Wednesday, 31 August 2016

హొ ఓల్ద్

రష్యా నుండి వచ్చి సైకిల్ మీద భారత దేశ యాత్ర చేస్తున్న అరవై రెండేళ్ల ‘పెన్తెకోవా ‘ నరసారావుపేట లో ఆగింది. కొబ్బరి బోండాం కొట్టించుకుని బాటిల్ లో పోయించుకుంటుంటే.. 
పక్కనే శానిటరీ షాపు లో ఒక పెద్దాయన రిలాక్స్డ్ గా కూర్చుని ఇదంతా గమనిస్తున్నాడు. 
తీరా డబ్బు విషయం వచ్చే సరికి అతను జోక్యం చేసుకోవాలసి వచ్చింది. ఆమెకున్న రష్యన్ ఇంగ్లీష్ పరిజ్ణానం అర్ధం చేసుకున్న పెద్దాయన డబ్బు లెక్క సెటిల్ చేశాడు ఇద్దరికీ వయా మీడియాగా..
పెన్తెకోవా అతనికి థాంక్స్ చెప్పింది. కొద్దిసేపు తమ షాప్ లో కూర్చోవచ్చని చెప్పాక, ఆమె కూలర్ ముందు కూర్చుని పిచ్చా పాటి మొదలెట్టింది.
“యు లుక్ సొ యాక్తివ్? వాట్ ఈస్ సీక్రెత్ బిహైంద్.?”
“నో సెక్రెట్. నో డైట్. నో ఎక్ష్సర్సైజ్. ఓన్లీ 3 ప్యాక్ సిగార్స్ డైలీ, హాఫ్ బాటిల్ రం వీక్లీ” నవ్వాడాయన.
“ఈస్ ఇట్ ?? వందరఫుల్ . వండర్ఫుల్. . హొ ఓల్ద్ ఆర్ యు సర్ ?”
“ జస్ట్ థర్టీ సిక్స్” చెప్పాడతను. 

దిలీప్ ఎవరు?

“మానసా నీతో మాట్లాడాలి “ స్నేహితురాలి కి ఫోన్ చేసి చెప్పాడు కార్తీక్.
“అంతా క్షేమమేగా?”
“ఎవ్విరి థింగ్ ఒకే “
“మరెంటి?”
“నీ ఎఫ్‌బి లో దిలీప్ ఎవరు?”
“ఏ ఏమయింది?”
“నిన్ను రెగ్యులర్ గా ఫాలో అవుతుంటాడు. ని ఫోటో లన్నిటిని , లైక్ చేసే, cute, super, awesome లాటి కామెంట్లు ఉంచుతుంటాడు.?”
“అతనా?”
“అవును. ఎవరతను ?”
“వదిలే. మారేదయినా మాట్లాడు”
“అంటే ని ex బాయ్ ఫ్రెండ్ ?”
“చి కాదు.”
“మరి? బ్రదర్?”
“నో ... వదిలెయ్యమన్నానా?”
“అంటే .. చెప్పటం ఇష్టం లేదా?”
“ప్లీజ్ అదొక్కటి అడక్కు?”
“సరే. వదిలేస్తా.. మన రిలేషన్ దెబ్బతింటుంది.”
“అబ్బా .. కార్తీక్ .. చేబ్తాను కానీ నువ్వు కోప్పడకూడదు.”
“ఐ ట్రై .. చెప్పు”
..
..
..
..
..
....
“అది నా ఫేక్ ఐ‌డి “ 

వర్డ్స్ అండ్ ఫిగర్ !!

