్ (లేడీస్ కాలి చెప్పు)
నా బుర్ర మొద్దు బారింది. 
వెనక సీట్లో మా ఆవిడ ఫోన్లో ఎవరో స్నేహితురాలితో మాట్లాడుతుంది.
తన లోకం లో తాను ఉంది.
రాత్రి ఆఫీసు లో లేటయితే మా సెక్రటరీ ని తాను ఉండే యేరియాకి దగ్గర లో వదిలాను.
ఆ టైమ్ లో తనకి బస్సులు దొరకటం కష్టం .. అది ఆ రూట్లో .
ఆమె చీకట్లో దిగుతూ జారవిడుచుకుని ఉండాలి . రాత్రి ఆమెను దించి కారు రివర్స్ చేస్తుంటే ఏదో చెప్పటానికి ఆమె ప్రయత్నించింది కానీ 'థాంక్స్' చెబుతున్నదనుకున్నాను.
కానీ ఈ రోజ్ కలర్ శాండిల్.
ఇంటావిడ జరిగింది చెబితే నమ్మే అవకాశాలు చాలా తక్కువ.
ఆ దీర్గపు మాటలు, అనుమానపు చూపులు.. విసుర్లు .. మౌనాలు .
అబ్బో ఆ నరకం భరాయించేది కాదు.
వత్తిడితో నేను కార్లో ఏ‌సి ని పెంచాను.
అద్దం లోంచి వెనక్కి చూశాను. పెద్దగా నవ్వుతూ మాట్లాడుతోంది.
తను కొన్న హారాన్ని స్నేహితురాలు ఫోన్ లోనే పొగడుతున్నట్లు ఉంది.
ఈమె లోకం మరిచి పోయింది. 'పొగడ్త' అది అని తెలిసినా వీళ్ళు దానికి బానిసలు.
పంజాగుట్ట ఫ్లై ఓవర్ బ్రిడ్జి వద్ద సిగ్నల్ పాయింటు వద్ద కారు ఆగింది.
అద్దం దించి అడుక్కునే అతనికి డబ్బు ఇస్తూ.. అత్యంత చాకచక్యంగా శాండిల్ బయట వేశాను.
హ మ్మ య్య ..
****
ఇంటికి వచ్చి సెల్లార్ లో కారు పార్క్ చేశాను.
ఎంతకీ దిగదే ఈవిడ ..
"ఏమిటి .. ఏమయింది ?"
"నా రోజ్ కలర్ శాండిల్ ఒకటే ఉంది. రెండోది కనిపించడం లేదు. నిన్ననే యెగ్జిబిషన్ లో కొన్నాను."
కార్లో లైట్ వేసి ఆమె వెతక సాగింది.

మాది చచ్చింది

రెండు రోజుల నుండి ఇంట్లో పేట్ డాగ్ కి ఆరోగ్యం బాగా లేదు
తిండి తినకుండా, ఒక మూలకి వెళ్ళి పడుకుంటుంది.
అస్సలు చురుకుతనం లేదు.
దిగులు పడుతున్న బర్త తో చెప్పిందావిడ.
"మొన్న.ఆ మధ్య Kv గారి కుక్కకి కూడా ఇలానే జబ్బు చేసిందట వాళ్ళావిడ దుర్గమ్మ గుడి లో కంపడినప్పుడు చెప్పింది. అదే నండి విజయవాడ పోరంకి ఫ్రెండ్. అతన్ని అడగండి సలహా "
"హలో రావు గారు బాగున్నారా ?'
"మా టామికి &*^%$#----@#@#@"
"సరిగ్గా ఇలానే ఉంటే నేను టర్పెంట్ ఆయిల్ తాగించానండి .. " ఆయన చెప్పేది పూర్తిగా వినకుండానే ఫోన్ పెట్టాడీయన.
వెంటనే పాయింట్ షాపు కెళ్ళి రెండు లీటర్ల టర్పెంట్ ఆయిల్ తెచ్చి గరాటు తో తాగించాడు.
**
తెల్లారే సరికి టామి చచ్చి పోయింది.
వెంటనే ఫోన్ తీసి కోపంగా KV రావుకి ఫోన్ చేశాడాయన.
" మీరు చెప్పినట్టు టర్పెంట్ ఆయిల్ తాగించాను . అది చచ్చి ఉరుకుంది " కోపంగా చెప్పాడు ఇతను.
"నేను చెప్పేది పూర్తిగా వింటేగా ? మాది చచ్చింది " ఫోను పెట్టాడు కే‌వి రావు.
#susri

ఓవర్ కాన్ఫిడెన్స్

వర్షాలు కురవటం కోసం వరుణయాగం చేసే చోటికి ఒక పిల్లాడు రైన్ కోట్ వేసుకుని వచ్చాడు
-------------- అది విశ్వాసం .
ఒక చిన్నారిని తండ్రి గాళ్ళకి విసిరేశాడు. చిన్నారి నవ్వు తూనే ఉంది . నాన్న పొదివి పట్టుకుంటాడని తెలుసు .
-------------- అది నమ్మకం.
ఉదయానికి నిద్ర లేస్తామో లేదో తెలీదు . కానీ అలారం పెట్టుకుంటామ్. 
--------------- అది ఒక ఆశ 
అప్పులు తీసుకుని కారు, ఇల్లు , జువెలరీ కొంటాం. ఉద్యోగం ఉంటుందో ఉడ్డుద్దో తేలిక పోయినా 
---------------- అది కాన్ఫిడెన్స్ 
అందఋ మొగుళ్ళూ గుండమ్మల చేతిలో నలిగి పోతున్న విషయం చూస్తూ.. మన కి అదే ముచ్చట జరగబోతుందని తెలిసీ, పెళ్ళికి సిద్దపడతాం.
-------------------- అది ఓవర్ కాన్ఫిడెన్స్ 

Thursday, 29 October 2015

రేడియేటర్ వేడెక్కింది.

ఒక సైక్రియాటిస్ట్ కి ఫోన్ వచ్చింది.
" సర్,,నేను 26 ఏండ్ల వివాహితని .ఈ ఉదయం నేను మా .పాప ని చూస్తుండమని మా పనిమనిషికి చెప్పి అత్యవసరంగా అరగంట డ్రైవ్ దూరం లో ఉన్న మా పేరెంట్స్ వద్దకి నా కారు లో బయలు దేరాను. రెండు కిలోమీటర్లు వెల్లనో లేదో కారు ఇంజను వేడెక్కింది. ఇంజన్ జామ్ అవుతుందని భయం వేసి ఇంటివద్ద ఉన్న మా వారి కారు తీసుకెళ్దామని ఇంటికొచ్చాను.
.. (కొద్ది క్షణాలు మౌనం) ఆయన పని మనిషితో ...
నేనేమీ చేయను ? సలహా ఇవ్వండి ?"
***
" మీరు నేను చెప్పినట్లు చేయండి. కారు రెగ్యులర్ గా సర్వీస్ చేయించండి. బయలు దేరే ముందు రేడియేటర్ లో నీళ్ళు ఉన్నాయో లేదో చెక్ చేసు కొండి. వీలయితే కూలింగ్ వాటర్ వాడండి.
ఇది సహజంగా కారు ఇంజన్ కూలింగ్ ఆయిల్ సర్కులేట్ అయ్యే సమస్య. మంచి మెకానిక్ ని కలసి సలహా పొందేత వరకు నా సమాదానం ఉపయోగ పడుతుందని భావిస్తున్నాను. కాల్ చేసి అందుకు దన్యవాదాలు "

గుండమ్మ కోరిక

ఒక గుండమ్మ (అభిమాన అత్తగారు సూర్యకాంతం పుట్టినరోజు ఇవాళ ) 
మొగుడుని అప్పడాల  కర్రతో వెంటాడేటప్పుడు కర్ర జారీ  ..
చూరు మీద నుండి పాతకాలం లాందరు దొర్లి కింద పడింది.

