Monday, 7 March 2016

హాపీ ఉమెన్స్ డే

అతనికి చాలా ఎక్సైటింగ్ గా ఉంది .
మొట్టమొదటి సారి తను ఉరేల్లింది.
ఏదో ప్రాపర్టీ తాలూకు గొడవల్లో మామగారికి తన సంతకం అవసరం అయ్యింది.
బబ్లూ ని వెంటబెట్టుకుని, రెండు రోజుల్లో వచ్చేస్తానని..
ఉద్యోగరీత్యా ఏలూరు లో ఉండటం మొదలెట్టాక ఇదే మొదటిసారి ఈ ఆరు సంవత్సరాలలో 
రెండు రోజులు .. పెళ్ళాం ఉరేలితే .. 
ఏమేం చెయ్యొచ్చు ?? ఫ్రెండ్స్ ? కార్డ్స్ ? మందు ? ఇవేమీ తనకు అలవాటు లేదు మరి అందరూ అనే ఈ స్వతంత్రం వాడుకోవటం ఎలా?
అతను ఇంటికొచ్చాడు. టైమ్ ఏడున్నర. ఫ్లాట్ తాళం వేసి ఉంది. వాలేట్ లో జాగర్తగా ఉంచుకున్న తాళం చెవి తీసి తలుపు తీశాడు. 
గదిలో సోఫా ముందు టీ పాయ్ మీద నిత్యం పడుకునే ముందు తను చదువుకునే పుస్తకం ఉంది. బెడ్ రూమ్ లో కి వెళ్ళి స్నానం చేశాడు. టవల్ కట్టుకుని పూజా మందిరం లోకి వెళ్ళి బొట్టు పెట్టుకుని అగరు బత్తీలు వెలిగించి నమస్కారం చేసుకున్నాడు.
కప్ బోర్డు తెరవగానే డోర్ లోపల వైపు అంటించి “తన’ ఫోటో ఉంది. 
హాని మూన్ వెళ్లినప్పుడు మున్నార్ బాక్ వాటర్స్ లో బోట్ లో స్వయంగా అతనే తీసిన ఫోటో అది. తనకి చాలా ఇష్టమయినది.
నైట్ డ్రస్ వేసుకుని వచ్చి హల్లో టి‌వి ఆన్ చేశాడు. పవర్ సప్లై పోవటం తను గమనించాడు. 
మిగిలిన అన్నీ రూముల్లో సప్లయ్ ఉంది. హల్లో ఉన్న మైన్ బోర్డు లో MCB ట్రిప్ అయి ఉంది దాన్ని సరిచేసే సరికి టి‌వి సప్లై వచ్చింది. పదినిమిషాలు టి‌వి చూసేసరికి ఫోన్ మోగింది.
తనే . “మాస్టారు ఏం చేస్తున్నారు ?”
“
ఇప్పుడే వచ్చి స్నానం చేసి కూర్చుని టి‌వి చూస్తున్నాను”
“mcb
ట్రిప్ అయి ఉందాలే? “ పక్కనే కూర్చుని చెప్పినట్లు చెప్పింది.
“
అవును ని కెలా ?” 
“
అదే మాజిక్” ఒక్క నిమిషం కిచెన్ లోకి వెళ్ళండి.”
అతను లేచి వెళ్ళేసరికి రైస్ కుక్కర్ వార్మ్ లో ఉంది. అవెన్ వార్మ్ మోడ్ లో ఉంది. తాను పవర్ సరిచేసినప్పుడు ఆన్ అయి ఉండాలి.
“
అవెన్ లో కూరలు వేడి అయి ఉంటాయి. రైస్ రెడీ అయి ఉంటుంది. ఫ్రీడ్జ్ లో పచ్చళ్లు, పెరుగు ఉన్నాయి. బోజనమ్ చేయండి. అంట్లు కడగటానికి పొద్దుటే పనమ్మాయి వస్తుంది”
అతను ఏమి మాట్లాడలేదు. 
“
హలో సార్ ఏమి మాటల్లేవు”
“
నువ్వేప్పుడు వస్తున్నావు?”
“
ఇవాళే సార్ నేను వచ్చింది. రేపు రిజిస్ట్రేషన్ పని అవోచ్చు. కానీ రేపు అమ్మ వాళ్ళు పంపక పోవచ్చు ఎల్లుండి వచ్చేస్తాను.” తను పోను పెట్టేసింది. 
రాత్రి పదిన్నరకి అతను ఫోన్ చేశాడు.
ఆమె మొదటి రింగు కె అటెండయింది.
“
బబ్లూ ఏమి చేస్తున్నాడు.?”
“
వాళ్ళ అమ్మమ్మ తో ఇప్పటిదాకా ఆడి ఇప్పుడే నిద్రపోయాడు”
“
బబ్లూ వాళ్ళ అమ్మ ఏమి చేస్తుంది?”
అటునుండి నవ్వు. 
ఇటు మౌనం .
అటు నుండి మళ్ళీ నవ్వు. 
“
మాధవి .. హాపీ ఉమెన్స్ డే. అండ్ xxx xxx xxx xxxx “
తెరలు తెరలుగా ఆమె నవ్వుతూనే ఉంది.



