Wednesday, 31 August 2016

దిలీప్ ఎవరు?

“మానసా నీతో మాట్లాడాలి “ స్నేహితురాలి కి ఫోన్ చేసి చెప్పాడు కార్తీక్.
“అంతా క్షేమమేగా?”
“ఎవ్విరి థింగ్ ఒకే “
“మరెంటి?”
“నీ ఎఫ్‌బి లో దిలీప్ ఎవరు?”
“ఏ ఏమయింది?”
“నిన్ను రెగ్యులర్ గా ఫాలో అవుతుంటాడు. ని ఫోటో లన్నిటిని , లైక్ చేసే, cute, super, awesome లాటి కామెంట్లు ఉంచుతుంటాడు.?”
“అతనా?”
“అవును. ఎవరతను ?”
“వదిలే. మారేదయినా మాట్లాడు”
“అంటే ని ex బాయ్ ఫ్రెండ్ ?”
“చి కాదు.”
“మరి? బ్రదర్?”
“నో ... వదిలెయ్యమన్నానా?”
“అంటే .. చెప్పటం ఇష్టం లేదా?”
“ప్లీజ్ అదొక్కటి అడక్కు?”
“సరే. వదిలేస్తా.. మన రిలేషన్ దెబ్బతింటుంది.”
“అబ్బా .. కార్తీక్ .. చేబ్తాను కానీ నువ్వు కోప్పడకూడదు.”
“ఐ ట్రై .. చెప్పు”
..
..
..
..
..
....
“అది నా ఫేక్ ఐ‌డి “ 

వర్డ్స్ అండ్ ఫిగర్ !!

బ్యాంక్ కాష్ క్లోసింగ్ అవర్స్ లో మేనేజర్ కి ఫోన్ వచ్చింది.
“సార్ అర్జంటుగా 80,000 కావాలి. ఒక్క పదినిమిషాల్లో వచ్చేస్తాను. ట్రాఫిక్ లో ఉన్నాను ప్లీజ్” తియ్యటి వాయిస్ తో గోముగా రిక్వెస్ట్. 
నార్త్ ఇండియా నుండి వచ్చిన కుర్ర మేనేజర్ వెంటనే ఇంటర్ కం లో కాషియర్ 
తో చెప్పాడు కాష్ క్లోజ్ చెయ్యొద్దన్ని.
అలాటి పది నిమిషాలు నాలుగు అయిపోయినాయి. 
హడావిడిగా లోపలికి వచ్చిన ‘హిడింబి’ నేరుగా మేనేజర్ వద్దకి దొర్లుకుంటా వెళ్లింది.
ఒక్క నిమిషం ఆమెని ఎగా దిగా చూసి. “నో వే. కాష్ క్లోజ్డ్. కం టుమారో” నిర్ధాక్ష్యణ్యం గా చెప్పాడు.
కేబిన్ లోంచి లేచి వచ్చి కేషియర్ తో కాష్ క్లోజ్ చెయ్యమని చెప్పాడు.
“చెక్ నహి లాయా క్యా?”
వింతగా చూసిన కొలీగ్ తో ..
“ Words అండ్ Figure నాట్ మాచేడ్. వాట్ టు డూ ?”

