Wednesday, 7 September 2016

పంది

ఆదివారం ఉదయాన్నే ఓపిగ్గా కూర్చుని, పిల్లల హెల్ప్ తో తన కారు కడుక్కున్నాడు ఆనందరావు.
..
పాలిష్ క్లాత్ తో చివరి సారిగా తుడిచి, ఇంట్లోకి వస్తుంటే పక్కింటి మేడ మీద నుండి మిస్సెస్ రంగారావు, చేపలు కడిగిన నీళ్ళు కారు మీద పడెట్టు గా విసిరింది. 
..
“పంది మొహందానా ? కళ్ళు దొబ్బినయ్యా?” తిట్టాడు ఆనందం. 
..
‘లాయరు రంగారావు క్రితం రోజే చేతి లో ఉన్న ఏకైక కేసు ఓడిపోయి ఉండటం తో మర్నాడే ‘ఆనందం’ మీద పరువు నష్టం కేసు వేశాడు.”
..
స్పీడ్ ట్రాక్ కోర్టు లో ఆనందానికి పెనాల్టీ వేస్తూ జడ్జి మందలించాడు.
“అయితే నేను మిస్సెస్ రంగారావు ని ‘పంది’ అనకూడదంటారు”
..
“యెస్ .. ఎక్షాక్ట్లీ “
.
“యువర్ ఆనర్.. మరి ఏదయినా పందిని, మిస్సెస్ రంగారావు అని పిలిస్తే కోర్టు కి ఏదయినా అబ్యంతరం ఉందా?” కోర్టు వారిని అడిగాడు.
..
“లేదు లక్షణంగా పిలుచుకోవచ్చు.” జడ్జి గారు బరోసా ఇచ్చారు.”
..
పెనాల్టీ కట్టి బయటకి వస్తుంటే రంగారావు, అతని బార్య కోర్టు బయట కనిపించారు.
..
“గుడ్ ఈవినింగ్ ‘మిస్సెస్ రంగారావు’ “
పెద్ద శబ్దం తో పలకరించాడు ఆనందం.

Tuesday, 6 September 2016

హార్మోనియం

వినాయకుని పందిట్లో ‘నవరాత్రులు బజన’  చేయటానికి ఒప్పుకున్న బృందం లో హార్మోనియం వాయించే అతన్ని వాలెంటిర్లు పోలీసులకి పట్టించారు. స్వామి వారి కి పూజ చేయటానికి తెచ్చిన వెండి దీపపు కుందులు  తస్కరించడం గమనించి.
***
ప్రోగ్రాం లో హార్మోనియం వాడకుండానే మర్నాడు పూజా  కార్య క్రమానంతరం బజన బృందం కార్యక్రమం నిర్వహించింది గాని బక్తులని అంతగా రంజింపలేక పోయింది.
***
తాత్కాలికంగా నాలుగు రోజులు హార్మోనిస్టు దొరుకుతాడేమోనని తెలిసీన డ్రామా కంపనీ ల్యాండ్ లైను కి ఫోన్ చేశాను.
“బజన బృందం లో రెగ్యులర్ గా ఒకరు ఉంటారే?” సందేహం వెలిబుచ్చాడు అటునుండి కంపెనీ అతను.
“ఉంటాడు. అతన్ని మా కుర్రాళ్ళు పోలీసులకి పట్టించారు”
“ఓహో .. అలాగా ఒక గంట ఆగి కనుక్కుని ఫోన్ చేస్తాను” అని ఫోన్ నెంబరు తీసుకున్నాడు
***
ఒక పదినిమిషాలు ఆగి అటునుండి మళ్ళీ ఫోను.. అతనే..
“పోలీసులకి పట్టించినతను అంత చండాలంగా వాయించాడా?”


Sunday, 4 September 2016

వాళ్లంతే

జయశ్రీ ఉదయం పేపర్ చూసేటప్పుడ్ ఒక ఆటొ న్యూస్ కనబడింది.
 
ఎప్పుడు కాళ్ళకి చక్రాలు కట్టుకుని, టూర్స్ తిరిగి, ఎంజాయ్ చేసే ఆవిడ కి ఒక ఆలోచన వచ్చింది. 

ఒక ఆటొ డ్రైవర్ ని పిలిపించి, తన ఆలోచన చెప్పింది. 
ఒక కొత్త సి‌ఎన్‌జి ఆటొ కొని ఇచ్చేట్టు వంద రోజుల పాటు తనని తను చూడాలనుకుంటున్న ప్రదేశాలన్నిటికి తిప్పేట్టు ఒప్పందం. 