Sunday, 6 March 2016

రెండు తర్వాత మూడే


మొదట్లో : డాలింగ్ I love you. I love you. I love you 
కొన్నాళ్ళకి : అఫ్కోర్స్ I love you 
కొన్నేళ్ళకి : ప్రేమించక పోతే ప్రపోజ్ ఎందుకు చేస్తాను 
..
బాక్ ఫ్రమ్ వర్క్ 
----------------
మొదట్లో : హాని.. ఆ యామ్ హోమ్ 
కొన్నాళ్ళకి : బాక్ ..టూ హోం 
కొన్నేళ్ళకి : ఇవాళ్ళ అమ్మ ఏమి వండుతుంది ??
..
బహుమతులు 
------------
మొదట్లో : ఈ ఉంగరం నీకు అద్బుతం గా ఉంటుంది.
కొన్నాళ్ళకి : ని కోసం ఒక పెయింటింగ్ తెచ్చాను. హాల్లో పెడదామా?
కొన్నేళ్ళకి : ఇదిగో డబ్బు. నిక్కావలసింది కొనుక్కో 
..
వంట 
-----
మొదట్లో : ఇంత బాగా వండొచ్చా?? 
కొన్నాళ్ళకి : ఇవాళ ఏమి వండుతున్నావ్?
కొన్నేళ్ళకి : మళ్ళీ ఆదేనా? 
..
కొత్త చీర 
-------
మొదట్లో : మై గాడ్ ఎంత అందంగా ఉన్నావు ఈ చీరలో 
కొన్నాళ్ళకి : మళ్ళీ కొత్తది కొన్నావా?
కొన్నేళ్ళకి : ఎంతయింది బిల్లు ??..
..
సంసారం 
-------
మొదట్లో : నిద్ర పోకూ ప్లీజ్ వచ్చేస్తున్నా 
కొన్నాళ్ళకి : అంత నిద్ర మత్తెమిటే ??
కొన్నేళ్ళకి : ఇంకా నిద్ర పోలా?