Friday, 26 August 2016

లేటు ..వయసు

1970 పి‌వి‌ఆర్ హై స్కూల్ లో పదో తరగతి చదివిన వాళ్ళందరూ గెట్ టు గెదర్ ఏర్పాటు చేసుకున్నారు.
చాలా దూర ప్రాంతాలనుండి, 45 ఏళ్ల తర్వాత అందరూ కలిశారు. వివిద ఉద్యోగాలు చేసి రిటైల్ అయ్యి సీనియర్ సిటిజన్స్ దశలో ఉన్నారు అందరూ.
ప్రారంభం లో తమ నుండి వెళ్ళిపోయిన సహచరులకి నివాళి ఘటించారు. 
రెండు రోజుల పాటు పాత జ్నాపకాలు తవ్వి పోసుకున్నారు.
అప్పటి నిక్ నేమ్స్ తో ప్రేమగా పలకరించుకున్నారు. 
ఆంజనేయులు, రాజ్యం మళ్ళీ కలిశారు. అప్పట్లో మూగ ప్రేమ గురించి మాట్లాడు కున్నారు. ఇద్దరు ఒంటరిగా మిగిలి పోయిన విషయాన్ని పంచుకున్నారు. 
ఒకరి నొకరు ఓదార్చుకున్నారు. 
“
మనం మళ్ళీ పెళ్లి చేసుకుందాం” అన్నాడు ఆంజనేయులు.
రాజ్యం చొట్ట బుగ్గలు లోకి గాలి నింపుకుని నవ్వింది. 
“
అలాగే” అంది ఎక్కువ సేపు ఆలోచించకుండా.
ఆ రాత్రి 'కాంటినెంటల్ హోటల్' లో బస చేసిన ఆంజనేయులు కి నిద్ర పట్టలేదు. 
ఉదయం బెడ్ కాఫీ తాగేటప్పుడు రాత్రి తను ‘రాజ్యానికి ప్రపోసే చేసిన విషయం’ గుర్తొచ్చింది. 
ఆమె ‘అవును’ ఆందో ‘కాదు’ ఆందో మాత్రం ఎంతమాత్రం గుర్తుకు రాలేదు. 
చాలా సేపు తర్జన బర్జన పడి ఫోన్ లో వాయిస్ సర్చ్ లో ‘ కాల్ స్వీట్ హార్ట్ రాజీ “ అని చెప్పాడు. ఫోన్ కనెక్ట్ అయింది. 
“
సారి రాజీ రాత్రి నేను ప్రపోజ్ చేసినప్పుడు నువ్వు ‘యెస్’ అన్నావో ‘నో’ అన్నావో గుర్తుకురాక ఫోన్ చేశాను.”
“
నువ్వేమి మారలేదు అంజీ ‘యెస్’ అని ‘మనస్ఫూర్తి’గా చెప్పాను “
ఆంజనేయులు ఆనందం గా ఫోన్ కట్ చెయ్యబోతుంటే రాజ్యం అంది.
“
నువ్వు ఫోన్ చెయ్యటం మంచిదయింది. రాత్రి ఎవరు ప్రపోజ్ చేశారో గుర్తుకురాక నిద్ర లేచినప్పటినుండి బుర్ర బద్దలు కొట్టుకుంటున్నాను “


Saturday, 20 August 2016

సాహితీ సభ

అతను బాత్రూము లో ఉన్నప్పుడు తన ఫోన్ మ్రోగటం, బార్య అటెండవటం గమనించాడు.
..
తలతుడుచుకుంటూ "ఇందాక ఫోన్ వచ్చి నట్లుంది." అడిగాడు.
..
“మీ ఫ్రెండ్ .. కామేశం ; సాయంత్రం ఏదో సాహితీ సభ అటండ్ అవటానికి ‘కావలి’ వెళ్దాం అనుకున్నారట గదా? అది కాన్సిల్ అయ్యిందని చెప్పమన్నాడు”
..
“ఆలానా ఎందుకని? మా ఫ్రెండ్స్ అందరం కలిసి వెళ్దాం అనుకున్నాం. ఇంటికి రావటం లేటు అవుద్దని కూడా నీకు చెప్పాను. కాన్సిల్ ఎందుకనట ?”
..
“బహుశా మీకు అప్పు ఇచ్చే బార్ రిపేర్ లో ఉండి ఉంటుంది.”
..
ఏమిటో చెవుల్లోకీ నీళ్ళు వెళ్ళి సరిగా వినబడటం లేదు అతనికి.
..