తరవాత కొంత కధ అందరికీ తెలిసిందే ..
..
దాన్ని చింతపండు తో తోమటం.....
..
పొగరావటం..ఒక భీకరాకారం రావటం ..
..
ఏమి కావలెనో కోరు కొమ్మనటం ...
..
ఇక్కడా అంతా షరా మామూలే....

..
గుండమ్మకి ఏమి కావాలో చెప్పటం మొదలెట్టింది...

.
* పెనిమిటి నన్ను తప్ప ఎవర్ని చూడ కూడదు. ముఖ్యంగా వంగినప్పుడు పని పిల్లని, .

స్కూటర్ తీసేటప్పుడు పక్కింటి దాన్ని etc 
..
* ఎప్పుడు నావయిపే చూస్తుండాలి. నన్ను ఎప్పుడు తన చేతుల్లో ఉంచుకోవాలి...

,,
* నాతో ప్రేమగా మాట్లాడాలి.

.
* నిద్ర లేవగానే నన్నే చూడాలి .

,,
* ప్రతి రోజు నాతో నే నిద్ర పోవాలి 

,,
* తనువెళ్లే ప్రతి చోటకి నన్ను తీసుకెళ్లాలి.బాత్ రుము కయినా సరే !!

..
గుండమ్మ కోరికల లిస్ట్ ఇంకా పూర్తవలేదు......

***
భికారాకారం గుండమ్మని మాయం చేసింది.

..
ఒక 'నెట్ కనెక్షన్ ఉన్న స్మార్ట్ ఫోన్' ప్రత్యక్ష మయింది. 

Wednesday, 28 October 2015

తప్పలేదు

పాపం పున్నారావు కి ఉడికి ఉడకని నుడిల్స్ తిని ఇంటెస్టైన్ లో అవాంతరం ఏర్పడి అత్యవసరంగా
ఆపరేషన్ చేయాల్సొచ్చింది.
మనకి ఉన్న కంఫ్లైట్ యేదీ ప్రబుత్వ పదకాల కింద కవర్ కాదు కాబట్టి వయా మీడియాగా అతను కొంత కట్టేట్టు మిగిలింది ఆరోగ్య శ్రీ క్లెయిమ్ చేసుకునెట్టు ఒప్పందం జరిగింది.
అందరూ ఖాళీగా ఉన్నప్పుడు, నయనతార గురించి చర్చించుకుంటూ ఆపరేషన్ చేసేశారు.
రోగిని వార్డు కి మార్చారు.
..
పున్నారావు కి చేసిన ఆపరేషన్ తో సంబందం లేకుండా తలంతా నొప్పిగాను, నాదు గాను అనిపించసాగింది.మాడు మీద నల్లగా కమిలినట్లు అవటం కూడా కుటుంబ సబ్యులు గమనించారు. బాద ఎక్కువవటం తో పదే పదే డ్యూటీ నర్సు తో చెప్పాక సీనియర్ అయిన ఆమెకి అతను ఏమయినా పోస్ట్ ఆపరేటివే షాక్ లోకి వెళ్ళాడేమో అని అనుమానం కలిగి
సర్జరీ చేసిన డాక్టర్ ని కలిసి చెప్పింది.
పాపం ఆయన కొత్తగా కొన్న రెడ్ మీ -3 లో. నెట్ బ్రౌజ్ చేసి నయన తార అసలు పేడు డయానా అని తెలుసుకున్న ఆనందం లో ఉన్నాడు.
...
"నువ్వు కంగారు పడకు సర్జరీ సగం లో ఉండగా మత్తు వదిలింది .. తప్పలేదు. తగ్గిపోతుంది."
#susri
(డాక్టర్ మిత్రులకి క్షమాపణలు. లైట్ తీసుకోండి. )

మైండ్ యువర్ ఒన్ :)

బబ్లూ పార్క్ లో కూర్చుని 'మంచ్' లు తింటున్నాడు.
సాయంత్రం నడకకి వచ్చిన పెద్దాయన ఇది గమనించి బెంచీ మీది అతని పక్కన కూర్చున్నాడు.
చిన్నగా మాట కలిపి, "ఒక్క సారి ఇన్ని చాక్లెట్స్ తినకూడదు, పళ్ళలో కేవిటీ లు తయారవుతాయి, వళ్ళు వస్తుంది.సుగర్ వస్తుంది. లావుగా .డుంబులాగా తయారవుతావు. జీవిత కాలం తగ్గుతుంది." అంటూ హెచ్చరించాడు.
"మా తాత 102 ఏండ్లు బతికాడు తెలుసా?" బబ్లూ అడ్డొస్తూ చెప్పడాయనకి.
" మీ తాత కూడా నిలాగే ఎక్కువ కాక్లెట్స్ తినేవారా?"
..
"అలా ఏమి లేదు.. ఆయన పని ఆయన చేసుకునేవారు" 

Tuesday, 27 October 2015

కుక్కలు తిన్న జిలేబి ఖర్చు

అగర్వాల్ గారి ఇంటి మీద Income tax అదికార్ల రైడ్ జరిగింది.
పొద్దుటే 5.00 గంటలకి కాలింగ్ బెల్ కొట్టి, మఫ్టీలో ఇంట్లో కొచ్చిన అదికార్లు 
ఫోన్ కట్ చేశారు. అందరి వద్ద నుండి సెల్ ఫోను లు స్వాదినం చేసుకున్నారు.
పొలైట్ గా మాట్లాడారు తమతో వచ్చిన డాక్టర్ గారి చేత వైద్య పరీక్షలు చేయించారు. బి‌పి కి మాత్రలు ఇచ్చారు. టిఫిన్ తెప్పించి పెట్టారు. అది వాళ్ళ సర్వీస్ రూలు.
ఎటువంటి మెడికల్ అవాంఛనీయ సంఘటనలు జరగ కుండా జాగర్తలు తీసుకున్నారు.
సోదా మొదలెట్టారు. ఏక సమయం లో ఆయన షాపు మూడు ఇండ్ల మీద జరిగిన దాడి లో మొత్తం పద్దెనిమిది మంది అదికారులు ఎనిమిది గంటల పాటు శోదించారు.
అనుభవజ్ఞుడయిన అగర్వార్ ఆడిటర్ చూపించిన వాటికి, వాస్తవానికి చెప్పుకోదగ్గ తేడాలు ఏమి లేవు.
చివరాఖరు ఫైనల్ గా కుక్కలకి 40000 రూపాయల జిలేబి తినిపించినట్లు చూపిన ఖర్చు కింద రెడ్ ఇంకు తో అండర్లైన్ చేశారు.
"ఇది వింతగా లేదు? కుక్కలకి జిలేబినా? "
***
***
***
"అగర్వాల్ జీ ఒక యాబై వేలు ఖర్చులకి ఇస్తే .. అంతా సవ్యంగా ముగుస్తుంది" డ్రైవరు చేత చెప్పించారు.
అగర్వాల్ అంగీకరించాడు.
అనుకున్నది కాగితం లో చుట్టి చేతులు మారాక రైడ్ పూర్తి అయ్యింది.
ఎవరి ఫోన్ లు వారి కిచ్చారు.
అగర్వాల్ వెంటనే ఒక కాల్ చేసి " ఆడిటర్ గారు కుక్కలు మరో యాబై వేల రూపాయల జిలేబి తిన్నట్లు ఇవాళ ఖర్చు లో రాయండి "
‪#‎susri‬

