Wednesday, 10 February 2016

పెద్దల పరీక్షలు

సెకండ్ ఇంటర్ చదివే పిల్లల తల్లి తండ్రులు MPC/BiPC ఏదయితేనేం 
ఫిబ్రవరి/మార్చ్ నెలల్లో కనీసం 10 నుండి 12 రకాల పరీక్షలకి డబ్బు కట్టాల్సి వస్తుంది.
అధమం గా చూసుకున్నా 20000 ఖర్చు. మార్చి నెలలో చాలామంది ఉద్యోగులకి జీతం రాదు. ( IT)
**
మే నెల దాకా బొంగరం లా పరీక్ష కేంద్రాలకి తిరగవల్సి వస్తుంది. 
తల్లి తండ్రులు శెలవలు పెట్టుకుని నానా ఇబ్బందులు పడాలి. .
మరో 20/30 వేల ఖర్చు వస్తుంది. విధ్యార్దినుల పరిస్తితి మరి అధమం. 
పాపం సరైన సౌకర్యాలు కూడా ఉండవు.నేచురల్ కాల్స్ కి కూడా కష్టమే.
**
ఇర్రెగ్యులర్ షెడ్యూల్స్ .. అలసట పిల్లల్ని 
పూర్తి స్తాయి performence నుండి దూరం చేస్తాయి.
నిజానికి ఇన్ని ప్రవేశ పరీక్షలు అవసరమా??
***
సరే పిల్లల్ని వత్తిడి పెట్టి రాయించామనుకోండి.
సీట్లు అమ్ముకున్న కాలేజీ పిల్లలకి ముందు రోజు రాత్రి చాటుగా సమాదానాలు అందుతాయి.
మరెందుకీ ముచ్చట?? డ్రామాలు ?? రిజర్వేషన్ విశ్వరూపాల గురించి మాట్లాడుకో నవసరం లేదు 
***
సమాజం పట్ల ఒక రకమయిన 'కసి' తో పిల్లలు బయటకి వస్తారు.
వివిద హోదాల్లో పని చేసే చోట ఎంత వద్దన్నా నిగూడంగా ఉన్న 'అసంతృప్తి'
తిరిగి సమాజం మీదకి గోడకి కొట్టిన బంతి లా తిరిగి వస్తుంది. (చాలా సార్లు)
***
మనం ఆలోచించలేమా?? దీనికి ముగింపులేదా?? క్షేత్ర స్తాయిలో దృష్టి పెట్టకుండా 
వంకర ఫలాలకి మందు చల్లుకుంటూ గడుపుదామా??
‪#‎susri 100216

Tuesday, 9 February 2016

ఫెబ్రవరి 14

మేరీడ్ వెర్షన్: (Feb 14) రధ సప్తమి 
----------------------------------------
రధ సప్తమి ముఖ్యంగా సూర్యుడిని ఆరాధించే పండగ . ఇది మాఘ శుద్ద సప్తమి నాడు వస్తుంది. సూర్య గ్రహణం తో సమానమయిన పర్వంగా శాస్త్రాలు పేర్కొన్నాయి. ఈ రోజు అరుణోదయ కాలం లో స్నానం చెయ్యటం, సూర్యుడిని ద్యానించడం , మహా పుణ్యఫలబద్రమని, ఆరోగ్యకరమని, అకాల మృత్యు పరిహారకమని, మరణానంతరం సూర్యలోకాన్ని పొందుతారని మహర్షుల బొదించి ఉన్నారు.
బాచులర్/అన్ మేరీడ్ వెర్షన్: వాలెంటైన్స్ డే 
-----------------------------------------------
డియోడరెంట్లు, హైర్ ఆయిల్సు, స్ప్రే లు పక్కన పడేసి వీలయినంత వరకు స్నానం చేసి, చిరిగిన జీన్స్ లు కాళ్లతో పక్కకు నెట్టి, బ్రాండెడ్ కాజువల్స్ వేసుకుని డిస్కో లకి వెళ్ళండి.
ఒంటరిగా కనబడ్డ వాళ్ళందరికీ బ్రాకెట్టు లు విసురుకుంటూ వెళ్ళండి. బ్రాకెట్టు వేసేటప్పుడు కనీస దూరం గజం ఉండెట్టు జాగర్త పదండి.(ఆడవాళ్ళ చెయ్యి అంతకంటే పొడుగు ఉండదని సైన్స్ చెబుతుంది) . మీ టైమ్ బాగుందా రిటర్న్ లో మీ కారు/ బైక్ ఫుల్ అవోచ్చు. All the best 
***

