Sunday, 24 July 2016

బహాయి – లోటస్ టెంపుల్

'మీర్జా హుసేన్‌ అలీ నూరి' ఒక 'వజీరు' కుమారుడు. 
1817
లో టెహరాన్ (పర్షియా) లో జన్మించారు. 
ఒక పెద్ద పదవిని చేపట్టవలసిన సమయం లో దాని ని తృణీకరించి, దైవ ప్రేరణ వల్ల కొత్త మతాన్ని స్థాపించాడు. 
ఆయన్ని 'బహాయుల్లా' అని కూడా పిలిచేవారు. 
ఆ పేరు తోనే బహాయిజం అనే పదం వాడుకలోకి వచ్చింది. 
..
భాహాయుల్లా అంటే దేవుని వెలుగు, తేజస్సు, శోభ అని. ..
..
భగవంతుడు ఒక్కడే. సర్వ మానవాళి ఒకే కుటుంబం. స్వర్గ నరకాలనేవి ఎక్కడో ఉన్నవి కావు, అవి కేవలం మనం అనుకునే స్థితులు మాత్రమే. 
చేసిన మంచి చెడుల బట్టి మరణానంతరం ‘ఆత్మ’ దేవుని దగ్గరగానో, దూరం గానో పయనిస్తుంది. 
ఎవరి పట్ల ఎవరికి అసహనం కూడదు. 
సత్యాన్వేషణ అనేది ఎవరికి వారు స్వయంగా అనుభవించి తెలుకోవలసిందే
---
క్రీ.శ. 1863లో ఇరాన్ రాజధాని టెహరాన్ లో ప్రారంభమైన ‘బహాయి’  అనే ఈ మతం ప్రభోదిస్తుంది. 
..
బహాయి మత విశ్వాసం ప్రకారం మొత్తం మానవాళి ఒకే జాతి, ఇభ్రహీమ్, మూసా, జొరాస్టర్, గౌతమ బుద్దుడు, శ్రీకృష్ణుడు, ఈసా, మహమ్మద్ మరియు బహావుల్లా వీరందరూ ప్రవక్తలు.. మాత్రమే .. 
..
ఈ మతాన్ని పాటించేవారు ఇండియా తో కలసి చాలా దేశాల్లో లక్షల సంఖ్యలో ఉన్నారు. తొమ్మిది కోణాల నక్షత్రం ఈ మతం గుర్తు. ..


బహాయుల్లా రచనలే ఈ మతానికి పవిత్ర గ్రంధాలు. వీరికి అర్చక వర్గం అంటూ ప్రత్యేకంగా ఏమి ఉండదు. 
ఇరాన్ లో పుట్టిన ఈ మతానికి అక్కడి పాలకుల నుండి వ్యతిరేఖత ఉంది .. అందువల్ల కేంద్ర స్థానం ఇరాన్‌ వదల వలసి వచ్చింది. ప్రస్తుతం ఇజ్రాయిల్‌లోని ‘హైఫా’ ఈ మతం కేంద్ర స్థానం.

..
క్లుప్తంగా చెప్పాలంటే కృష్ణుడు ని చూడలేదు, రాముని చూడలేదు కానీ వారి రిరువురూ పూజించిన సూర్యుడిని/ వెలుగుని మాత్రం మనం చూడగలుగు తున్నాం. కనుక మనకి జ్ణానాన్ని ఇచ్చే ..'వెలుగే' భగవంతుడు అనేది బహాయిల విశ్వాసం.
..


ప్రపంచం లో ఒకానొక గొప్ప బహాయి మందిరం ‘ఢిల్లీ లోని లోటస్ టెంపుల్’ యాడాదికి 40 లక్షల మంది దర్శించే ఈ విశ్వాస మందిరం మద్యలో ప్రార్ధనామందిరాన్ని సూర్యుని కాంతి పుంజం ఒకటి తాకుతూ ఉంటుంది. చుట్టూ ఏర్పాటు చేసిన బెంచీ ల మీద ప్రశాంతం గా కూర్చుని ఏ మతస్తులయినా ప్రార్ధించు కోవచ్చు. తన లోని వెలుగు ని గుర్తించు కోవచ్చు...


Friday, 22 July 2016

చందనేనా?

