Wednesday, 11 May 2016

తాగుడు సమస్య

“అమ్మా నాకు తాగుడు  సమస్య వచ్చింది.”
**
తల్లి షాక్ అయింది.
ఎనిమిదేళ్ళ పిల్లాడి వైపు భయం భయం  గా చూసింది.
హాల్లో  వాడిని అలానే వదిలి మెల్లగా తమ గది లోకి వచ్చింది.
నీలకంఠం అల్మారా లో దాచుకున్న బాటిల్, ఫ్రీడ్జ్ లో తెచ్చుకున్న నీళ్ళతో కలిపి ప్రశాంతంగా తాగుతున్నాడు.
“నేను ఏదయితే భయపడ్డానో అదే జరిగింది. ఈ దరిద్రం మానెయ్యమన్నాను వినలేదు. తెచ్చి అందుబాటులో పెట్టావు. ఇప్పుడు చూడు సర్వనాశనం అయ్యింది.” అంది ఉపోద్గాతం లేకుండా .
నీలకంఠం ఇంకా తన రోజు పరిమాణం పూర్తి చేయలేదు. బార్య వైపు ఎగా దిగా చూశాడు.
ఏమయింది?”
“ఇంకేం కావాలి?? . ఒక్క గా నొక్క బిడ్డ నాశనం చేశావ్ వాడిని. వాడిని చూస్తే భయం వేస్తుంది”
నీలకంఠం చప్పున లేచాడు.
” ఏమయింది ?” అంటూ కంగారుగా హల్లో కి వచ్చాడు.
పిల్లాడు హల్లో హోమ్ వర్క్ చెయ్యటం ఆపేసి దిర్గంగా ఆలోచిస్తున్నాడు.
“ఏమయిందే?
“వాడినే అడుగు”
“నాని .. ఏమయింది?” తండ్రి అనునయంగా అడిగాడు.
“ డాడీ నాకు డ్రింకింగ్ ప్రబ్లెమ్ వచ్చింది” పిల్లాడు ఆలోచిస్తూ చెప్పాడు.
**
తండ్రి పక్కనే కూర్చుని వాడి పుస్తకం వైపు చూశాడు.
If Geeta drank 650 ml juice, Raju drank 250ml juice and Sunil drank the balace of 1200 ml ; then  what is the quantity of juice Sunil drank? “


No comments:

www.susri.home.blog

  అందరికీ నమస్తే 66o పోస్టులు పైగా వ్రాసిన ఈ బ్లాగ్ లోని నా పోస్ట్ లలో  చాలా అచ్చుతప్పులు ఉండటం గమనించాను.  వాటన్నిటినీ ఎడిట్ చేస్తూ, modify...