Wednesday, 11 May 2016

108

108 కి ఫోను.
"మావారికి ఛాతిలో నొప్పి వచ్చిందండి. ఊపిరి తీసుకోటానికి బాగా ఇబ్బంది పడుతున్నారు"..

..
" please హాంగ్ అప్ .. చెప్పండి ఏ ఏరియా నుండి మాట్లాడుతున్నారు?"..

..
వివరాలు అన్నీ నమోదు చేసుకున్నాక అయిదారు నిమిషాల్లో .కన్ఫిర్మేషన్ కాల్ వచ్చింది...
..
"
హలో మీరెనా అండి. ఎవరికో ఛాతీ నొప్పి అని ఫోన్ చేశారు. ఏమయింది"..
..
"
హటాత్తుగా ఛాతీ నొప్పి అని సోఫాలో కూలబడి పోయారండి. చేత్తో రుద్దుకుంటున్నారు. ఊపిరి తీసుకోవటం కష్టం గా ఉంది"..
..
"
మేము బయలు దేరాం. ఈ లోగా పెషంటు కి బాగా గాలి ఆడేట్టు చూడండి. "..
చెయ్యాల్సిన ప్రధమ చికిత్స వివరంగా చెప్పిన పది నిమిషాల్లోనే 108 వాహనం వచ్చింది. 
..
అందులో స్టాఫ్ వచ్చి, ఫస్ట్ యైడ్ చేసి సెలైన్ కట్టి స్టేచర్ మీద పెషంటుని ఎక్కించుకుని, ప్రవేట్ హాస్పిటల్ కా లేక ప్రబుత్వ హాస్పిటల్ కా ? "
..
"
దగ్గర్లోనే ప్రభుత్వ ఆస్పత్రి ఉంది. మీరు పదండి నను అరగంట తర్వాత వచ్చేస్తాను"
ఇంటావిడ చెప్పింది...
....
"
అదేమిటి? తోడుగా ఎవరు రావటం లేదా?"
..
"
వచ్చేస్తా ....వచ్చేస్తా ..'పతియే ప్రత్యక్ష దైవం' సీరియల్ మొదలవబోతుంది అది పూర్తి కాగానే వచ్చేస్తా.. 

No comments:

www.susri.home.blog

  అందరికీ నమస్తే 66o పోస్టులు పైగా వ్రాసిన ఈ బ్లాగ్ లోని నా పోస్ట్ లలో  చాలా అచ్చుతప్పులు ఉండటం గమనించాను.  వాటన్నిటినీ ఎడిట్ చేస్తూ, modify...