మిస్సెస్ రాజు 22/07/16
----------------------------
ఈ రోజు ఉదయం నుండి తను మూడీగా ఉన్నాడు. 
తనకి ఇష్టమయిన టిఫిన్ చేసి పెట్టాను. కనీసం బావుందని చెప్పలేదు. ఆఫీసుకి వెళ్తూ కనీసం చెయ్యి ఉపలేదు.
సాయంత్రం బయటకి వెల్ధామనుకున్నాను. వస్తూనే సోఫాలో బాగ్ గిరాటేశాడు. 
“
ఏమయిందండీ ?” అడిగాను. పలకలేదు. సాయంత్రం దాకా టి‌వి కి అతుక్కు పోయాడు. నేను శాటిన్ పింక్ నైట్ డ్రస్ వేసుకున్నది కూడా గమనించలేదు. బోజనమ్ కూడా అన్యమస్కంగానే కానిచ్చాడు. 
బెడ్ రూమ్ లో కూడా అదే నిర్లిప్తత. ఎప్పుడు నిద్ర పోయాడో ఏమిటో? 
మనసులో ఎవరున్నారో? క్లాస్ మెట్ ‘చందనా?’ చందనేనా?  
రాజు 22/7/16
-----------------
ఇడియట్ మూడు రోజులనుండి ట్రై చేస్తున్నాను. “కబాలి” టికెట్స్ దొరకలేదు. చట్ ..

ఆమె సరే! అతడెవరు?

గాఢ నిద్రలో ఉన్న ‘భోపాల్’ ఉలిక్కి పడింది.చల్లటి ఉదయపు గాలుల్లో విషం. విపరీతమయిన వేగం తో నగరాన్ని చుట్టుముడుతున్న విష వాయువు.
కాల్చిన ఉక్కు గుండెల్లోకి పీల్చి నట్లు ఊపిరితిత్తుల మంట. ఏం జరగబోతుందో తెలుసుకునేలోగా జనాలను మృత్యువు మింగేస్తోంది .
శరీరం మీద మంటలు, దద్దుర్లు.ఎక్కడివారక్కడ ఎలా ఉన్నవారు అలానే గిల గిలా తన్నుకుంటున్నారు.
అది 1984 డిశంబరు 3.యూనియన్ కార్బైడ్ కంపెనీ నుండి మిథైల్ ఐసోసినెట్ అనే విషవాయువు రెండు గంటల్లో 42 టన్నుల విషాన్నికక్కిన రోజు.
రెండున్నర వేలమంది మృత్యువాత పడిన రోజు. వేలాది మంది శరీరాలని, ఊపిరి తిత్తులని విషం అంటుకున్న రోజు.
చరిత్రలో ఒక చీకటి రోజు.
***
ముందు రోజు రాత్రి ‘ ప్రవీణ్’ పండా సిటీ నుండి భోపాల్ వచ్చాడు. తన వివాహానికి మిత్రులని ఆహ్వానించాల్సి ఉంది అని ‘పూజా’ తో చెప్పి వచ్చాడు .
సాయం కోసం సైన్యం రంగం లోకి దిగింది. వేలాది గాస్ మాస్కు లు ధరించిన సైన్యం బ్రతికి ఉన్న వారిని సిటీకి దూరంగా తరలిస్తున్నారు.
అనేక మెడికల్ క్యాంపు లు నిర్వహణ జరుగుతుంది. ఎంతో మంది బాధితులని గుర్తిస్తున్నారు.
సహాయక చర్యలు ముమ్మరంగా జరుగుతున్నాయి. నగరాన్ని సాధ్యమయినంతగా ఖాళీ చేయిస్తున్నారు.
మృతదేహాలని గుర్తించినవి పోను మిగిలినవి అనాధ ప్రేతాలా తగలెడుతున్నారు. అశ్రద్దగా ఉంటే ప్లేగులాటి ప్రాణాంతక వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉంది.
ఉన్నతాధికారులు/సైన్యం ఆక్సిజన్ మాస్కు లు ధరించి తమ విధుల్ని చిత్త శుద్దితో చేస్తూ ఉన్నారు.
అలాటి భోపాల్లో ఆ విపత్తు జరిగిన మూడో రోజు ఒక పోలీసు ఉన్నతాధికారిని కలిసింది 'ఆమె '.ఆమెకి అతడిని కలవటం అంత సులభంగా సాధ్యపడలేదు.
హోం మినిస్ట్రీ లో పనిచేస్తోన్నతన మేనమామ పలుకుబడి ఉపయోగించి ఆ పోలీసు ఉన్నతాధికారి అప్పాయింట్మెంట్ పొందగలిగింది.అతను వెహికల్ దిగుతూనే సబార్డినేట్స్ తో మాట్లాడుతూ క్యాబిన్ లోకి వెళ్తుంటే ఆమె డోర్ వద్ద నిలబడి ఉంది.
ముఖాన మాస్క్ ఆమె మొఖం లోని ఆదుర్దాని కానీ, బేల తనాన్ని కానీ దాచలేక పోతున్నాయి.అతను ఆమెకి సైగ చేసి లోనికి పిలిచాడు.
"ఎస్ ప్లీజ్”  ఆమె అతని టేబుల్ మీద ఒక కవరు ఉంచింది.అది ఒక పెండ్లి పత్రిక.
అతడు ఆమె వైపు విచిత్రంగాను, కవరు వైపు ఆసక్తి గాను చూసాడు. "ప్రవీణ్ వెడ్స్ పూజా” అందంగా ఉన్న కార్డు అంతే అందం గా ఆ జంట ఫోటోలు.
"డిశంబరు 6 వ తేదీ ఉదయం"పండా సిటీ లోని రైల్వే కల్యాణ వేదిక"లో వివాహం." అని ఉంది.
అతను చప్పున తన చేతి వాచి చూసాడు. ఆరో తేదీ ఉదయం 9.00 గంటలు.
భోపాల్ కి 18 కిలోమీటర్ల దూరం లోని పండా నగరం లో ఈ పాటికి పెళ్లి జరుగుతూ ఉండాలి.
అతని ఆలోచనలని అడ్డుకుంటూ "నేనే పూజ " అందామె.
"ఈ నెల 2 వ తేదీ రాత్రి మిత్రులని ఆహ్వానించాల్సి ఉందని భోపాల్ వచ్చాడు.
ఆ తర్వాత ఏమయ్యిందో తెలీదు." ఆమె ముఖానికి ఉన్న గ్యాస్ మాస్క్ మెల్లిగా కదులుతుంది  దాని వెనుక దుఃఖం కరుగుతుంది అని అతనికి అర్ధం అయ్యింది.
ఆమె బ్యాగ్ లో నుండి ఇరవై పైగా ఫోటోలు తీసి టేబుల్ మీద ఉంచింది.అన్నిటి లోను ఎర్రగా పొడవుగా ఒకే యువకుడు.
చిరునవ్వు తో ఉన్న ముఖం స్పష్టంగా కనిపిస్తుంది. అతనికి విషయం అర్ధం అయ్యింది.
" వియ్ ట్రై టు లొకేట్. గివ్ మీ కాంటాక్ట్ నెంబర్" అతను ఆమె కళ్ళలోకి చూడలేక పోయాడు.
ఆమె ‘పండా సిటీ’ లో తన ఫోన్ నెంబరు, చిరునామా వ్రాసిఉన్న కాగితం అతని టేబుల్ మీద ఉంచి నమస్కరించింది.
***