Friday, 4 March 2016

మురికి చొక్కా



ఎర్రటి ఎండలో ఎప్పుడో ఒక ఆటొ తప్ప ఏ వాహనము తిరగని మట్టి బాట వెంట 
డ్యూటీ లో బాగంగా టూ వీలర్ మీద వెళ్తూ ఉంటే ఒక కాకి నిక్కరు వేసుకున్న అతను ఉన్న ఒక్క చేతిని ఎత్తి లిఫ్ట్ అడిగాడు.
మాసిన అతని చొక్కాని, మురికిగా ఉన్న నిక్కరు ని చూసి, నాలుగు కొలోమీటర్ల దూరం వెళ్ళి.. పోయిన పని చేసుకుని బయలు దేరబోతుంటే, వెనక టైరు ఫ్లాట్ అయి ఉంది.
30 కుటుంబాలు మించని అతి చిన్న హాబీటేషన్ అది. కొద్ది మంది ఇంటికి కాపలా ఉన్న ముదుసలి వాళ్ళు తప్ప మరెవరూ కనబడలేదు. ఒక అంగన్వాడీ టీచరు, ఉన్న నలుగురు పిల్లల్తో కాలక్షేపం చేస్తుంది. 
సహజంగా ఇలాటి పరిస్తితులలో గుర్తుకు వచ్చే అనుకూలమయిన ఒక ఛోటా నాయకుడు గుర్తొచ్చాడు. ఫోన్ తీశాను. సిగ్నల్ లేదు.
టైమ్ మద్యాన్నం 1.30 దాటింది. దాహం మొదలయ్యింది. ఆకలి గుర్తుకొస్తుంది.
నడిచి వెళ్లాలన్న తారు రోడ్డు కి కనీసం రెండు గంటలు నడక ఉంది.
ఒక ఎండిపోయిన వేపచెట్టు కి కట్టిన అరుగు మీద, నీటి చుక్క రాని బోరింగు పక్కన కూర్చున్నాను. అరగంట గడిచింది. 
అంగన్వాడీ టీచరు ఒక పిల్లాడిని పంపి నాసరయ్య ని పిలిపించింది.
అతను వస్తూనే నన్ను చూసి నమస్కారం పెట్టాడు. 
వెనుక టైర్ ని సైకిలు టిబు తీసినట్లు తీసి స్టిక్కర్ వేసి సైకిలు పంపు తో గాలి కొట్టి రెడీ చేశాడు. దేవుడు ఇలాటప్పుడే గుర్తొస్తాడు ..
నేను పర్సు తీసి ఇవ్వబోతున్న వందని వంటి చేత్తో తిరస్కరించాడు. 
"
మా ఊరు వచ్చే అదికార్లే తక్కువ. వచ్చిన వారు ఇబ్బంది పడకూడదు" అన్నాడు.
నాసరయ్య నిక్కరు చొక్కా మాత్రమే మురికిగా అనిపించాయి. 
చెప్పుల్లో దూరిన కాళ్ళ వెళ్ళు లెక్కపెట్టుకుంటూ బండి స్టార్ట్ చేశాను.
#susri

Tuesday, 1 March 2016

షాపింగ్ .. షాపింగ్

“ఊహూ .. ఆ పై అరలో ఊదారంగు చీర తియ్యండి”
అప్పటికే ఒక యెనబై చీరలు చూసి ఉంటుంది ఆమె. 
సేల్స్ గర్ల్ కి విసుగ్గా ఉంది 
కానీ మొహం లో అది కనబడనియ కుండా, 
మెట్లు ఏర్పాటు ఉన్న స్టూల్ ఎక్కి ఆ రంగు చీర తీసింది.
..
బస్టాంట్ దగ్గరగా ఉన్న ఏసీ వస్త్రాలయం . ఖరీదయిన చీరలు కి పెట్టినిల్లు.

గంట క్రితం వచ్చిందామే. ఆమెతో వచ్చిన 
ఆరేడు ఏండ్ల చిన్న పిల్లాడు మ్యాంగో జూస్ రెండు గ్లాసులు తాగి,
సెల్ లో గేమ్స్ ఆడుతున్నాడు. 
..
“
దీని పమిట డిజైన్ చూపించండి” సేల్స్ గర్ల్ చీర మడతలు విప్పి, 
"
ఇది లేటెస్ట్ డిజైన్ మాడమ్, బ్లౌస్ పీస్ కూడా ఇందులో ఉంది కావాలంటే కట్ చేసి కుట్టించుకోవచ్చు లేదా ఇలానే ఉంచి మరో డిజైనర్ బ్లౌస్ తీసుకోవచ్చు”
..
“
దీంట్లో రెండు షేడ్స్ వస్తున్నాయి కదా ఆ మోడల్ లేవా?” ..
క్షుణ్ణంగా పరిశీలించాక అడిగిందామే.
సేల్స్గ గర్ల్ కి విసుగొచ్చింది. హమ్మయ్య సెలెక్షన్ అయిపోయింది అనుకోవటం 
చివర్లో మరేదో లేదా అని అడగటం, గంట నుండి అన్నీ కుప్ప పడేయించింది. 
ఇవన్నీ తిరిగి సర్దుకోటానికే మరో గంట ఖాయం గా పడుతుంది.
..
“
వెనక్కి తిరిగి పై రాకు లోని మరి కొన్ని చీరలు తీసి చూపించింది. ..
ఈ కలర్స్ ఇప్పుడు ఫాస్ట్ మూవింగ్ మాడమ్. హాఫ్ జెరీ వి. 
ఎప్పటికయినా జరి వరకు అమ్మినా సంగం పైగా డబ్బులు రిటన్ వస్తాయి” 
ఆ ఆమ్మాయి ఆశగా చెప్పింది.
..
ఇంతలో పిల్లాడి చేతిలో సెల్ మోగింది. ..
..
ఈమే అందుకుంది . 
“
ఏమండీ వచ్చారా? ఎండ మండి పోతుంది. బస్సు దిగి గంటయింది. 
ఇప్పుడా మీరొచ్చేది. అక్కడే ఉండండి పక్కనే ఉన్నాను ‘ ..
సెల్ ఆపి “రే బాబు నాన్న వచ్చారు పోదాం పద “ 
ఆమె క్షణాల్లో మాయం అయింది. 

