మహారాష్ట్ర లో SBI లో పి ఓ గా చేసే
శ్రీదర్ కి,
విష్ణు కాలేజీ లో బి డి యెస్ చేసిన సుమిత్రకి ఆర్నెళ్ళ క్రితమే వివాహం అయింది. అప్పటి నుండి అత్తగారింట్లోను, తల్లి తండ్రులతోనూ గడిపిన సుమిత్ర,
శ్రీధర్ కి మచిలీపట్నం బదిలీ తో ఊపిరి పీల్చు కున్నట్లయింది.
కొత్తగా కాపురానికి అన్నీ ఏర్పాట్లు చేసుకున్నాక,
ఇష్ట దైవం తిరుమల వెంకటేశ్వరుని దర్శనానికి కొత్త జంట ఇద్దరు వచ్చారు.
...
తొలినాళ్లలో అన్నీ శ్రద్దగా ఉంటాయి కాబట్టి శ్రీదర్ దర్శనం& కాటేజీ వసతులు అన్నీ ఆన్లైన్ లో చేయటం తో షెడ్యూల్ ప్రకారం ఏమాత్రం ఆటంకాలు లేకుండా ట్రిప్ పూర్తయింది. ...
తిరుగు ప్రయాణం లో తిరుమల లో బోజనమ్ చేసుకుని 3.50 కి బయలు దేరే ట్రైన్ అందుకోటానికి ఆటొ లో రైల్వే స్టేషన్ కి వచ్చేశారు.
ఇంకా అరగంట మించి టైమ్ ఉంది.
..
మొదటి ఫ్లాట్ ఫార్మ్ మీద నుండి మూడో దానికి వెళ్ళేటపుడు escalator ఎక్కారు. నాలుగు మెట్లు ముందున్న వ్యక్తి చేతిలో ఉన్న ప్లాస్టిక్ బాగ్ చినిగి టక్కున అందులో ఉన్న పార్సిల్ బోజనమ్ పాకెట్టు కదిలే మెట్ల మద్య పడి పోయింది. ..
..
అతను వెంటనే సర్దుకుని మిగిలిన రెండు పాకెట్లు జారీ పోకుండా కాపాడు కున్నాడు. శ్రీదర్ సాయం చేయబోయే లోపే ఆ బోజనమ్ పాకెట్ పనికి రాకుండా అయిపోయింది. మెట్లు పైకి రాగానే, తమ బాగ్ లో సైడ్ ఉంచుకున్న గట్టి కెరీ బాగ్ ఒకటి తీసి మిగిలిన రెండు పాకెట్లు అందులో వేసి అతనికి ఇచ్చాడు.
.. ..
అతను పలకరింపుగా నవ్వాడు. “సంచి బరువు మోయలేక పోయింది” అన్నాడు. తన పొరపాటు ఏమి లేదని చెప్పుకుంటున్నట్టు. ..
..
అతని పేరు వెంకట్రామయ్య అని, చాలా దూరం నుండి బార్యా పిల్లలతో వచ్చానని, తిరుమల మొక్కు తీర్చుకుని వెళ్తున్నామని. ..11 గంటలకి రావాల్సిన పాసింజర్ రైలు లేటు అయ్యిందని. ఒక క్విక్ పరిచయం చేసుకున్నాడు.
..
మేము అందరం మూడో నెంబరు ఫ్లాట్ ఫార్మ్ మీదకి చేరాము...
..
అతను కొద్ది దూరం లో ఉన్నతమ కుటుంబం దగ్గరకి వెళ్ళాడు. ..
వారి 10,12 ఏండ్ల వయసు ఉండే పిల్లలు ఇద్దరికీ గుండ్లకి గందం రాసి ఉంది. పిల్లలిద్దరి నుదుటు కి శ్రీనివాసుని నామాలు ఉన్నాయి.
కొద్ది దూరం లో ఉన్న శ్రీధర్ సుమిత్ర లకి ఆ కుటుంబం కనబడుతూనే ఉంది.
సుమిత్ర కి తాము కూడా కొన్నాళ్ళకి ఇలానే పిల్ల పాపలతో ..
అనే ఆలోచన వచ్చి, శ్రీధర్ తో మాట్లాడుతూనే ముచ్చటగా ఉన్న ఆ కుటుంబాన్ని ఒరకంట గమనించ సాగింది.
..
వెంకట్రామయ్య బార్య పిల్లల వద్దకి వెళ్ళగానే ..
“నేను అక్కడే తినేశాను మీ వరకు పొట్లం కట్టించుకొచ్చాను. తినెయ్యండి"
అని చెప్పి పేట్ బాటిల్లో మంచి నీరు కోసం ఫ్లాట్ ఫారం మీద వెతుక్కుంటూ వెళ్ళాడు.
..
సుమిత్ర కి ఆశ్చర్యం వేసింది. అతను బార్యతో ఎందుకలా చెప్పాడో అర్ధం కాలేదు.
ఈలోగా వెంకట్రామయ్య బార్య ఒక పొట్లం విప్పి, అన్నం కూరలు కలిపి పిల్లలిద్దరికి ముద్దలు చేసి పెట్ట సాగింది. ..
పిల్లలు బాగా ఆకలి తో ఉన్నట్టు వారు తినే పద్దతిని బట్టి సుమిత్రకి అర్ధం అయింది.
..
పిల్లలిద్దరి చేతులు కడిగాక రెండో పార్సిల్ విప్పి ఆమె ఒక ప్లేటు లో అన్నం, కూరలు సర్ది వెంకట్రామయ్య కి తినమని ఇచ్చింది.
“నేను తినే వచ్చానే .. నువ్వు తిను. లేకపోతే ఇంకో పొట్లం తచ్చేవాడిని కదా?” వెంకట్రామయ్య నచ్చ చెప్పే ప్రయత్నం చేశాడు.
...
ఆమె ఏమాత్రం వినిపించు కోకుండా “మేం తినకుండా నెవెప్పుడన్నా తిన్నావా? ఇద్దరం చెరో ముద్ద తిందాము.” అంది....
..
తలకి చుట్టు కున్న తువాలు తో నేల మీద దుమ్ము విసిరి, అతను ఆమె పక్కన కూర్చున్నాడు. ..
..
ఇద్దరినీ గమనిస్తున్న సుమిత్ర పక్కనే కూర్చుని ఉన్న శ్రీధర్ చేతిని బలంగా పట్టుకుంది. ఏదో అర్ధమయిన భావం శ్రీధర్ ని కూడా చుట్టు ముట్టింది.
***
(ఎన్నో జీవితాలని దగ్గరనుండి చూస్తుంటాను. ప్రతి సంఘటన వెనుక ఉన్న జీవితాన్ని గమనిస్తూ ఉంటాను. అందులో 'ఎస్సెన్స్' పట్టుకునే ప్రయత్నం చేస్తుంటాను కొందరికి ఇవి నాటు గాను, మోటు గాను లేదా సిల్లీ గాను అనిపించవచ్చు. కానీ చాలా గొప్ప మేనేజ్మెంట్ పాఠాలు మనం పరిసరాలనుండి నేర్చుకోవచ్చు)

No comments:
Post a Comment