Saturday, 16 July 2016

దబిడ దబిడే

“సెంట్రల్ లో దిగి, లోకల్ ట్రైన్ ఎక్కి ఎగ్మోరే వెళ్ళి అక్కడనుండి రాత్రంతా ప్రయాణం చేసి, ఉదయం మళ్ళీ రెండు బస్సులు మారి, కాలేజీ గేటు నుండి కాలిజేర్రు లాగా కిలోమీటరు నడిస్తే గాని ని కొడుకు దర్శనం కాదు. ని ఇష్టం వచ్చినట్టు సర్దావ్ లగేజీ ఈ బాగు ఏమిటి?ఈ దుప్పట్లు ఏమిటి?. ఈ పుస్తకాలు అంటే తప్పవు. ఈ పచ్చడ్లు ఏమిటి?. వాడేమన్నా అడివిలో నా ఉండటం? ఇంతోటి పచ్చడ్లు అక్కడా బోలెడు? ఈ చక్రాలు, సున్నుండలు, రవ్వ లడ్లు  ఏమే పిల్లాడు ఇవన్నీ తిని కాలేజీ ఊడవాలా యేమిటి? “
రెండున్నర ట్రైన్ కి తత్కాల్ లో టికెట్ దొరికింది అతనికి . హాస్టల్ లో ఉండి చదువుకుంటున్న పిల్లాడి వద్దకి వెళ్ళటానికి నెలన్నర తర్వాత ఇప్పటికీ కుదిరింది. ఉదయం బొంగరం లాగా పనిచేసి హాఫ్ డే లీవు చేయించుకుని వచ్చేసరికి ఒంటిగంటయింది. ప్లేట్లో బోజనమ్ కలుపుకుని తింటూ నే ఇంటావిడ సర్దిన లగేజీ గురించి రివ్యూ చేస్తున్నాడు.  ఈ నెల రోజుల్లో పిల్లాడు  ఫోన్ చెయ్యటం ఇంటావిడ  బాగ్ సర్దటం. తీరా బయలు దేరేసరికి రెండు బాగులు  మోయలేనంత బరువు వి సర్ది ఉంచింది. అతను కేకలు వేస్తూనే ఉన్నాడు.
తనకేమి వినబడనట్టు ఆవిడ డేట్టాల్ సబ్బులు రెండు సైడ్ జిప్పులో ఉంచింది.
“నేనిక్కడ వాగుతున్నానా? తీయి .. ఆ పచ్చడ్లు తియ్. సబ్బులు, బొబ్బులు అక్కడ కొనుక్కుంటాడు లేవే”
ఇఖ  చివరి అస్త్రం ఆవిడ బయట కి తీసేలోపు పోను మ్రోగింది.
అవతల అతని  అధికారి. “ఎక్కడ?”
“సార్ .. సార్  ... ట్రైన్ టైమ్ అయ్యింది. అన్నం తింటున్నాను. ఆటో పట్టు కోవటమే ఆలస్యం “
“నేను కారు తీసుకొస్తున్నాను. నిన్ను స్టేషన్ లో దింపేస్తాను”
ఈ సారి ఆశ్చర్య పోవటం అతని  వంతు అయ్యింది. ఆయన తన కార్లో వచ్చి తనని  స్టేషన్ లో దించడమా?
సహజంగా ఉండటానికి ప్రయత్నం చేస్తూ “చూశావా ? మా ఇ ఇ కి నేనంటే ఎంత అభిమానమో?” అన్నాడు తింటూనే.
“ఎవరు వేణుగోపాలరావేనా?” అంది  ఆవిడ పెరుగు వంచుతూ .
“అవును వాళ్ళ అబ్బాయి కూడా అదే కాలేజీ లో మనాడికి సీనియర్. చెప్పాగా పోయిన సారి”
“ఆ గుర్తుంది . మీకు ఇక దబిడ దబిడే “ అంది ఆవిడ  విచిత్రంగా.
ఇంటి ముందు కారు హారన్ వినిపించింది. అన్నం ముద్ద నోట్లో కుక్కుకుని చేతిని కడిగి ఆమె చీర కొంగుకి తుడిచి బాగ్ లు రెండు పట్టుకుని బయట పడ్డాడు.
**
పొద్దుటే పూజ చేసుకుని వంట మొదలేడుతూ బర్త కి ఫోన్ చేసిందావిడ.
“ఎగ్మోర్ లో ట్రైన్ అందిందా?”
“మొత్తానికి ట్రైన్ పట్టుకున్నాగాని. నువ్వన్న దబిడ దబిడే కి అర్ధం తెలిసింది. ఆయన కొడుక్కి చేర్చమని పచ్చళ్ళు ఉన్న  అట్ట పెట్టె మరొకటి ఇచ్చాడు. పైగా గ్లాస్ విత్ కేర్ స్టిక్కర్ ఒకటి”

