Wednesday, 20 April 2016

అట్ల తద్ది

."ఇవాళ ఏం రోజో మీకు గుర్తుందా? "
..
బ్రేక్ పాస్ట్ లోకి అతనికి పెసరట్టు ఉప్మా చేసి పెట్టింది ఆవిడ...
..
ఓ ఎందుకు గుర్తు లేదు?" నవ్వాడతాను ..
..
"ఖచ్చితంగా గుర్తుండదు" ఆమె నమ్మకంగా చెప్పింది...
..
"చూస్తావుగా?"
***
11 గంటలకి ఒక డోర్ బెల్ మోగింది. ఒక కుర్రాడు వచ్చి ఒక పూల బొకే ఇచ్చి వెళ్ళాడు.
"roses to my darling" అని బర్త చేతి రాత తో రాసిన స్టిక్కర్ ఉంది.
***
3 గంటలకి ఒక పార్సిల్ వచ్చింది. అందులో తన కి సరిపడే ఒక మంచి ఖరీడయిన డ్రస్ ఉంది" మళ్ళీ ఒక నోట్. " to my dearest" అని..
**
4.30 మళ్ళీ బెల్ మోగింది. జయాలూకస్ నుండి ఒక గిఫ్ట్ పాక్ .
డైమండ్ పెండెంట్ & to my lovely wife అని నోట్ కూడా ఉంది.
***
8 గంటలకి బర్త వచ్చాడు. ఎర్రటి బుగ్గల్తో బ్రూ కాఫీ ఇచ్చింది.
"అట్లతద్దికి బార్యకి ఇన్ని పంపారంటే నెక్స్ట్ వీక్ బర్త్ డే కి మరెంత సర్ ప్రైజ్ చేస్తారో"
అతన్ని చెవిలో చెప్పింది.
**
అబ్బాయికి కాఫీ పొరబోయింది.


Friday, 15 April 2016

తల నొప్పి

అపార్ట్మెంట్ లో తరచూ బాత్రూమ్ లో టాప్స్ బ్లాక్ అయిపోతున్నాయి.
..
సర్విస్ యెరియా నుండి బక్కెట్టు తో నీళ్ళు పట్టుకుని ప్రతిసారి బాత్రూమ్ కి వెళ్లాలంటే చాలా సమస్యగా ఉంటుంది. ..
పైగా వెర్టిఫైడ్ టైల్స్ ఫ్లోరింగు. చుక్క నీళ్ళు పడ్డా జారీ పడటం ఖాయం. 
నడుములు విరగటం డబుల్ ఖాయం. 
..
స్వంత ఫ్లాట్ కాబట్టి ఎవర్ని నిందించడానికి లేదు. ..
అన్నిటికి ఆ బిల్డర్ ని తిట్టుకోటం మినహా. 
పనివాళ్ళకి మహానగరం లో మహా కరువు. చెయ్యను అని చెప్పరు. చెయ్యరు. 
'
ఇదిగో వస్తున్నా' అంటే ఆర్నెలలు. ఫోన్ చేస్తే తియ్యరు. తీసినా 'వీది మలుపులో ఉన్నాను వచ్చేస్తున్నాను' అంటారు. నత్తలు కూడా వచ్చేస్తాయి వాళ్ళు రారు.
...
అలాటి పరిస్థితులలో ఆదివారం పొద్దుటే ప్లంబర్ తలుపు తట్టి వచ్చేసరికి సుబ్బారావు ఉక్కిరి బిక్కిరయ్యాడు....
..
ఉపోద్ధాతం లేకుండా "అసలు నా తలనొప్పి గురించి చెబుతాను" మొదలెట్టాడు సుబ్బారావు. 
..
"
మీ ఆవిడ గురించి నాకెందుకు సార్. ప్లంబింగ్ రిపేరు ఏమిటో చెప్పండి"
పిల్లాడు త్రివిక్రమ్ శిష్యుడు . ..
Love