Monday, 26 October 2015

మూడు సార్లు చెప్పలేను

కొత్తగా ఏర్పాటయిన రెస్టారెంట్ కి వెంకట రమణ బార్య యోగితా తో
కలిసి కాండిల్ లైట్ డిన్నర్ కి వెళ్ళాడు.
..
వారం లో మూడు రోజులు చెయ్యి చేసుకొనని వాళ్ళిద్దరి మధ్య ఒప్పందం ఉండటం తో
రెచ్చి పోయి తాను బెంగుళూరు రామయ్య కాలేజీ లో ఇంజనీరింగ్ చదివి నప్పటి 
జోకులు కొన్ని చెప్పటం మొదలెట్టాడు.
**
ఆడవాళ్ళ మంద బుద్ది మీద బోలెడన్ని జోకులు చెప్పటం మొదలెట్టాడు.
**
శ్రుతి మించడం తో యోగిత అతన్ని ఆపె ప్రయత్నం చేసింది.
ఏమి లాభం లేక పోయింది.
***
యోగిత తన ఫోన్ అందుకుని ఒక కాల్ చేసింది.
**
పదంటే పది నిమిషాల్లో ఇద్దరు హిడింబీలు వాళ్ళ టేబుల్ షేర్ చేసుకున్నారు.
**
" ఈ మే నా స్నేహితురాలు . కల్పన 6'2" హైటు,
115 కేజీల బరువు, వరసగా మూడేళ్లుగా హెవీ వైట్ లిఫ్ట్ ఛాంపియన్,
ప్రోఫ్ఫెషనల్ రెస్లర్ "
**
వెంకట రమణ జగర్త గా ఆమెని గమనించాడు.
**
" ఈమే మల్లీశ్వరి, 120 కేజీల బరువు.కిక్ బాక్సర్ 6' 4" హైటు"
**
ఆమెని కూడా కోవొత్తి వెలుగులో జాగర్తగా అభావంగా గమనించాడు. వెంకట రమణ కుమార్.
***
"ఇప్పుడు చెప్పండి ఆడవాళ్ళ మీద జోకులు " చేతులు కట్టుకుంటూ అడిగింది యోగిత
..
..
..
..
" ఇక చెప్పను"
ఆమె నవ్వి "అలా రండి దారికి " అంది.
..
"ప్రతి జోకు మూడు సార్లు చెప్పి.. ముగ్గురి కి అర్ధం  అయిందాకా వివరించాలంటే కష్టం "
**
(రెండు రోజుల నుండి ఫోన్ అటెండ్ అవటం లేదు రమణ grin emoticon pacman emoticon pacman emoticon )
‪#‎susri‬

do not bend

దసరా శెలవలు ముగిశాయి.
యుద్దం ప్రారంభం.
ఉదయాన్నే నిద్రలేచి తలుపు తీశాను.
దోర్మాట్ మీద ఒక పెద్ద ఎనేవేలప్ కవర్ పడి ఉంది.
DO NOT BEND అని పెద్ద అక్షరాలతో రాసి ఉంది.
ఆ మాత్రం ఇంగ్లీష్ మనకి వచ్చు . అర్ధం తెలియనంత అమాయకులమి అసలే కాదు.
'వంగకుండా కింద ఉన్న కవర్ ఎలా తీయాలో అరగంట నుండి ఆలోచించినా అర్ధం కాలేదు.
frown emoticon గుడ్ మార్నింగ్. అండ్ గెట్ రెడీ తో వర్క్.
‪#‎susri‬

Sunday, 25 October 2015

పడమటి గాలి


మొత్తానికి వాళ్ళిద్దరికి పెళ్లయింది.
పెళ్ళికి తీసుకున్న సెలవులు వృదా కాకుండా తిరపతి, షిర్డి వెళ్ళి వచ్చారు. కొత్త కాపురం.
మిత్రులు ఇచ్చిన విలువయిన బహుమతులు ఆటొ లో వేసుకుని తమ ఫ్లాట్ కి చేరుకున్నారు.
సోమవారం నుండి ఆఫీసులకి వెళ్ళవలసి ఉండటం తో తీరిగ్గా కూర్చుని గిఫ్ట్ లు అన్నీ
తీయటం మొదలెట్టారు. బాగా విలువయిన వాటిని బెడ్ రుము వార్డ్ రోబ్ లోనూ, 
మిగిలినవి హాల్ గోడల మీదా, కిచెన్ కి పని కొచ్చేవి అక్కడా మొత్తానికి సర్దు కున్నారు.
కొంత మండి కవర్స్ లో బాంక్ గిఫ్ట్ చేక్స్ పంపారు.
వాటిని జాగార్త చేస్తుంటే ఒక కవర్ లోంచి రెండు టిక్కెట్స్ బయట పడ్డాయి.
రవీంద్ర భారతి లో పాటిబండ్ల ఆనందరావు గారు రాసిన "పడమటి గాలి"
రెండు రోజుల ప్రదర్శనని కలిపి ఒకెరోజు కంటిన్యూ గా 10 గంటల పాటు జరగనున్న ప్రదర్శనకి టిక్కెట్స్ అవి.
గొప్ప నాటకం. చాలా సార్లు మిస్సయ్యారు. వాటి మీద డేట్ చూశారు.
ఆ రోజే. పంపినవారు పేరు లేదు కవర్ మీద " can u guess?"
అని ఉంది. ఎవరో మిత్రుల పని అనుకుని . వెంటనే రెడీ అయి ప్రదర్శనకి వెళ్లారు.
గొప్ప నాటకం చూసి తెల్లవారు ఝామున ఫ్లాట్ కొచ్చారు.
తాళం వేసినట్టే ఉంది. లోపల అంతా ఖాళీ .
అద్దం మీద స్కెచ్ పెన్ తో రాసిన "its me" అన్న అక్ష రాలు తప్ప.
(పాటిబండ్ల ఆనందరావు గారు నాకు సన్నిహితులు. వీలయితే ఎప్పుడయినా పడమటి గాలి చూడండి గొప్పగా ఉంటుంది.)
#susri

తవ్వతో

ఎండన బడి ఇంటికొచ్చి మమ్మాయి చేసిన మైదా అన్నం లో మజ్జిగ పులుసు వేసుకి తిని అలా నడుం వాల్చానో లేదో .. మా గుండమ్మ ఒక కారీ బాగ్ తీసుకొచ్చి మంచం మీద కుప్పగా పోసింది. 
రంగు రంగుల గుడ్డలు ఉన్నాయి అందులో.
మనం గమనించ కుండా అటు తిరిగి పడుకున్నామనుకో ..
అదేం ఖర్మో అప్పుడే దోమ వాలుద్ది మన వీపు మీద...
నిలువు గుడ్లు వేసుకుని చూస్తా ఉంటే.. 
"జాకెట్టు ముక్కలండి ఈ మధ్య వెళ్ళిన పెళ్లిళ్ల లోనూ, మన ఫ్రెండ్స్ ఇళ్లకెళ్లినప్పుడు తాంబూలాలతో పాటు వచ్చినవి. మొత్తం పద్నాలుగు"
నాకు పద్నాలుగు లోకాలు చూపించే వ్యవహారం ఏదో ఉందని మనసు హెచ్చరిస్తున్నా
నాలుక ఉంది చూసారూ ..
"ఈ రెండు కలర్స్ బలే ఉన్నాయి " నోటి దూల మనం ఊరుకోముగా?
"లేవండి బజారు కెళ్ళి మాచింగ్ చీరలు తచ్చుకుందాం. మీకు నచ్చాయిగా ఈ రెండు "
దీన్నే ఇంగ్లీష్ లో తవ్వతో .... డాష్ ... అంటారని రఘురాం చెప్పాడు మొన్నో సారి.

