Monday, 30 November 2015

గార్గేయి

ఆరేళ్ళ పిల్లాడు వర్క్ ఫ్రమ్ హోమ్ అటెండవుతున్న తండ్రి దగ్గరకి వచ్చాడు.
“డాడీ నేను మన నెక్స్ట్ రోడ్ థర్డ్ హౌస్ లో ఉంటున్న ఫౌల్ట్రీ ఫారం 
రామనాధం గారి అమ్మాయి గార్గేయి ని మార్రెజ్ చేసుకుంటాను” అన్నాడు 
..
తండ్రి షాక్ అయ్యాడు. లాప్ టాప్ స్లీప్ బటన్ నొక్కి అరచేతిని ..
అడ్డువుంచుకుని నవ్వుని కనిపించకుండా దాచేశాడు.
..
‘ఏది ఆ యు కె జీ పిల్లానా? “..
..
“అవును . పెళ్లయాక ఒకవారం ఇక్కడ ఉంటాం. మరో వారం అక్కడ ఉంటాం “.. తండ్రికి ముచ్చట వేసింది. ఈ మాత్రం స్పష్టత లేక 30 నిండినదాకా పెళ్లి చేసుకోనందుకు బాద పడ్డాడు.
..
“మరి అక్కడికి ఇక్కడికి రాను పోను కష్టం కదా ?” కొడుకుతో తను సీరియస్ గా అడిగాడు.
“నాకు కిడ్స్ బైక్ ఉందిగా తనకి ట్రై సైకిల్ ఉంది “..
..
తండ్రి సెల్ మ్యూట్ లో ఉంచి ‘ఆడియో రికార్డింగ్’ బటన్ ప్రెస్ చేసి ..
మాట్లాడటం మొదలెట్టాడు. చాలా విషయాలకి బుడ్డోడి దగ్గర
సంతృప్తి కరమయిన సమాదానాలు ఉన్నాయి.
..
ఇక ముసుగులో గుద్దులాట ఎందుకని తండ్రి అదిగాడు...
..
“మరి బాబూ .. పెళ్లయాక పిల్లలు అది ఉంటారు కదా వారి సంగతి ?”..
..
“నా దగ్గర ఒక ప్లాన్ ఉంది డాడీ . తను గుడ్లు పెట్టగానే కాలితో తోక్కేస్తాను.పిల్లలు పొదగ కుండా “
..
తండ్రి కి సృహ తప్పింది...
‪#‎susri‬
చిరంజీవి సాయి చందు కి జన్మదిన శుభాకాంక్షలు.





Sunday, 29 November 2015

వారుణీ వాహిణీ

ఒకాయన సారాయి వ్యాపారం చేసి బాగా కూడబెట్టాడు. ప్రస్తుతం మార్కెట్ ఉన్న వ్యాపారం అదొక్కటే.
డబ్బు సంపాదించాలన్నా, కాజేసుకోవాలన్నా సినిమా లని మించిన విషయం లేదని హైదరాబాదు లో అందరూ చెబుతుంటే విని వెంటనే విమానం ఎక్కేశాడు . ముంబై లో దిగగానే ఒక స్టార్ హోటల్ లో దిగి సెక్రయిటరీ ని ఏర్పాటు చేసుకున్నాడు.
విషయం అంతా విని వెంటనే వారుణి వాహిణి అని అనే ప్రొడక్షన్ కంపెనీ రిజిస్టర్ చేస్తూ కొన్ని సినిమా టైటిల్స్ కూడా పనిలో పనిగా రిజిస్టర్ చేయించాడు. మచ్చుకి కొన్ని ..
 సోడా అక్బర్
పెగ్ పియాతో డర్ణా క్యా
రమ్ దే బసంతి
హిక్ హిక్ హోతా హై
దారు దాస్
మైనే క్యా పియా
రమ్ మారో రమ్
మైనే డ్రింక్ తుజ్కో దియా
బీర్ జమీన్ పే
ఏక్ థా బాగ్ పైపర్
హామ్ ఫుల్ హొ చూకే సనం
రం నే పిలా ది తోడి.
బాటిల్ రాథోడ్
ఉల్టీ కర్ ది ఆప్ నే
విస్కీయా పీనేవాలా బాటిల్ లే జాయెగా
#susri



పేరు చెప్పు

కొత్త బండి మీద స్పీడ్ లిమిట్ దాటగానే
..
ట్రాఫిక్ పోలీస్ ఆపేశాడు...
..
చలానా బుక్ తీసి .. "పేరు చెప్పు "..
..
సార్ పొరపాటయ్యింది సార్ ..
.
పేరు చెప్పు ?.
..
ఈ ఒక్కసారికి వదిలేయ్యండి సార్...
.
పేరు చెప్పు..
.
ఇంకెప్పుడూ స్పీడ్ గా బండి నడపను సార్..
.
పేరు చెప్పు?
సార్ .
..
పేరు చెప్పమన్నానా?..
.
త్రికులవేట్టి త్రక్కపరబుల్ క్షీరేంద్ర ....
..
చలానా బుక్ మూసేసి " ఇంకెప్పుడూ వేగంగా వెళ్లకు " 

ఇక్కడా అదే పరిస్తితి

ఫ్లైట్ టెక్ ఆఫ్ అయిన అయిదు నిమిషాలకే అనౌన్స్మెంట్ మొదలయ్యింది.
..
"ఎయిర్ ఇండియా వెల్కంస్ యు. దిస్ ఇస్ ఫ్లైట్ నెంబర్ 273 లీవింగ్ టు పట్టాయా తాయ్ లాండ్ 
ఓ అబ్బా, మంట .. మంట .. మంట, కాల్తుంది .. చచ్చాన్రా బాబోయ్ "
..
విమానం లో వాళ్ళందరికీ చెమటలు పట్టాయి.
కాక్పిట్ నుండి వచ్చే కేకలకీ అందరి ప్రాణాలు పోయినంత పని అయ్యింది.
మరు నిమిషం లోనే మరో ప్రకటన.
..
క్షమించండి నేను వైస్ కెప్టెన్ రాకేశ్ మెహ్రా ని మాట్లాడుతున్నాను.
ఎయిర్ హోస్తెస్ వేడిగా ఉన్న కాఫీ నా ఫాంట్ మీద ఒలక పోసింది.
కావాలంటే తడి చూసి ఎవరయినా కన్ఫర్మ్ చేసుకోవచ్చు."
..
"అరె నీ యబ్బ .. ఇక్కడ కూడా అదే పరిస్తితి..
నువ్వు కూడా వచ్చి చూసుకోవచ్చు "
కొత్తగా ఫ్లైట్ ఎక్కిన సుబ్బారావు అరిచాడు. 