Sunday, 10 April 2016

మెట్లు

నేనతన్ని అక్కడ చూస్తానని అస్సలు అనుకోలేదు.
అది కూడా కోటూ, బూటూ వేసుకుని హుందాగా, భారీ స్తాయి మోసగాడి లాగా ..
ఎక్కడో కొట్టుకొచ్చినట్టున్నాడు. కొంత మంది బకారాగాళ్ళు చుట్టూ చేరి వాడు చెప్పేది ఆసక్తిగా వింటున్నారు.
మధ్య మధ్యలో నవ్వులతో కలిపిన చలోక్తులు విసురుతున్నాడు. గాలానికి యెర వేసినట్లు..
ఆర్డీవో గారి  వియ్యంకుడి కొడుకు పెళ్లి రిసెప్షన్ అది.
సమాజం లో ఉన్నత వర్గం తో పాటు అధికార్లు, ప్రజా ప్రతినిధులు లాటి  వారితో పాటు ఫోర్త్వెంటీ  రాజీ గాడు ..
నా కదే మింగుడు పడటం లేదు.
ఈవెంట్ మేనేజర్ ని అనే గాని నాకు RDO గారు ఇచ్చే మర్యాద అంతా ఇంతా కాదు, స్వంత మనిషి లెక్క.
తన ఆఫీసు లోపాయకారి వ్యవహారాలు చక్కబెట్టే విషాయాలు అన్నీ నేనే చూస్తుంటాను. ఆయన కి నేను నమ్మిన బంటు. కుడి బుజం. ఒక రకంగా నేను హనుమంతుని లెక్క .. అలాటి నాకు ‘రాజి గాడి’ సంగతి  తేల్చాల్సిన బాద్యత ఉంది ..
రాజి గాడు చిన్నప్పుడు మావూర్లో మా ఇంట్లో పని చేసిన  మా పాలేరు కొడుకు.
మహా గడుగ్గాయి. ఒక్క చోట కుదురుగా ఉండేవాడు కాదు.
రోజూ  వాళ్ళ అయ్య చేతిలో తన్నులు, తింటుండే వాడు. ఎప్పుడో ఇంట్లో దొంగతనం చేసి పారి పోయినట్లు విన్నాను.
తర్వాత వాడిని ఇదే చూడటం. పెద్ద మోసగాడయి ఉంటాడు.
ఇలాటి వాళ్ళు సమాజానికి చీడ పురుగులవుతారు. అలాటి రాజి గాడు ఇక్కడ? ఎలా? అసలు వీడు రాజి గాడేనా ?
నెమ్మదిగా వెళ్ళి వాళ్ళ లో కలిశాను.
ఏదో విషయం నాక్కూడా అర్ధం కానీ ఆంగ్లం లో మాట్లాడుతున్నారు. మోసగాళ్ళకి ఇలాటి పనికి మాలిన స్కిల్స్ చాలా ఉంటాయి.
“నువ్వు వీరన్న కొడుకు రాజి గాడివి కదూ ?” స్పష్టంగా అడిగాను.
అతను ఒక్క సారి బేల కళ్ళతో చూశాడు.
సమూహం లో మిగిలినవారు నన్ను నా సంబోదనని ఆశ్చర్యంగా చూశారు.
అతను మెల్లిగా “అవునండి .. మీరు ? క్షమించండి గుర్తుకు రావటం లేదు “ అన్నాడు.
ఎందుకు గుర్తొస్తుంది . వీడి బండారం బయటపడి పోదూ ?