Monday, 29 February 2016

MBA ప్రేమలేఖ

ఒక MBA కుర్రాడు (HR మానేజర్ ) అనుకోండి వ్రాసిన ప్రేమ లేఖJ
డియరెస్ట్ మిస్ గార్గేయి ..
Sub: ప్రేమ ధరఖాస్తు
ఈ నెల 21 తేదీ (శనివారం) నుండి మీతో ప్రేమలో పడ్డ విషయం మీకు తెలియచేయడానికి సంతోషం గా ఉంది. 20 వ తేదీ ఫిబ్రవరి (శుక్రవారం ) నాటి 15.00 గంటల మన సమావేశాన్ని మీ దృష్టికి తెస్తున్నాను.
నన్ను నేను ఒక స్టిర చిత్తం గల బావి ప్రేమికుడిగా అభివర్ణించుకుంటున్నాను. మన ప్రేమ వ్యవహారం మూడు నెలల పాటు పరిశీలన లో ఉంటుంది. పరిశీలనా కాలం లోని అనుకూలతని బట్టి శాశ్వత స్థానం పొందుతుంది.
పరిశీలనా కాలం లో నైపుణ్యాల మెరుగుదల, పరిణీతి ల పై శిక్షణ ఉంటుంది. ప్రేమికురాలి నుండి అర్ధాంగి గా ఉన్నతి పొడటానికి  ఈ శిక్షణ దోహదం చేస్తుంది.
పరిశీలనా కాలం లో ఖర్చు అయ్యే, టి ,కాఫీ, పాని పురి, పల్లిలా ఖర్చులు  కొద్ది కాలం పాటు సమానంగా  భరించాల్సి ఉంటుంది. తదుపరి మీ నైపుణ్యాలను బట్టి ఖర్చు లో ఎక్కువ భాగాన్ని నేను భరాయించే అవకాశం కూడా ఉంది. ఏమయినా పూర్తి చిల్లర ఖర్చులు, మీ చిన్న చిన్న షాపింగ్ ఖర్చులు నేను అందిపుచ్చుకోగల విశాల మనసు ఉందని కూడా తెలియ చేస్తున్నాను.
ఈ లెటర్ అందిన 30 పని దినముల లోగా స్పందించ గలరని, లేని యడల మికు కేటాయింపబడిన ఈ అవకాశం ఎటువంటి ముందస్తు నోటీసు లేకుండానే రద్దు అయ్యే అవకాశం ఉందని గ్రహించ గలరు. తదుపరి జాబితా లో ఉన్నవారికి ఈ అవకాశం మళ్లింప బడుతుందని తెలుసుకోగలరు. ఆసక్తి లేనిచో మీరే మీ స్నేహితురాలు ఎవరికయినా ఈ లెటర్ ను బట్వాడా చెయ్యగలరు. ఏది ఏమయినా మీరీ అవకాశాన్ని అంది పుచ్చు కోవాలని కోరుకుంటున్నాను.
మీకు శుభ కామనలు . మీకు ముందుగా దన్యవాదాలు .

