Sunday, 2 October 2016

కాలం

ఒక వ్యక్తి సంచి నిండా ఇంట్లో చాన్నాళ్లుగా ఉన్న గులక  రాళ్ళు పోసుకుని ఊరి వెలుపలికి వెళ్ళాడు. అక్కడ ఒక నది పారుతూ ఉంది. నది ఒడ్డున ఒక పొడవాటి చెట్టు ఉన్నది. దాని కొమ్మల మీద పక్షులు ఉన్నాయి. రంగు రంగుల పక్షులు.
అతను సంచి లోని రాయి తీసుకుని గురి చూసి ఒక పక్షి  మీదకు విసిరాడు. అది పక్షికి తగల లేదు ప్రవహించే కాలవలో పడిపోయింది. మరొకటి విసిరాడు. అది కూడా తగల లేదు. ఏదో ఒకటి తగలక పోతుందా అని విసురుతూనే ఉన్నాడు.
పక్షులు ఒక చోట నుండి మరొక చోటకి ఎగురుతున్నాయి గాని దేనికి రాళ్ళు తగల లేదు. రాళ్ళన్ని నదిలోకి పోయి పడ్డాయి.
ఆఖరుకు ఒక రాయి మిగిలింది. మెరుస్తున్న దానిని తీసుకుని అతను వెనక్కి వచ్చాడు. ఊరి మొదట్లో ఒక దుకాణాదారునికి దాన్ని చూపించాడు. వ్యాపారి దాన్ని చూసి అబ్బురం చెందాడు. “ఇది మామూలు గులక రాయి కాదు. చాలా విలువయినది. దీని ఖరీదు కూడా నేను చెప్పలేను. నిపుణులయిన వారు మాత్రమే చెప్పగలరు” అన్నాడు
అప్పుడా వ్యక్తి అయ్యో నేను విలువయిన రాళ్ళు వృధాగా నదిలో జారవిడుచుకున్నానే.. అని భాదపడి మిగిలిన ఒక్క దానిని అయినా సద్వినియోగం చేసుకోవాలి అనుకున్నాడు.

ఆ రాళ్లే జీవితకాలం లో విలువయిన తిరిగిరాని సంవత్సరాలు, నెలలు. చెట్టుమీదున్న పక్షులే ఆశలు, కోరికలు. ఆ నదే మృత్యువు. వ్యాపారే గురువు.
ఇది ఒక క్రైస్తవ నీతి కధ. 

Friday, 30 September 2016

ATM బాలన్స్

బార్య కి పాడయిపోయిన  స్మార్ట్ ఫోన్ బదులు మరో ఫోన్ కొనిపించడం మర్చి పోయిన శ్యాం కి ఇంట్లో శనివారం  పొద్దుటే టిఫిన్ పెట్టలేదు.
ATM సాఫ్ట్ వేర్ మైంటనెన్స్ చేసే శ్యాం కి ఆ పూట కి వీది చివర్లో ఉన్న మిత్రుడి హోటల్ కి వెళ్ళాడు.
కాషియర్ సీట్లో నుంచి లేచి వచ్చి న మిత్రుడు, పలకరింపుగా నవ్వి “ఏం కావాలి?” అని అడిగాడు, గ్లాసులోకి నీళ్ళు వంచుతూ..
ఎమున్నాయి?”
ఇడ్లీ, వడ, దోసె, పూరీ, పెసర, మసాలా దోశె “ 
“మసాలా దోశె చెప్పండి”
“లేదు”
“పెసర?”
లేదు”
“మరి ఏమి ఉంది?”
“ఏమీలేదు”
ఏమి లేవని మొదట్లో నే చెప్పొచ్చుగా?” శ్యాం చిరాకు పడ్డాడు.

“మీ ATM సంగతేమిటి.? కార్డు సరిగా ఇన్సర్ట్ చెయ్యమంటుంది!, 1 నుండి 15 లోపు అంకె నొక్క మంటుంది.1 PIN నెంబరు అడుగుతుంది. మొదట్లో ఏం భాష కావాలి అంటుంది!, బ్యాంకింగ్, కాష్ విత్ డ్రాయల్ అని అడుగుతుంది!. ఎంత కావాలి అంటుంది!, రశీదు కావాలా వద్దా!! అంటుంది. తీరా చివర్లో “ నో సఫిషియంట్ బాలన్స్!!!” అంటుంది. !     మరి మాకు మండదా ???

