పొద్దుటే లేచి వాకింగ్ కి వెళుతూ " ఈ రోజు మంచి రోజు " అన్నాడు మొగుడు.
ఆమె నవ్వింది.
కొన్ని సంవత్సరాలుగా అతని అలవాటు అది.
..
మహిళా మణులు సామాన్యంగా కొంపలు మునిగే విషయాలు చర్చించు కోడానికే షాపింగ్ కి ,
మార్కెట్ కి , పెరంటాలకి, బాలసాలకి ..వెళ్తుంటారు .
గమనించారో లేదు అగ్గిపెట్టే కొనటానికి సూపర్ మార్కెట్ వడపోస్తారు.
అదొక ఫీనామినా ..
..
బజార్లో ఆడవాళ్లందరి చెవుల్లో పడిందా విషయం. అది సుడులు తిరిగి నోట్లోంచి బయటకొచ్చి మగాళ్లందరిని వెంటాడి వేటాడింది.
..
సదరు మొగుడుని ఆఖరికి పట్టుకున్నారు. .
"ఎందిరా నాయనా మాకీ శిక్ష? ప్రతి రోజు లేవగానే ఇవాళ మంచి రోజు అంటావట. మేమేప్పుడు అలా అనలేదని మా ఇళ్ళల్లో గొడవ "
..
"పెళ్ళయిన కొత్తల్లో 'ఒక మంచి రోజు చూసుకొని, నిన్ను వదిలేసి పోతాను అని చెప్పింది'
రోజు గుర్తు చేస్తుంటాను. ఎప్పటికయినా తన మాట నిలబెట్టుకోక పోతుందా అని చిన్న ఆశ "
నిట్టూర్చాడు మిస్టర్ మొగుడు.
#susri

No comments:
Post a Comment