ఇంటావిడ నవ్వింది. 
**
(కార్తీక్ కట్టా .. కోసం)

Friday, 15 July 2016

రెండో టాబ్లెట్స్

ఒక సన్నిహిత మిత్రులు సీనియర్ డాక్టర్ గారిని ఒక మెడికల్ సలహా అడిగాను.
వారు దానికి సమాదానంగా టాబ్లెట్స్ ఏం వాడాలో తెలియజేస్తూ ఒక మెస్సెజ్ ఉంచారు. అప్పటికి తగ్గకపోతే రిలేటెడ్ డాక్టర్ ని కలవండి అని సూచించారు.
**
నాకు మందుల పేర్లు అంతగా జ్ణప్తికి ఉండవు.

సాయంత్రం బస్టాండ్ దగ్గర 3 స్టార్ హోటల్ రెసెప్షన్ ని తలదన్నేట్టు గా ఉండే A/C మెడికల్ షాప్ కి వెళ్ళాను. అక్కడ పొడవాటి కౌంటర్ వద్ద ఉన్న ఒక సేల్స్ అమ్మాయికి సెల్ లో మెస్సెజ్ చూపించి ఆ మందులు ఇవ్వమన్నాను.
**
ఆమె అది చదివి రెండు రకాల టాబ్లెట్స్ ఇవ్వమంటారా? అంది.
నేను ఆశ్చర్యంగా చూసి "టాబ్లెట్స్ ఒకటే గదా? రాసింది " అన్నాను.
"
కాదండీ DERMATOLOGIST అని మరో రకం రాశారు." అంది.

Thursday, 14 July 2016

ఆపండీ

చర్చి లో వివాహం జరుగుతుంది.
ఫాదర్ ప్రమాణాలు చేయిస్తున్నారు.
హటాత్తుగా వెనుక నుండి ఒక స్త్రీ తన ఒడిలోని పసిపిల్లని బుజాన వేసుకుని జనం లోంచి ముందుకు రాసాగింది. 
***
బిత్తరపోయిన వధువు 'వరుడు' ని లాగి ఒకటి పీకింది. 
వధువు తల్లి స్పృహతప్పింది. 
వరుడి స్నేహితులు ఈ సన్నివేశాన్ని ఎలా మేనేజ్ చెయ్యాలా అని ఆలోచనలో పడ్డారు. 
వరుడి తండ్రి కుమారుడిని అనుమానంగా చూశాడు. 
ఫాదర్ బేలగా ఆమెని గమనిస్తున్నాడు.
“
ఏమయింది బిడ్డా ?” ఆయన పలకరించాడు.
ఆమె బిడ్డని అందరికీ కనిపించే టట్లు రెండో భుజం మీదకి మార్చుకుంది.

…
...
...
...
...
...
...
...
“
అక్కడ ఆమూల కూర్చున్నవాళ్ళకి పెళ్లి ప్రమాణాలు వినబడటం లేదు.”