అమరావతి


కొత్త రాజధాని 'అమరావతి' శంకుస్థాపన కార్యక్రమానికి వచ్చిన అప్పారావు
తెలీక మోది కాన్వాయ్ లోకి తన కారుని తోలుకొచ్చాడు. దసరా రోజు.
వెంటనే బ్లాక్ కమాండోలు అతన్ని చుట్టుముట్టి ప్రమాదకరమయిన వస్తువులు ఏమి లేవని గ్రహించాక బెజవాడ పోలీసులకి అప్పగించారు.
అతన్ని లాకప్పులో ఉంచి ప్రోగ్రాం అంతా సక్సెస్ అయ్యాక ఊపిరి పీల్చుకుని
కొద్దిగా రెస్ట్ తీసుకున్నాక అప్పారావుని మందలించి మూడో రోజు కారు ఇచ్చి పంపారు.
***
మర్నాడు పొద్దుటే మనాడు అదే కారు వేసుకుని అదే పోలీస్ స్టేషన్ లోకి దూసుకొచ్చాడు.
కారు దిగిన అతన్ని పోలీస్ ఆఫీసర్ గుర్తు పట్టాడు. దురుసుగా స్టేషన్ లోపలికి డ్రైవ్ చేసిన అతడిని చూడగానే వళ్ళు మండింది ఆఫీసర్కి.
"వళ్లెలా ఉంది?" లాటీ చూపిస్తూ హుంకరించాడు.
"మీరేమయినా చేయండి పర్లేదు.. రెండో రోజులుగా మీ లాకప్పులో ఉన్న విషయం మాత్రం
కార్లో కూర్చుని ఉన్న మా ఆవిడకి చెప్పండి చాలు" బోరు మన్నాడు అప్పారావు.
#susri

నివాళి


ప్రతి ఆదివారం చర్చి కాంపౌండ్ వాల్ అనుకోని ఉన్న సమాడుల వద్దకి
అతను క్రమం తప్పకుండా అక్కడికి వస్తాడు.
ఖరీడయిన పూల గుచ్చం ఎప్పుడు ఉంచే సమాది మీద ఉంచి మోకాళ్ళ మీద కూర్చుని మౌనంగా ప్రార్ధిస్తాడు కొద్ది నిమిషాలకే తట్టుకోలేని దుఖం అతన్ని చుట్టుముడుతుంది.
చేతుల్లో ముఖం దాచుకుని పెద్దగా ఏడుస్తాడు.
పాపం ఎప్పుడు కుదుట పడతాడో ఎప్పుడు ఇంటికి వెళతాడో ఎవరికి తెలీదు.
**
చాలా కాలంగా గమనిస్తూ ఉన్న డేవిడ్ ఈ ఆదివారం అతను బయటకి వచ్చే దాకా ఓపిగ్గా ఎదురు చూశాడు. ధూఖాన్ని దిగమింగుకుని కాంపౌండ్ దాటి బయటకి వస్తున్న అతన్ని పలకరించాడు.
"జనన మరణాలు సహజం."
అతను నెమ్మదిగా తల ఉపాడు. ముఖాన్ని రెండు చేతులతో గట్టిగా రుద్దుకున్నాడు.
గట్టిగా ఊపిరి పీల్చి వదిలాడు.
"నీకు తెలుసా ఆ సమాది ఎవరిదో?" సన్నగా అడిగాడు డేవిడ్ ని.
" ఊహూ.. మీ బార్య?/కుమార్తె? .. సారి ఊహించలేను.మీరే చెప్పండి"
" మా ఆవిడ మొదటి బర్త ది " చెప్పాడతను.
అతని వేదనలో అర్ధం ఉంది.
have a wonderful Sunday :)

ఉన్నదే



వాకింగ్ లో అప్పిచ్చిన మిత్రుడి వార్నింగ్ గురించి బాద పడుతున్నాడు బర్త.
"ఏమండీ కొంచెం డబ్బులు కావాలి " కాఫీ ఇస్తూ అడిగింది ఆవిడ.
చర్రు మంది ఇంటాయనకి.
".బుద్ది ఉండాలే.. బుద్ది.. ఎప్పుడు డబ్బులెనా? కాస్త బుద్ది వాడవే బుద్ది"
" నిజమేననుకోండి .. పాపం మీదగ్గర లేనిది ఏమడగను ?"
ఇల్లాలు తెలియక అందా? 

తెలివిగా అందా? 
కాఫీ తాగాలా? వద్దా?
‪#‎susri‬

Saturday, 24 October 2015

ఫేస్ క్రీమ్

ఒక పెద్ద షాపింగ్ మాల్ లో బార్యా బర్తలు ఇద్దరు షాపింగ్ చేస్తున్నారు.

కేన్ బీర్ 10 టిన్ బండిల్ ఒకటి ట్రాలి లో వేశాడు మొగుడు.

ఏం చేస్తున్నారు?

"ఆఫర్ ఉంది. మొత్తం 240 రూపాయలే"

డబ్బు దుబారా చేయకండి. తిరిగి యదా స్థానంలో ఉంచిందావిడ.

కాష్ కౌంటర్ దగ్గర రాక్ లోంచి ఒక ఫేస్ క్రీమ్ ట్రాలీ లో వేయటం గమనించి


"ఫేస్ క్రీమ్ 500 వందలా? ఇది దుబారా కాదా?" మళ్ళీ మొగుడు.


" అది నన్ను అందంగా చేస్తుంది. ని కోసమే" మసాలా చల్లింది నవ్వు మీద.


"నేను కొన్నది కూడా అందుకే .. సగం రేటులో పనయ్యేది" నసిగాడు అతను.


ఏదో తగిలిందండీ అతనికి ..ఏమయి ఉంటుంది ??? tongue emoticon


గుడ్ న్యూస్

.ACTO, శ్రీనివాస్ ప్రసాద్ ఆడిటర్ మీటింగు అటెండ్ అవటానికి కాన్ఫరెన్స్ రూములోకి 
వెళ్తుంటే పర్సనల్ నెంబరుకి మాధవి ఫోన్ చేసింది..
***
"మీకో గుడ్ న్యూస్ అండ్ ఒక బాడ్ న్యూస్ "
***
"నేను ముఖ్య్మయిన మీటింగ్ కి వెళ్తున్నాను. గుడ్ న్యూస్ చెప్పు షార్ట్ గా "
***
" మన కొత్త కారు లో ఎయిర్ బాగ్స్ బాగా పని చేస్తున్నాయి."
‪#‎susri‬

ఆస్పిరిన్


నైట్ షిఫ్ట్ డ్యూటి కాన్సిల్ చేయించుకుని త్వరగా ఇంటి కొచ్చిన పోలీస్ అదికారి 
డూప్లికేట్ తాళం తో తలుపు తీసి .. బార్యని డిస్టబ్ చేయటం ఇష్టం లేక చీకట్లోనే బట్టలు మార్చుకుని 
పడక గదిలో మంచం మీదకి చేరాడు.
..
బార్య చిన్నగా మూలగటం గమనించాడు...
..
"ఏమయింది."
"ఏమండీ మీరొచ్చారా?"..