మనకి ఏమి కావాలి ??

ఒక ఆలయానికి ఒక బొమ్మ  ఏనుగు కావాల్సి వచ్చింది. దానిని చెయ్యమని ఒక వడ్రంగి కి చెప్పారు. అతడు మూడు నెలల పాటు శ్రమించి ఒక ఏనుగు తయారు చేశాడు. దాని నాణ్యత పరిశీలించడానికి మరో వడ్రంగి వెళ్ళాడు.
కూడా అతని చిన్న వయసు కుమార్తె కూడా వెళ్లింది.
ఏనుగును చూడగానే ఆ పాప “నాన్నా ! ఏనుగు వద్దకు వెళ్లకు, అది మిమ్మల్ని ఏమయినా చేస్తుంది” అని భయపడుతూ హెచ్చరించింది.
కానీ తండ్రి ఆమెని పట్టించుకోకుండా వెళ్ళి ఏనుగు ని తడిమి చూసి, అబ్బురంగా చూస్తుండి పోయాడు. తయారీకి వాడిన కలప నీ, శిల్పి పని తనాన్ని మెచ్చుకోకుండా ఉండలేక పోయాడు.
వడ్రంగి కి ఏనుగు కనిపించలేదు. కుమార్తె కి కలప కనిపించలేదు.
వస్తువు ఒక్కటే. భావన మాత్రం భిన్నం.
పరమాత్మ స్వరూపాన్ని ఎక్కడని వెతకటం? పరమాత్మ, పంచభూతాలు రెండు వేరు కాదు.
పరమాత్మ వేరు అని మనం  భావించినప్పుడు పంచ భూతాలు మాత్రమే కనిపిస్తాయి.
అదే పరమాత్మ అనుకుంటే.. పంచ భూతాలు మాయమవుతాయి.
మనకి  ఏమి కావాలి??  అనేది మనకే తెలుస్తుంది.
*****
(శైవ సిద్ధాంత సంబందమయిన గ్రంధాలను తిరుముర్తే అంటారు. తిరుమూలర్ అను యోగీశ్వరుడు వ్రాసినది మొదటి తిరుమూర్తే . అందులో ఆయన వ్రాసిన ఒక పధ్యం సారాంశాన్ని శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు చెప్పారు.)



Monday, 26 September 2016

దయామయుడయిన ప్రభువా!!

అనురాధ ట్రైని పైలెట్ తో టు మెన్ సీటర్ లో ఫ్త్లెయింగ్ ప్రాక్టీస్ చేస్తుంది.
అనుకోకుండా ట్రైనర్ కి కార్డియాక్ స్ట్రోక్ వచ్చింది.
వళ్లంతా చెమటలు పట్టాయి. మాట్లాడలేక పోతున్నాడు. ఊపిరి కూడా కష్టంగా ఉంది. కళ్ళు తేలేశాడు. 
అనురాధ కి పరిస్తితి అర్ధం అయింది. వెంటనే కంట్రోల్ రూముకి కనెక్ట్ అయింది.
"హలో.. హలో.. నేను ట్రైని పైలెట్ గయ్యాళి అనురాధని.
నా ట్రైనర్ కి హటాత్తుగా హెల్త్ ప్రాబ్లెమ్ వచ్చింది. మన స్పృహలో లేడు.
అతని ప్రాణం పోయేలా ఉంది.
నాకు ఫ్లైట్ నడపటం పూర్తిగా రాదు. ఇన్స్త్రక్టర్ లేకుండా నాకేమీ తెలీదు మీరే కాపాడాలి."
రేడియో సిగ్నల్ నుండి ఒక లేడి గొంతు వినబడింది.
"ఏమి కంగారూ పడకు అనురాధా నేను కవితని.
ఇలాటివి చాలా డీల్ చేశాను. భయపడకుండా గుండెలనిండా గాలి పీల్చుకో. ప్రశాంతంగా ఉండు. కంగారూ పడితే ఎక్కువ తప్పులు చేసే ప్రమాదం ఉంది. .ఇప్పుడు ని ముందున్న డాష్ బోర్డు చూసి, నువ్వు ఉన్న ఎత్తు, పొజిషన్ సరిగ్గా చెప్పు"
అనురాధ వెంటనే చెప్పింది.
"ఎత్తు 165 సెంటీమీటర్లు. హై హిల్స్ తో కలిపి 171. కుడివైపు సీట్లో కూర్చుని ఉన్నాను"
అటునుండి కొద్ది సేపు మౌనం.
"నేను చెప్పేది పలుకు.. దయామయుడయిన ప్రభువా!! :p 