ఆమెన్

ఈ ఆదివారం సిటీ చర్చ్ లో ఒక వీడ్కోలు సభ జరగనుంది.
25 సంవత్సరాలుగా విధులు నిర్వహించి తన సక్సెసర్ ని నియమిస్తున్న వేడుక.
సన్మాన ఏర్పాట్లు భారీగా జరిగాయి, ప్రముఖ జనాదరణ కలిగిన MP గారి ని అద్యక్షుడిగా పిలిశారు. మూడు వేల మంది ముందు మాట్లాడే అవకాశం రాజకీయనాయకులు వదులుకోవటం అరుదు. ఈయన అంగీకరించారు.
***
చుట్టూ పక్కల గ్రామాలనుండి కూడా దైవ జనులని ప్రోగు చేశారు.
కార్యక్రమం సరిగ్గా సాయంత్రం అనుకున్న టైమ్ కి మొదలయ్యింది.
MP గారు పూర్తి ఇండియన్ పంక్చువాలిటీ మనిషి కనుక పత్తా లేదు
పి ఏ కి ఫోన్ చేస్తే "వస్తున్నారు.. బయలుదేరుతున్నారు ' అని ప్రతిసారి సమాదానం.
కాలా తీతమయ్యింది . వక్తలందరు మాట్లాడారు. MP గారు పత్తాలేరు.
సభికుల అందరి సమయాన్ని ఇంకా వృధా చేయకుండా .'వీడ్కోలు గ్రహీత'' ని మాట్లాడమన్నారు.
**
"నేను మొదటిసారి ఈ చర్చి ఫాదర్ గా వచ్చిన రోజు నాకింకా గుర్తే.మొట్ట మొదటి కన్ఫెషన్ బాక్స్ లో కూర్చున్నప్పుడు మొదటగా ఒక మగ మనిషి అటునుండి మాట్లాడటం విని పించింది
..
" తను డ్రగ్స్ వాడతానని, చాలామంది ట్రాన్స్ జెండర్ లతో సంబందాలు ఉన్నాయని, తాజాగా ఒక టి వి దొంగిలించానని, జైలు లో ఆరునెలలు గడిపానని, తరువాత తనకి పని చూపించిన ఇంట్లో పని మనిషితో వ్యవహారం నడిపానని , ఆమె రెండో బిడ్డ కి తానే తండ్రినని "..
ఇంకా కొన్ని చెప్పాడు.
..
నాకు కళ్ళు తిరిగినంత పని అయ్యింది. కాలం గడిచే కొంది ఇలాటివి మాములయ్యాయి. మనం చేసిన అన్నీ పాపాల నుండి మనన్ని కాపాడేది దైవ స్మరణ మాత్రమే. తప్పులు తెలుసుకుని మళ్ళీ అవి చెయ్యనివాడే నిజమయిన దైవ సేవకుడు "
***
హటాత్తుగా MP గారు వచ్చారు.
వేదిక మీదికి రాగానే ఆయన ప్రసంగం మొదలయ్యింది.
..
"అనేక పనుల వత్తిడి వల్ల లేటుగా వచ్చాను . ..
మన్నించండి. నేను ఇంత వత్తిడిలోను ఇక్కడికి రావటానికి కారాణం నాకు ఫాదర్ కి ఉన్న అనుబంధం.మీ అందరికీ ఒక నిజం చెప్పాలి. మీరు నమ్మలేనిది. ఈ చర్చి కి ఫాదర్ గా ఈయన వచ్చాక మొట్టమొదటి సారిగా కన్ఫెషన్ బాక్స్ లో కూర్చుని సాక్షం చెప్పిన వ్యక్తిని నేనే " సబికుల వైపు చూస్తూ ఆయన అగాడు.
****
#justforfun

Friday, 27 November 2015

ఇంకేమయినా ఇబ్బంది?

రెండు రోజుల నుండి చేతి వేళ్ళు వాచి కణుపుల వద్ద నొప్పి 
ఉంగరాలు తీసివేశాను. ఉప్పు వేసిన వేడినీళ్లలో ఉంచి కాపడం పెట్టాను. 
అయినా చెప్పుకోదగ్గ ఉపయోగం లేదు.బండి తోలటం ఆపేశాను. 
ఎటువెళ్లినా ఆటో లోనే. డాక్టర్ మామూలు చెల్లించి చాలా కాల మయింది. 
ఆయన బిల్లు కట్టి వస్తే కానీ తగ్గవని నిర్ధారణ అయ్యింది. 
**
అందుకే ఇవాళ వెలుతురు లో ఇల్లు చేరాను. ఫ్రెష్ అయ్యి .మళ్ళీ ఆటో ఎక్కి హాస్పిటల్ కి వెళ్ళాను. బాగా పరిచయం ఉన్న ఆర్ధో డాక్టర్ వద్దకి.
ఆయన అంతా విని, మొహమాటానికి వేళ్ళు వత్తి .. 
ఆయింటుమెంటు, రెండురోజుల మందులు రాసి ఇస్తూ..
"ఇంకేమయినా ఇబ్బంది ఉందా" అని అడిగాడు.
**
అవును బాగా ఇబ్బందిగా ఉంది.
ఏమిటన్నట్టు చూశాడు.
"బస్సు లో టికెట్ ఉంగరం లో ఉంచుకునేవాడిని. రెండు రోజుల నుండి దాన్ని బస్సు దిగిందాకా దాయటం బాగా ఇబ్బందిగా ఉంది "
పెద్దగా నవ్వి ఇవాల్టికి ఇదే మనస్పూర్తిగా నవ్వటం అన్నాడు
** 
బిల్లు, మందుల ఖర్చు మాత్రం మామూలే .. frown emoticon 
‪#‎susri‬