భవదీయ ...

Saturday, 27 February 2016

అవుట్ డేటెడ్

గృహావసరాల కోసం 600 అడుగుల డీప్ బోర్ లో నీళ్ళు అడుగంటుతున్న  
ఒక ప్రకాశం పశ్చిమ ప్రాంతానికి ఇరిగేషన్ ఏయీ వివాహానికి గతరాత్రి వెళ్ళాను.
..
భారీగా ఏర్పాట్ల మధ్య, పాట కచ్చేరి లో “మంచమెక్కి ..” అంటూ చిరంజీవి పాటలకి ఆడపిల్లల డాన్సులతో ఇరగదీశారు. పెద్ద పెద్ద సౌండ్ సిస్టమ్ తో అల్లాడించారు...
..
ఈ లోగా తెలిసిన అతన్ని ఆదారంగా చేసుకుని, చాకచక్యంగా అందిన కాడికి బోజనమ్ చేశాను. ఈ పోరాటానికి కొంత సమయం పట్టింది. ..
తిరిగి వేదిక వద్దకి వచ్చే సరికి మంచి ఊపు మీద పాటలు – ఆటలు ముతక జోకులు...
..
సందట్లో సడేమియాలాగా మంత్రమన్నది ఎవరి చెవికి వినబడకుండా పెళ్లి తంతు ముగిసింది.
బాలయ్య పాటలు హామ్ చేస్తూ వధూవరులని దీవిస్తున్నట్టు ఫోటోల కార్యక్రమం జరుగుతుంది...
..
నేను అక్షితలు ఎక్కడ ఉన్నాయో కనుక్కుని, వాటిని సాదించి పిల్లల్ని ఆశీర్వదించి వేదిక దిగేటప్పుడు వధువు “పెద్దమ్మ రాలేదా.. పెదనాన్నా” అని చెవిలో ఆప్యాయత రంగరించి పోసింది.
..

 తనకి సమాదానం చెప్పి రోడ్డున పడ్డాను...
..
అతిదులలో బోజనాల వద్ద ఒక పెద్దాయన “మేము మావే వాడుకున్నాం.. మీరు మీ ముది మనవల్ల వాటా కూడా వాడేసుకుని, రంగు కాగితాలు మిగులుస్తున్నారు” అనడం మాత్రం నన్ను వెంటాడుతూనే ఉంది.

మంచి డాన్సు ప్రోగ్రాంలు చూడకుండా  పెద్దాయన నీటి వెతల విషయాలు చెబుతుంటే ఎబ్బెట్టుగా లేదూ ??

Monday, 22 February 2016

రాంగ్ నెంబర్

తెల్లవారుజామున వాలెంటెన్స్ డే రోజు కిషోర్ ఇచ్చిన ఫోన్ నెంబరుకి 
స్వీటి ఫోన్ చేసింది.
అటునుండి ఆడ గొంతు "ఎవరు?"
"కిషోర్ ఉన్నారా?"

"ఉన్నాడు. బాత్ రూమ్ లో ఉన్నారు"

"నేను తన గర్ల్ ఫ్రెండ్ ని ఫోన్ చేశానని చెప్పండి"
****
అరగంట గడిచింది. రిప్లై రాలేదు.
****
మళ్ళీ స్వీటి ఫోన్ చేసింది.
ఈసారి మగ గొంతు. " ఎవరూ "
"
నేను స్వీటిని. మీరు నా కిషోర్ కాదు"
"
తెలుసు. అరగంట నుండి ఆవిడకి నచ్చచెప్పలేక పోతున్నాను.
తల్లి ఫోన్ ఇస్తాను మాట్లాడి నా సంసారం నిలబెట్టు"

www.susri.home.blog

  అందరికీ నమస్తే 66o పోస్టులు పైగా వ్రాసిన ఈ బ్లాగ్ లోని నా పోస్ట్ లలో  చాలా అచ్చుతప్పులు ఉండటం గమనించాను.  వాటన్నిటినీ ఎడిట్ చేస్తూ, modify...