Tuesday, 16 February 2016

మాటల్లేవ్ :)

మా వాడు చదువుతున్న పుస్తకాన్ని పూర్తి చేసి హల్లో కొచ్చే సరికి 
వాళ్ళ అమ్మ పద్మాసనం లో కూర్చుని సెల్ ఫోన్ లో రాందేవ్ బాబా వీక్లీ యోగా చూస్తూ ప్రాణాయామం చేస్తూ ఉంది.
..
జంపఖానా మీద వాళ్ళ అమ్మ పక్కనే పడుకుని కాసేపు అటు ఇటు దొర్లాడు . 
ఫోన్ లో గురుజి ని చూస్తూ ఉంటే ..
..
రాత్రి హింది సీరియల్ చూసిన ఎఫెక్ట్ తో
“దేఖనే సే కోయి ఫాయిదా నహి హోతా.. కర్నే సే హోతా “ అంది వాడితో ..
..
“ఇసిలియే మై నహే దేక్తా” అంటూ వాడు లేచి బాత్ రుము కి వెళ్ళాడు ..
..
ఈ సన్నివేశం లో నా ప్రమేయం ఏమయినా ఉందా చెప్పండి.??
..
సోఫాలో కూర్చుని అమాయకంగా పేపర్ లో ప్రణీత ని పరామర్శిస్తుంటే --..
నన్ను సూటిగా చూడట మెందుకు ??
..
“అయ్య బుద్దులు ఎక్కడికి పోతాయ్ అని వినబడేట్టు గా గొణగట మెందుకు ??
..
మార్నింగ్ ‘టి’ వచ్చిందాకా ఈ సన్నివేశం లో
మనకి డైలాగులు లేవు కనుక ... tongue emoticon


Sunday, 14 February 2016

రధ సప్తమి

గీజర్ లో నీళ్ళు చల్లగా ఉన్నాయి.
షేవింగ్ చేసుకుని, స్నానం ముగించి డైనింగ్ టేబుల్ ముందు  కూర్చున్నాను.
ప్లేట్లో ఏదో ఒక గుండ్రటి పదార్ధం  వచ్చింది.ప్రక్కనే ఎప్పుడుచిన్న బాండీ లో తాలింపు వేసిన పప్పుల చట్నీ ఉండేది. అది లేదు.  జాడీ పచ్చడి నేను తిననని తెలిసి వడ్డించింది.
రోజు లా ప్రశాంతంగా లేదు .. తను కొంత టెన్స్ గా ఉంది. సాయి కాలేజీకి వెళ్ళాడు. ఏం జరిగింది?? క్యా హువా?? గత 24 గంటల ని స్కాన్ చేశాను. రాత్రి టివి చూస్తూ పెద్దగా నవ్వానా? తాను సీరియల్ చూస్తుంటే దైర్యంగా రిమోట్ తీసుకుని న్యూస్ చానెల్ మార్చానా? లేక ఘోరంగా తాను ఏదయినా చెప్పెటప్పుడు నిద్ర పోయానా? ఏమి గుర్తు లేదు. అంత ఘోరమయిన విషయాలు జరిగిన గుర్తు లేదు.
WA మెసేజ్ లు చూసే అవకాశం లేదు. లాక్ పేట్రన్ మార్చాను. మరి??
ఇంకొంచెం వెనక్కి వెళ్ళి 28 ఏండ్ల క్రితం పెళ్లి రోజు అన్నం తింటుంటే మంచి నీళ్ళ గ్లాసు తగిలి తన చీర మీద నీళ్ళు వణికాయి. అదేమయినా గుర్తొచ్చిందా?? ఏమో ఈ ఆడాళ్ళా ప్రాసెసర్ మోస్ట్ పవర్ ఫుల్.
ఏమి గుర్తుకు రాలేదు. నిద్రలో పొరపాటున కాలు  వేయటం/ గురక పెట్టటం/ కనకాన్ని కలవరించడం ??? ఊహూ ఏమి గుర్తు రాలేదు.
ప్లేట్లో ఆవిటి కుడుము అల్లం పచ్చడి లో నంచుకుని మొహం లో ఆనందాన్ని నటిస్తూ రాజీవ్ బట్టాచార్య చెప్పినట్టు 32 సార్లు నముల్తూ ఆలోచించాను. కానీ ఏమి అర్ధం కాలేదు.
పరిస్తితి మరి అంతా అననుకూలంగా ఏమీలేదు . ఈ సన్నివేశం లో మనకి ఒకటి రెండు డైలాగుల ఛాన్స్ ఉంది.
గొంతు సవరించుకోవటం లాటివి చేసి గట్టిగా గుండెల్లోకి గాలి పిల్చుకుని
“ఆవిటి కుడుం బాగుంది. చట్నీ చెయ్యక పోయావా??”
తను గ్లాసు తో మజ్జిగ తచ్చి పక్కనే నిలబడి “ రాత్రి నుండి కరెంటు లేదు. ఇన్వెర్టర్ చివర్లో ఉంది. మిక్సీ పని చెయ్యట్లేదు. రోట్లో రుబ్బాను. మీరు తింటున్నది పెసరట్టు . ఈ పుటకి సర్దుకోండి. బాబు అన్నం తిని వెళ్ళాడు “ అంది సౌమ్యంగా.
హమ్మయ్య అదన్నమాట సంగతి.
మీరు బలేవారండి బాబు... రధ సప్తమి పూట బంగారం లాటి కాపురం లో పోపు పెట్టాలని చూస్తారు .. హన్నా ..