బ్యాంక్ కాష్ క్లోసింగ్ అవర్స్ లో మేనేజర్ కి ఫోన్ వచ్చింది.
“సార్ అర్జంటుగా 80,000 కావాలి. ఒక్క పదినిమిషాల్లో వచ్చేస్తాను. ట్రాఫిక్ లో ఉన్నాను ప్లీజ్” తియ్యటి వాయిస్ తో గోముగా రిక్వెస్ట్. 
నార్త్ ఇండియా నుండి వచ్చిన కుర్ర మేనేజర్ వెంటనే ఇంటర్ కం లో కాషియర్ 
తో చెప్పాడు కాష్ క్లోజ్ చెయ్యొద్దన్ని.
అలాటి పది నిమిషాలు నాలుగు అయిపోయినాయి. 
హడావిడిగా లోపలికి వచ్చిన ‘హిడింబి’ నేరుగా మేనేజర్ వద్దకి దొర్లుకుంటా వెళ్లింది.
ఒక్క నిమిషం ఆమెని ఎగా దిగా చూసి. “నో వే. కాష్ క్లోజ్డ్. కం టుమారో” నిర్ధాక్ష్యణ్యం గా చెప్పాడు.
కేబిన్ లోంచి లేచి వచ్చి కేషియర్ తో కాష్ క్లోజ్ చెయ్యమని చెప్పాడు.
“చెక్ నహి లాయా క్యా?”
వింతగా చూసిన కొలీగ్ తో ..
“ Words అండ్ Figure నాట్ మాచేడ్. వాట్ టు డూ ?”

Friday, 26 August 2016

లేటు ..వయసు

1970 పి‌వి‌ఆర్ హై స్కూల్ లో పదో తరగతి చదివిన వాళ్ళందరూ గెట్ టు గెదర్ ఏర్పాటు చేసుకున్నారు.
చాలా దూర ప్రాంతాలనుండి, 45 ఏళ్ల తర్వాత అందరూ కలిశారు. వివిద ఉద్యోగాలు చేసి రిటైల్ అయ్యి సీనియర్ సిటిజన్స్ దశలో ఉన్నారు అందరూ.
ప్రారంభం లో తమ నుండి వెళ్ళిపోయిన సహచరులకి నివాళి ఘటించారు. 
రెండు రోజుల పాటు పాత జ్నాపకాలు తవ్వి పోసుకున్నారు.
అప్పటి నిక్ నేమ్స్ తో ప్రేమగా పలకరించుకున్నారు. 
ఆంజనేయులు, రాజ్యం మళ్ళీ కలిశారు. అప్పట్లో మూగ ప్రేమ గురించి మాట్లాడు కున్నారు. ఇద్దరు ఒంటరిగా మిగిలి పోయిన విషయాన్ని పంచుకున్నారు. 
ఒకరి నొకరు ఓదార్చుకున్నారు. 
మనం మళ్ళీ పెళ్లి చేసుకుందాంఅన్నాడు ఆంజనేయులు.
రాజ్యం చొట్ట బుగ్గలు లోకి గాలి నింపుకుని నవ్వింది. 
అలాగేఅంది ఎక్కువ సేపు ఆలోచించకుండా.
ఆ రాత్రి 'కాంటినెంటల్ హోటల్' లో బస చేసిన ఆంజనేయులు కి నిద్ర పట్టలేదు. 
ఉదయం బెడ్ కాఫీ తాగేటప్పుడు రాత్రి తను రాజ్యానికి ప్రపోసే చేసిన విషయంగుర్తొచ్చింది. 
ఆమె అవునుఆందో కాదుఆందో మాత్రం ఎంతమాత్రం గుర్తుకు రాలేదు. 
చాలా సేపు తర్జన బర్జన పడి ఫోన్ లో వాయిస్ సర్చ్ లో కాల్ స్వీట్ హార్ట్ రాజీ అని చెప్పాడు. ఫోన్ కనెక్ట్ అయింది. 
సారి రాజీ రాత్రి నేను ప్రపోజ్ చేసినప్పుడు నువ్వు యెస్అన్నావో నోఅన్నావో గుర్తుకురాక ఫోన్ చేశాను.
నువ్వేమి మారలేదు అంజీ యెస్అని మనస్ఫూర్తిగా చెప్పాను
ఆంజనేయులు ఆనందం గా ఫోన్ కట్ చెయ్యబోతుంటే రాజ్యం అంది.
నువ్వు ఫోన్ చెయ్యటం మంచిదయింది. రాత్రి ఎవరు ప్రపోజ్ చేశారో గుర్తుకురాక నిద్ర లేచినప్పటినుండి బుర్ర బద్దలు కొట్టుకుంటున్నాను