Wednesday, 13 July 2016

భానుమతి తెలివి

బూందీ, స్వీటు టిస్యూ పేపరు మూడు ఒకే ప్రెస్ కవర్లో ఉంచిన పాకెట్లు.. డిపార్ట్మెంటల్ స్టోర్ ప్రారంభానికి విచ్చేసిన వారందరికి ఇచ్చారు.
..
"
టిస్యూ పేపరు అయిడియా బాగుంది కదా?" అంది బర్తతో భానుమతి.
..
"
టిస్యూ పేపరు విడిగా అందుబాటులో ఉంచాలి కానీ పాకెట్ లో వేస్తే ఏమిటి ఉపయోగం?" ఆమెకి బర్త మాట నచ్చదు.
...
తన 'టాలెంట్' ని తోక్కెస్తున్నాడని గొప్ప అనుమానం. అందుకే అతన్ని మాట్లాడనివ్వదు. సమాదానం కోసం చూడదు. తను తెలివిగలదానిని అని భానుమతికి ఒక గొప్ప నమ్మకం. ఆ నమ్మకం తోటే బాంక్ నుండి లోను తీసుకుని భారీగా స్టోర్ ఓపెన్ చేసింది.
..
"అంతా బాగుంది కానీ ఆ రాక్ వద్ద చిన్న పొరపాటు జరిగినట్లుంది."
భానుమతి కి అప్పిచ్చి రిబ్బన్ కటింగు కి వచ్చిన బాంకు మేనేజర్ అన్నాడు..

..
"
అక్కడ చూడండి .Tooth Brush లూ, Tooth Paste లు తారుమారుగా ఉన్నాయి." ఆమెకి చూయిస్తూ చెప్పాడతను. వచ్చిన అతిదులు ఇంకా గమనించలేదు.
...
బానుమతి హడావిడిగా paste లు, brush లు అయిదు నిమిషాల్లో స్టాఫ్ చేత సర్దించింది.. ప్రైస్ టాగ్ లు సరిచూసి. స్వయంగా తానే అంటించింది.
..
సరిపోయిందిగా?? అన్నట్టు చూసింది మానేజర్ వైపు.
.....
"
రాక్ పైన ఉంచిన పేర్లు మారిస్తే సరిపోయేది కదా ?" అంతా గమనించిన బానుమతి మొగుడు.
ఈయనకి ఎందుకండి. రాత్రికి ఇంట్లో బువ్వ లేకుండా చేసుకోవటం తప్పితే..
..
.'
మేనేజరు గారు దిగులు పడకండి...విభూతి పెట్టుకు పడుకోండి. EMI లు వాళ్ళాయన తీర్చేస్తాడు' 


Thursday, 7 July 2016

భయపెడదామని

మైన్ డోర్ లాక్ చేశాడో లేదో సరి చూసుకుని స్నానానికి బయలు దేరాడతను.
బాత్ టబ్ నింపుకుని లిక్విడ్ సోప్ కలుపుకుని, తలకి ప్లాస్టిక్ కాప్ తగిలించుకుని నీళ్ళలో పడుకున్నాడు. 
ఇయర్ ఫోన్స్ లో మ్యూజిక్ వింటూ, పక్కనే ఉంచుకున్న డ్రింక్ సిప్ చేస్తూ.. రిలాక్స్ గా ..
అరగంట గడిచాక మ్యూజిక్ ఆల్బమ్ పూర్తి అయి రెండో ఆల్బమ్ మొదలయ్యే గాప్ లో ఇంట్లోంచి ఏదో శబ్దం వినబడింది. చెవిలోంచి ఇయర్ ఫోన్లు పక్కలి లాగేసి, చెవులు రిక్కించాడు. అవును తమ ఇంట్లోనుండే.. 
ఇంట్లో ఎవరు లేరు. ఇంటావిడ హాస్పిటల్ లో ఉన్న స్నేహితురాలిని పరామర్శించడానికి వెళ్ళి ఉంది. 
హల్లో ఏదో శబ్దం వినిపించింది. ఏదో సర్దుతుంటే జారీ క్రింద పడిన వస్తువులు చేసే శబ్దం.
అతను మెల్లిగా లేచి టవల్ చుట్టుకుని, బెడ్ రూము లో గోడకి తగిలించి ఉన్న రైఫిల్ పట్టుకుని జాగర్తగా హాల్లోకి వచ్చాడు. అక్కడ ఎవరూ లేరు. వంటగది లోకి తడిచిన వంటి మీది చుట్టుకున్న టవల్ తో మెల్లగా అడుగేట్టాడు. వంటింట్లో బార్య అంట్లు సింక్ లో వేసి కడుగుతూ ఉంది. 
“
ఎవరో దొంగ అని భయపడి పోయాను?” 
“
డూప్లికేట్ కి తో తాళం తీసుకుని ఇంట్లోకి వచ్చి మీకు వినబడేటట్టు కేకవేసానే?”
“
మ్యూజిక్ వింటున్నాను.? “
“
ఆ తుపాకి పని చేయదు కదా దాన్నెందుకు తెచ్చారు?”
“
పని చెయ్యని విషయం మనకే గదా తెలిసేది. ఉత్తినే భయపెడదామని ”
“
ఆమె అతన్ని ఒక్కసారి నింపాదిగా చూసి భయపెట్టటాని తుపాకి ఎందుకు ?” అంది.
ఆయన జారిన టవల్ అందుకున్నాడు. J 


