Tuesday, 31 May 2016

ఫామిలి .. ఫామిలీ :)

.అప్పటికి అరగంట నుండి వార్డెన్ ని మాటల గారడీ లతో మాయ చేసే ప్రయత్నం చేస్తున్నాను.
మా అమ్మాయి పి‌జి చేస్తున్న కాలేజీ , ఉమెన్స్ హాస్టల్ వార్డెన్ ఆమె. శెలవులకి ఇంటికి తీసుకు వెళదామని నేను మా ఆవిడా వెళ్ళాం. అమ్మాయి బట్టలున్న బాగ్ లు రెండు బయట కారులో సర్ధి ఉన్నాం. వార్డెన్ పర్మిషన్ కోసం నేను అమ్మాయి వెళ్ళాం. మా ఆవిడని కొద్దిసేపు హాస్టల్ ముందున్న పార్కు లో వైట్ చెయ్యమని చెప్పి.
అప్పటిదాకా మనమ్మాయి కి అన్ని క్రెడిట్స్ ఉన్నాయని మనకి మాత్రం ఏం తెలుసు.
ఆమె చండ శాసనురాలని, కనీసం అరగంట క్లాసు కి ప్రిపేర్ కమ్మని ముందుగానే నన్ను సిద్దం చేసింది. అందుకే లోక్యం గా నన్ను పిలుచుకు వెళ్లింది.
“మీరెనా? ఫాదర్? “ అందామే.
నేను చుట్టూ కలియ చూశాను నాటకీయంగా..
ఆ రూములో మగ పురుగుని నేనొక్కడినే.
“మేడమ్ ఔట్ పాస్ కావాలి. పేరెంట్స్ తో సెలవులకి వెళ్తున్నాను” మమ్మాయి ఎలియన్స్ తో మాట్లాడినంత జాగర్తగా అంది.
“కూర్చోండి “ అందామే.
ఆమె రూములో ఎదురుగా సి సి కెమెరా మానిటర్స్ ఉండటం గమనించాను.
ఎక్కడ ఏమూల ఏమి జరిగినా ఆమెకి తెలియకుండా ఉండటం అసాద్యం.
ఇక ఆమె మా పాప లీలలు చెప్పటం మొదలెట్టింది.
“ వై ఫై  పాస్వర్డ్స్, హక్ చెయ్యటం, శాకాహార హాస్టల్ లోకి పార్సిల్స్ తేవటం. ఒక గాంగ్ ని మైన్టైన్ చెయ్యటం, హాస్టల్ లో వంటలకి సాకులు పెట్టటం, టి‌వి రూము టైమింగ్స్ మీద అల్లరి చెయ్యటం ..ఇలా చాలా “
“మా అమ్మాయి మోస్ట్ ఇన్నోసెంట్ మొహం తోను నేను మాటల గారడీ తోను మాయ చేసే ప్రయత్నం చేస్తున్నాను.
ఇంతలో మా అమ్మాయి నన్ను  మోచేత్తో పొడిచింది.
మానిటర్ చూడమన్నట్టు కళ్ళతో సైగ చేసింది.
సరిగ్గా కెమెరా ఉన్న చోటే నిలబడి మా ఆవిడ పూల మొక్కలు పీకి తనతో తెచ్చుకున్న కారి బాగ్ లో సర్దుతుంది


No comments:

www.susri.home.blog

  అందరికీ నమస్తే 66o పోస్టులు పైగా వ్రాసిన ఈ బ్లాగ్ లోని నా పోస్ట్ లలో  చాలా అచ్చుతప్పులు ఉండటం గమనించాను.  వాటన్నిటినీ ఎడిట్ చేస్తూ, modify...