Saturday, 20 August 2016

సాహితీ సభ

అతను బాత్రూము లో ఉన్నప్పుడు తన ఫోన్ మ్రోగటం, బార్య అటెండవటం గమనించాడు.
..
తలతుడుచుకుంటూ "ఇందాక ఫోన్ వచ్చి నట్లుంది." అడిగాడు.
..
“మీ ఫ్రెండ్ .. కామేశం ; సాయంత్రం ఏదో సాహితీ సభ అటండ్ అవటానికి ‘కావలి’ వెళ్దాం అనుకున్నారట గదా? అది కాన్సిల్ అయ్యిందని చెప్పమన్నాడు”
..
“ఆలానా ఎందుకని? మా ఫ్రెండ్స్ అందరం కలిసి వెళ్దాం అనుకున్నాం. ఇంటికి రావటం లేటు అవుద్దని కూడా నీకు చెప్పాను. కాన్సిల్ ఎందుకనట ?”
..
“బహుశా మీకు అప్పు ఇచ్చే బార్ రిపేర్ లో ఉండి ఉంటుంది.”
..
ఏమిటో చెవుల్లోకీ నీళ్ళు వెళ్ళి సరిగా వినబడటం లేదు అతనికి.
..

Wednesday, 17 August 2016

మీటింగు ముగిసింది

రాత్రి ఆఫీసునుండి ఇంటికి వచ్చి స్నానం చేసి, కాలనీ కమిటీ మీటింగు కి అటెండయ్యాను.
..
అనేక విషయాలు చర్చకి వచ్చాయి,
సిమెంట్ రోడ్డు ప్రతిపాదన, గుడి అభివృద్ది, గుళ్ళో మంచి నీటి సౌకర్యం, 
సేవా టికెట్లు, ఫలహారాలు, పరిశుబ్రత, కొబ్బరికాయల అమ్మకం, 
ఆదాయవనరులు పెంచడం.. ఇలా అనేకం..
..
రాత్రి 11 దాటింది.
సభ్యులు  కొంత మంది నిద్రకి అవులిస్తున్నారు.. 
పగలు పనులకి వెళ్ళిన ఒకాయన గోడకి ఆనుకుని కునికిపాట్లు పడుతున్నాడు. 
అప్పటికే ఏమన్నా ఉంటే మరో మీటింగులో మాట్లాడుకుందాం. అని ఒక బాడీ మెంబరు నన్ను గీరుతున్నాడు.
..
“అన్నీ చర్చించాల్సిందే నని, ఎలాటి రాజీ లేదు అని  నిర్మొహమాటంగా చెప్పాను.
**
మరో పావుగంటకి నాకు Whats app లో మా పెద్దమ్మాయి నుండి సందేశం వచ్చింది.
“నాన్నా అమ్మ అలక అయిపోయింది. మీరు ఇంటికి రావచ్చు”
..
మీటింగు వెంటనే  ముగిసింది.

Monday, 15 August 2016

శాంతి దూత

సాయిబాబా ఛారిటీ స్కూల్ లో 70 వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి.
కమిటీ సభ్యులు దాతలు అతిదులు (నేనున్నానని చెప్పక్కర్లేదుగా J ) పిల్లలని ఉత్తేజ పరుస్తూ చక్కటి మాటలు వారి భాషలో చెప్పారు. జాతి నిర్మాణానికి ఇప్పటి నుండే పిల్లలు నిర్వహించాల్సిన భాద్యతలు గుర్తు చేశారు. ప్రత్యేకంగా వచ్చిన ఒక అతిది శాంతి దూత లా  “శాంతి గురించి చాలా చక్కగా చెప్పారు. అహింస గురించి ఓపికగా వివరించారు, వ్యక్తిగత హింసకి పాల్పడినప్పటికి శాంతి యుతంగా గాంధీ మార్గంలో ప్రజలు నడిచి నట్లయితే స్వాతంత్ర మనకి ఇంకా ముందే వచ్చి ఉండేది అని నమ్మకంగా చెప్పారు”