..
అవును.డ్యూటి కాన్సిల్ అయ్యింది...

..
"వెంటనే వెళ్ళి ఆస్పిరిన్ ఒకటి తెండి. విపరితమయిన తలనొప్పి"..

..
అతను ఆ చీకట్లోనే బట్టలు మార్చుకుని బయటకి వచ్చి.
బస్టాండ్ వద్ద 24 గంటలు పని చేసే మెడికల్ షాప్ కి వెళ్ళాడు. _..

..
"ఒక ఆస్పిరిన్ ఇవ్వండి "..

..
"సార్ మీరెంటి ? వాచ్ మెన్ డ్రస్ వేసుకున్నారు?" ..
గుర్తు పట్టిన మెడికల్ షాప్ అతను అడిగాడు ఆశ్చర్యంగా ..
‪#‎susri‬

Friday, 23 October 2015

సమస్య మొదటి కొచ్చింది

ముప్పై నాలుగేళ్ల రామ్ పెళ్లి కాక బాద పడుతుంటే,
మిత్రులు అడిగారు "అసలు ని సమస్య ఏమిటిరా?"
"ఎవరు నచ్చట్లేదు" గొనిగాడు.
"నచ్చటానికి నువ్వేమన్నా పర్ఫెక్ట్ వా? కొంచెం అటు ఇటూగా సర్దుకు పోవాలి " సలహా ఇచ్చారు మిత్రులు.
"నచ్చనిది నాకు కాదురా. మా అమ్మకి " నిట్టూర్చాడు రామ్.
"సింపుల్ .. అచ్చం మీ అమ్మ లాటి అమ్మాయి కోసం ప్రయత్నించు" మిత్రుల వద్ద ఇంస్టంట్ సమాదానాలు బోలెడు.
"ఇదేదో బాగుందిరా ఆ పని మీద ఉంటాను"
*****
"ఆరు నేలలయ్యింది. నీకు ఇంకా మీ అమ్మ లాటి పిల్ల దొరకలేడా"?
"భేషుగ్గా"
"మరెంటి.. పెల్లెప్పుడు?"
" మళ్ళీ సమస్య మొదటి కొచ్చింది. ఆ పిల్ల మా నాన్నకి నచ్చలేదు "

Thursday, 22 October 2015

ముగ్గురు వృద్దులు


'ముగ్గురు వృద్దులు' రంగారాయుడి చెరువు మీద ఉన్న బెంచీ పైన కూర్చుని
అమరావతి కి మోడి ఏమి ఇస్తాడు / ఇవ్వడు అనే విషయం మీద గొడవ పడుతున్నారు.
హటాత్తుగా శ్రీకాంత్ చానెల్ రిపోర్టర్ మైక్ తీసుకుని ప్రత్యక్షం.
**
"ఆవు దూడ కాగ్రెస్స్ సింబల్ గా ఉన్నప్పటి నుండి తెలుసు. దీనివల్ల ఏమి ఒరగదు. బ్రమలు మాని వాస్తవం లోకి రాగలిగితే మంచిది." ఒకాయన చెప్పాడు.
మీ వయసు ఎంత? అడిగాడు రిపోర్టర్
"93 "
***
"ముప్పై రూపాయల సాయానికి మూడు లక్షల పబ్లిసిటీ మనస్తత్వం లోంచి బయటపడక పోతే చాలా కష్టం. వాస్తవ దృక్పడమ్ తో పని చెయ్యాలి . చేయించాలి.మేనిప్యులేటెడ్ డిజిటల్ లెక్కలు చూస్కుని బలుపు అనుకుంటే మనం కోలుకోవటం కస్త్తమ్"
రెండో వృద్దుడు చెప్పాడు " నా వయసు 90 చిన్నప్పటినుండి ఎన్ని చూడలేదు?" కలిపాడు ఆయన.
***
కాబోయే ప్రదానిని (చిన బాబు గారి బుల్లి బాబు ని ) పలకరించడానికి ప్రస్తుత ప్రదాని వచ్చాడు. చేతులు ఖాళీ లేక డబ్బుల సూటికేసు పట్టుకు రాలేదు" మూడో ఆయన ఖచ్చితంగా చెప్పాడు.
"మీరేం చేస్తుంటారు?"
"నేను పార్టీ అభిమానిని నా వయసు 33 " చెప్పాడా మూడో వృద్దుడు.
****
ఆంధ్రుల అభిమాన అమరావతికి శుభమగుగాక !!! ?
‪#‎susri‬

మిత్రుడి జాడ

నాయుడు గారి అబ్బాయి డొనేషన్ కట్టి మరీ వెటర్నరీ డాక్టరయ్యాడు.
పక్క రాష్ట్రం లో. ఆంబోతు లా గా తయారయిన మనాడి ని ఎవరూ 
పశువుల డాక్టర్ లాగా గుర్తించక పోవటం తో .. 
ప్రజానీకాన్ని నమ్మించే కష్టం ఆ తండ్రికి తప్పలేదు.
..
ఆదివారం పక్క మండలం లో పశువుల సంతకి తోలుకెళ్ళాడు.
వియ్యంకుడు అవుతాదేమో అని ఆశగా ఉన్న మిత్రుడిని తోడు తెసుకెళ్ళాడు...
..
అబ్బాయి కారు దిగగానే ఒక చోట కెళ్ళి..
" ఈ ఎద్దు కి కొమ్ములు లెవెంటీ ?"అని అడిగాడు.
..
పక్కనే ఉన్న రైతు సమాదానం చెప్పాడు.
" పశువులకి కొమ్ములు అడ్డదిడ్డగా పెరుగుతాయి . ..
అవి ఇబ్బందిగా ఉన్నప్పుడూ కొంత బాగం చెక్కి అనుకూలంగా మారుస్తుంటాము. "
అబ్బాయి గారిని అనుమానంగా చూసి
"కానీ ఇది గుర్రం. దీనికి కొమ్ములు ఉండవు " అన్నాడు.
*****
నాయుడు గారి వియ్యంకుడు అవుతాడు అనుకున్న మిత్రుడి జాడ ఇంకా తెలియలేదు

దసరా మామూళ్ళు

పావురాళ్ల కొట్టు సెంటర్ లో ఒక సీనియర్ కమ్మరి ఉన్నాడు.
ఆకురాళ్ళ తో గొడ్డళ్ళు , కత్తులు చేయటం ...లో ఫేమస్.
దసరాకి తన పనివాడికి ఇచ్చే మామూళ్ళ విషయం లో తేడాలు రావటం తో.
కొత్తగా కారు చవకగా బీహార్ వాడిని పనిలో పెట్టుకున్నాడు.
ఈయనకి తెలుగు తప్ప మరేం రాదు.. వాడికి తెలుగు అసలు రాదు.
ఆయుధ పూజ అయ్యింది.
మంచి రోజని మధ్యాహ్నం కొలిమి వెలిగించారు.
లారీ కమాన్ కడ్డి లు కొలిమిలో బాగా కాల్చారు.
'సీనియర్' పట్టకారతో దాన్ని బయటకి తీశాడు.
తాను తల ఊపగానే బరువయిన సుత్తితో కాలిన ఎర్రటి ఇనుము మీద మోదాలని
తెలుగులో యాక్షన్ జత చేసి మరీ చెప్పి ఉన్నాడు.
సరిగా పొజిషన్ లో పట్టుకుని తలుపాడు ..
*****
కొత్త కమ్మరి కోసం బండ్లమిట్ట సెంటర్లో వెతుకులాట మొదలయ్యింది.
...
నీతి: దసరా మామూళ్ళ కోసం పనివాళ్లతో గొడవ పడ వద్దు. ప్రేమతో పరిష్కారం చేసుకోండి 

Wednesday, 21 October 2015

విజయదశమి శుభాకాంక్షలు .