(దేబ్యం ముఖం వేసుకుని ‘నానో’ కార్లో వెళ్ళేరు ?? 
మీరు ఒంటరిగా వెనక్కి రావాల్సిందే. 
లేదా మీకు మరో మగ తోడు దొరకాల్సిందే. 
నానో కారుకి ఇంజను వెనక వైపు ఉంటుందని అందరికీ తెలుసు.)

Sunday, 7 February 2016

నాన్నకు ప్రేమతో

శెలవు రోజు  సాయంత్రం బండి తీసి బయటకి వెళ్తుంటే.. అప్పటికే రెడీ గా ఉన్న  మా అబ్బాయి గబ గబా మెట్లు దిగి వచ్చాడు. “నాన్నా నన్ను రత్నమహల్ సినిమా హాలు వద్ద దించుతారా? “ 
“ఏమిటి విశేషం?”
ఈ రోజు మా ఫ్రెండ్స్ కొంతమందిమి “నాన్నకు ప్రేమతో” సినిమాకి వెళ్దామనుకున్నాం. చెప్పాడు వాడు.
నెలకో సారి ఫ్రెండ్స్ తో సినిమాకి వెళ్ళటం మామూలే. “ సరే వచ్చేసేయ్. డబ్బులున్నాయా? “
“ ఆ అమ్మని అడిగి తీసుకున్నాను “
మేము మా ఇల్లు రోడ్డు దాటి మైన్ బజార్లోకి వెళ్ళాం. “మీరు వెళ్తుంది అటెనా? “ అడిగాడు పిల్లాడు.
“ లేదురా. మా ఫ్రెండ్ అంజి వాళ్ళ అమ్మగారు హస్పేటల్ లో ఉన్నారు. ఒక సారి పలకరించి వద్దామని వెళ్తున్నాను “
“ఓహ్ .. ఆ అంకులా, శివాని స్కూల్ దగ్గర ఉంటారు. నల్లగా పొడవుగా ?”
“అవును తానే.. వాళ్ళ అమ్మగారి కి ఈ మధ్య ఒక సర్జరీ చేశారు మరో వారం లో డిశ్చార్జ్ అవుతారు”
మేమిద్దరం ఇలా మాట్లాడుకుంటూ వెళుతున్నప్పుడు ఎదురుగా వస్తున్న ఒక 'వాను డ్రైవర్' కింద నున్న కుక్కని గమనించకుండా పోనివ్వటం తో దాని ముందు టైరు కుక్క  కాలు మీద నుండి పోవటం అది హృదయ విదారకంగా మొరగటం  క్షణాల్లో జరిగింది. మేం బండి పక్కన పెట్టి వచ్చేసరికి ఎక్కడినుండి వచ్చాయో గాని చుట్టూ పక్కల గొందుల్లోంచి కుక్కలు పరిగెట్టుకొచ్చాయి. కాలు విరిగిన కుక్క చుట్టూ చెరీ వాటి అరుపులతో  అవి దాదాపు రోడ్డు బ్లాక్ చేశాయి. విరిగిన దాని కాలు నాలుకతో నాకీ దాని నొప్పి ఉపశమనం కలిగించేందుకు రెండు కుక్కలు ప్రయత్నిస్తున్నాయి.
**
సినిమా హాలు వద్ద పిల్లాడిని దించి “వచ్చేటప్పుడు ఆటొ కి రా బాబు. అవసరం అయితే నా నెంబరుకు ఫోన్ చెయ్యి నేను వస్తాను “ మా వాడికి చెప్పాను.
“ఒక్క నిమిషం నాన్నా.. ఇప్పుడే వస్తాను ఉండండి “ వాడు సినిమాహాలు బయట నిలబడి ఉన్న వాడి స్నేహితులతో రెండంటే రెండు నిమిషాలు మాట్లాడి పక్కనే ఉన్న బంకులో రెండు కొబ్బరి బోండాలు కొట్టించుకుని వచ్చాడు.
“నాన్నా నేను వస్తాను పదండి “ అన్నాడు బండి వెనుక కూర్చుంటూ ...