చక్కగా తయారయి, యూనిఫార్మ్ ల లో ఉన్న చిన్న పిల్లలు చక్కటి శ్లోకాలు, సామెతలు, పాటలు, ప్రార్ధనలతో వేదిక పులకించింది. పిల్లలకి కొన్ని ప్రోత్సాహక బహుమతులు పంపిణీ చేశారు. అందరికీ తినుబండారాల పాకెట్లు ఇవ్వబడ్డాయి. వందన సమర్పణ సరిగ్గా 11-00 కి పూర్తి అయ్యింది. విసురుగా గాలి మొదలయింది.
స్కూల్ పక్క నున్న మేడ మీద పక్షుల ఆహారం కోసం ఉంచిన ప్లాస్టిక్ గిన్నె ఒకటి గాలికి ఎగురుకుంటూ వచ్చి, శాంతి దూత గారి తలకి తగిలింది. మేడ మీద నుండి ఒకతను తొంగి చూశాడు.
“ఎవడ్రా అది .. పుండాకోర్ గిన్నె విసిరింది “ అంటూ అతని మీద విరుచుకు పడ్డాడు అతిది.

పిల్లల మనసుల్లో కొత్త ప్రశ్నలు మొలకెత్తకుండా నేను, ఓబులరెడ్డి మాస్తారు అడ్డుగా నిలబడ్డాము.

Sunday, 14 August 2016

ఒక్క రూపాయి.

అయిదారేళ్ళ క్రితం ఒక రోజు ఉద్యోగరీత్యా పర్చూరు శాసన సబ్యులు దగ్గుబాటి వేంకటేశ్వర రావు గారిని కలవటానికి పర్చూరు వెళ్లాల్సి వచ్చింది. ఒంగోలు నుండి చీరాల వరకు కృష్ణ ఎక్స్ ప్రెస్  లో వెళ్ళాను. అక్కడ దిగి పక్కనే ఉన్న బస్ స్టాండ్ లో బయలుదేరిన బస్సు రన్నింగ్ లో ఎక్కాను. బస్సులో మిగిలిన ఒక్క సీట్లో కూర్చున్నాను.
కొద్ది దూరం వెళ్ళాక బస్సు ఆపి కండెక్టర్ ఒక ముసలావిడ ని ఎక్కించాడు. ఆమె వద్ద ఉన్న మెత్తాళ్ళ(ఎండబేట్టిన చిన్న రొయ్యలు) గోతం ముక్కు పుటాలు అదరేస్తుంది. ఎవరయినా లేచి సీటు ఇస్తారేమో నని చూసా గాని ఎవరూ ఇవ్వలేదు. అందాకా ట్రైన్ లో నిలబడే ప్రయాణం చేశాను. లేచి నిలబడాలని పించలేదు. పైగా ఎం‌ఎల్‌ఏ గారి తో మాట్లాడటానికి కొంత ప్రిపేర్ అవాల్సి ఉంది. ఆవిడ అక్కడే కొద్దిగా స్థలం చూసుకుని కింద కూర్చుండి పోయింది.
కొద్దిసేపట్లో నేను డైరీ చూసుకుంటుండగా కండెక్టర్ టికెట్ అడిగాడు. వాలేట్ తీశాను. ఒక అయిదువందల నోటు మరో పది నోటు మిగిలింది. టికెట్ 11 రూపాయలు. జేబులు ఎంత వెతికినా చిల్లర లేదు జేబులో ..
500 కి చిల్లర లేదు. ఒక్క రూపాయి కావాలి.
అప్పుడు ఆమె తన నడుముకి ఉన్న చిన్న సంచి లోంచి చిల్లర వెతికి రూపాయి ఇచ్చింది. నేను చూస్తూ ఉండిపోయాను. దిగి మరో బస్సు ఎక్కే టంత టైమ్ లేదు. ఏదో తెలీని గిల్టీ ఫీలింగ్.
తీరా కారంచేడు చేరబోయేటప్పటికి వాలేట్ లోని జిప్ కవర్లో ఒక రెండు రూపాయల కాయిన్ ఉండటం గుర్తుకొచ్చింది. అది తీసి ఆమె కి ఇవ్వబోయాను. ఆమె తీసుకోలేదు. వద్దు” అంది. నాకేం చెయ్యాలో పాలు పోలేదు.
బస్సు దిగాను.