Sunday, 25 September 2016

అమృత

నా పేరు అమృత. ఆ రోజు నాకింకా గుర్తుంది. 1919 ఏప్రిల్ 14 వ తేదీ. 
రోజు లాగే అన్న స్కూల్ కి ఉదయాన్నే వెళ్ళాడు. అతను స్కూల్ కి వెళ్లలేదని మర్నాడు తెల్సింది.
అతడు ఇంటికి వచ్చేసరికి బాగా ఆలస్యం అయింది. ఇంట్లో అందరూ దిగాలు పడి ఉన్నారు. అన్న ముఖం వేలాడేసుని వచ్చాడు. బోలెడు దుఖం తో అతను నిలువునా మునిగి ఉన్నాడు. 
అన్న కి చిన్న చెల్లెలు ని నేను. నేనంటే అన్న ఎంతో ప్రేమగా ఉండేవాడు. 
“అన్నా ఎందుకింత ఆలస్యం అయింది.? ఎక్కడికెల్లావు ?” అని నేను ఆందోళనగా అడిగాను. 
“ఏమి తెచ్చానో చూడు” చేతి లో జేబులోంచి తీసిన ఎర్ర సీసాని చూపించాడు.
అందులో మట్టి ఉంది. మట్టి రంగు ఎరుపుగా ఉంది. తడిగా ఉంది.
“ఏమిటిది?” నేను భయంగా అడిగాను.
“ఇందులో ఉన్నది 360 మంది భారతీయుల రక్తం తో తడిచిన మట్టి ఉంది. రోలర్ చట్టానికి శాంతియుత నిరసన తెలపటం కోసం సమావేశమయిన వేలాది ప్రజలమీద కి, నిన్న జనరల్ డయ్యర్ మరఫిరంగులతో కాల్పులు జరిపాడు. ఎందరో చనిపోయారు. ఆ వీరుల రక్తం తో తడిచిన జలియన్ వాలా బాగ్ మట్టి ఈ సీసా లో ఉంది.” అన్న దుఖం తో ఒక్కో మాట చెప్పాడు.
అక్కడ ఏమి చూశాడో, ఏమి విన్నాడో తడబడుతు చెప్పాడు.
ఈ రోజు అన్న ఆహారం ముట్టలేదు. తోటలో నుండి చాలా పూలు తెచ్చి ఆ సీసాని అలంకరించాడు. దానికి మోకరిల్లాడు. తనలో తానే ఏవేవే మాట్లాడుకున్నాడు. బహుశా మనసులోనే ఏవో స్థిరంగా నిశ్చయించుకుని ఉంటాడు.
ఈ హుతాత్ముల రక్తం తో ఆయనకి సన్నిహిత సంభందం ఏర్పడింది. అందుకే తను గూడా విప్లవ కారులకు నాయకుడై ఆత్మ బలిదానం చేశాడు.
మీ కింతకి మా అన్న పేరు చెప్పలేదు కదూ... ఆయన్ని మీరు ఎరుగుదురు . ఆయన పేరు భగత్ సింగ్.