“పెద కొత్తపల్లి గోవిందయ్య గారు గుర్తున్నారా? మీ నాన్న అక్కడ పని చేసేవాడు. పాలేరుగా”  చివరి పదాన్ని వంకరగాను , స్పష్టం గాను పలికాను.
మిగిలిన వాళ్ళు ఇంకా విస్తూ పోయారు. అసలు వీడి చరిత్ర తెలిస్తే ఇంకా స్పృహ తప్పడం ఖాయం.
“ నేను ఆ గోవిందయ్య గారి పెద్దబ్బాయిని  టౌన్ లో హాస్టల్ లో ఉండి పెద్ద చదువులు చదువు తుండే వాడిని  గుర్తుందా?”
“అయ్యో గుర్తు లేక పోవటం ఏమిటండీ అప్పట్లో మన ఊరిలో అంత గొప్ప చదువులు చదివిన వారిలో మీరు ఉన్నారు. ప్రత్యక్షంగా చూడక పోవటం వలన గుర్తుపట్టలేక పోయాను. మన్నించండి. గోవిందయ్య గారు బాగున్నారా?”
“ఆయన పోయి చాన్నాళ్ళయింది. గాని అప్పట్లో  ఇంట్లో దొంగతనం చేసి పారి పోయినట్లున్నావు ?”
నేను బాంబు పేల్చాను. తామేమి విననట్లు మిగిలిన వారు మాటల్లో పడ్డట్టు నటిస్తున్నారు.
“అవునండి. అక్కకి ఏదో ఫంక్షన్ చెయ్యటం కోసం నాన్న తెచ్చి పెట్టిన డబ్బు తీసుకుని వెళ్ళి రైలు ఎక్కాను, ’చిరంజీవి’ ని చూడాలని “  రాజి గాడు ఏమాత్రం బెరుకు బిడియం లేకుండా చెప్పాడు. అయినా నా చాదస్తం కాక పోతే ఇడిచేసిన వాడికి ఏం ఉంటుంది.
“చిరంజీవి ని చూద్దామనా? ఇంతకీ చూశావా?” వ్యంగ్యం గా అడిగాను.
“లేదండీ. అది కుదిరి చావలేదు  రైల్లో వెళుతుంటే కుటుంబం తో తిరుపతి వెళ్ళి వస్తున్న ఒక అయ్యవారు కి దొరికాను. ఎంత బుజ్జగించినా ‘ఊరు- పేరు’ చెప్పలేదు.”
“డబ్బులు లాక్కుని తన్ని తగలేశాడా?”
“ఎంత మాట? ఎంత మాట?. ఆయన నాకో శిక్ష వేశాడు. తనతో తీసికెళ్లి, చెల్లెలితో కలిపి నాకు చదువు చెప్పాడు “
“చెల్లా?”
“పంతులు గారి అమ్మాయి “
“ఆహా ఏమి చదివించాడో .. కుతికలదాకా చదివావా?”
“లేదండీ అక్కడా ఆయన వల్ల కాలేదు, చిన్నగా గురుకుల పాఠశాలలో వేశాడు”
“మొత్తానికి వదిలించు కున్నాడన్న మాట “ నేను నవ్వాను.
రాజి గాడు కూడా తోడుగా నవ్వాడు.