విషయం చాలా చిన్నదయినా చాలా సార్లు గుర్తుకొస్తుంది.
..
చిల్లర గురించి మళ్ళీ ఇంత వరకు ఇబ్బంది పడలేదు. ఎప్పుడు బాగ్ లో కొన్ని కాయిన్స్ వేసుకోవటం అలవాటు అయింది.

Friday, 12 August 2016

శ్రావణ మాసం - కొన్ని జాగర్తలు


మీ చాకచక్యం అంతా ఉపయోగించి, శ్రావణ శుక్రవార నోములకి, 
తాంబూలాలకి ఆడ లేడీస్ ని పోనీయకుండా జాగర్త పడండి.
లేదో .. మీకు ఇత్తడయిపోద్ది.
..
ఒక వేళ వెళ్లారనుకోండి. వాళ్ళు ఇంటికి వచ్చేసరికి విచారంగా మొహం పెట్టి, 
ఫ్లాట్ రేపేరుకి డబ్బు కట్టాల్సి వచ్చిందనో, కార్/హౌస్ లోన్ కిస్తిలు ఆరునెలలుగా పేరుకు పోయి ఉన్నాయనో, లేక మరో రెండు నెలలు జీతం రాదనో, మరేదో ఖర్చనో బొంకండి. 
'
ఆరోగ్యం బాలేనట్టు' నటించి 'టృంప్ కార్డు' బయటకి తీయండి. 
ఎందుకు చెబుతున్నానో గమనించుకోండి.
..
పెరంటాలలో నిజానికి జరిగేది, ప్రదర్శన, ఫోటో షూట్ లు, కొత్త చీరలు, నగలు, అక్సెసరీస్, ఐ బ్రోస్ , అబ్బో అవి చెప్పేవి కాదు. ఫోటోలు, చిరునామాలు, ధరవరలు బుర్రలో సేవ్ చేసుకుని ఇంటికి వస్తారు. పదిగ్రాముల చలిబిండి చేతి లో పెట్టి అది గొంతు దిగక ముందే ..   
మీరు నేను చెప్పిన జాగర్తలు తీసుకోలేదో.. మిమ్మల్ని విజయ్ మాల్వా కూడా కాపాడలేడు. ఇక మీష్టం.
..
మా గుండమ్మ పెరంటానికి దగ్గర్లో ఉన్న పోష్ అపార్ట్మెంట్ కి వెళ్లింది.
పది పదిహేను నిమిషాల్లో రావచ్చు..ప్రిపేర్ అవ్వాల్సి ఉంది. నమస్తే..

Monday, 8 August 2016

వాస్తు హోమం _శాంతి హోమం


 శ్రీ .అభయాంజనేయ  స్వామి వారి, బింబ, ద్వజస్తంభ, విమాన కలశ ప్రతిష్టా కార్యక్రమ వాస్తు హోమం మరియు శాంతి హోమం .