Friday, 12 February 2016

కనకం

కనకం బస్సు ఎక్కింది.
చిన్న వంగ పూల తెల్లటి మెత్తటి చీర. 
ఫుల్ వాయిల్ గుడ్డలో వాక్యుం పాక్ చేసినట్లు... wink emoticon
ఎప్పటిలాగే తలనిండా కనకాంబరాలు .. 
***
ఖాళీ సీట్లు లేని బస్సులో , హ్యాండ్ బాగు పైన ఉంచి నిలువు రాడ్డుకి శరీరం ఆనించి నిలబడి ఉన్నాను.
ఆమె విప్పారిన కళ్ళతో నావైపు చుసేలోగా, 
మైదాన్నాన్ని టోపీ తో కప్పెట్టి, 
కుండ లోపలి లాగాను.
ఏటో చూస్తున్నట్టు నటిస్తూ తననే చూస్తున్నాను. 
(
నిజానికి ఇది ఆడవాళ్ళ విద్య మనకి చాతకానిది. అయినా వెర్రి మొహం వేసుకుని ప్రయత్నిస్తుంటాం ) 
తను నా వైపు నేరుగా చూడలేదు కాని, చూసినట్టు పెదవుల చివర నవ్వు నన్ను చేరింది. తను నుదిటి మిద జుట్టుని, అవసరం లేని పమిటని నేను గమనించేట్టు సర్దుకుంది.
**
టికెట్ తీసుకుంటూ నా రెస్పాన్స్ కోసం చూసింది. నేను అభావంగాను, 
తరువాత పచ్చి ఆముదం తాగిన వాడిలాగాను, 'ఇగిలికం' ఉండ మింగిన వాడి లాగాను వికారంగా ముఖం పెట్టాను. 
అప్పటికే కొందరు ఆమెని గమనిస్తూ ఉన్నారు. 
నేను మండల దీక్ష తీసుకున్న తివ్రవాడిలా నిలబడి కుండని జాగర్తగా నియంత్రిస్తున్నాను. 
***
జీవితం చానా చండాలమయినది. 
మనం భక్తిగా కొండకి వెళ్తున్తామా, మన కారు కింద నాటు కోడి పుంజు పడుతుంది. చుట్టూ ఎవరు ఉండరు. బోరున దుఖం తన్నుకొస్తుంది.
ఎక్కడో అడవిలో రాత్రంతా చిక్కుకు పోతాం. 
మర్నాడు ఉదయం రోజుకో సారి వచ్చే బస్సు ఎక్కగానే కండక్టర్, 'మీరున్న చోటుకి పక్కనే ఈతకల్లు, బొంగు చికెన్' దొరుకుతుంది.. బాగా ఎంజాయ్ చేసారా?? అంటాడు. అతన్ని కాష్ బాగ్ తో ఉఋ వెయ్యకుండా నియంత్రించు కుంటాం.
**
(
మాస్టారూ ఎక్కడికో వెళ్ళిపోయారు బస్సులోకి రండి సార్) 
**
టికెట్ కొనే టప్పుడు బాగ్ లోంచి తీసిందో.. ..
లేక నేను చూడాలని తీసిందో చేతిలో సెల్ ఫోను పట్టుకుని ఉంది కనకం. 
తన ఫోన్ నెంబరు నాకు తెలియచేయాలనో లేక 
నా నెంబరు తను తిసుకోవాలనో సంకేతం అది. 
మికెలా తెలుసు అంటారా. ఇట్టాంటివి ఆ రోజుల్లో ఎన్నెన్ని చూడలేదు tongue emoticon
**
హటాత్తుగా ఆమె కళ్ళకి నా కళ్ళు దొరికాయి.
సెల్ టవర్ మిదేక్కి కుర్చునట్టు సిగ్నల్ అయిదు పాయింట్లు ఫుల్ గా ఉంది.
ఈ లోగా బస్సు లోకి సుర్యుడు వచ్చినట్లుంది. 
బస్సు వేడిగా ఉంది. ఎండ వీపుని తాకుతున్నట్లు ఉంది.
**
ఆమె కళ్ళతో ఎదో చెబుతుంది. 
సిస్టం అంతా వైరస్ . ఎదో అర్ధమయి అర్ధమవనట్టు .. 
నాకు కాళ్ళు వణుకుతున్నాయి..
**
ఆమె అక్కడి నుండి నావైపు రావటం మొదలెట్టింది. 
నాకు కళ్ళు తిరిగేలా ఉన్నాయి. వెనుక నుండి ఎండ బూతద్దాల లోంచి చుక్కలా మారి వీపున గుచ్చు కుంటుంది.
**
ఆమె మరో రెండు అడుగులు నా వైపు నడిచింది.
..
నా గుండె జారి పోయింది. గబాలున వెనక్కి తిరిగి వెనుక సీట్లో ఇరుక్కొని కూర్చుని నన్ను కనకాన్ని మింగేసాలా చూస్తున్న మా ఆవిడ ని చూస్తూ 
“
షేర్ మార్కెట్ 700 పాయింట్లు పడి పోయింది తెలుసా ???” బిగ్గరగా అరిచాను.
***
అర్జునా.. ఫాల్ఘునా... కిరీటి .. 

