Sunday, 6 December 2015

ఆమె లేని ఉదయం

నీతో పాటు నేను ఉన్నాను,
పూలు నామీదా కురుస్తూనే ఉన్నాయి.
నువ్వు పడుకుని వున్నావు.
నేను నడుస్తూ వున్నాను ..
ని వెనుకే ..
అంతే తేడా  :(

*******
నీవు లేని ఉదయం 
మాములుగానే తెల్లారింది.
ని అడుగుల చప్పుడు లేదు..
ని మాటల సవ్వడి లేదు..
అంతా నిశ్శబ్దం ..
ఘాడంగా ఉంది.
ఆ మాటలకోసం , ఆ చేతలకోసం
మనసంతా తవ్వుకుంటున్నాను ..
నన్ను నేను వెతుక్కుంటున్నాను
నాకు నేను దొరుకుతానని
ఏమాత్రం ఆశ లేదు ........ :(

(బార్య వియోగం తో భాదపడుతున్న ఒక మిత్రుడి ఆత్మ)frown emoticonfrown emoticon

కన్ఫిర్మేషన్

వాట్స్ అప్ లో ఇంటావిడకి సందేశం
"పొద్దుటే ఏడింటికి ట్రైన్ కాచ్ చెయ్యాలి. ఆఫీస్ ట్రిప్ మూడు రోజులు. బట్టలు ప్రెస్ చేసి బాగ్ సర్ధి పెట్టు. మొన్న వర్షానికి తడిచిన జర్కిన్ జాగర్తగా క్లీన్ చేసి పెట్టు. రెండు జతల సాక్స్ కూడా. రాత్రికి లేటుగా వస్తాను. మష్ రుమ్స్ కూర వండి ఉంచు."
రెండు నిమిషాలు ...నో రెస్పాన్స్
మరో సందేశం ఇటు నుండి ..
అన్న్తట్లు జయాలుకస్ నుండి గిఫ్ట్ పాక్ పంపాను అందిందా?
వెంటనే సమాదానం..
"వావ్ .. లవ్ యు డార్లింగ్ .. ఏముంది అందులో ?"
"J/K  మొదటి మెస్సెజ్ చూశావని  కాన్ఫిర్మేషన్ కోసం  =D "

Friday, 4 December 2015

బయటకి లాగాడు

నిండు కోర్టు లో కేసు విచారణకి వచ్చింది...
..
పాతికేళ్ళ యువకుడు ని బోనులో నిలబెట్టారు.
..
"న్యాయానికి ప్రతీక అయిన మిలార్డ్ నేనేమయినా చెప్పుకోవచ్చా ??"..
..
"తెలుగు సినిమాలు ఎక్కువ చూస్తావా? విశేషణాలు ఆపి విషయం చెప్పు?"..
..
"నేను నా గర్ల్ ఫ్రెండ్ తో టెలిఫోనే బూత్ లో మాట్లాడుతున్నాను సార్ ..
ముఖ్యమయిన విషయం కొంచెం ఎక్కువ సేపు మాట్లాడాను అనుకోండి .. 
ఈ కానిస్టేబుల్ నన్ను బయటకి లాగి. కింద పడేసి తిట్టాడు సార్."
..
జడ్జి గారు పోలీస్ వైపు చూశాడు...

..
"అంటే కాదు సార్ పక్కనే మరో టెలిఫోన్ బూతు ఉంది అందులో మాట్లాడుకోవచ్చు ..

అది ఖాళీగానే ఉంది. కానీ నన్ను చొక్కా పట్టుకుని బయటకి లాగి.. 
నానా ఆన్ పార్లమెంట్ భాష వాడాడు సార్ "
..
"నిజమేనా? " పోలీస్ వైపు చూస్తూ జడ్జిగారు...

..
" సార్ ఇంకా ఉంది నన్ను లాగి తిట్టినా పర్లేదు. నాతో ఉన్న..

 నా గర్ల్ ఫ్రెండ్ ని కూడా బయటకి లాగాడు సార్ " 

tongue emoticon tongue emoticon pacman emoticon pacman emoticon
‪#‎susri‬

Wednesday, 2 December 2015

చెప్పటం నా ధర్మం

సంగీతం మాస్టారుని కలిశాడు రామారావు
..
"మా ఆవిడ హార్మోనియం నేర్చుకుంటానని అంటుంది."..
..
కొద్దిసేపు పిచ్చాపాటి మాట్లాడాకా ఆయన ..రామారావు కి ఒక సలహా ఇచ్చాడు...
..
"హార్మోనియం వద్దు, సన్నాయి గాని, మౌత్ ఆర్గన్ గాని నేర్చుకోమనండి"
..
ఏం మాస్టారు హార్మోనియం కష్టమా ?..
..
"కష్టమా పాడా ? ని గురించే నాయనా. సాధన చేసేటప్పుడు పాట కూడా వినాల్సి వస్తుంది. చెప్పటం నా ధర్మం."..

తోక కట్ చేయండి.