Wednesday, 25 November 2015

కార్తీక మాసం కొన్ని సూచనలు


మీరు మీ ఆవిడతో కలిసి ఆటో దిగగానే , మీకు ఒక బాగ్ లో ఆల్ ఇన్ వన్ పూజా సామాగ్రి 
దారాళంగా ఇచ్చేస్తుంటారు. మీ చెప్పులు తాకట్టు పెట్టుకుని . రేటు దేముంది తరవాత అడగొచ్చు అని ఆనందపడకండి. బజన.. బజనే ..
ప్రదక్షణలు చేసే టపుడు, మీ చూపులు ఆడాళ్ళ తడిచిన జుట్టు లో చిక్కు పడిపోనీకుండా క్రింద చూస్తూ నడవండి . బేపరువుగా వాళ్ళు వత్తులు వెలిగించడానికి వేసుకున్న ముగ్గు తొక్కారో, మీకు ఇత్తడయి పోద్ది . మీ బాస్ మిమ్మల్ని చాలా మర్యాదించినట్లు. 
క్యూ లో సెల్ ఫోన్ లు ఆపేసి నడవండి. వీలయితే ‘ హర హర శివ శంబో ‘ అంటుండండి.
గుడి గురించి దేవుడి గురించి మీకు తెలిసిన నాలుగు మాటలు మీ ఇంటావిడ తో చెప్పండి. మరేదయినా బాగుందని అన్నారో ఆటో ఇంటికి కాదు షాపింగ్ కి వెళ్తుందని సదా గుర్తుంచుకోండి.
పూజారి స్పష్టంగా చూసేటట్టు దక్షణ ఇవ్వండి. అప్పుడే మీకు శత గోపం, తీర్ధం దక్కుతాయని గుర్తుంచు కోండి.
వచ్చిన పని అవగానే వాయువేగంతో ఇంటికి బయలు దేరటం మంచిది. పట్టు చీరల ఇమేజ్ లు రికార్డ్ అవుతూ ఉంటాయని గుర్తెరగండి .
మీ అందరికీ కార్తీక పౌర్ణమి శుబాకాంక్షలు .. మీ సీనియర్ నుండి.
‪#‎justforfun‬

మెయిల్

జీవితం రసహీనంగా, నిరాసక్తంగా అనిపించిన ఉదయం నేనేం చేస్తానో తెలుసా ?
ఒక మోటివేటర్ ఉపన్యాసం ప్రారంభిస్తు ఆడిగాడు.. 
నా మైల్ ఓపెన్ చేస్తాను.
కనీసం అయిదారు బాంక్స్ ఈజీ లోన్స్ ఇస్తామంటాయి.
నేను GBP 100000000 ఇంకా USD 500000 గెలిచానని అదృస్తవంతుడిని అని ఒక మైల్ ఉంటుంది.
కనీసం 10 కంపెనీలు మంచి ఉద్యోగాలతో ఎదురు చూస్తుంటాయి.
అయిదారు మంచి పెళ్లి సంబందాల సైట్స్ రెడీ గా ఉంటాయి.
Dr Batra నా జుట్టు ని కాపాడతాను/ తిరిగి మొలిపిస్తాను అని వాగ్దానం ఇస్తూ ఉంటారు.
మూడు యువర్సిటీ లు నాకు ఏవేవో డిగ్రీలు ఎవ్వటానికి ఉత్శహంగా ఉంటాయి.
మరి ముఖ్యంగా ..
కనీసం 30/40 మైల్స్ లో ప్రియా, పాయల్ & నేహా ఒంటరిగా ఫీల్ అవుతూ నన్ను కలుసు కోవాలని బెంగపెట్టుకుని ఉంటారు.
దీనెమ్మ జీవితం ఇంత కన్నా ఏం కావాలి ?
సభికులందరి అటెన్షన్ ఆయన వైపు మళ్ళింది.
‪#‎susri‬

Tuesday, 24 November 2015

IQ చిట్టి

లేటెస్ట్ గా తెరిచిన బార్ అండ్ రెస్టారెంట్ లో రోబోట్ సర్వర్స్ ని ఏర్పాటు చేశారు.
మాట్లాడేవి,ఆలోచించేవి, సహకరించేవి, సర్వ్ చేసివి అన్నీ అవే ..
**
"మీ IQ ఎంత"
ఒక కస్టమర్ ని అడిగింది.
ఐ‌క్యూ 145 అన్నాడతను.
అతఃనికి డ్రింక్స్ సర్వ్ చేస్తూ స్ట్రింగ్ తీయరీ గురించి, కాన్సర్ పరిశోదనల తాజా నివేదికల గురించి కబుర్లు చెప్పసాగింది ఆ రోబోట్.
**
"మీ IQ ఎంత"
ఒక కస్టమర్ ని అడిగింది.
ఐ‌క్యూ 110 అన్నాడతను.
అతఃనికి డ్రింక్స్ సర్వ్ చేస్తూ కాంట్రావెర్షియల్ క్రిటిసిజం గురించి, అవాంఛిత గర్బస్రావం గురించి చెప్పసాగింది ఆ రోబోట్.
**
"మీ IQ ఎంత"
ఒక కస్టమర్ ని అడిగింది.
ఐ‌క్యూ 45 అన్నాడతను.
అతఃనికి డ్రింక్స్ సర్వ్ చేస్తూ 'బిహార్ మంత్రుల తెలివితేటల' గురించి మాట్లాడటం మొదలెట్టింది. ఆ రోబోట్.
‪#‎susri‬