“వదిలించుకున్నా బాగుండేది. దర్శి గురుకుల పాఠశాలలో ఆ యాడాది  టెన్త్ మంచి మార్కులతో పాసయిన రెండో వాడిని నేను”
“ఆహా.. ఆ తర్వాత “
“మళ్ళీ మాస్టారే పూనుకుని ‘ ప్రభుత్వ  రెసిడెన్షియల్ కాలేజీ లో చేర్పించాడు”
“అక్కడ కూడా పాసయ్యావా?”
“మీ నాన్న గారి లాటి వారి ఆశీర్వాదం ఆండీ . పాసయ్యాను మొదటి ప్రయత్నం లోనే సిద్దార్ధ మెడికల్ కాలేజీ లో సీటు వచ్చింది. మూడేళ్ళ  క్రోతమే మెడిసిన్ పూర్తి చేశాను”
నాకు నోట మాట రావడం కష్ట మయింది.
“అయితే ఇప్పుడు ను... ను వ్వు డాక్టర్ వా?”
“లేదండీ .. ఎందుకనో నేను డాక్టర్ గా కూడా  సంతృప్తిగా ఉండలేక పోయాను. ఈ లోగా చెల్లి పెళ్లి అయింది. ఆర్డీఓ గారి మనల్లుడి తో, ఇద్దరు కలిసి నన్ను డిల్లీ నెట్టేశారు “
“ఎందుకండీ? “ నా గొంతు సరిగా నాకే వినబడలేదు .
“సివిల్స్ కోచింగ్ తీసుకున్నాను రెండేళ్ళు. మొదటి సారి కుదర్లేదు రెండో సారి రాంకు వచ్చింది. పోస్టింగ్ కోసం ఎదురు చూస్తున్నాను “
“మీ అమ్మా .. నాన్నా “
“స్కూల్ అయిపోగానే కలిశాను. ఇప్పుడు పల్లె లోనే ఉంటున్నారు. వాళ్ళిద్దరు అక్కడే ఉన్నారు రెండు బర్రెలు పెట్టుకుని. వాళ్ళకి అలానే బాగుంది, నేను వాళ్ళని కదిలించదలుచు కోలేదు”
“మీ..రు... ఇ..క్క..డ?”
“పెళ్లి కూతురు ఎవరనుకున్నారు మా చెల్లెలే .. అదే మా అయ్యవారి కూతురు “
“ఆలానా అండీ.. సంతోషం “
మా సంభాషణ ఇంకా కొనసాగుతుండ గానే..
RDO గారి శ్రీమతి  ‘రాజి గారి’ ని వెతుక్కుంటూ వచ్చింది.
“రాజా బాబు .. ఇక్కడున్నారా? మీ అంకుల్ మిమ్మల్ని పిలుస్తున్నారు. కలెక్టర్ గారికి పరిచయం చెయ్యాలట వెంటనే రమ్మన్నారు “ అంది చెయ్యి పట్టుకుని లాక్కెళుతూ..
నా వైపు తిరిగి “అన్నట్టు వెంకట్రావు గారు వచ్చేనెల మా అమ్మాయికి, రాజా బాబు కి ఎంగేజ్మెంట్ ఉంది. ఏర్పాట్లు అవి మీరు చూడాలి “ అంది.
“రాజా బాబు నాకు చేతులు జోడించి నమస్కారం చేశాడు “ మంచిదండి కలుస్తాను మిమ్మల్ని ఇలా కలవటం ఆనందం గా ఉంది “ అని ఆమెతో పాటు వేదిక వైపు నడిచాడు.