రేపు ఉదయాన్నే మహిళామణులు తలస్నానం చేసి ,
నాలుక బయటకి లాగి పసుపు కుంకుమతో అలకరించుకోండి.
..
పురుషులు, వాహనాలు, పని ముట్లు.. కొండకచో , సీసాలు అలకరించండి.
దుర్గామాత కి పూజ చేయండి.
మీ అయుద పూజా ముగిసినట్లే..
..
tongue emoticon విజయదశమి శుభాకాంక్షలు .. tongue emoticon
‪#‎susri‬

Saturday, 17 October 2015

పది ఒంట్లు .

ఒక సీనియర్ బర్త కి బార్యకి యదావిడిగా .గొడవయ్యింది .
అందరూ మొగుళ్ళలాగే అతను మౌనంగా ఉండి పోయాడు.
కొద్ది సేపు అతని నుండి ఏమి మాటలు లేకపోయటం తో తనని  "లక్స్య" పెట్టటం లేదు అని ఆమెకి అర్ధం అయింది.
ఇది అతి పెద్ద శిక్ష అని ఆమెకి తెలుసు.
"పది ఒంట్లు చదువుతా ..నాతో మాట్లాడక పోతే ..విషం తాగి చస్తా" బెదిరించింది ఆవిడ.
ఇటునుండి ఏమి స్పందన లేదు.
" ఒకటి "
మనాడు మౌనం.
"రెండు"
తలతిప్పుకుని మళ్ళీ మౌనం.
"మూడు"
లేచి పక్కకి వెళ్ళి పోయాడు.
"ఇదుగో వింటున్నావా ?  నాలుగు"
ఊహూ లాభం లేదు..
ఆమె ఏడుపు అందుకుంది.
అతడి ఆశ నిరాశ అయ్యింది.
" నాతో మాట్లాడవా?"
"తర్వాత అయిదు " అందించాడు మొగుడు.
" హమ్మయ్య .. మాట్లాడారు కనుక సరి పోయింది. లేకపోతే విషం తాగి చచ్చేదాన్ని" ముక్కు భీదింది ఆవిడ.
మనాడికి ఇంకా బాడ్ టైమ్ నడుస్తూనే ఉంది. పాపం... 

Wednesday, 14 October 2015

కేజీ ఆరటిపళ్ళ ధర ?

తోపుడు బండి మీద ఆరటిపళ్ళు అమ్ముకునే  వ్యాపారి సాయంత్రానికి
టౌన్ లోని ఎలక్ట్రిసిటీ కార్యాలయం ముందున్న చెట్టు కిందకు చేరాడు.
మెడలో ఉన్న ఎర్రటి తువాలుతో ముఖానికి పట్టిన చమట తుడుకు కున్నాడు.
..
ఆఫీసులోంచి ఒక ఉద్యోగి వచ్చి అరిటికాయల రేటు అడిగాడు.....
..
" గుడికి అయితే కేజీ 30 రూపాయలు,
ఓల్డ్ ఏజ్ హోం కి అయితే కేజీ 35 రూపాయలు,
స్కూల్ కి అయితే కేజీ 40 రూపాయలు,
ఇంటికయితే కేజీ 45 రూపాయలు,
షాపు కయితే కేజీ 50 "..
..
"అన్నీ ఒకేరకం కాయలకి ఇన్ని రేట్లా?" ఆశ్చర్యపోవటం అతని వంతు అయింది.
..
"ఏం? మీరు ఒకే కరెంటుకి అనేక శ్లాబ్ లు వసూలు చెయ్యట్లా?? మేమెప్పుడయినా అడిగామా?"

Saturday, 10 October 2015

తాగుబోతు కష్టం !!

బజార్నుండి వస్తుంటే రోడ్డు పక్కన ఒక తాగుబోతు
ఎక్కువగా తాగటం వల్ల దొర్లి మురుగు కాలవలో పడ్డాడు.
..
వర్ధ మాన తాగుబోతులు వారి సానిభూతి పరులు అందరూ
పోగయి అతన్ని బయటకు లాగి ఒక బిందెడు మంచినీళ్లు
గుమ్మరించారు . మనోడు కొద్దిగా తెప్పరిల్లాడు.
"వళ్ళు తెలీకుండా తాగడమెందుకు? ఈ బురదలో పోర్లాడట మెందుకు?"
దారిన పోతున్న ఆడాళ్ళ ప్రశ్న.
**
నాకొచ్చిన కష్టం పగ వాడికి కూడా రాకూడదు. మత్తుగా బదులిచ్చాడు. బురద తాగబోతు.
పాపం చెప్పుకోలేని కష్టం వచ్చి ఉంటుంది అందుకే ఎక్కువ తాగి ఉంటాడు.
వర్ద మానులు .సీనియర్ ని  సపోర్ట్ చేశారు.
"అవును" అతను రోదించాడు.
చుట్టూ పొగయిన జనం ఓదార్చారు.
పాపం ఎంత కష్టం వచ్చిందో ?? నిట్టూర్చారు.
**
రెండు గ్లాసులు మజ్జిగ పట్టిచ్చాక అతని కష్టం గురించి ఆరా తీశారు.

"కొంచెం తాగి మిగతాది దాచుకుందామని ఫుల్ బాటిల్ ఓపెన్ చేశానా?
సీసా మూత పడి పోయింది. ఎంత వెతికినా దొరకలేదు " బావురు మన్నాడు అతను. 