వేగు పాండు

హాలీవుడ్ జేమ్స్ బాండ్ సినిమా ని తెలుగు లో డబ్ చేయటానికి హక్కులు తీసుకున్న ఒక నిర్మాత కి 
సెన్సార్ వాళ్ళు చుక్క లు చూయించారు. ముద్దు సీన్లు, మర్డర్ సీన్లు తొలగిస్తే సగం కూడా మిగల్లేదు .
ఛీ మనకి లోకల్ టాలెంట్ ఇంత ఉండగా , హాలీవుడ్ అద్దె సరుకెందుకు దండగ అని తెలుగులో జేమ్స్ బాండ్ సినిమా ప్లాన్ చేశాడు.
ఫెస్బుక్ పెద్దాయన్ ఎటు ఉన్నారుగా ‘జాజి శర్మ’ గారు ఆయనకి కధా స్క్రీన్ ప్లే బాద్యతలు అప్పగించారు.
వారం తిరక్కుండానే స్రీన్ ప్లే బౌండింగ్ బుక్ లో నాలుగు మూలలా పసుపు పూసుకుని మన నిర్మాతకి చేరింది.
**
“ వేగు పాండు “ అని టైటిల్ ఉంది పైన.
మొదటి రెండు పేజీలు ల లో
శ్రీహరీ !శ్రీహరీ!! జై శ్రీమన్నారాయణ!! జై జై శ్రీమన్నారాయణ!! గోవిందా!! గోవింద!! నమ: పార్వతీ పతయే హరహర మహదేవ శంభో శంకర !! అని ఉంది.
ఆయన కంగారుగా పుస్తకాన్ని అక్కడక్కడా కొన్ని పేజీలు తిప్పి  లోపలికి తొంగి చూశాడు.
చక్కెర కలిపిన పెరుగు కప్పు పూర్తిగా తినేసి తెల్ల దోవతి కట్టుకుని తల్లి పాదాలకి నమస్కరించి
కొత్త సమస్య పరిస్కారానికి బయలు దేరాడు.
“ఈ పాండు కి అలుపు ఉండదు. రోడ్డు మీద పిల్లి ఎదురైతే తప్ప !!!!”
శత్రువుల డెన్ లోకి వెళ్ళే ముందు కెమెరా పండు నడిపే కారు డాష్ బోర్డు మీద అంటించిన గణేశ్ ప్రతిమ మీద నుండి జూమ్ అవుతుంది.
విలన్ : రండి మిస్టర్ పాండు మీ కోసమే ఎదురు చూస్తున్నాం.
పాండు : బూట్లు ఎక్కడ విప్పాలా అని చూస్తున్నాను .
గదిలో అగరబత్తి వెలిగించి , హీరోయిన్ ని మైకం లో పడేశాడు.
‘” ఈ రోజు మంగళవారం అదీ కార్తీక మాసం , శత్రువులని పాండు చంపడు”
నిర్మాత సినిమా ఆలోచన మానుకుని పోరంకి దగ్గర కోళ్ళ ఫారం పెట్టుకోటానికి స్థలం వెతుకుతున్నాడు.
‪#‎susri‬

Monday, 23 November 2015

ఇల్లాలి ఉత్తరం.

ఇంటికొచ్చే సరికి ఇల్లాలి ఉత్తరం టి పాయ్ మీద ఉంది.
.
ఊరికెళ్తున్నాను. మీరు ఫోన్ మ్యూట్ లో ఉంచినట్టున్నారు. .
.
వాట్స్ అప్ లో మెస్సెజ్ ఉంచాను. చూశారో లేదో..
.
పని మనిషికి ఈ నెల జీతం ఇచ్చేశాను .. dvs కర్ణ అయిపోకండి..
.
మీ డ్రాయర్లు బనియన్లు ఆరమారా కుడివైపు, పిల్లాడివి ఎడమవైపు ఉన్నాయి.
పోయినసారి వాడివి వేసుకుని రోజంతా లాక్కుంటూ గడిపానని అన్నారు..
..
కళ్ళజోడు గుర్తుండే చోట పెట్టుకోండి. ..
పోయిన సారి నేను ఊరు నుండి వచ్చే సరికి అది ఫ్రీడ్జ్ లో ఉంది. బాత్రూంలో సబ్బు పెట్టెలో మొబైల్ మర్చిపోయారు. మొబైల్ ఫోను తో బాత్రూములో ఏమి పనో నాకు ఇంతవరకు అర్ధం కాలేదు.
.
ఎక్కువ స్నేహితులని జమ చేయకండి. .
సోఫాలో సిగిరెట్టు నుసి క్లీన్ చేసుకోవటానికి ఒక పూట పట్టింది.
మంచింగ్ బూందీ, ముంగ్ దాల్ , వాక్యూమ్ క్లీనర్ తో క్లీన్ చేయాల్సి వచ్చింది.
.
మన పేపర్ మనకే వస్తుంది పక్కింటి వాళ్ళని బెల్ కొట్టి అడగకండి..
...
తెచ్చుకున్న పార్సిల్ కవర్లు, డస్ట్ బిన్ లో వెయ్యండి. పేపర్ వైట్ పెట్టి టీపాయ్ మీద ఉంచకండి.
..
మరి ఎక్కువ ఆనంద పడకండి. నేను ఏ క్షణాన అయినా వచ్చే అవకాశం ఉంది.
‪#‎susri‬

Friday, 20 November 2015

బ్రాంచ్ ఆఫీసు మూత పడింది.