Saturday, 6 August 2016

రెండు విషయాలు

'కృష్ణ మోహన్' అని స్వామి వారి దేవాలయానికి ఒక గొప్ప దాత అయిన యువకుడు ఉన్నాడు. 
స్వంత ట్రాక్టర్ ఉంది. దేవాలయానికి సంబందించి ప్రతి కార్యక్రమానికి అతను ట్రాక్టర్ పంపుతాడు. ఆయిల్, డ్రైవర్ ని అతనే ఏర్పాటు చేస్తాడు. 
ఈ రోజు తాను కూడానే ఉన్నాడు. నిలువెత్తు పూలమాలలు తీసుకు వచ్చాడు. 
మూడు గంటల పైగా ఊరేగింపు జరిగింది. దేవాలయం లో కార్యక్రమం మరో గంట. 
డ్రైవర్ ని దిగమని అతనే బండి తోలాడు. 400 కేజీ లు పై చిలుకు ఉన్న స్వామివారిని వాహనం నుండి దించి ఆలయం లోకి తీసుకు వస్తుంటే .. ఆలోచన లోని ఒకావిడ గ్రానైట్ మెట్ల మీద నీటిని వారుగా పోసింది. ముందు వరసలో ఉన్న వాళ్ళ కాళ్ళు మెట్లమీద జారాయి. అతికష్టం మీద తమాయించుకుని క్షేమంగా స్వామివారి బింబాన్ని లోపలికి తీసుకు వచ్చారు.
...
"జారీ పడి పోతానేమో నని భయం వేసిందండి. కానీ ఆయనే ఆపాడు. లేకపోతే నడుములు విరిగేవి ' అన్నాడు నా పక్కకి వచ్చి నిలబడి.
...
"ఈ మధ్య కాలంలో అయిదుగంటల పాటు సిగిరెట్టు తాగకుండా మీరు ఉండటం ఇదే చూడటం " నేను నవ్వుతూ గుర్తు చేశాను. అతను దాదాపు చైన్ స్మోకర్.
..
"అవును గుర్తే లేదండీ " అన్నాడు.
"నేను సిగిరెట్టు లేకుండా ఉండలేనేమో అని ఒక అపనమ్మకం. ఇప్పుడు నమ్మకం కుదిరింది. మానేస్తాను. లేదా ఖచ్చితంగా తగ్గిస్తాను." అన్నాడు.

-------------------------------------------------------------------------------------------------------------------------------
కొన్ని సంగతులు కాకతాళీయమో లేక దైవ సంకల్పమో తెలీదు కానీ 'జరుగుతుంటాయి' 
..
మేము స్వామివారి బింబాన్ని ఊరేగింపుగా తీసుకు వచ్చే ఏర్పాటులో ఉన్నప్పుడు ఒక ఫోన్ కాల్ వచ్చింది 'గజ్జల శ్రీనివాస రెడ్డి' అనే మిత్రుడి నుండి. విజయవాడ లో ఉన్నాను మరో పావుగంటలో కార్లో ఒక్కడినే బయలు దేరుతున్నాను." అని .. ..
..
నేను సమాదానం చెప్పేలోగా మా ఓబులురెడ్డి మాస్టారు నాదగ్గరకి వచ్చి "గోపుర శిఖరం మీద కలశం ఇస్తానన్న దాత తను తేలేక పోయాడు, మీరు తెచ్చుకోండి. బిల్లు తీసుకురండి డబ్బులు ఇస్తాను అంటున్నాడు." ..
..
నేను ఫోన్ కి చెయ్యి అడ్డుగా ఉంచి " ఎక్కువ గా ఆలోచించొద్దు.. విజయవాడ లో కలశాలు దొరుకుతాయా ?" ..
..
'పోలవరం రాము అని ఒకతను ఉన్నాడు. అతని కార్డు నాదగ్గర ఉండాలి" అన్నాడు సారు. "చూడండి చూసి నెంబరు చెప్పండి."..
..
ఫోన్ లో వెయిట్ చేస్తున్న మిత్రుడికి" కారు ఆపుకుని కాఫీ తాగు. తాగే లోపు whats app లో ఏం చెయ్యాలో వివరాలు వస్తాయి " అని చెప్పాను...
..
ఈలోగా మాస్టారు విజిటింగ్ కార్డు తీసి ఇచ్చారు. వివరాలు చెబుతూ..
కార్డ్ ని ఫోటో తీసి" 30 అంగుళాల ఎత్తు, విష్ణు చక్రం ఉండే కలశం ఈ కాంటాక్ట్ లో ఉన్న వ్యక్తి ని కలిసి తీసుకొచ్చేయ్. మేం .అతనికి ఫోన్ చేసి వివరాలు చెబుతాం ఈ లోపు. కాష్ against బిల్. ఇంతకీ డబ్బులున్నాయా?"
అటునుండి తను ' పర్లేదు 12 వేల దాకా ఉన్నాయి. సరిపోతాయా?' అని తిరుగు టపా ..
'లక్షణంగా' అని చెప్పి మా పనిలో పడిపోయామ్.
స్వామి వారి 'దాన్యాది వాసం' కార్యక్రమం చూసి ఇంట్లోకి వస్తుంటే శ్రీనివాస రెడ్డి నుండి ఫోన్ కలశాలు 'పాలిష్ చేసి రెడీగా లేవని, ఇప్పటిదాకా కూర్చుని పాలిష్ చేయించి. బిల్ చెల్లించి బయలదేరబోతున్నానని.'
'గుడ్ బయలు దేరి వచ్చెయ్ .. జాగర్త ..పొద్దుటే కలుద్దాం "
.
మాకేమిటండీ ? మా వానర సైన్యం ఉంది. ఏ ఆటంకం ఉండదు.