పొద్దుటే వెటర్నరీ డాక్టర్ వద్దకి ముప్పై మూడేళ్ళ రాజ్ కుమార్ 
ఒక పేట్ డాగ్ ని తీసుకొచ్చాడు.
..
"చెప్పండి ఏంటి ప్రబ్లెమ్" దాన్ని పరిశీలనగా చూస్తూ అడిగింది డాక్టర్...
..
"దీని తోక కట్ చేయండి."
..
"వాట్ ?" ఆశ్చర్యపోయిండావిడ ..
..
"సరిగా వినలేదా? ఆశ్చర్యమా?" రాజ్ కుమార్ సందేహం...
..
"తోక కట్ చెయ్యమంటున్నారు. ఎందుకు ?" ఆవిడ అతన్ని సందేహంగా చూసింది...
..
"ఇది ఇంటికి ఎవరోచ్చినా తోక ఊపుతూ స్వాగతం చెబుతుంది"..
..
మంచిదేగా?..
..
"ఏం మంచిది. దీని తోక ఊపడం చూడటం కోసమే వారానికి రెండు సార్లు వస్తుంది ఆవిడ "..
..
ఆవిడా ? ఆవిడెవరు ?..
..
"మా ఆ త్త "..
‪#‎susri‬

సిరియా లో సైనిక చర్యలు

రెటైర్మెంట్ వయసుని హటాత్తుగా 60 ఏళ్ళు చెయ్యటం వెనుక, 
ఉద్యోగులకు చెల్లించాల్సిన రిటర్మెంట్ బెనిఫిట్స్ నుండి వాయిదా దొరుకుతుందని 
ప్రబుత్వం ఉద్దేశం అనుకుంటే మీరు తప్పు లో కానీ ఉప్పు లో కానీ 
కనీసం పప్పు లో కాలేసినట్లే. tongue emoticon
...
ఎంచక్కా 60 ఏళ్ళకు రెటైర్మెంట్ వేడుకతో పాటు షష్టి పూర్తి కూడా చేసుకుంటారని ...
తద్వారా అన్యోన్య దాంపత్యం కి గుర్తింపు ని తెచ్చినట్లు అవుతుందని ప్రభుత్వం ఆలోచన.
అలాటి ఒక వేడుకలో అన్యోన్య దంపతులకి సన్మానం జరుగుతుంది.
..
బఫే బోజనాల దగ్గర ఆహుతులు, పెద్దాయాన చుట్టూ చెరీ వారి..' అన్యోన్న దాంపత్యానికి' రహస్యాలు రాబట్టారు.
..
"సింపుల్ . నాయనలారా .. ఇంట్లో పెద్ద నిర్ణయాలన్నీ నావే. చిన్న చిన్నవి ఆమె కి వదిలేస్తాను"
ఇంకొంచెం వివరంగా చెప్పమన్నారు అభిమానులు...
..
'బ్రెజిల్ లో రాజకీయ పరిణామాలు, సిరియాలో సైనిక చర్యలు, ..
పాకిస్తాన్, చైనా ఒప్పందం లాటివి నేను చూసుకుంటాను"
..
అంధరు తినటం ఆపి వినటం మొదలెట్టారు...
..
" పిల్ల పెళ్లి, అపార్ట్మెంట్ కొనటం, పిల్లాడి చదువులు, లాటి చిన్న చిన్న విషయాలు ఆమె చూసు..కుంటుంది.. ఒకరి సబ్జెక్ట్ లో మరొకరం వేలు పెట్టం.".
..
అబ. .జబ.. దబ్బ. ఏం చెప్పాడు? పెళ్ళాం పెత్తనం అని ..
‪#‎susri‬

Tuesday, 1 December 2015

ఒక్కొక్కటి తీసుకురండి.

ఒక డిపార్ట్మెంట్ స్టోర్ లో ఎలకల బాద ఎక్కువయింది.
విసిగిపోయిన ఆయన ఎలాగయినా వాటి ని వదిలించుకోవాలని 
స్టోర్ బయట ఒక బోర్డు ఉంచాడు. 
"ఎలకలన్నింటిని చంపిన వారికి 10000 బహుమతి అని"
**
సాయంత్రం ఏడుగంటలకి ఒక పెద్ద వెదురు బుట్ట తీసుకుని ఒక పీలగా ఉన్న వ్యక్తి వచ్చాడు.
నేరుగా యజమాని వద్దకి వెళ్ళి
"నిజంగా 10000 ఇస్తారా?"
"మొత్తం ఒక్కటి మిగల్చ కూడదు. అన్నింటిని చంపాలి "
అతను " తెల్లవారేలోగా అన్నిటిని చంపేస్తాను "
"అయితే ఇవాళే పని కానివ్వు "
***
అతను తన బుట్టతో షెల్లార్ లో ఉన్న స్టోర్ రూము కి వెళ్ళాడు. పది నిమిషాల తర్వాత వచ్చి
"చీజ్ ఒక పావుకేజీ కావాలి "
ఇచ్చి పంపించిన మరో పదినిమిషాలకి " కొద్దిగా ఆల్లం పచ్చడి, అర బాటిలు స్పిరిట్ కావాలి"
అవి తీసుకుని స్టోర్ రూముకెళ్లి ఈ సారి గంటకి బయటకి వచ్చాడు.
కళ్ళు ఎర్రగా ఉన్నాయి , మాట, నడక తడబడుతుంది.
" ఇప్పుడు ఒక్కొక్కటి తీసుకురండి. ఛంపేస్తాను " స్టోర్ ఓనర్ తో చెప్పాడు.
‪#‎susri‬

www.susri.home.blog

  అందరికీ నమస్తే 66o పోస్టులు పైగా వ్రాసిన ఈ బ్లాగ్ లోని నా పోస్ట్ లలో  చాలా అచ్చుతప్పులు ఉండటం గమనించాను.  వాటన్నిటినీ ఎడిట్ చేస్తూ, modify...