వ్యాపారం లాభసాటిగా ఉండటం తో సరే అని అతను ఒప్పుకోవటం వెంటనే ఆటో కొనివ్వటం, యాత్ర కి బయలు దేరాటం జరిగిపోయాయి.
 మహాబలిపురం లోని సీ రాక్ టెంపల్ వద్ద మొదలయినప్రయాణం, తిరుత్తణి, తిరుపతి, కంచి, ............... కొనసాగింది. 

సరిగ్గా వందవ రోజు పూర్తి అయ్యేసరికి ఆటొ ఒంగోలు, రైల్వ్యే స్టేషన్ కి చేరింది.
 జయశ్రీ అప్పటికే బాగా అలసిపోయి ఉన్నారు. 

వాళ్ళ కాంట్రాక్ట్ పీరియడ్ అయిపోయింది. “ఇక ఆటో ని స్వంతం” చెప్పారావిడ. 


“మంగమూరు రోడ్డు మర్రిచెట్టు దగ్గర మా తమ్ముడు ఉన్నాడు.

 వాళ్ళ ఇంటి వద్ద నన్ను దించేసి వెళ్ళి పో “ చెప్పిందావిడ. 

పక్కనున్న ఆటో వాళ్ళతో అడ్రెస్ చెప్పించుకుని అతను


“కుదరదండీ తిరుగు బేరాలు ఉండవు గిట్టుబాటు కాదు. మరో ఆటో మాట్లాడుకోండి” చెప్పాడతను.    

Saturday, 3 September 2016

పెద్దాడిని పంపనా?

ఏ‌సి మార్చురి పెట్టె లు సప్లయి చేసే ముత్యాలరావు,  తెల్లవారుఝామున  తన బార్యని తట్టి లేపాడు.

విపరితమయిన నొప్పి అతని బొడ్డు వద్ద ప్రారంభమయి రెండు ఊపిరితిత్తుల మధ్యగా పైకి తంతూ ఉంది.
రిబ్స్ దిగువ ప్రాంతం లో బయంకరమయిన నొప్పి. 

ఆమె కి కాళ్ళు వణికాయి. 
పక్కింటి వాళ్ళని సాయం అడగటం 108 లో అరగంటలో హాస్పిటల్ కి చేర్చడం వెంటనే ట్రీట్మెంట్ మొదలయ్యే ఐ‌సి‌యూ లో చేర్చడం జరిగిపోయాయి.

ఫార్మల్ టెస్ట్ లు అన్నీ చేశారు. 
కిడ్నీలో రాళ్ళు,ఉన్నాయని అది పగలటం తో భరించలేనంత నొప్పి వచ్చిందని డాక్టర్ ప్రాధమికంగా ఒక నిర్ణయానికి వచ్చారు.

ప్రాధమిక వైధ్యం అందాక, ఐ‌సి‌యూ లో అతని పక్కనే కూర్చున్న అతని బార్య అడిగింది 
“మార్చురి బాక్సు షాపుకి మన పెద్దవాడిని పొమ్మని చెప్పనా?”


అక్కడున్న నర్సు ఆమెని అయోమయంగా చూసి 
“అంత తొందర ఏమి లేదండీ. సారుకి తగ్గే అవకాశం కూడా  ఉంది” అంది. 

బర్త్ డే గిఫ్ట్.

ఆఫీసు లో మేనేజర్ బర్త్ డే సెలబ్రేట్ చేయాలని స్టాఫ్ ఫిక్స్ అయ్యారు.
సాయంత్రం ఆఫీసు అవర్స్ అయ్యాక ఆయన కేబిన్ లో అందరూ సమావేశం అయ్యారు.
గుడ్ లుక్స్ కోసం పాటుపడే కొందరు శాలువా కప్పారు. బర్త్ డే కేక్ కట్ చేయించారు.
బొకెలు, షేక్ హ్యాండ్లు .. అభినందనలు. హగ్ లు...
స్టాఫ్ అంతా కలిసి ఒక బాగా పాక్ చేసిన కార్టన్ ఒకటి బహుమతిగా ఇచ్చారు. 
 మేనేజర్ పాకెట్ ఊపి చూశాడు.
పెట్టె ఒక వైపు తడిగా ఉండటం గమనించి , వేలు నోట్లో పెట్టుకుని రుచి చూసి, 
“థాంక్స్ ఫర్ ది షాంపైన్” చెప్పాడు.
“కాదండీ” అన్నారు స్టాఫ్.
ఈ సారి మళ్ళీ టేస్ట్ చేసి “వైన్??”
“ఊహూ “
“స్కాచ్???” పాకెట్ ని గట్టిగా వాసన చూసి అడిగాడాయన.
మళ్ళీ ‘కాదనే’ సమాదానం
క్యూరియాసిటీ ఆపుకోలేక అప్పుడే ఆ గిఫ్ట్ పాక్ ఓపెన్ చేశాడాయన.