మా వాడు పెద్దవాడవటం నేను గమనించాను. మీరు గమనించారా??

Friday, 5 February 2016

మహేంద్ర డ్యూరో, 70 కి మీ మైలేజ్


ఉదయాన్నే షు వేసుకుని మెట్లు దిగుతున్ననా, పోర్తికో లో మహీంద్రా డ్యూరో (Mahindra duro 2 వీలర్ ) దీనంగా నిలబడి ఉంది. అప్పటికే చమటోడ్చు తూ ఉంది. 
మరో వైపు మెట్ల కింద ఉంచిన తుప్పు పట్టిన వాషింగ్ మెషీన్ ని, ఏనుగు లాటి GRINDIG టి‌వి ని ఒరకంట గమనిస్తూ ఉంది. 
దగ్గరకి వెళ్ళి ప్రేమగా చెయ్యి వేశాను. వళ్ళంతా తడిచి ఉంది .
..
గేటు బయట మా గుండమ్మ పేడ కల్లపి మీద ముగ్గు వేస్తూ కనబడింది. ..
“ఇవాళ్ళ కూడా బండి మీద నీళ్ళు పోసావుగా??” 

"చిమ్మి కడిగినప్పుడు కొంచెం పడ్డట్టు ఉన్నాయి.” అంది.

కానీ కావాలనే నీళ్ళు గుమ్మరించిందని నాకు ప్రగాడ నమ్మకం. 
కొన్నాళ్ళకి క్రమేణా తుప్పుపట్టటం తద్వారా పాత ఇనుము వాడికి మరో వస్తువు సిద్దం కావటం జరగ బోతుంది.
...
ఆ మధ్య అవసరార్ధం ఆవేశంగా మా వాడి కోసం సెకండ్ సేల్స్ లో కొన్నాను ఈ బండి.
బండి తెల్లగా ముద్దుగా సూపర్ గా ఉంది, సీటు కింద మంచి స్టోరేజ్ స్పేస్ల, 
సిగ్నల్ లైట్స్, ఆటొ స్టార్ట్.. అబ్బో ఇరగడిస్తుంది. 
మావాడు సరిగ్గా రెండు రోజులు కాలేజీకి వెళ్ళి ఫీడ్ బాక్ 'సూపర్ నాన్నా' అని ఇచ్చాడు. 
తర్వాత నుండి మల్లెపూవు లాగా కాలేజీకి వెళ్ళి ముఠామేస్త్రీ లాగా ఇంటికి చేరటం మొదలెట్టాడు. ఏమయిందిరా అని అడిగితే.. నేను కాలేజీ కి నడిచి పోతాను అన్నాడు. 
వాడిని సముదాయించి మరి మరి అడిగితే
“మీరొకసారి తొలి చూడండి “ అన్నాడు. 

...
పిల్లాడిని ఎక్కించుకుని స్టార్ట్ చేసి జామ్మంటు ఒక కిలో మీటరు వెళ్లానో లేదో ...బండి సైలెన్సర్ లోంచి తుప్పు మని శబ్దం వచ్చి ఆగి పోయింది. 
అంతే దానిని స్టార్ట్ చెయ్యటం మా వల్ల కాలేదు పరిచయం ఉన్నవాళ్లని /లేనివాళ్లని అందర్నీ బతిమాలి షెడ్డు దాకా నేట్టించుకుని వచ్చాం. 
దానిని చూడంగానే “ఏం సర్ పాత ఇనుము వాడి వద్ద కొన్నారా అన్నాడతను. “ 
బండి విప్పి ఏదో సారి చేసి పెట్టాడు. స్టార్ట్ అయ్యింది జామ్మంటు వచ్చాం 
మళ్ళీ కిలోమీటలు రాగానే తుప్పు మని సౌండు.. అబ్బా కొడుకులం నెట్టు కుంటూ ఇంటికొచ్చామ్.
..
ఇక దాని సంగతి నేను మాట్లాడటం లేదు వాడు కూడా..
“ఆ బండి అమ్ముతారా ?? ఉల్లిపాయలకి వెయ్యమంటారా? “ మా ఆవిడ అల్టిమేటం...