ధాన్యాదివాసం

ఎనిమిదేళ్ళ క్రితం దేవాలయ నిర్మాణానికి శంకుస్థాపన జరిగిన 'శ్రీ అభయంజనేయ స్వామి వారి దేవాలయం'
(మర్రిచెట్టు కాలనీ, మంగమూరు రోడ్డు, ఒంగోలు , ప్రకాశం జిల్లా, ఆంధ్ర ప్రదేశ్ ) ఈ నాటికి ఒక రూపు రేఖలు అందుకుంది. 10 తేదీ న దేవాలయం లో కొలువవటానికి 'ఆంజనేయుడు' బయలు దేరి వచ్చాడు.
మా గ్రామ ప్రజలు, ఊరేగింపుగా వెళ్ళి స్వామివారిని, మేళ తాళాలు తో బాజా బజంత్రీలతో, ఊరేగింపుగా తీసుకుని వచ్చారు. స్వామివారు నేడు దాన్యది వాసం చేస్తున్నారు. మరో ప్రక్క ఈ పండుగకి అన్నీ ఏర్పాట్లు బక్తులు చేస్తున్నారు.





ఆహ్వానం _/][\_


Friday, 5 August 2016

మరో ఏడు జన్మలు

స్వర్గం లో 'జనరల్ బాడీ' మీటింగు జరుగుతుంది. 
ఒక జటిలమయిన సమస్య చర్చకి వచ్చింది.
చిత్రగుప్తుడు ఈ సమస్యని ప్రవేశ పెట్టాడు. 
పునర్జన్మ సమస్య గురించి.
శ్రావణ మాసం, కార్తీక మాసం మహిళామణులు, మరో ఏడు జన్మల వరకు ఇదే భర్త కావాలని, బొల్దెంత టైమ్ & టెక్నిక్స్ వాడి ఈ జన్మలో తాము ట్రైన్ అప్ చేసుకున్నామని, కనీసం మరో ఏడు జన్మల వరకు వారి సేవలు అనుభవించే హక్కు తమకి ఉందని ఉమ్మడి ఏజండా తో ఉన్నారు.
ఇందులో సమస్యేముంది?” బ్రహ్మ ఆశ్చర్యం.
మగాళ్ల ప్రతినిధిగా చలసాని కిశోర్ దీనికి వప్పుకోవటం లేదు. పండగ నాడు కూడా పాత పెళ్లామేనా? మేం వప్పుకోము అంటున్నాడు. జేబులో ఆల్రెడీ నెక్స్ట్ జన్మ ఛాయిస్ పోటో పెట్టుకు తిరుగుతున్నాడు
సమస్య జఠిలమయ్యింది. అనేక వాదోపవాదాలు, సలహాలు , సూచనలు మైక్ లు విరగ్గొట్టుకోటాలూ, పత్రాలు విసురుకోటాలూ జరిగాయి. 
వెనుక బెంచీ నుండి చాణుక్యుడు లేచి నిలబడ్డాడు. అతని మీద గౌరవం తో అంతా ఒక్క నిమిషం లో సర్దుకుని అతనికి మాట్లాడే అవకాశం ఇచ్చారు. 
వచ్చే ఏడు జన్మలకి ఇదే బర్త ని అంగీకరించండి..
మగాళ్ల అల్లరి మళ్ళీ మొదలయింది. చాణుక్యుడు ఆగమన్నట్లు చూసి అదే అత్త, వాళ్ళే ఆడబిడ్డలు కామన్ పాకేజీ అనౌన్స్ చేద్దాం
ఆడాళ్ళ గొడవ మొదలయింది. వాళ్ళని సముదాయించడం ఎవడివళ్ళా కాదు. 
వాళ్ళు మాట్లాడుతూనే ఉంటారు కానీ మీరు రెడీ అయ్యి ఆఫీసుకి బయలుదేరండి. 
శుబోదయం. మిత్రులందరికి.

