సుజనా
మాల్ కి బార్యతో సహా వెళ్ళి వస్తుంటే
పార్కింగ్ నుండి బండి తీసేటప్పుడు, తాజా గా పలకరింపుకి వచ్చిన వర్షం కి తడిచిన రోడ్డు మీద శ్రీహరి బండి స్లీప్ అవటం కంట్రోల్ చేసే ప్రయత్నం లో కింద ఉంచిన కాలు మెలిక పడి బెణకటం క్షణాల్లో జరిగి పోయింది.
**
కంగారు పడ్డ శ్రీహరి బార్య ఆక్టివా డ్రైవింగ్ తను తీసుకుని అతన్ని నేరుగా
JNTU కి దగ్గర్లో ఉన్న ఫిజిషియన్ వద్దకి తీసుకెళ్లింది.
**
డాక్టర్ పరీక్ష చేసి ఎముక కి ఏవిధమయినా డామెజి లేదని టాబ్లెట్స్ వ్రాసి కొనుక్కు వచ్చి చూపిస్తే వాడే విదానం చెబుతానని చెప్పాడు.
**
ఒక్క సారి ప్రమాదం లేదు అన్న మాట వినగానే మనలోంచి కారల్ మార్క్స్ బయటకి వచ్చేస్తాడు కాబట్టి, నేరుగా శ్రీహరి మైన్ రోడ్డు లో 20% డిస్కౌంట్ ఇచ్చే మెడికల్ షాప్ కి వెళ్ళి మందులు తీసుకుని వచ్చేశాడు.
**
0 - 0 -0
అనివున్న వివరాన్ని బట్టి లావుగా ఉన్న టాబ్లెట్ ని కష్టంగా మింగేశాడు.
మూడు పూటలా కోర్సు పూర్తి అయిందాకా మింగినా కాలి వాపు తగ్గక పోగా రెండు లాస్ ఆఫ్ పే లు వాడుకోవాల్సి వచ్చింది.
**
మర్నాడు ఆక్టివా మీద ఆసుపత్రికి బయలుదేరా రా దంపతులు.
"మందు కరెక్ట్ గా వాడారా?"
"పొద్దుట, సాయంత్రం, రాత్రి మూడు పూటలా నేనే గుర్తుచేసి మరి మింగించాను"
కామర్స్ గ్రాడ్యుయేట్ అయిన శ్రీహరి బార్య ఒకింత అసహనంగా చెప్పింది.
**
"మింగారా??? అవి వేడి నీళ్ళలో వేసి కరిగించి కాలుని ఆ నీళ్ళలో అరగంట ముంచి ఉంచాలి మూడు పూటలా "

No comments:
Post a Comment