ఎం.ధర్మరాజు గారి ఆఫీసు ఆధునికరణ , కంప్యుటరీకరణ పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి.
దైనందిక కార్యక్రమాలు కుంటుపడుతున్నాయి. ..
..
లేడి దర్మరాజు గారు స్టాఫ్ అందరికీ ముసురుకి పకోడీలు, తేనేరు వండి వార్చ లేక సతమతమవుతుంది. వంటశాల నుండి అవాంఛిత శబ్ధాలు పెరిగి పోతున్నాయి.
..
విజ్ఞుడయిన MDR గమనిస్తూనే ఉన్నాడు...
పని పాటా లేనందున తనకి అత్యంత త్వరలో వంటగలోకి ఆహ్వానం వచ్చే సూచనలు ఆకాశం లోని ముసురు లా కనిపిస్తున్నాయ్. 
..
వెంటనే ch. గుప్తా గారికి కబురు వెళ్లింది. మెత్తటి పకోడీలు తింటూ సాదిక్ రాసిన నానో –నాగ సాదువులు చదువు కుంటున్న గుప్తాజీ వెంటనే వచ్చేశారు మూతి తుడుచుకుంటూ.
గుప్తా గారితో మంతనాలు ప్రారంభమయ్యాయి.
..
మనం వెంటనే భూలోకంలో బ్రాంచ్ ఆఫీసు తెరుద్దాము . ..
ఇక్కడ పనులు అయిపోగానే తిరిగి వచ్చేద్దాం . అప్పటికే వృషబ వాహనం సిద్దంగా ఉంది. అందుబాటులో ఉన్న తాళపత్ర గ్రంధాలని అందుకుని గుప్తా గారు వెంట వచ్చారు.
..
కొత్త కార్యాలయానికి అమరావతికి షిఫ్ట్ అయి ఖాళీగా ఉన్న ఒక ఆఫీసు దొరికింది. ..
సతీ సమేతంగా కొత్త కార్యలయం లో ఆసీనులయిన MDR కేకేట్టారు.
..
“పాపులని పిలువండి “ అంటూ ..
..
గుప్తాగారు పొరపాటున తన అప్పుల లిస్ట్ రాసుకున్న పుస్తకాలు పట్టుకొచ్చారు . ..
రికార్డ్స్ అన్నీ పైనే ఉన్నాయి 
..
పాపం ఆయన కి ఎంచెయ్యాలో తోచలేదు. కిటికీలోంచి చూశాడు . 
మార్నింగ్ వాక్ కి వచ్చిన ఒక తెల్లటావిడ ని బ్రతిమాలి పట్టుకొచ్చాడు. 
..
రెండు నిమిషాల్లోనే , గుప్తాని జాడించేసిడావిడ...
..
"అమాయకత్వం కాక పోతే ఆఫీను ఆధునీకరణ ఏమిటి? యమలోకానికి బ్రాంచ్ ఆఫీసు ఏమిటి? మా ఎరియాకి వచ్చి నా అనుమతి లేకుండా ఆఫీసు తెరవటం ఏమిటి? అసలు ఏమి జరుగుతుంది ఇక్కడ ? నాకు తెలియాలి .(మూడుసార్లు )" అంది ఆవేశంగా.
.
"ఎవరీవడ ? ఈమె చేసిన పాపములేవీ ?" గర్జించాడు పెద్దాయన. .
.
"ఈమె వైదేహి మూర్తి అని ఫేసుబుక్ లో కొత్త విషయాలు కనిపెట్టి తగవులు పెట్టుచున్నది"..
.
ఈలోగా లేడి ధర్మరాజు గారి జరీ చీర ఒక మూల నలిపి “ ఇది ఒరిజినల్ కాదు క్రియరెన్స్ సెల్ లో కొన్నట్టు ఉంది” అని ఒక క్లూ వదిలిందావిడకి. Vydehi Murthy.
.
ఏమయిందో గాని MDR కుర్చీ లోంచి ముందుకు పడ్డారు..
.
“మిస్టర్ గుప్తా బ్రాంచ్ ఆఫీసు క్లోజ్. ఈవిడని అర్జంటుగా ఇంట్లో దిగబెట్టి, మూర్తిగారిని పరామర్శించి తరవాత బస్సు కి వచ్చేయ్ . “.
..
బ్రాంచ్ ఆఫీసు మూత బడింది. 
‪#‎justforfun‬

Wednesday, 18 November 2015

కోపం

నాకతను అంటే నలబై ఏళ్లుగా కోపం.
**
ఆరో తరగతి చదివేటప్పుడు ఆయన ఇంట్లో ఉండేవాడిని .. అయితే..
అమ్మ నాకు వేడి వేడి అన్నం, రాముల్లకాయ కూర పెట్టేది .. అయితే ..
పంతులుకి ముడుగిన్నెలు కారీజి నాకు రెండు గిన్నెల కారేజి .. అయితే.
అప్పటికి పిల్లలు లేని మాస్టారుకి నేనే కొడుకుని ... అయితే.
రిటైర్ అయ్యాక పుట్టిన చెల్లెళ్ళు ఇద్దరు పెళ్ళికి మేము వెళ్ళాం .. అయితే
ఏచిన్న సమస్యవచ్చినా నాతో ఫోన్ లో మాట్లాడతారు.... అయితే.
పెద్దమ్మాయికి ఇద్దరు పిల్లలు , చిన్నమ్మాయికి ఇద్దరు.. అయితే
ఇప్పటికీ నాకు పెద్ద కొడుకుగా స్థానం ఉంది ......అయితే..
ఇవాళ ఈ ముసురులో తిరపతికి జోగి ఎత్తుకుని ఎదురు నడిచారు.... అయితే.
నన్ను మూడు రోజులనుండి ఫోను లో సంప్రదిస్తూనే ఉన్నాడు.... అయితే..
**
ఆరో తరగతి లో వారానికి రెండు సార్లు ....'కోలుకుక్కరాయి' వెయ్యలా?
అంత తొందరగా మరిచి పోతామా ఏమిటి?..



..
అబ్బూరి సింగయ్య పంతులు గారూ..
నెల్లూరు వైపు ట్రాఫిక్ స్తంబించింది.
పొదిలి కనిగిరి, మీదుగా మరో రూటు ఉంది. జాగర్తగా వెళ్లిరండి.
వాతావరణం సహకరించి మీరు అందరూ స్వామిని దర్శించుకు రండి ..
అప్పుడు మీతో మాట్లాడిల్సినవి చాలా ఉన్నాయి.
**
మాస్టారూ జాగర్త .. ఎందుకంటే మీరంటే నాకు కోపం smile emoticon


Tuesday, 17 November 2015

మరోసారి చూపించండి.