నా వల్ల కాదు

వాకింగ్ కి వెళ్తుంటే .. 
ఇంట్లోంచి రిక్వెస్ట్ లాటి ఆర్డర్ 
"వస్తూ రెండు పాల పాకెట్లు తెండి. ఒకవేళ అక్కడ 'కొడిగుడ్లు' ఉంటే అరడజను తెండి "

***
ఆవిడ చెప్పిన షాపు వద్ద ఆగాను.
"కోడిగుడ్లు ఉన్నాయా?"
"
ఉన్నాయి "
"
అయితే అరడజను పాల పేకెట్లు ఇవ్వండి."
***
చెప్పిన పని చెప్పినట్టు చేసినా ఇంట్లో గొడవే.
నా వల్ల కాదు 'బయ్యా' ఈ సంసారం ఈదటం.

Wednesday, 10 February 2016

లాయర్లే పుడతారు

రఘుపతి వద్దకి, ఒక సారి ప్రవీణ్ చస్ట్ x-ray కోసం వెళ్ళాడు.
...
రఘుపతి x-ray యూనిట్ చెస్ట్ మీదకి అడస్ట్ చేసి క్లిక్ చెయ్య బోయే సరికి
ప్రభుత్వ ఆస్పత్రి వారి యూనిట్ కాబట్టి దబ్బున జారీ అతని తుంటి బాగం 
ఫోటో వచ్చింది.
....
"ఆర్రే ఎలా .. రేడియేషన్ ప్రభావం తీవ్రంగా ఉండొచ్చు" రఘు ప్రవీణ్ తో చెప్పాడు....
...
మామూలు గా అయితే మరో సారి చార్జ్ చేసి ఇంకో సారి తీసి ఉండేవాడు....
మిత్రుడు కనుక బాదపడుతూ చెప్పాడు
..
"ఏమయినా ఇబ్బంది అంటావా ?" ప్రవీణ్ బయపడుతూ అడిగాడు...
...
" అవును. రేడియేషన్ తాలూకు పరిణామాలు రిప్రొడక్షన్ మీద ఉంటాయి"
అతను ఇంకా బయపడి పోయాడు....
..
"ఏమవుతుంది ??"
..
..
..
..
..
..
"నీకు పుట్ట బోయే పిల్లలందరూ లాయర్లు అవుతారు "