Wednesday, 3 August 2016

మనం చేస్తున్నది కరెక్టేనా?

శ్రావణ మాసం తొలి ఉదయం నేనో విషయం చర్చకు తీసుకు రాదలిచాను.
వ్యక్తిగతంగా నాకు భగవంతుని పూజా విధానాలు కానీ మంత్రాలు  కానీ తెలియదు . కానీ మనసు నిండా భగవంతుని ఉనికిని విశ్వసిస్తాను. పూజా కార్యక్రమాలప్పుడు మా శ్రీమతి పూజ చేస్తుంటే నేను లిప్ మువ్మెంట్ J ఇస్తుంటాను.
అభయంజనేయ స్వామి వారి ఆలయ నిర్మాణం లో నేను టెక్నికల్ విషయాల భాద్యత మాత్రమే తీసుకున్నాను, ఆగమ విషయాలు తెలిసిన పెద్దలు మిగిలిన విషయాలు చూస్తున్నారు. నేను కేవలం సర్వీస్ ప్రొవిడర్ ని. ఇది నిజం.
మంచి భావాలు, ఆలోచనలు ఎక్కడున్నా చదువుతాను వాటిని ఆస్వాదిస్తాను; వీలయితే మీతో పంచుకుంటుంటాను.
నాకో విషయం చెప్పాలని ఉంది.
ఆ మధ్య కాలికి వాడే చెప్పుల మీద, శరీరం కప్పుకునే బికినీల మీద హిందూ దేవుళ్ళ బొమ్మలు ప్రచురించారని వాళ్ళని నానా తిట్లు తిట్టాము. ఆ వస్తువులు ఆన్ లైన్ లో అమ్మే సంస్థల సేవలు కూడా రద్దు చేయాలని ఆవేశపడ్డాం.









మరి మనం చేస్తున్న పని ఏమిటి?
శ్రావణ మాసం ఉదయాన్నే దేవాలయానికి వెళ్ళండి. అప్పటికే చాలా మంది బక్తులు, దీపారాదన చేసి ఉంటారు, పసుపు, కుంకుమ పాకెట్లు, సాంబ్రాణీ కడ్డీలు, కర్పూరం, నూనె పాకెట్లు ఎక్కడివక్కడ కాలితో తొక్కకుండా నడవ లేకుండా పడి ఉంటాయి లేదా కొంచెం శ్రద్ద గలవాళ్లు చెత్తబుట్టలో వేస్తారు.




వాటన్నిటి మీదా భగవంతుని రూపాలు ముద్రించి ఉండవా?
ప్రసాదం పాకెట్లు, కేరి బాగులు వీటిమీద ఏం ముద్రిస్తున్నాం ??  చివరికి ఇవన్నీ ఎక్కడికి చేరుతున్నాయి? చెత్త లోకి లేదా మురికి కాలవలోకి.
మరి హిందువులుగా మనం మన దేవతా రూపాలని  నిజంగా గౌరవిస్తున్నామా?
మనసు లగ్నం కావటం కోసం ఏర్పాటు చేసుకున్న దేవతా మూర్తుల పాత్రలని  మన సినిమాల్లో _____ (మాటల్లేవు)
మన ఇంట్లో పెద్దని మనం గౌరవించకుండా పక్కింటి వాళ్లనుండి పూజలు అందుకోవాలనటం ఎంతవరకు సబబు?

03/08/16

www.susri.home.blog

  అందరికీ నమస్తే 66o పోస్టులు పైగా వ్రాసిన ఈ బ్లాగ్ లోని నా పోస్ట్ లలో  చాలా అచ్చుతప్పులు ఉండటం గమనించాను.  వాటన్నిటినీ ఎడిట్ చేస్తూ, modify...