పాపారావు కారు లో వెళుతుంటే యాదగిరి గుట్ట దగ్గర ఒక గొండ్రు కప్ప రోడ్డు దాటటం గమనించాడు. 
..
చిన్నగా కారు ఆపి దిగి ఆ కప్పని రోడ్డు దాటించాడు ఒక కర్ర పుల్ల సాయంతో ..
హటాత్తుగా ఆ కప్ప మాట్లాడ సాగింది...
..
" మిత్రమా మీకో సాయం చేస్తాను. ఏమి చెయ్యమంటావు?"
పాపారావు నమ్మ లేదు...
..
"నన్ను నిరబ్యంతరంగా నమ్మోచ్చు.మొన్ననే ఒక చాయ్ వాలాని ప్రధాని ని చేశాను.ఇప్పుడు అందరి పాలు పిండుతున్నాడు "
***
పాపారావు " అయితే నా కుక్కని రేపటి రన్నింగ్ రేసులో గెలిచెట్టు చెయ్యగలవా?"
" ఏది ఒక సారి చూడ నివ్వు"..
.
కార్ లోంచి కుక్కని దించాడు. లావుగా, మూడు కాళ్లతో కుంటుతు ఉంది అది.
"కష్టం మారేదయినా కోరుకో ".
.
"మా ఆవిడని ఈ ఏరియా అందగత్తే ల పోటీలో గెలిచే టట్టు చెయ్యి "
" ఏది ఒక సారి చూడ నివ్వు".
..
కారు లోంచి పాపారావు బార్య దిగింది.
ఒక్క నిమిషం తర్వాత కప్ప అంది...
..
"మరో సారి మీ కుక్కని చూపించండి "..

Saturday, 14 November 2015

ఈ రోజు మంచి రోజు

పొద్దుటే లేచి వాకింగ్ కి వెళుతూ " ఈ రోజు  మంచి రోజు " అన్నాడు మొగుడు.
ఆమె నవ్వింది.
కొన్ని సంవత్సరాలుగా అతని అలవాటు అది.
..
మహిళా మణులు సామాన్యంగా కొంపలు మునిగే విషయాలు చర్చించు కోడానికే షాపింగ్ కి ,
మార్కెట్ కి , పెరంటాలకి, బాలసాలకి ..వెళ్తుంటారు .
గమనించారో లేదు అగ్గిపెట్టే కొనటానికి సూపర్ మార్కెట్ వడపోస్తారు.
అదొక ఫీనామినా ..
..
బజార్లో ఆడవాళ్లందరి చెవుల్లో పడిందా విషయం. అది సుడులు తిరిగి నోట్లోంచి బయటకొచ్చి మగాళ్లందరిని వెంటాడి వేటాడింది.
..
సదరు మొగుడుని ఆఖరికి పట్టుకున్నారు. .
"ఎందిరా నాయనా మాకీ శిక్ష? ప్రతి రోజు లేవగానే ఇవాళ మంచి రోజు అంటావట. మేమేప్పుడు అలా అనలేదని మా ఇళ్ళల్లో గొడవ "
..
"పెళ్ళయిన కొత్తల్లో 'ఒక మంచి రోజు చూసుకొని,  నిన్ను వదిలేసి పోతాను అని చెప్పింది'
రోజు గుర్తు చేస్తుంటాను. ఎప్పటికయినా తన మాట నిలబెట్టుకోక పోతుందా అని చిన్న ఆశ "
నిట్టూర్చాడు మిస్టర్ మొగుడు. 


‪#‎susri‬

రాజా వారు తెలుసుకున్న తప్పు

(software ఉద్యోగులకి అంకితం )
..
రాజు గారికి ఒక ఆలోచన వచ్చింది.
క్రూరమయినది. అమానుషమయినది.
'అవిశ్వాసులను  ఊర కుక్కలకు సజీవంగా ఆహారం గా వదిలెయ్యటం'
..
మంత్రి వర్గం లో ఎవరికి ఇష్టం లేదు. రాజు గారికి చెప్పే., ధైర్యం నేర్పు లేవు.
కాస్తో కూస్తో బుర్ర కలిగిన వాడు ప్రధాన మంత్రే .
అంధరు ఆయనతో రహస్య సమావేశం జరిపి తమ అసంతృప్తి ని వెలిబుచ్చారు.
ఏదో ఒకటి చేయాల్సిందే నని తీర్మానించారు.
..
వేగుల దారా. రాజా వారికి విషయం పోక్కింది.
మంత్రి గారిని ఉరకుక్కలకి ఆహారం గా వెయ్యమని ఆజ్ణ.
..
మంత్రి గారు పాత పరిచియాలు తవ్వారు.
పదేళ్లుగా తాను ఎంత విదేయుడిగా ఉంది;
ఎంత ఆపద్కాల పరిస్థితులలో తాను సమస్యలని పరిష్కరించింది వినయంగా గుర్తు చేశాడు.
రాజు గారు ససేమిరా అన్నారు.
అనేక వేడికోళ్ళ తర్వాత 10 రోజుల గడువు మాత్రం ఇచ్చారు.
అప్పగింతల దృస్త్యా ...
...
పదకొండో రోజు శిక్ష అమలు.
రాజు గారికి విస్మయం కలిగిస్తూ కుక్కలు మంత్రి మీద దాడిచేయకుండా
కాళ్ళ చుట్టూ తోకలు ఉప్కుంటు తిరగ సాగాయి.
..
"రాజా 10 రోజులు చేరదేస్తేనే కుక్కలు క్షమించాయి.
మీకు పదేళ్ళు సేవ చేశాను నాకు క్షమా బిక్ష లేదా "అన్నాడు దినంగా
.
రాజు గారికి జ్నానోదయం అయ్యింది.
తప్పు తెలిసి వచ్చింది. పచ్చాతాపం తో బాద పడ్డాడు.




మర్నాడు తోడేళ్లని తెప్పించాడు.
(కదలో పాత్రల పేర్లు మార్చుకునే స్వాతంత్రం మీకు ఉందని మనవి )
‪#‎susri‬

Thursday, 12 November 2015

ఒకే కప్పు కింద ఇద్దరు

పాపం ఒక కుర్ర సర్జన్, తన తండ్రికి ఆపరేషన్ చేయాల్సి వచ్చింది.
బాగా నెర్వస్ గా ఉన్నాడా డాక్టర్. 
చిన్నప్పటినుండి బుజాలమీద తిప్పిన నాన్న, వేలు పట్టుకు నడిపించిన నాన్న.
కొంత వత్తిడికి గురవటం తండ్రి గమనించాడు.

