Sunday, 1 November 2015

కారు పోయింది

నెలాఖరు మీటింగు నుండి బయటపడే సరికి పొద్దు పోయింది.
సెకండ్ ఫ్లోర్ లో ఉన్న కాన్ఫరెన్స్ హాలు నుండి బయటి కోస్తూ పార్కింగ్ లాట్ వైపు చూశాను.
అక్కడ నా కారు లేదు.
రెండురోజుల క్రితమే తను నేను ఈ విషయం మీద పెద్ద గొంతు తో మాట్లాడుకున్నాం. 
కారు తాళాలు ఇగ్నిషన్ కే వదిలి మర్చి పోయే అలవాటు గురించి
ఇవాళ కూడా మర్చి పోయినట్లున్నాను.
కానీ మొదటి సారి కారు మిస్ అవటం.
రెండో ఫ్లోర్ నుండి కీదకి దిగి వచ్చి పార్కింగ్ లాట్ అంతా వెతికాను.
లాభం లేదు అంతా ఖాళీ ..
మీటింగు నుండి అప్పుడే బయటకి వెళ్ళిన నా మిత్రుడు RDO మురళి కి ఫోన్ చేశాను.
నాకారు మిస్ అయ్యిందని .
తరచు కార్లోనే తాళాలు మర్చిపోయే అలవాటు ఉందని.
"రిట్జ్ , ఏ పి 27 బి 2729 గ్రే కలర్ "
వెంటనే DSP గారికి ఫోన్ చెయ్యటం ఆయన సెట్ లో అందర్నీ అలెర్ట్ చెయ్యటం.
టౌన్ మొత్తం కారు గాలింపు చర్యలు చేపట్టటం జరిగిపోయింది.
ఇక ప్రధాన ఘట్టం మిగిలి ఉంది.
మా ఆవిడకి చెప్పటం.
ఫోన్ చేశాను
"స్వీటీ ..ఎక్కడ?"
"చెప్పండి."
"ఇవాళ కూడా కారు తాళాలు ఇగ్నీషన్ కే ఉంచి ..
ఆహా మీటింగ్ హడావిడిలో మర్చిపోయినట్టున్నాను "
"యు ఆర్ యాన్ ఇడియట్ "
"అవును . పెళ్లయినప్పటి నుండి"
"ఏమన్నారు ?"
"యు ఆర్ యాన్ ఇడియట్ అగైన్ "
"కాదని ఎవరన్నరే?"
"పొద్దుట నేనే కదా డ్రాప్ చేసింది మిమ్మల్ని?"
* &%$#@&@ .. అవును కదా?"
" మరింకేం .. రా పిక్ ఉప్ చేసుకుందువు గాని"
"తమరి బొంద(మర్యాద మర్చి పోలేదు గమనించండి). కారుతో సహా టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఉన్నాను"
‪#‎susri‬

No comments:

www.susri.home.blog

  అందరికీ నమస్తే 66o పోస్టులు పైగా వ్రాసిన ఈ బ్లాగ్ లోని నా పోస్ట్ లలో  చాలా అచ్చుతప్పులు ఉండటం గమనించాను.  వాటన్నిటినీ ఎడిట్ చేస్తూ, modify...