చంద్ర శేఖర ఆజాద్

చంద్ర శేఖర తివారీ, జులై 23 న 1906 లో మద్య ప్రదేశ్ లోని 'భవ్రా' గ్రామంలో జన్మించారు. 
తండ్రి సీతారాం తివారి, తల్లి జాగ్రాని దేవి (మూడో బార్య). మొదటి ఇద్దరు బార్యలు చనిపోయారు. 
చంద్ర శేఖర్ ని తల్లి ఒక గొప్ప సంస్కృత పండితుడిగా చూడాలని కల కనేది. అందుకే ప్రఖ్యాత హిందూ విశ్వవియాలయం (బెనారస్) లో చంద్ర శేఖర్ ని చేర్పించారు. 15 ఏళ్ల వయసున్నప్పుడు, మహాత్మా గాంధీ ప్రారంభించిన సహాయ నిరాకరణ ఉద్యమం లో పాల్గొని డిసెంబర్ 1921 లో అరెస్టు అయ్యాడు. 
మేజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టినప్పుడు తన పేరు ను ‘ఆజాద్’ అని తన తండ్రి పేరు ‘స్వతంత్ర’ అని తన భావజాలం లో ఉన్న పదాలని దిక్కార స్వరం తో చెప్పాడు.
జైలు నే తన ఊరు అని చెప్పి, 16 హంటర్ దెబ్బలని శిక్షగా పొందాడు.
'వందేమాతరం' నినాదం తో వాటిని స్వీకరించి, సొమ్మసిల్లి పోయాడు.
ఆనాటి నుండి అతను చంద్ర శేఖర ఆజాద్ అయ్యాడు. 



1922 లో జైలు నుండి విడుదల అయ్యాక అతను మరింత కరుడుగట్టిన స్వతంత్ర భారత అభిలాషి అయ్యాడు. HRA (హిందూస్థాన్ రిపబ్లిక్ అసోసియేషన్) స్తాపకుడు శ్రీ రామ్ ప్రసాద్ బిస్మిల్ తో పరిచయం అయినప్పుడు “ నీలో దేశభక్తి ని చూడాలను కుంటున్నాను” అన్నప్పుడు చంద్ర శేఖర్ ఒక వెలుగుతున్న దీపం మీద తన చేతిని ఉంచాడు. శరీరం కాలి వాసన వేస్తున్నా, అతను చలించలేదు. రామ్ ప్రసాద్ బిస్మిల్ అతన్ని వారించి HRA లో కి ఆహ్వానించాడు. అప్పటి నుండి చంద్ర శేఖర్ తను నమ్మిన HRA కి నిధులు వసూలు చేయటం మొదలెట్టాడు. ఎక్కువభాగం నిదులు బ్రిటిష్ ప్రభుత్వం నుండి కొల్లగొట్టనవి సేకరించేవాడు. సోషలిస్ట్ ప్రిన్సిపల్స్ మీద ఒక నూతన ఇండియా ని నిర్మించాలని భావించాడు.
1925 లో జరిగిన కకొరి రైలు రాబరీ లో అతని పాత్ర ఉంది. 1926 లో విక్టోరియా రైల్ ను పేల్చే ప్రయత్నం చేశాడు.
మోతీలాల్ నెహ్రూ నుండి కూడా నిధులు వసూలు చేసేవాడు.
రైలు రాబరీ తర్వాత ఆజాద్ అజ్ఞాతవాసంలో కెళ్ళాడు.
ఝాన్సి సమీపం లోని అడవుల్లో స్థావరం ఏర్పాటు చేసుకుని తన అనుచరులకి తుపాకి కాల్చడం లో శిక్షణ ఇచ్చాడు . పరిసర గ్రామాలలోని యువకులని చేరదీసి దేశభక్తి నూరి పోసేవాడు, సైనిక శిక్షణ ఇచ్చేవాడు.
1929 మే 2న పార్లమెంటుపై జరిగిన బాంబు దాడి కేసులో భగత్‌సింగ్, సుఖ్‌దేవ్, రాజ్‌గురులకు ఉరిశిక్ష ఖరారు చేశాయి న్యాయస్థానాలు. అది తెలిసి ఆజాద్ విచలితుడయ్యాడు. వారిని విడిపించేందుకు ఎంతకైనా తెగించాలనుకున్నాడు. ఎన్నో ప్రయత్నాలు చేశాడు. 1931 ఫిబ్రవరి 27న జవహర్‌లాల్ నెహ్రూని కలిశాడు ఆజాద్. విప్లవ వీరులైన భగత్‌సింగ్ తదితరుల్ని విడిపించేందుకు సహకరించమన్నాడు. నెహ్రూ అందుకు అవుననలేదు, కాదనలేదు. ఆజాద్ అక్కడి నుంచి నేరుగా అలహాబాద్‌లోని ఆల్ఫ్రెడ్ పార్కుకి వెళ్లాడు. ఓ చెట్టు కింద ఇద్దరు మిత్రులతో కూచున్నాడు. భగత్ త్రయాన్ని ఎలాగైనా విడిపించేందుకు వారితో చర్చిస్తున్నాడు. అంతలో వారిలో ఒకరు పోలీసు ఇన్‌ఫార్మర్ అని అనుమానమేసింది. చప్పున కుడిచేయి మోకాలి దగ్గరి రివాల్వర్ దగ్గరకు వెళ్లింది. అదే క్షణంలో పోలీసులు చుట్టు ముట్టారు . ఆజాద్ వెంటనే కాల్పులు జరిపాడు . ముగ్గురు పోలీసులు తూటాలకు బలైపోయారు. ఒక్క పోలీసు కూడా తనను ముట్టుకోకుండా తుపాకీని కాలుస్తూనే ఉన్నాడు ఆజాద్. ఇక ఒక్క బుల్లెట్ మాత్రమే మిగిలింది. అది కూడా అయిపోతే పోలీసులకు తాను పట్టుబడటం ఖాయం. బతికుండగా బ్రిటిష్ వారికి చిక్కడమా? నెవ్వర్!అనుకున్నాడు. అంతే! ఆ ఒక్క తూటాతో తననే కాల్చుకున్నాడు ఆజాద్.
నేల కొరిగాడు.అప్పటికి అతని వయసు 24 ఏళ్ళు మాత్రమే..