మత్తు ఇచ్చే ముందు కొడుకుతో మాట్లాడాయన.
"ఆరేయ్ నాన్నా, వత్తిడి తీసుకోకు. ఏమి అవదు .. నా కొడుకు మీద నాకు నమ్మకం ఉంది.
కానీ అవకూడనిది ఏదయినా అయితే , ఒకవేళ అయితే, మీ అమ్మ, బార్య నీతో నే ఉంటారని
మర్చిపోకు " pacman emoticon pacman emoticon
‪#‎susri‬

Wednesday, 11 November 2015

మరెవరయినా ఉన్నారా?

పరమ ఆస్తికుడయిన పర్వతారోహకుడు 
మోడి మీద పూర్తి విశ్వాసం తో ఉండటం వల్ల దురదృష్టవశాత్తూ  లోయలోకి జారాడు.
వేగంగా జారుతుంటే మధ్యలో ఒక చెట్టు పిక ఆధారం దొరికింది.
అది బలహీనగా ఉంది ఏ క్షణం లో నయినా తెగి పోయెట్టుగా ఉంది.
దగ్గరలో మరో ఆధారం కనిపించలేదు.


హటాత్తుగా అయన కీ ఇష్ట దైవం గుర్తొచాడు.
కొమ్మని వదలకుండా భీకరంగా ప్రార్ధించాడు.
వెంటనే ఉరుములు మెరుపులు మెరిసి మోడి గొంతు తో అదృష్టవాణీ  వినిపించింది.
చోడ్ దో . ముజే పకడ్  లో " అని.
ఆయన ఎంత లోతు ఉందో తెలీని లోయని మరో  ఆధారం లేని శిఖరాన్ని 
మార్చి మార్చి చూశాడు.

మరెవరయినా ఉన్నారా స్వామి _/\_ సాయం చేసేవారు ?" అన్నాడు బేలగా.

Wednesday, 4 November 2015

P...E....R..

P planning
E executing
R reporting...
..
పై మూడిటీ పరిదిలోకి మనం చేసే పనులని తీసుకుని వచ్చి ఆర్గనైజే చేసుకోవచ్చు...
..
ఉద్యోగి: ఎలా చెయ్యాలో అను కోవటం, చెయ్యటం, రిజల్ట్ ని పై అదికార్లకి తెలియపరచడం...
..
విధ్యార్ది : ఎప్పుడే పాటం నేర్చుకోవాలో ప్లాన్ చేసుకోవటం, అలాగే నేర్చుకోవటం, పరీక్షలల్లో దానిని రిపోర్ట్ చెయ్యటం...
..
ఇల్లాలు: సమయాన్ని బట్టి ఏం వండాలో అనుకోవటం, వండటం, కారేజి పెట్టటం. ఇలాగా (ఫెమినిస్ట్ లు ఈకలు పీకోద్దు , సాదారణ గృహిణి ప్రామాణికం)..
..
ఇలా చాలా విషయాలని P E R గా విభజించుకోవచ్చు. మూడిటినీ సమానంగాను, సమర్ధవంతం గాను, నిర్వహించినప్పుడే, ఫలితం ఉంటుంది. కానీ అంధరు ఇలానే ఉన్నారా? ప్రతి వ్యవస్త లోనూ ఇది జరుగుతుందా? ఒక్కసారి ఆలోచిద్దాం.
..
.ఉధ్యోగుల్లో ఒక విచిత్రమయిన 'వర్గం' ఉంటుంది. రిపోర్ట్ మాత్రమే అందంగా స్పిరల్ బౌండ్ చేసి ప్రసెంట్ చేసి మార్కులు కొట్టేవారు, సహజంగా ఏ వ్యవస్త లో నయినా మూడు రకాల 'నెల కూలీలు' ఉంటారు.
కేవలం ప్లాన్ చేసేవాళ్ళు (సహజంగా అదికార్లు, వీళ్ళకి కార్లు, నౌకర్లు, ఏ సి గదులు,మంచి జీతాలు, ఫార్మెట్ లు తయారీ లో నిష్ట్నాతులు, ఎప్పుడు చేతులు చాచే బుద్దులు ఉంటాయి.)
..
పని చేసేవారు (క్షేత్ర స్థాయి సిబ్బంది, తక్కువ జీతాలు, నిరంతర పని, టార్గెట్ లు, డాటా సేకరణ లాటివి, వీళ్ళు మద్యన్నం బోజనం .స్వంత డబ్బుల్తో చేయలేని స్తితిమంతులు )..
..
రిపోర్ట్ మాత్రమే చేసేవారు (వీళ్ళు సహజంగా ఆగస్ట్ 15 న, జనవరి 26 న అవార్డులు, తీసుకుంటూ ఫోటో లకి పోజూలిస్తుంటారు)
**
do you want to add something; then do do.

Tuesday, 3 November 2015

డాడీస్ రిమోట్ !!

సాయంత్రం అలసి పోయి ఇంటికి వస్తామా ?
హల్లో టి వి చూస్తుంటుంది ఇంటావిడ.
కొంచెం చప్పుడు చేస్తాం.
చిన్న శబ్దం వచ్చేట్టు చేతి లోని బాగ్ టి పాయ్ మీద పెడతాం.
చిన్నగా దగ్గుతాం ..
ఊహూ ఏమి లాభం లేదు.
ఆవిడ సీరియల్ చూస్తూ ఉంటుంది.
అదృష్టవశాత్తు కమర్షియల్ బ్రేక్ వస్తుంది కాబట్టి ఒక గ్లాసు చన్నీళ్ళు, ఒక కప్పు వేడి నీళ్ళు టీపాయ్ మీదకి వస్తాయి. మళ్ళీ ఆమె సీరియల్ లోకి మునిగి పోతుంది.
పాపం కొండవలస పోయారట ?
ఆశ చావక అడుగుతాం ?
మూడు ప్రశ్నల గురుతుగా మూడుసార్లు తల ఊగుతుంది.
ఏ సీరియల్? ఏ చానెల్ ? ఎన్ని గంటలకి ? అని అర్ధం .
ఇక లాభం లేదని పొద్దుటి సద్ది పేపర్ తిప్పటానికి ప్రయత్నిస్తుంటే..
బయట ఆడుకునే కొడుకు వచ్చి, హాల్లో వెతకటం మొదలెడతాడు?
అయినా ఆవిడ ఉలకదు.?
"ఎందిరా వెతుకుతున్నావ్?"
"రిమోటే డాడీ, స్టార్ స్పొర్ట్స్ లో క్రికెట్ వస్తుంది."
మనం తెలివిగా వాడికి ఇంటావిడని చూపిస్తాం కళ్ళ తోనే ..
"టి వి రిమోటే డాడీ.. మీ రిమోటే కాదు " అంటాడు వాడు.
తూ .. దీనెమ్మ జీవితం.:(
#susri ..