Sunday, 4 October 2015

టైమ్ మేనేజ్మెంటు

జాజి శర్మ గారు రిటైర్ అయ్యాక మనవళ్ళూ, 
మనమనరాళ్ళ తో బిజీ అయిపోయారు. 
ఈ రోజుల్లో తాతయ్య, నానమ్మ ల వద్ద గడిపే సమయం పిల్లలకి తక్కువగా ఉండటం, తిట్టే నోరు తిరిగే కాలు కుదురుగా ఉండక పోవటం తో కొత్తగా బాంకు లో రిక్రూట్ అయిన వారికి ట్రైనింగ్ ప్రోగ్రామ్ లో టైమ్ మేనేజ్మెంట్ గురించి ఒక క్లాస్ తీసుకోవటం మొదలెట్టారు.
రచయితలకి నేరుగా విషయం చెప్పే అలవాటు ఎప్పుడూ ఉండి చావదు.
అనేక ఉదాహరణలు చెబుతూ సోదాహరణంగా 
"ఆడాళ్ళు వంటింట్లో పొయ్యి దగ్గరనుండి ఫ్రిజ్ దగ్గరకి అక్కడి నుండి అలమారాకీ ఒక్కో వస్తువు కోసం ఒక్కోసారి నడుస్తారు.
అలా కాకుండా అన్నీ వస్తువులు ఒకే సారి సమకూర్చుకుంటే రోజులో కనీసం రెండు కిలోమీటర్లు నడక బోలెడంత సమయం కలిసొస్తుంది."
ఆయన ఉపన్యాసం కొనసాగుతూనే ఉంది.
ట్రైనీ లోంచి ఎవరో అడిగారు " మీరు ఇంట్లో ఈ విషయం చెప్పారా?"
జాజి శర్మ గారు ఒక్క సారి కళ్ళ జోడు సర్దుకుని చెప్పారు. "అంతకుముందు ఆమె ఉప్మా 20 నిమిషాల్లో చేసేది. ఇప్పుడు కేవలం 7 నిమిషాల్లో చేస్తున్నాను నేను."

శేషాచలం అడవి

శేశేషాచలం అడవుల్లో మళ్ళీ కార్చిచ్చు రగిలింది.
నేషనల్ జాగ్రఫీ ఫోటో గ్రాఫర్ 'బాబ్ హేమార్' రేణిగుంట ఎయిర్ పోర్ట్ కి వచ్చాడు.
అతని కోసం ఒక చాపర్ ఆరెంజ్ అయి ఉంటుందని చెప్పారు.
అప్పటికే చీకటి కావస్తుంది. బాబ్ హేమార్ టాక్సీ లోంచి దిగగానే
షెడ్యూల్ ప్రకారం అక్కడో చిన్న టు మెన్ ఎయిర్ చాపర్ ఉంది. తన లాగేజీ తో 
అందులో ఎక్కగానే పైలెట్ కి చెప్పాడు. 'కమాన్ గో "
పైలెట్ ఒక్క ఉడుటున ఫ్లైట్ పైకి లేపాడు. "గో టూ నార్త్ వేర్ ది ఫ్లెమ్స్ ఆర్ హై" చెప్పడతాను. పైలెట్ పెద్ద కుదుపుతో నిలువుగా దూసుకు పోయాడు అటువైపు.
మండే అడవి పైకి చేరగానే.. స్పీడ్ తగ్గించకుండానే
" అండ్ దెన్" పైలెట్ కంగారుగా అడిగాడు
"ట్విస్ట్ ది చాపర్ అండ్ గో నియర్ బై"
"వై?" అన్నాడు పైలెట్ భయంగా.
" ఆయామ్ ఎ పోటోగ్రాఫర్ . అండ్ ఐ నీడ్ టూ టేక్ హై రెసోలూషన్ పిక్టర్స్ "
**
" ఆర్ యు షూర్ .. యు ఆర్ నాట్ మై ఇన్ స్ట్రక్టర్ " అటునుండి బేలగా వినిపించింది.
‪#‎susri‬

Friday, 2 October 2015

సుబ్బులు

చాతగాని వాడు చేసిన చపాతీ లాటి మాస్టర్ వీవర్ ఆ రోజుకి దుకాణం మూసేయటానికి సిద్ద పడుతున్నాడు.
'ఆమె' వచ్చింది. చీకట్లో నిలబడింది. ' కాపూ ' అంది. 
ఎక్కడి నుండో వచ్చినట్లుగా స్వరం ఉంది.అతను లైట్లు ఆపే ప్రయత్నాన్ని ఆపి అటువైపు చూశాడు.
ఆమె వెలుతురు లోకి వచ్చింది. ముఖం ముభావంగా ఉంది. నిర్లిప్తంగా ఉంది.
"కాపు నాకు ఒక అయిదువేలు కావాలి " ఆమె స్తిరంగా ఉంది.
ఆ గొంతులో నిజాయితీ ఉంది. అతను ఆమెను పరీక్షగా గమనించాడు.
ఎప్పుడు తన వద్ద ఎకులు తీసుకెళ్లి బారలు నేసి కూలి తీసుకునే ఆమె చాలా కాలం నుండి తెలుసు.
అప్పుడెప్పుడో ఆమె బర్తని చూసిన గుర్తు.
గంభీరంగా ఉంటుంది. నిండుగా ఉంటుంది. అవసరమయినంత వరకే మాట్లాడుతుంది.
అన్నిటి కన్నా ముఖ్యంగా డబ్బు వద్ద ఖచ్చితంగా ఉంటుంది.
ఇప్పటికే తన స్తాయికి మించి తన వద్ద అప్పు చేసింది.
" అంత అవసరమా?" ఏదయినా అడగాలి కనుక అడిగాడు.
ఎంతో అవసరం ఉంటే తప్ప ఆవేళప్పుడు అంత దూరం నుండి ఆవిడ రాదు.
**
"నా పెనిమిటి ని గుంటూరు తీసుకెళ్లాలి. ఆసుపత్రికి " ఆమె పదాలు వెతుక్కుంటూ చెప్పింది.
అతను నుదురు చిట్లించాడు.
" ఇవాళ మా వాడలో గణేశ్ నిమజ్జనం జరిగింది. రోజు కంటే ఎక్కువ తాగాడు.
ఇంటి వద్ద గొడవ పడ్డాం. రోజు లాగే బెదిరించాడు చచ్చి పోతానని.
కానీ ఇవాళ గొంతు కోసు కున్నాడు. ఇంటి వద్ద నెత్తురు మడుగు లో ఉన్నాడు.
ఆర్‌ఎం‌పి ఏడుకొండలు ని పిలిస్తే వచ్చి కళ్ళు తిరిగి పడిపోయాడు."
అన్నీ మాటలు ఆమె ఉన్న స్తితిలో ఎలా మాట్లాడిందో ఆమెకే ఆశ్చర్యంగా ఉంది.
**
" అతను వెంటనే జేబులోంచి డబ్బు తీసి ఇచ్చాడు.
తమ ఆటొ వాడికి ఫోన్ చేసి బండి లో ఆయిల్ పోయించుకుని గుంటూరు ఆసుపత్రికి వెళ్ళి
వాళ్ళని దించి రమ్మని పురమాయించాడు. "నువ్వు ఇంటికెళ్లు ఆటో వస్తుంది"
**
" నాదగ్గర మీ బాకీ తీర్చడానికి ఏమి మిగల లేదు.
నా పెనిమిటి అంతా తాగేశాడు. నేను బతికుండగా బాకీ తీరుస్తాను.
లేని పక్షంలో ఇన్నాళ్ళు కాపాడిన నా పెనిమిటి మర్యాద ని అమ్ముకుని అయినా సరే.. "
ఆమె ఏమి మాట్లాడబోతుందో అతనికి అర్ధమయింది.
**
"ముందు నువ్వు ఇంటి కేల్లు. అక్కడికి వెళ్ళాక అవసరం అనుకుంటే ఫోన్ చేయించు"
తన విజిటింగ్ కార్డు ఇస్తూ చెప్పాడు.
..
కళ్ళలో నీళ్ళు అతని కంట బడకుండా రెండు చేతులు జోడించి ఆమె ఇంటివైపు వడి వడిగా నడిచింది.