Wednesday, 17 August 2016

మీటింగు ముగిసింది

రాత్రి ఆఫీసునుండి ఇంటికి వచ్చి స్నానం చేసి, కాలనీ కమిటీ మీటింగు కి అటెండయ్యాను.
..
అనేక విషయాలు చర్చకి వచ్చాయి,
సిమెంట్ రోడ్డు ప్రతిపాదన, గుడి అభివృద్ది, గుళ్ళో మంచి నీటి సౌకర్యం, 
సేవా టికెట్లు, ఫలహారాలు, పరిశుబ్రత, కొబ్బరికాయల అమ్మకం, 
ఆదాయవనరులు పెంచడం.. ఇలా అనేకం..
..
రాత్రి 11 దాటింది.
సభ్యులు  కొంత మంది నిద్రకి అవులిస్తున్నారు.. 
పగలు పనులకి వెళ్ళిన ఒకాయన గోడకి ఆనుకుని కునికిపాట్లు పడుతున్నాడు. 
అప్పటికే ‘ఏమన్నా ఉంటే మరో మీటింగులో మాట్లాడుకుందాం.’ అని ఒక బాడీ మెంబరు నన్ను గీరుతున్నాడు.
..
“అన్నీ చర్చించాల్సిందే నని, ఎలాటి రాజీ లేదు” అని  నిర్మొహమాటంగా చెప్పాను.
**
మరో పావుగంటకి నాకు Whats app లో మా పెద్దమ్మాయి నుండి సందేశం వచ్చింది.
“నాన్నా అమ్మ అలక అయిపోయింది. మీరు ఇంటికి రావచ్చు”
..
మీటింగు వెంటనే  ముగిసింది.

Monday, 15 August 2016

శాంతి దూత

సాయిబాబా ఛారిటీ స్కూల్ లో 70 వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి.
కమిటీ సభ్యులు దాతలు అతిదులు (నేనున్నానని చెప్పక్కర్లేదుగా J ) పిల్లలని ఉత్తేజ పరుస్తూ చక్కటి మాటలు వారి భాషలో చెప్పారు. జాతి నిర్మాణానికి ఇప్పటి నుండే పిల్లలు నిర్వహించాల్సిన భాద్యతలు గుర్తు చేశారు. ప్రత్యేకంగా వచ్చిన ఒక అతిది శాంతి దూత లా  “శాంతి గురించి చాలా చక్కగా చెప్పారు. అహింస గురించి ఓపికగా వివరించారు, వ్యక్తిగత హింసకి పాల్పడినప్పటికి శాంతి యుతంగా గాంధీ మార్గంలో ప్రజలు నడిచి నట్లయితే స్వాతంత్ర మనకి ఇంకా ముందే వచ్చి ఉండేది అని నమ్మకంగా చెప్పారు”

చక్కగా తయారయి, యూనిఫార్మ్ ల లో ఉన్న చిన్న పిల్లలు చక్కటి శ్లోకాలు, సామెతలు, పాటలు, ప్రార్ధనలతో వేదిక పులకించింది. పిల్లలకి కొన్ని ప్రోత్సాహక బహుమతులు పంపిణీ చేశారు. అందరికీ తినుబండారాల పాకెట్లు ఇవ్వబడ్డాయి. వందన సమర్పణ సరిగ్గా 11-00 కి పూర్తి అయ్యింది. విసురుగా గాలి మొదలయింది.
స్కూల్ పక్క నున్న మేడ మీద పక్షుల ఆహారం కోసం ఉంచిన ప్లాస్టిక్ గిన్నె ఒకటి గాలికి ఎగురుకుంటూ వచ్చి, శాంతి దూత గారి తలకి తగిలింది. మేడ మీద నుండి ఒకతను తొంగి చూశాడు.
“ఎవడ్రా అది .. పుండాకోర్ గిన్నె విసిరింది “ అంటూ అతని మీద విరుచుకు పడ్డాడు అతిది.