తెల్లటి పర్ తో  క్యూట్ గా ఉన్న ‘పప్పి’ ఉంది అందులో. 

Friday, 2 September 2016

డియర్ బా ..

“డియర్ బా ..” 
ఒక్క సారి ఉలిక్కి పడ్డాడు అతను. లంచ్ అవర్లో బోజనం చేయటానికి కూర్చున్నప్పుడు, లంచ్ కారేజి, నాప్కిన్ తో బాటు బయట పడింది ఆ కాగితం. 
తనని బార్య మాత్రమే పిలిచే పేరు అది.. అవును అంజలి వ్రాసిన ఉత్తరం తనకే... ఒకే ఇంట్లో ఉంటూ ఫోన్లు, వ్హాట్సప్ప్ లు, imo లో ఇన్ని ఉండగా స్వదస్తూరితో ఉత్తరం...
"డియర్ బా ..
నెల రోజులుగా గమనిస్తున్నాను. నేను అడగకుండానే, ప్రత్యేకమయిన సందర్బాలు లేకుండానే నువ్వు ఈ మద్య నాకు బహుమతులు తెస్తున్నావు.. అవి నన్ను తాత్కాలికంగా సంతోష పెట్టినా.. ఒంటరిగా ఉన్నాప్పుడు వేటాడుతున్నాయి.
ఏదో బార్య కి ఇష్టం లేని పని చేసినప్పుడు, సహజంగా బర్త ఇచ్చే కాంపన్సేషన్ బహుమతులు అనిపిస్తుంది. 

అలాటి పరిస్తితి అయితే, దానినుండి బయటకు రావటం కూడా మీ చేతిలోనే ఉంది.
మనమిద్దరం 'మనం' గా ఉండి పోవటానికి నా వంతు గా నేను సిద్దంగా ఉన్నాను.
కాలం తో పాటు మోనాటని కూడా పెరుకుపోతుంది మన మధ్య..
వెంటనే ఒక వారం సెలవు పట్టండి. పనులెప్పుడు ఉంటాయి.. మనం కొచ్చిన్ వెళ్దాం. నన్ను తీసుకెళ్తానని పదేళ్ళ క్రితం నుండి చెబుతున్నారు.
ఇంతకు మించి .. ఈ విషయం మీద మనం మాట్లాడుకోవద్దు.. మాటలు మన మద్య అఘాధాన్ని సృష్టిస్తాయి."
ప్రేమతో...నీ అంజలి. 

Wednesday, 31 August 2016

హొ ఓల్ద్

రష్యా నుండి వచ్చి సైకిల్ మీద భారత దేశ యాత్ర చేస్తున్న అరవై రెండేళ్ల ‘పెన్తెకోవా ‘ నరసారావుపేట లో ఆగింది. కొబ్బరి బోండాం కొట్టించుకుని బాటిల్ లో పోయించుకుంటుంటే.. 
పక్కనే శానిటరీ షాపు లో ఒక పెద్దాయన రిలాక్స్డ్ గా కూర్చుని ఇదంతా గమనిస్తున్నాడు. 
తీరా డబ్బు విషయం వచ్చే సరికి అతను జోక్యం చేసుకోవాలసి వచ్చింది. ఆమెకున్న రష్యన్ ఇంగ్లీష్ పరిజ్ణానం అర్ధం చేసుకున్న పెద్దాయన డబ్బు లెక్క సెటిల్ చేశాడు ఇద్దరికీ వయా మీడియాగా..
పెన్తెకోవా అతనికి థాంక్స్ చెప్పింది. కొద్దిసేపు తమ షాప్ లో కూర్చోవచ్చని చెప్పాక, ఆమె కూలర్ ముందు కూర్చుని పిచ్చా పాటి మొదలెట్టింది.
“యు లుక్ సొ యాక్తివ్? వాట్ ఈస్ సీక్రెత్ బిహైంద్.?”
“నో సెక్రెట్. నో డైట్. నో ఎక్ష్సర్సైజ్. ఓన్లీ 3 ప్యాక్ సిగార్స్ డైలీ, హాఫ్ బాటిల్ రం వీక్లీ” నవ్వాడాయన.
“ఈస్ ఇట్ ?? వందరఫుల్ . వండర్ఫుల్. . హొ ఓల్ద్ ఆర్ యు సర్ ?”
“ జస్ట్ థర్టీ సిక్స్” చెప్పాడతను. 

www.susri.home.blog

  అందరికీ నమస్తే 66o పోస్టులు పైగా వ్రాసిన ఈ బ్లాగ్ లోని నా పోస్ట్ లలో  చాలా అచ్చుతప్పులు ఉండటం గమనించాను.  వాటన్నిటినీ ఎడిట్ చేస్తూ, modify...