 సజీవంగా బ్రిటిష్ ప్రభుత్వానికి దొరకను అని చెప్పిన మాట నిలబెట్టుకున్న వీరుడు. “చంద్ర శేఖర ఆజాద్”

Saturday, 24 September 2016

ప్రశ్నించే అలవాటు

Israel Isaac Rabi (29 July 1898 – 11 January 1988)
సౌకర్యంగా 'డాక్టర్ రాబి' అందాం. 

1944 నోబెల్ బహుమతి తీసుకున్న ఫిజిక్స్ శాస్త్రవేత్త. 
మిక్రోవేవ్ రాడార్స్ & ఒవెన్స్ పని చేయటం లో కీలకమయిన ‘న్యూక్లియర్ మాగ్నెటిక్ రిసోనెన్స్ ని కనిపెట్టిన మేధావి’ 
నోబుల్ ప్రైజ్ స్వీకరించాక న్యూ యార్క్ లో ఒక పత్రికా విలేఖరి వారిని కలుసుకు ని ఇంటర్వ్యూ కోరాడు. 
“మీ విజయానికి వెనుక రహస్యం ఏమిటి?”
అందుకాయన ఏమాత్రం ఏమాత్రం ఆలోచించకుండా “ మా అమ్మ” అని సమాదానం ఇచ్చాడు.
విలేఖరి ఆశర్యపోయాడు. “అదెలా?” అని అడిగాడు .
అందుకాయన “రోజు నేను స్కూల్ నుండి రాగానే, మా అమ్మ నన్ను అడిగేది.
“ఈ రోజు స్కూల్ లో మీ క్లాస్ టీచర్ ని ఎమయినా మంచి ప్రశ్న వేశావా ?” అని
‘ టీచర్ ని మంచి ప్రశ్న అడగాలంటే ఆలోచించాలి. రోజు పడుకోబోయే ముందు మర్నాడు టీచర్ ని అడగటం కోసం ఒక మంచి ప్రశ్న సిద్దం చేసుకునేవాడిని. నా ఆలోచనలకి పదును పెట్టేవాడిని. మా అమ్మ నాకు నేర్పిన ప్రశ్నలు అడిగే స్వభావమే, నాకు నోబెల్ బహుమతి రావటానికి కారణం

www.susri.home.blog

  అందరికీ నమస్తే 66o పోస్టులు పైగా వ్రాసిన ఈ బ్లాగ్ లోని నా పోస్ట్ లలో  చాలా అచ్చుతప్పులు ఉండటం గమనించాను.  వాటన్నిటినీ ఎడిట్ చేస్తూ, modify...