..
"అరె జి‌డి‌పి తగ్గి పోయింది. అదేదో  రెప్ అంట దాని పరిస్తితి బాలేదు. 

షేర్ మార్కెట్ పరిస్తితి అయోమయంగా ఉంది . రియల్ ఎస్టేట్ పరిస్తితి బాలేదు. 
అమరావతి లాండ్ పూలింగ్ లోనే రేట్లు లేవు. రియల్టర్స్ చాలా మంది తెల్లవారుజామునే రైల్వే స్టేషన్ లో మెత్తటి ఇడ్లీలు, మొహం పుల్లలు, కాఫీ పొడి పోట్లాలు అమ్ముకుంటున్నారు. 
ఇక మన బండికి మంచి రేటు వచ్చే అవకాశాలు దగ్గర లో లేవు “.. నేను వివరించే లోపు 
“ ఈ సుత్తి అంతా నా కొద్దు . అది అమ్ముతారా లేదా నేనో ఒకరోజు ఉల్లిపాయలకి వేస్తాను’”అంది.

..
అదిగో అప్పటి నుండి దాని బాగోగులు ఆమె పట్టించుకుంటుంది. 
రోజు పేడ నీళ్ళతో తల స్నానం చేపిస్తుంది. 
ఒళ్ళు తుడవటం మాత్రం నాకు కేటాయిస్తుంది”
..
ఈ రోజు దీన్ని మార్కెటింగ్ చెయ్యాలి తప్పదు . 
కాలింగ్ బెల్లు కొట్టి మేడ మీద ఉన్న మా అబ్బాయిని పిలిచాను, ..
గుండమ్మకి వాడికి వినబడెట్టుగా రాయలసీమ ఫాక్షనిస్టు స్థాయిలో “రేయ్ బండి తియ్” అని అరిచాను. 
వాడు క్షణాల్లో కిందకి వచ్చి కొత్తగా కొన్న హీరో ఐ స్మార్ట్ తీశాడు. 
వాడికి నచ్చచెప్పి మహీంద్ర బండి తీశాను .
..
స్టార్ట్ చేయకుండా బండి తోసుకుంటూ .. ఉదయాన్నే మా మిత్రులందరం పోగయ్యే చోట కి ఒక కిలో మీటరు ముందు స్టార్ట్ చేసుకుని స్టైల్ గా బండి ఆపాం ...
..
బండి మార్కెటింగ్ మొదలెట్టాము. ..
“అబ్బా ఏం బండి, ఏమి కలరు, ఎంత స్టోరేజే స్పేస్ లాటి నిజాలు ఇద్దరం కలిసి చెబుతుంటే మొహమాటానికి మా ఫ్రెండ్ ఒకడు 

“సుశ్రీ మైలేజ్ ఎంత వస్తుంది ??” అన్నాడు.

..
“70-72 దాకా “..

..
అక్కడంతా నిశబ్దం . 
మిగిలిన మిత్రులు మమ్మల్ని మా బండి ని అపనమ్మకం గా చూశారు. 
గేర్లెస్ బండి 40 కిలోమీటర్లు ఇవ్వడమే చాలా గొప్ప అలాటిది. 
“నిజమా” 

“నిజం గా నిజం .. నేనెప్పుడు 200 కి(మూడు లీటర్లు) పెట్రోల్ కొట్టిస్తాను. ప్రతిసారి 70 కిలోమీటర్లు తగ్గకుండా వస్తుంది మైలేజే.”..

..
రెండు నిమిషాల్లో ఆ స్థలం ఖాళీ చేసి అందరూ ఇంటి మొఖం పట్టారు. 
నేను మావాడు స్టైల్ గా బండి స్టార్ట్ చేశాం. 
మరో కిలో మీటరు వరకు డోకా లేదని మా ఇద్దరికీ గట్టిగా తెలుసు. 