ఆతరువాత జరిగిన అత్యవసర సమావేశం లో అతను ఆ ఫోటో లు అధికారులకి పంచి క్లుప్తంగా విషయం చెప్పాడు.
" ట్రయ్ టు ఫిగర్ ఔట్ థి మ్యాన్ వేర్ ఎవెర్ హీ ఈజ్ "
మర్నాటి ఉదయం అతను ఆఫీసుకి వస్తూఉంటే వైర్లెస్ సెట్ మోగింది.

తన ఇమ్మిడియట్ సబార్డినేట్ నుండి.“సర్ .. ప్రవీణ్ దొరికాడు. సారీ అతని బాడీ దొరికింది. కానీ సార్ హీ ఈజ్ ఏ సన్ ఆఫ్ బిచ్. అతని బాడీ తోపాటు హోటల్ గది లో నగ్నంగా ఉన్నమరొ మహిళ బాడీ కూడా దొరికింది."

Monday, 18 July 2016

చెత్త

“తిమింగిలాలు మమ్మెల్ జాతికి సంభందించినవి. మనుషుల్లాగే పిల్లలని గర్భం ద్వారా జన్మనిచ్చి , పాలిచ్చి పెంచుతాయి. ఇవి సినిమాల్లో చూయించినట్లు మనుషులని మింగలేవు వాటి గొంతు ఆకారం తో పోలిస్తే చాలా సన్నగా ఉంటుంది. “ క్లాస్ టీచర్ పాఠం చెప్పుకుంటూ పోతుంది.


చివర్లో సందేహాలు అడగమన్నప్పుడు ఒక పిల్లాడు  “మా ఫ్రెండ్ రాజుని  పోయిన సంవత్సరం కొత్తపట్నం బీచ్ లో తిమింగిలాలు లాక్కుపోయి మింగేసాయి” అన్నాడు.
“అవి మింగలేవు. కొన్ని తప్పుడు నమ్మకాలని సినిమాలు మనకి చూపిస్తున్నాయి. ఉదాహరణకి  పాములు ద్రవపదార్ధాలు తీసుకోలేవు. మన సినిమాల్లో పాల గిన్నెలోంచి పాలు తాగినట్లు చూపిస్తారు”

టీచర్ మరింత వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు.
పిల్లాడు కరుడుగట్టిన అనుమానస్థుడు. “నేను స్వర్గానికి వెళ్ళాక రాజుని నిజమో కాదో అడుగుతాను” తను చెప్పినదాన్ని టీచర్ సమర్ధించక పోవటం ఆ పిల్లాడిని బాధపెట్టింది.  
టీచర్ కి నవ్వొచ్చింది. పిల్లల మనసుల్లో సమాజం ఎంత చెత్త నింపుతుందో అని ఆవిడకి బాదేసింది.
 “ఒకవేళ మీ ఫ్రెండ్ రాజు నరకానికి వెళ్ళి ఉంటే? అప్పుడేం చేస్తావు?”
**
**
**

“రాజుని మీరు అడిగి తెలుసుకోండి.” పిల్లాడి సమాదానం. 