పరుగో పరుగు

పని రాక్షసులారా? మీ కోసం.
ఫ్లాట్ కి వెళ్ళాక తాళం తీయకుండా ఐ‌డి కార్డు స్వీప్ చేస్తున్నారా?
స్నేహితురాలితో రెస్టారెంట్ కి వెళ్ళి బోజనమ్ చేశాక ప్లేట్ తీసుకుని వాష్ బేసిన్ వద్దకి వెళ్తున్నారా?
తండ్రి తో మాట్లాడే టప్పుడు తల్లి పక్కనే లేదని “ వీక్లీ స్టేటస్ కాల్ అటెండవాలని తెలీదా ?” అంటున్నారా?
ఎఫ్‌బి ఆకవుంటూ బ్లాక్ చేస్తారని ఇంట్లో ఉన్నప్పుడూ కూడా బయపడుతున్నారా?
మిత్రులతో మాట్లాడుతూ వీడ్కోలు అప్పుడు “in case of any issues will call you back” అంటున్నారా??
ఫోన్లో పొరపాటున డిలేట్ చేసిన మెసేజ్ లు  రీసైకిలింగ్ బిన్ లో ఉంటాయని అనిపిస్తుందా??
మెడికల్ షాపు లో ఫార్మసిస్ట్ 250 ఎం‌జి నా? 500 ఎం‌జి నా? అని అడిగితే 256 ఎం‌బి అని చెబుతున్నారా?
సినిమా చూస్తూ టైమ్ ఎంతయిందో అనిపించినపుడు తెర కుడివైపు బాటమ్ కార్నర్ వెతుకుతున్నారా?
రోడ్డు మీద ఆగి లంచ్ బాక్స్ ఖాళీ/ నిండు గా ఉండటాన్ని బట్టి ఆఫీసుకి వెళ్తున్నారో, ఆఫీసునుండి వస్తున్నారో డిసైడ్ చేసుకుంటున్నారా?
అబ్బాయిలు .. అమ్మాయిలు.. కనీసం ఒక వారం సెలవు పడేసి మీ అమ్మమ్మ దగ్గరకో , నాయినమ్మ దగ్గరకో వెళ్ళండి. స్మార్ట్ ఫోన్లు విసిరి మురికి కాలవలో వెయ్యండి.
మిమ్మల్ని మీరు కొల్పెయే లోగా కొంత చైతన్యం పొందడానికి.
60 సెకండ్స్ లో చెప్పండి ఉదయం మీ బార్య/ బర్త వేసుకున్న డ్రస్ గుర్తుందా?
కనీసం వాళ్ళని లోగడ ఎప్పుడు అబినందించారో గుర్తుందా??
మీ పిల్లలు చదివే స్కూల్ ఎక్కడ? మీ నాన్న/అమ్మ తాజాగా ఇబ్బంది పడ్డ అనారోగ్యం?
మీకు ఎన్ని బాంకు  అకౌంట్స్ ఉన్నాయి.

మనం ఎక్కడ ఉన్నాం? 
ఏం చేస్తున్నాం ?? 
ఎవరికోసం పరిగెడుతున్నం ??

పెద్దల పరీక్షలు

సెకండ్ ఇంటర్ చదివే పిల్లల తల్లి తండ్రులు MPC/BiPC ఏదయితేనేం 
ఫిబ్రవరి/మార్చ్ నెలల్లో కనీసం 10 నుండి 12 రకాల పరీక్షలకి డబ్బు కట్టాల్సి వస్తుంది.
అధమం గా చూసుకున్నా 20000 ఖర్చు. మార్చి నెలలో చాలామంది ఉద్యోగులకి జీతం రాదు. ( IT)
**
మే నెల దాకా బొంగరం లా పరీక్ష కేంద్రాలకి తిరగవల్సి వస్తుంది. 
తల్లి తండ్రులు శెలవలు పెట్టుకుని నానా ఇబ్బందులు పడాలి. .
మరో 20/30 వేల ఖర్చు వస్తుంది. విధ్యార్దినుల పరిస్తితి మరి అధమం. 
పాపం సరైన సౌకర్యాలు కూడా ఉండవు.నేచురల్ కాల్స్ కి కూడా కష్టమే.
**
ఇర్రెగ్యులర్ షెడ్యూల్స్ .. అలసట పిల్లల్ని 
పూర్తి స్తాయి performence నుండి దూరం చేస్తాయి.
నిజానికి ఇన్ని ప్రవేశ పరీక్షలు అవసరమా??
***
సరే పిల్లల్ని వత్తిడి పెట్టి రాయించామనుకోండి.
సీట్లు అమ్ముకున్న కాలేజీ పిల్లలకి ముందు రోజు రాత్రి చాటుగా సమాదానాలు అందుతాయి.
మరెందుకీ ముచ్చట?? డ్రామాలు ?? రిజర్వేషన్ విశ్వరూపాల గురించి మాట్లాడుకో నవసరం లేదు 
***
సమాజం పట్ల ఒక రకమయిన 'కసి' తో పిల్లలు బయటకి వస్తారు.
వివిద హోదాల్లో పని చేసే చోట ఎంత వద్దన్నా నిగూడంగా ఉన్న 'అసంతృప్తి'
తిరిగి సమాజం మీదకి గోడకి కొట్టిన బంతి లా తిరిగి వస్తుంది. (చాలా సార్లు)
***
మనం ఆలోచించలేమా?? దీనికి ముగింపులేదా?? క్షేత్ర స్తాయిలో దృష్టి పెట్టకుండా 
వంకర ఫలాలకి మందు చల్లుకుంటూ గడుపుదామా??
‪#‎susri 100216

www.susri.home.blog

  అందరికీ నమస్తే 66o పోస్టులు పైగా వ్రాసిన ఈ బ్లాగ్ లోని నా పోస్ట్ లలో  చాలా అచ్చుతప్పులు ఉండటం గమనించాను.  వాటన్నిటినీ ఎడిట్ చేస్తూ, modify...