Wednesday, 3 February 2016

లక్ష్మణుడినే

మనం నేర్చుకోవాలే గాని మన మధ్య చాలా మంచి విషయాలు ఉంటాయి..
..
నా మిత్రుడు 'హనుమంత రావు' అని ఒకరు ఉన్నారు . బాంకు ఉద్యోగి.
..
ఎప్పుడు చేనేత చొక్కాలు వాడతారు. ..
మరొకటి వేసుకోగా నేను ఈ 15 ఏళ్లలో చూడలేదు.
ఎప్పుడో కాలేజీ రోజుల్లో చేనేత మగ్గాలని చూడటానికి వెళ్ళి వారి శ్రమ /దోపిడి బాదలు చూసి
"ఉద్యోగం వచ్చాక ఎప్పుడు చేనేత బట్టలే వాడతాను " అని మనసులో అనుకున్నారట.
గత 30 సంవత్సరాల నుండి అదే మాట మీద ఉన్నారు.
***
గ్రౌండ్ ఫ్లోర్ గా ఉన్న ఇంటిని మరో రెండు ఫ్లోర్స్ అదనంగా వేసినప్పుడు.
మంచి ఫ్లోరింగ్ తో ఉన్న పోర్తికో కింద స్థలాన్ని తవ్వించి. పెద్ద 'ఇంకుడు గుంట'
కట్టించాడు. నేను వారించినా వినలేదు. (నిజానికి నేను ప్రోత్సహించాల్సి ఉంది)
కమిట్మెంట్ అంటే అది.
**
మనం కళ్ళు తెరిచి గమనించాలే గాని మన చుట్టూ రత్నాలు చాలా ఉన్నాయి.
ఇలాటి మిత్రులే నాకు బలం. వారికి నేను ఎప్పుడు లక్ష్మణుడినే. smile emoticon grin emoticon
‪#‎susri‬

Monday, 1 February 2016

ఒకేసారి

బాలా నగర్ ఇండస్ట్రియల్ ఏరియా లో చిన్న మేనిఫాక్చరింగ్ యూనిట్ నడుపుతున్న 
వెంగళరావుని, ముడి సరుకు సప్లై చేసే కంపనీ rep రఘుపతి కలిశాడు.
..
తమ Raw మెటీరియల్స్ మార్కెట్ రేటుకి అనుకూలంగా లేవని, 
పైగా నాసి రకంగా ఉంటున్నాయని వెంగళరావు కంప్లైంట్. ..
..
కంపనీ తో మాట్లాడి రేటు విషయం, నాణ్యతా విషయం రెండు అనుకూలంగా ఉండేట్టు ఏర్పాటు చేస్తానని, ఆర్డర్ మాత్రం తమకే ఇవ్వమని చాలా సేపు బతిమాలాక వెంగళరావు కన్వీన్స్ అయి/ అవనట్టు కనిపించాడు.
***
వాతావరణం తేలిక చేయటానికి రఘుపతి తన బాగ్ లోంచి ఛాన్స్లర్ సిగార్ పేకెట్టు ఒకటి తీసి వెంగళ రావుకి ఆఫర్ చేశాడు.
..
"
సిగిరెట్టా .. వద్దు .. ఒక సారి తాగాను .. నచ్చలేదు" ముభావంగా చెప్పాడు అతను.
***
"
లంచ్ కి బంజారాకీ వెల్దం రండి. మా కంపనీ కి డిస్కౌంట్ కార్డు ఉంది. మంచి వైన్ అక్కడ మాత్రమే దొరుకుతుంది." మరో బాణం వేశాడు రఘుపతి...
...
"
వద్దు నేను రాను. వైన్ ఒక సారి తాగాను. నాకు నచ్చలేదు. బంజారాలో బోజనమ్ కూడా నాకు నచ్చలేదు "
***
పరిస్తితి చెయ్యి జారీ పోతుందని అర్ధమయింది రెఘుపతి కి.
..
వెంగళరావు అదేమీ ..పట్టించు కోకుండా..
అప్పుడే యూనిట్ లోకి సైకిలు తొక్కుకుంటూ వస్తున్న ఒక పిల్లాడిని చూపించి 

మాట మార్చడం కోసం 
"వీడు మా అబ్బాయి .. రాకేశ్ " పరిచయం కావించాడు.
***
"
మీకు సింగిల్ చైల్డ్  అనుకుంటాను" రఘుపతి .. 

www.susri.home.blog

  అందరికీ నమస్తే 66o పోస్టులు పైగా వ్రాసిన ఈ బ్లాగ్ లోని నా పోస్ట్ లలో  చాలా అచ్చుతప్పులు ఉండటం గమనించాను.  వాటన్నిటినీ ఎడిట్ చేస్తూ, modify...