లైఫ్ రిస్క్ మాజిక్

విజయవాడ హోటల్ M లోఉన్న మినీ కాన్ఫరెన్స్ హల్లో షో ముగిశాక, 
అక్కడే బస చేసిన ప్రముఖ మెజీషియన్ ని అప్పారావు అతి కష్టం మీద కలిశాడు .
**
"మీ షో లు చాలా చూశాను. మనిషిని రెండుగా విడదీస్తారే 

ఆ మాజిక్ అంటే నాకు చాలా ఇష్టం "
**
"అది చాలా క్లిష్టమయిన మాజిక్ " మజిషియన్ చెప్పాడు.
**
"
దాని సీక్రెట్ రివిల్ చెయ్యరా? ప్లీజ్ "
**
*
వద్దు.. లైఫ్ రిస్క్ ఉంటుంది అందులో. 
అనుభవం లేకుంటే ప్రాణం కూడా పోవచ్చు"
**
"
అయితే మా ఆవిడకి చెప్పండి. 
తన దగ్గర నేర్చుకుంటాను " 
కొద్ది సేపు ఆగి చెప్పాడు అప్పారావు. 

Saturday, 9 April 2016

హై బీపీ

సుబ్బారావు బ్లడ్ రిపోర్ట్ ఎగాదిగా చూశారు డాక్టర్.
..
"మై గాడ్ ఇంత బ్లడ్ ప్రెజరా ??. "..
..
"ఇది ఇంకా తక్కువ డాక్టర్. ఇంకా బెస్ట్ పెర్ఫార్మెడ్ ఫిగర్స్ ఉన్నాయి"..
...
"ఎప్పటినుండి ఇలా ?"...
..
"ఆరేళ్లనుండి "
..
"నిజమా? హెరిడిటీ ఏమైనా ఉందా? 
ఐ మిన్ మీ నాన్నగారికి కానీ అమ్మగారికి కానీ హై బీపీ ఉండేదా?"....
..
"లేదు డాక్టర్ గారు. మీరు అంటుంటే అనుమానం వచ్చింది. 
మా ఆవిడ తాలూకు హెరిడిటీ అయి ఉంటుంది."
..
"చ. చ. ఆ అవకాశం లేదు. సైన్స్ ఒప్పుకోదు "..
...

"ఒకసారి మా ఆవిడని పిలవనా ? మీ అభిప్రాయం మారోచ్చు" 
సుబ్బారావు అనుమానం పడ్డాడు. 

Wednesday, 6 April 2016

ఒక ప్రశ్న – మరో సమాదానం

“పిల్లాడికి నాలుగు కోట్లు ఉన్నాయన్నావు.”
“మూడు  లాండ్రీ లో ఉన్నాయి ఒకటి చిరిగిపోయింది. కుట్టిచ్చుకోటానికి బనియను వేసుకుని సైకిలు మీద టైలర్ దగ్గరకి వెళ్ళాడు.”
**
ఇంటిముందు ఎప్పుడు ఫారిన్ కార్లు ఆగి ఉంటాయన్నావు ?
ఎదురుగా  పేరుమోసిన మెకానిక్ ఉన్నాడు.
**
కింద హాల్లో రోజు 50/60 మందికి బోజనాలు వడ్డీస్తూ ఉంటారన్నావు.
పిల్లాడు ఉండే రుము కింద ఫ్లోర్ లో మంచి మెస్ ఉంది.
**
ఆడపిల్లలు క్యూ లో ఉంటారు అన్నావు.
పిల్లాడు ముంత పప్పు మసాలా బాగా కలుపుతాడు.
**
ఓరీ డెబ్బ .. నువ్వక్కడే ఉండరా .. వస్తున్నాను..
**
Good Morning. 