గాడిద

రహదారి మీద ప్రమాదం జరిగింది.
వేగంగా వెళ్తున్న ప్రక్క రాష్ట్రం  మంత్రి గారి కారుకి ఊరి చివరనున్న దాబా హోటల్ వద్ద ఒక గాడిద గుద్దుకుంది.
స్పాట్ లో చనిపోయిందా జీవి.

హోటల్ వాళ్ళు కారు ఆపేశారు. జనం ప్రోగయ్యారు. మంత్రి గారిని గుర్తుపట్టలేదు.
గాడిద ల తో పాటు ఉన్న పిల్లాడి తండ్రి రావాల్సిందే, నష్ట పరిహారం కట్టాల్సిందే.  అప్పుడు కానీ కారు కదలనిచ్చేది  లేదని తేల్చేశారు.
కారు పక్కగా ఆపించి తాళాలు స్వాదినం చేసుకున్నారు.  గాడిదల కాపరి సెల్ ఫోన్ లు హామిగా దగ్గర ఉంచుకున్నాడు.
ఎటు పాలుపోని పరిస్థితిలో మంత్రి గారు డ్రైవర్ ని దూరంగా కనిపిస్తున్న ఊర్లోకి సాయం కోసం ఎవరినయినా పట్టుకు రమ్మని పురమాయించారు.
***
అర్ధ గంట గడిచింది. గంటయింది. గంట మూడు గంటలయ్యాయి.
డ్రైవర్ తిరిగొచ్చాడు. మెడలో పూల దండలు ఉన్నాయి. కడుపునిండాక పైన ఒలికిన కల్లు వాసనతో, ఎర్రటి కళ్లతో తులుకుంటు వచ్చాడు.
మంత్రి గారికి కోపం వచ్చింది. “ ఏం జరిగింది? సాయం తీసుకు రమ్మన్నాను. ఈ తాగుడేమిటి?” కేకలెట్టాడు.

డ్రైవర్ సంబాళించుకుని   చాలా మంది గుమిగూడి రంజాన్ వేడుకలు జరుపుకుంటున్నారు. వాళ్ళకి అర్ధం కావాలని నా కొచ్చిన ఉర్దు లో
 "మినిస్టర్ కా గాడి కొ యాక్సిడెంట్ హోగయా, గధా వహీ మర్ గయా .’ అని చెప్పాను. 
పూలదండలు వేసి కల్లు తాపించి కడుపునిండా స్వీట్స్ పెట్టి పంపించారు.” 

Wednesday, 6 July 2016

గంటే

పక్క ఫ్లాట్ కి కొత్తగా ఎవరో వచ్చినట్టున్నారు ?" ప్రసాద్ ఇంటికి రాగానే బార్య శారద ని అడిగాడు.
"
అవునండి గంట క్రితమే సామాను దించేసి రేపు ఉదయాన్నే వస్తామని చుట్టాల   ఇంటికి వెళ్ళి పోయారు "
"
ఏం చేస్తుంటాడట. పిల్లలు ఎంతమంది. ?"
"
ఏమో నండీ తెలీదు. చీరలు కళానికేతన్ లో కొంటుందిట, ఆర్నెల్ల కోసారి కాంచి పురం వెళ్ళి పట్టుచీరలు కొంటుంది. జ్యూవెలరి కళ్యాణి లో కొంటుంది. ఎలైట్ బ్యూటీ పార్లర్ కి రెగ్యులర్ కస్టమర్.............."
తలపట్టుకున్నాడు ప్రసాద్ .
  

www.susri.home.blog

  అందరికీ నమస్తే 66o పోస్టులు పైగా వ్రాసిన ఈ బ్లాగ్ లోని నా పోస్ట్ లలో  చాలా అచ్చుతప్పులు ఉండటం గమనించాను.  వాటన్నిటినీ ఎడిట్ చేస్తూ, modify...