Sunday 29 November 2015

ఆమెన్

ఈ ఆదివారం సిటీ చర్చ్ లో ఒక వీడ్కోలు సభ జరగనుంది.
25 సంవత్సరాలుగా విధులు నిర్వహించి తన సక్సెసర్ ని నియమిస్తున్న వేడుక.
సన్మాన ఏర్పాట్లు భారీగా జరిగాయి, ప్రముఖ జనాదరణ కలిగిన MP గారి ని అద్యక్షుడిగా పిలిశారు. మూడు వేల మంది ముందు మాట్లాడే అవకాశం రాజకీయనాయకులు వదులుకోవటం అరుదు. ఈయన అంగీకరించారు.
***
చుట్టూ పక్కల గ్రామాలనుండి కూడా దైవ జనులని ప్రోగు చేశారు.
కార్యక్రమం సరిగ్గా సాయంత్రం అనుకున్న టైమ్ కి మొదలయ్యింది.
MP గారు పూర్తి ఇండియన్ పంక్చువాలిటీ మనిషి కనుక పత్తా లేదు
పి ఏ కి ఫోన్ చేస్తే "వస్తున్నారు.. బయలుదేరుతున్నారు ' అని ప్రతిసారి సమాదానం.
కాలా తీతమయ్యింది . వక్తలందరు మాట్లాడారు. MP గారు పత్తాలేరు.
సభికుల అందరి సమయాన్ని ఇంకా వృధా చేయకుండా .'వీడ్కోలు గ్రహీత'' ని మాట్లాడమన్నారు.
**
"నేను మొదటిసారి ఈ చర్చి ఫాదర్ గా వచ్చిన రోజు నాకింకా గుర్తే.మొట్ట మొదటి కన్ఫెషన్ బాక్స్ లో కూర్చున్నప్పుడు మొదటగా ఒక మగ మనిషి అటునుండి మాట్లాడటం విని పించింది
..
" తను డ్రగ్స్ వాడతానని, చాలామంది ట్రాన్స్ జెండర్ లతో సంబందాలు ఉన్నాయని, తాజాగా ఒక టి వి దొంగిలించానని, జైలు లో ఆరునెలలు గడిపానని, తరువాత తనకి పని చూపించిన ఇంట్లో పని మనిషితో వ్యవహారం నడిపానని , ఆమె రెండో బిడ్డ కి తానే తండ్రినని "..
ఇంకా కొన్ని చెప్పాడు.
..
నాకు కళ్ళు తిరిగినంత పని అయ్యింది. కాలం గడిచే కొంది ఇలాటివి మాములయ్యాయి. మనం చేసిన అన్నీ పాపాల నుండి మనన్ని కాపాడేది దైవ స్మరణ మాత్రమే. తప్పులు తెలుసుకుని మళ్ళీ అవి చెయ్యనివాడే నిజమయిన దైవ సేవకుడు "
***
హటాత్తుగా MP గారు వచ్చారు.
వేదిక మీదికి రాగానే ఆయన ప్రసంగం మొదలయ్యింది.
..
"అనేక పనుల వత్తిడి వల్ల లేటుగా వచ్చాను . ..
మన్నించండి. నేను ఇంత వత్తిడిలోను ఇక్కడికి రావటానికి కారాణం నాకు ఫాదర్ కి ఉన్న అనుబంధం.మీ అందరికీ ఒక నిజం చెప్పాలి. మీరు నమ్మలేనిది. ఈ చర్చి కి ఫాదర్ గా ఈయన వచ్చాక మొట్టమొదటి సారిగా కన్ఫెషన్ బాక్స్ లో కూర్చుని సాక్షం చెప్పిన వ్యక్తిని నేనే " సబికుల వైపు చూస్తూ ఆయన అగాడు.
****
#justforfun

No comments:

www.susri.home.blog

  అందరికీ నమస్తే 66o పోస్టులు పైగా వ్రాసిన ఈ బ్లాగ్ లోని నా పోస్ట్ లలో  చాలా అచ్చుతప్పులు ఉండటం గమనించాను.  వాటన్నిటినీ ఎడిట్ చేస్తూ, modify...