ఈపూరుపాలెం లో నేత పని వాళ్ళ ఇల్లు అంటే ... పెద్ద ఇల్లేమి కాదు ఇప్పటికీ నెలకి 500 అద్దె ఉండే ఒక్క గది ఉండే ఇల్లు.
కొన్నిటికి పూరి కప్పు కూడా ఉంటాయి. ఇసుక నెలల్లో ఉండే ఆ ఇండ్లలో ఉండే ఒకే ఒక గదిలోనే ఒక వైపు కి మగ్గం గుంట ఉంటుంది.
కుటుంబం లో ఆడా మగా అందరూ నేత పనిలో తలా ఒక చెయ్యి వేసి రెండో వైపు ఉన్న పొయ్యి వెలిగేలా చేస్తుంటారు.
మాస్టర్ వీవర్స్ కొంత పెట్టుబడి పెడుతుంటారు. మగ్గం ఏర్పాటుకి. నూలు (యేకు) ని ఇస్తారు.
మగ్గానికి ఉన్న పోగులకి వీటిని ఓపికగా అతకాలి ఒక్కొక్కటి చీర వెడల్పు ఉన్న ప్రతి పొగుని ఒక్కో పొగుకి నేర్పుగా అతకాలి.
అతికే ముందు నూలు ని పొడవుగా (సుమారు ఏడు గజాల చీరలు అయిది టి పొడవు 35 గజాలు ఉంటుంది) ఓపికగా చిక్కు లేకుండా పొడవుగా సాపు చేసు కోవాలి. కందెలు చుట్టాలి .
ఆ తర్వాత డిజైన్ ప్రకారం నేయాలి ఈ విదానం అంతా కలిపి ఒక వారం పడుతుంది ఒక జంటకి. .
నేసిన బట్టని తిరిగి మాస్టర్ వీవర్ కి అప్పగిస్తే 3000 రూపాయల కూలీ గిడుతుంది. వీటిలో అనేక డిజైన్స్ ఉంటాయి వాటికి పనీ ఎక్కు వే కులీ ఎక్కువే. ఇంట్లో పిల్లలు కూడా ఏదో పని చేస్తూనే ఉంటారు.
బార్యా బర్తలిద్దరూ కలిసి పని చేసుకుంటే సౌకర్యంగా నే ఉంటుంది. కానీ ..
అలా ఎప్పుడూ జరగదు.. జరిగితే ఇన్ని కధలు వ్యధలు ఉండవు!!!.
**
గుంటూరు వెళ్ళిన ఆటో నుండి యే ఆసుపత్రి వద్దా అతడిని దించే అవసరం రాలేదు.
జాయిన్ చేసే టప్పుడు కౌంటర్ వద్ద ఎంత కట్టాలో చొఖీదారే చెప్పెశాడు.
నాలుగయిడు చోట్ల తిరిగిన ఆటో ప్రబుత్వ ఆస్పత్రికి చేర్చి వెనక్కి వెళ్ళి పోయింది.
వర్కింగ్ క్లాస్ (లేబర్ అనే పదం వాడటం ఇష్టం ఉండదు నాకు) కుటుంబాలలో ఉన్న గొప్పతనం కష్టం లో ఉన్న పక్క కుటుంబాలను ఆపదలో ఆదుకోవటం .
ఇంటివద్ద ఉంచిన ఇద్దరు బిడ్డలని పక్కింటి వారు ఆదరిస్తుంటే ఈమె పెనిమిటికి వైద్యం చేయించింది.
అధృష్టవశాత్తు (?) అన్నవాహిక తెగలేదు, కనుక బ్లీడింగ్ ని సరిచేసి కుట్లు వేసి మూడో రోజు ఇంటికి పంపారు.
అప్పటికి ఆమె తిండి తిని రెండు రోజులయింది. బట్టలు మార్చుకుని మూడు రోజు లయింది .
ఇదంతా ఒక ఎత్తయితే ..
రైల్లో తిరిగి వచ్చేటప్పుడు పెనిమిది అడిగాడు
" నొప్పి తెలుస్తుంది సుబ్బులూ ఒక క్వాటరు మందు కావాలి " అని.

అదిగో ఈ 'తాగుడే' ఎన్నో కుటుంబాలని నలిపి వేస్తుంది.
ఆమెకి ఏమి చెయ్యాలో అర్ధం అవలేదు. తన కుటుంబం ఎలా గాడిలో పడుతుందో అర్ధం కాలేదు.
మాస్టర్ వీవర్ దగ్గర తీసుకున్న అప్పులు, ఇంటి చుట్టుపక్కల అందుకున్న బదుల్లు, పచారి కొట్లో అప్పులు,
గత నెలలో 12 ఏండ్లకే చాపెక్కిన పెద్ద పిల్ల, వాళ్ళూ వీళ్ళు ఇచ్చినవి తప్ప
తనకంటూ స్వంత చొక్కా ఇప్పటి వరకు లేని ఎనిమిదేళ్ళ పిల్లాడు
ఆమెని రైల్లోంచి దూకకుండా ఆపాయి ఆపుతున్నాయి.
..
నిజానికి .. సుబ్బులు పెనిమిటి మంచి నేత పని వాడు.
డిజైన్ నేత లో ఎక్స్పర్ట్. నాలుగంటే నాలుగు రోజుల్లో ఒంటి చేత్తో 6000 విలువ చేసే బారు నేయగలిగిన వాడు.
అతడిని పెళ్ళాడినప్పుడు సుబ్బులు మురిసిపోయింది.
మంచి పని వాడి కి ఇచ్చి చేసినందుకు తండ్రికి మనసులోనే కృతజ్ఞతలు చెప్పుకుంది. పెనిమిటి తనకి కాకుండా చేసి, తన కుటుంబాన్ని అత్యంత హీనంగా మార్చింది మాత్రం " తాగుడు".
ఆమె తండ్రి ని తల్లి ని దగ్గర నుండి గమనించింది. తన తల్లి తండ్రి కారణంగా ఎన్ని బాదలు పడిందో నిశితంగా గమనించింది. అలాటి తాగుడు కి 'తన' ఇల్లు కూడా వేదిక కాకూడదని అన్నీ దేవతలకి మొక్కుకుంది . కానీ ఆమె ఆశ అడియాశే అయ్యింది.
పెనిమిటి కి తాగుడు అలవాటు ఉందని తెలిసినప్పుడు ఆమె ఎంతగా రోదించింది అంటే బహుశా తండ్రి మరణం కూడా ఆమెని .అంతగా బాద పెట్టలేదు. ఆ రాత్రి సుబ్బులు కి అనేక ఒట్లు వేశాడు అతను. మరెప్పుడు మందు జోలికి వెల్లనన్నాడు. వెళితే చెప్పు తాగిందాకా కొట్టమన్నాడు.
ఒక చెప్పునీ చూరుకి తాడు కట్టి వేలాడ దీశాడు.
సరిగ్గా వారం దాటకుండానే మళ్ళీ తాగాడు, చూరుకి ఉన్న చెప్పు అలానే ఉంది. .
ఆమె దుఖం పోగయి సెలయేరు లాటి ఆమె తనలోకి తను ముడుచుకు పోయి ఘనీబవించడం మొదలెట్టింది. 

www.susri.home.blog

  అందరికీ నమస్తే 66o పోస్టులు పైగా వ్రాసిన ఈ బ్లాగ్ లోని నా పోస్ట్ లలో  చాలా అచ్చుతప్పులు ఉండటం గమనించాను.  వాటన్నిటినీ ఎడిట్ చేస్తూ, modify...