బాబాయ్ నిన్ను వదలా!!

అంత ఆలోచన కానీ వివేకం కానీ నాకు అప్పట్లో లేవు.
మా పెళ్లి జరగటానికి కారణమయిన మా అత్తగారి తరపు పెద్దావిడ ఒకరికి హటాత్తుగా అనారోగ్యం అని చెప్పి నన్ను నా బార్యని ఊరికి తీసుకెళ్ళాడు మా మామ. 
అప్పటికి పెళ్ళయి నాలుగయిదు నెలలు అయి ఉంటుంది. 
ఇద్దరం చిన్న వాళ్ళం తన కింకా నిజానికి పెళ్లి వయసు కూడా రాలేదు.
..
మా అమ్మ కి నాన్న కి మేమిద్దరం అలా వెళ్ళటం ఎందుకో ఇష్టం లేదు.
..
తీరా వెళ్ళాక గాని నాకు కొన్ని విషయాలు అర్ధం అవలేదు.
..
రెండు రోజుల క్రితం మేము గొడవ పడటం, తను మంచం పట్టే కి తల కొట్టుకోవటం
బొప్పి కట్టటం, నేను బాబాయి.(పమిడిముక్కల చంద్ర శేఖర్ ఆజాద్ , జానకి దంపతులు)
వాళ్ళ ఇంటికి తనని తీసుకెళ్లటం. వాళ్ళ దంపతులు మా ఇద్దర్ని మందలించడం.
ఎలా ఉండాలో తనకి, ఎలా ఉండకూడదో నాకు చెప్పటం.
మేము కొంత అవగాహనకి రావటం జరిగిపోయింది.
..
మా మామ మమ్మల్ని తోలుకొచ్చింది పంచాయితీకి ..
..
" సుందోరి పాలెం సంబందానికి ఇస్తే బావుండేది" ముసలావిడ అంది.
..
అప్పటికే నేను కుంగి పోయి ఉన్నాను.
బార్యని బాదపెట్టిన విషయం జీర్ణించుకుని సిగ్గుతో ఉన్నాను.
ఆమె మాటలు నా ఇగో ని .బాద పెట్టాయి.
..
నాకో స్పష్టత ఉండేది. అప్పట్లోనే...
..
" నేను స్థిరంగా చెప్పాను. నేను తప్పు చేశాను. ..
తనని బాద పెట్టాను. నాకు తోటి మనిషి గురించి ఆలోచించడం ఇంకా అలవాటు అవలేదు.
కానీ నేను చేసింది తప్పు . మా విషయం లో మీరు కల్పించుకోవటం ఇంకా తప్పు."
..
నా బార్య తో అన్నాను " రమ్మీ నేను కొట్టేది కొట్టేదే, తిట్టేది తిట్టేదే. ..
నా మీద నమ్మకం ఉంటే వచ్చేయ్. లేదా ఉండిపో."
..
విసురుగా లేచి బస్ స్టాండ్ కి వచ్చెను...
..
సరిగ్గా రెండు నిమిషాల్లో తాను వేరే మార్గం నుండి వచ్చింది...
..
వెనక నుండి మా అత్త ఏదో చెప్పే ప్రయత్నం చేస్తుంది. ..
నా బార్య ఆమెకి నమస్కారం చేసింది.
మా జోలికి రావద్దు అనే అర్ధం అందులో ఉంది.
..
ఇది జరిగి 27 ఏళ్లయింది...
నా బార్య నామీద ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకోటానికి నిరంతరం ప్రయత్నం చేస్తుంటాను. మరెప్పుడు తను మా అత్తగారింటిలో నిద్ర చేసిన గుర్తు లేదు.
..
పోయామా ? వచ్చామా ? అంతే.
వాళ్ళే వచ్చి మా వద్ద ఉండి పోతుంటారు..
...
ఎందుకో గుర్తొచ్చింది...
..
చిన్న వయసులో పెళ్ళయిన మాకు ఎంతో మార్గదర్శనం ..
చేసిన చంద్ర శేఖర్ ఆజాద్ బాబాయికి, జానకి అక్క కి
(అలానే పిలిచే వాళ్లం ఇద్దరం: ఈ మధ్యే షష్టి పూర్తి చేసుకున్నారు )
మా పాదాభివందనం.
..
బాబాయ్ నిన్ను వదలా grin emoticon
‪#‎susri‬

Monday, 2 November 2015

ఫ్లోరింగ్ ఆరలేదు

..ఒక కానిస్టేబుల్ స్టేషన్ హౌస్ ఆఫీసర్కి ఫోన్ చేశాడు.
..
"సార్ ఇక్కడ నిర్మల్ నగర్ లో ఒకావిడ బర్త ని చంపేసింది "....
..
"ఏమిటి ఎవర్ని ఎవరు చంపారు ? మరో సారి చెప్పు ?"..
..
" ఆవిడ ఇల్లు తుడిచ్చిందట, ఈయన తడి ఫ్లోరింగ్ మీద నడిచాడట ..
ఆమె రోకలిబండ విసిరింది; ఇతను స్పాటు " షార్ట్ హాండ్ FIR ఇచ్చాడు కానిస్టేబుల్.
..
" ఇంతకీ ఆమెని అరెస్ట్ చేశారా లేదా? "..
..
"ఇంకా లేదండీ "..
.
"ఏం ఎందుకని ?".
..
"ఇంకా ఫ్లోరింగ్ తడి ఆరలేదు frown emoticon "

www.susri.home.blog

  అందరికీ నమస్తే 66o పోస్టులు పైగా వ్రాసిన ఈ బ్లాగ్ లోని నా పోస్ట్ లలో  చాలా అచ్చుతప్పులు ఉండటం గమనించాను.  వాటన్నిటినీ ఎడిట్ చేస్తూ, modify...