పిల్లల మనసుల్లో కొత్త ప్రశ్నలు మొలకెత్తకుండా నేను, ఓబులరెడ్డి మాస్తారు అడ్డుగా నిలబడ్డాము.

Sunday, 14 August 2016

ఒక్క రూపాయి.

అయిదారేళ్ళ క్రితం ఒక రోజు ఉద్యోగరీత్యా పర్చూరు శాసన సబ్యులు దగ్గుబాటి వేంకటేశ్వర రావు గారిని కలవటానికి పర్చూరు వెళ్లాల్సి వచ్చింది. ఒంగోలు నుండి చీరాల వరకు ‘కృష్ణ ఎక్స్ ప్రెస్’  లో వెళ్ళాను. అక్కడ దిగి పక్కనే ఉన్న బస్ స్టాండ్ లో బయలుదేరిన బస్సు రన్నింగ్ లో ఎక్కాను. బస్సులో మిగిలిన ఒక్క సీట్లో కూర్చున్నాను.
కొద్ది దూరం వెళ్ళాక బస్సు ఆపి కండెక్టర్ ఒక ముసలావిడ ని ఎక్కించాడు. ఆమె వద్ద ఉన్న మెత్తాళ్ళ(ఎండబేట్టిన చిన్న రొయ్యలు) గోతం ముక్కు పుటాలు అదరేస్తుంది. ఎవరయినా లేచి సీటు ఇస్తారేమో నని చూసా గాని ఎవరూ ఇవ్వలేదు. అందాకా ట్రైన్ లో నిలబడే ప్రయాణం చేశాను. లేచి నిలబడాలని పించలేదు. పైగా ఎం‌ఎల్‌ఏ గారి తో మాట్లాడటానికి కొంత ప్రిపేర్ అవాల్సి ఉంది. ఆవిడ అక్కడే కొద్దిగా స్థలం చూసుకుని కింద కూర్చుండి పోయింది.
కొద్దిసేపట్లో నేను డైరీ చూసుకుంటుండగా కండెక్టర్ టికెట్ అడిగాడు. వాలేట్ తీశాను. ఒక అయిదువందల నోటు మరో పది నోటు మిగిలింది. టికెట్ 11 రూపాయలు. జేబులు ఎంత వెతికినా చిల్లర లేదు జేబులో ..
500 కి చిల్లర లేదు. ఒక్క రూపాయి కావాలి.
అప్పుడు ఆమె తన నడుముకి ఉన్న చిన్న సంచి లోంచి చిల్లర వెతికి రూపాయి ఇచ్చింది. నేను చూస్తూ ఉండిపోయాను. దిగి మరో బస్సు ఎక్కే టంత టైమ్ లేదు. ఏదో తెలీని గిల్టీ ఫీలింగ్.
తీరా కారంచేడు చేరబోయేటప్పటికి వాలేట్ లోని జిప్ కవర్లో ఒక రెండు రూపాయల కాయిన్ ఉండటం గుర్తుకొచ్చింది. అది తీసి ఆమె కి ఇవ్వబోయాను. ఆమె తీసుకోలేదు. “వద్దు” అంది. నాకేం చెయ్యాలో పాలు పోలేదు.
బస్సు దిగాను.

విషయం చాలా చిన్నదయినా చాలా సార్లు గుర్తుకొస్తుంది.
..
చిల్లర గురించి మళ్ళీ ఇంత వరకు ఇబ్బంది పడలేదు. ఎప్పుడు బాగ్ లో కొన్ని కాయిన్స్ వేసుకోవటం అలవాటు అయింది.

www.susri.home.blog

  అందరికీ నమస్తే 66o పోస్టులు పైగా వ్రాసిన ఈ బ్లాగ్ లోని నా పోస్ట్ లలో  చాలా అచ్చుతప్పులు ఉండటం గమనించాను.  వాటన్నిటినీ ఎడిట్ చేస్తూ, modify...