Tuesday, 5 April 2016

కోటీస్ షాపింగ్ మాల్

ఒక నడివయస్సు అతను, కొడుకుతో కలిసి 42 డిగ్రీల గ్రీష్మం లో బాపూజీ కాంప్లెక్స్ పార్కింగ్ లాట్ లో నుండి బండి తీసి ఫర్లాంగు వచ్చాడో లేదో బండి చైన్ తెగి పోయింది.
..
ఇస్లాంపేట మొదట్లో చాలా మెకానిక్ షాపులు ఉన్నాయి. మరో పర్లాంగ్ లోపు దూరం లో ఉన్న మెకానిక్ షాపు కి తండ్రి కొడుకులు బండి నెట్టుకు వెళ్లారు. లేటుగా లంచ్ కి వెళ్ళిన కుర్రాళ్ళు ఇంకా రానందున ఒక గంట సమయం పడుతుందని, బండి ఉంచి గంట తర్వాత రమ్మని తెలిసిన మెకానిక్ చెప్పాడు.
..
తండ్రి కొడుకులు దగ్గర్లో ఉన్న కోటిస్ షాపింగ్ మాల్ కి వెళ్లారు. 
గ్రౌండ్ ఫ్లోర్ లో ఏ‌సి పోకుండా ఎయిర్ కట్టర్ ఉంది. 
దాని కింద రెండు నిమిషాలు నిలబడ్డారు అప్పటికి కానీ తడిచిన చొక్కాలు ఆరేలేదు. 
కౌంటర్ ముందు తెల్లటి టైల్స్ మీద పువ్వులతో పెద్ద ముగ్గు వేసి ఉంది.
..
మద్యాహ్నం టైమ్ అవటం తో జనం పలచగా ఉన్నారు.
..
నాలుగంతస్తుల షాపింగ్ మాల్ లో లిఫ్ట్ లో తిరుగుతూ అంతా కలియతిరిగారు. 
బేబీ టాయ్స్, నుండి వాక్యూమ్ క్లీనర్ల వరకు అన్నీ చూశారు, ధరవరలు విచారించారు.
 క్రోకరీ డిజైన్స్ అన్నీ ఒక్కొక్కటి ముట్టుకుని చూశారు. 
పిల్లాడు ఎలెక్ట్రానిక్ బిభాగాన్ని, గేమ్స్ వస్తువులని, 
తండ్రి ఫర్నిచర్ ని హౌస్ హోల్డ్ వస్తువులని నఖశిఖ పర్యంతం విచారించారు. 
ప్రతి ఫ్లోర్ లో ఉంచిన కూలింగ్ వాటర్ గ్లాసులు నింపుకుని తాగారు. 
లిఫ్ట్ లో పైకి కిందకి చెరో రెండు సార్లు తిరిగారు.
..
కౌంటర్ లో కూర్చుని సెక్యూరిటీ కామ్ లో  ఏమి కొనకుండా కాంప్లెక్స్ అంతా కలియ దిరుగుతున్న ఇద్దరినీ గమనించిన మేనేజర్ కౌంటర్ నుండి ఫస్ట్ ఫ్లోర్ కి వెళ్ళి పెద్దాయనని కలిసి అడిగాడు.
...
 “మీకేం కావాలి సార్ ?” వినయం పలికి నప్పటికి “ఎందుకొచ్చారు?” అని దాని భావం.
..
“అనాసిన్ టాబ్లెట్ కావాలి. అది కూడా డాక్టర్ రెడ్డీస్ లాబ్ లో జనవరి 16 తేదీ తయారయినది“ పెద్దాయన చక్కటి ఇంగ్లీష్ లో చెప్పాడు. 
ఈ లోగా ఆయన కొడుకు కూడా అక్కడి వచ్చాడు. “ప్లాస్టిక్ స్పూన్ లు డజను సెట్ ఇస్తారట. ఒక్కొక్కటి ఇవ్వటం కుదరదట?” తండ్రి తో చెప్పాడు ఆ పిల్లాడు.
..
మేనేజర్ ఒక్క నిమిషం అయోమయంగా చూసి ఇద్దర్ని అనుమానంగా చూశాడు.
ఇద్దరు నాగరికుల లాగానే ఉన్నారు. 
వాళ్ళు కావాలనే అలా బిహేవ్ చేస్తున్నట్టు మేనేజర్ కి క్షణాల్లో అర్ధం అయింది.
..
“అసలేమయింది సార్ ? “ మర్యాద గా అడిగాడు.
..
“గుడ్. యు గాట్ ది పాయింట్ “ ఒక్క గంటకే ఇరిటేటింగా ఉందా మీకు ?” జేబులోంచి సెల్ తీశాడు. లాక్ తీసి మెసేజెస్ ఓపెన్ చేసి ‘కోటిస్ లో కొనమని వచ్చిన కమరిషియల్ మెసేజ్ లు చూయించాడు.
..
“ అప్పుడెప్పుకో అప్పడాల కర్ర కొన్నప్పుడు ఫోన్ నెంబరు రాసుకుని నాలుగేళ్ళు నుండి నెలకి 12 చొప్పున అయిదొందల సార్లు కి పైగా  మెసేజ్ లు పంపుతున్నారు. మాకేలా ఉంటుంది.??”  Grrrrrrrrr


www.susri.home.blog

  అందరికీ నమస్తే 66o పోస్టులు పైగా వ్రాసిన ఈ బ్లాగ్ లోని నా పోస్ట్ లలో  చాలా అచ్చుతప్పులు ఉండటం గమనించాను.  వాటన్నిటినీ ఎడిట్ చేస్తూ, modify...