Sunday, 17 July 2016

ఆరో వేలు

ఈ రోజు సాయంత్రం ఆప్తమిత్రుడు  డాక్టర్ వెంకట్ చాలా కాలం తర్వాత ఇంటికి వచ్చాడు. 
తాను ఉద్యోగానికి శెలవు పెట్టి MS జాయిన్ అయ్యాక గతం లో లా కలవటం కానీ కలసి మస్తాన్ ఇడ్లీ తినటం కానీ సాద్యపడటం లేదు. 
హటాత్తుగా ఫోన్ చేసి “ఒంగోలు లో ఉన్నాను” అన్నారు.
“ఇంట్లో ఉన్నాను. ఇప్పుడే ఫ్రీ అయ్యాను వచ్చేయండి”
హల్లో దివానీ మీద సిట్టింగ్ వేశాం. 
మా పెద్దమ్మాయి, అనాటమీ గురించి అడిగిన  కొన్ని సాదారణ ప్రశ్నలతో ప్రారంభం అయిన సమావేశం మూడున్నర గంటల పాటు సాగింది. 
అనేక సందేహాలకి తన యాపిల్ 6+ నుండి కొన్ని వీడియో  లు పి‌డి‌ఎఫ్ లు చూయిస్తూ ‘బయాలజీ తో ఏమాత్రం సంబందం’ లేని మాకు చక్కగా బోదపడేట్టు గా అనేక విషయాలు చెప్పు కొచ్చారు.
గొప్ప మెడికల్ కాలేజీ లలో ఆ మాత్రం చెబుతారని కూడా నేను అనుకో ను. 
సత్సంగమ్ అంటే ఇదే. దేవాలయపు ఆవరణాలలో కూర్చుని మైకుల్లో ప్రార్ధన లు, నోటితో అప్రస్తుతాలు మాట్లాడు కోవటం కాదు. 
సంభాషణ మద్యలో విట్ k గురించి ప్రస్తావన వచ్చినప్పుడు ఒక చిన్ననాటి సంఘటన జ్ఞాపకం వచ్చింది.
‘వెంకట్’ కి సెండాఫ్ ఇవ్వటానికి మెట్లు దిగుతుంటే మెట్లమీద వర్షం నీళ్ళు ఉన్నాయి.
***
అలాటి వర్షం పడిన ఒక సాయంత్రం చాన్నాళ్ల క్రితం ..
పెంకుటింటి వరండాలో ఉన్న లో ఒల్టేజ్ బల్బు వెలుగులో మరి కొంతమంది పిల్లలతో కలసి హోం వర్కులు చేసుకుంటున్నాప్పుడు మా నాన్న (టీచరు) బజారు నుండి వచ్చారు. 
వచ్చి రాగానే కాళ్ళు కడుక్కుని వరండాలో కుర్చీ లో కూర్చుని మా హోమ్ వర్క్ పుస్తకాలు చూడటం మొదలెట్టాడు. 
బాగస్వామ్య లెక్కలు చేస్తున్నట్టు గుర్తు. అప్పట్లో మనం లెక్కల్లో ఇరగదీసే వాళ్ళం? 
ఎందుకో తెలీదు ఒక లెక్క తప్పుచేశాను. 
తలమీద చెయ్యి వేసి వంగదీసి వీపున ఒక దెబ్బ వేశాడు. 
తూలి కింద పడిన నేను ఎంతకీ లేవలేదు. 
ఆయన కంగారుగా నన్ను లేపబోయాడు.  “నాన్న ఏందిది ?” నేను బయంగా అరిచాను.
ఆయన కాలికి ఆరోవేలు ఉంది. అది మూడో వేలుకి ముందుపక్క అతుక్కుని.
అది ఒక్కటే కదులు తుంది.
నాన్నకి ఏమి టో అర్ధం అవలేదు. లో ఒల్టెజ్ కాంతి లో అది సరిగా కనిపించడం లేదు.
నేను దాన్ని పట్టుకున్నాను. మెత్తగా ఉంది నాన్న కాలి నుండి లాగుతున్నాను. అది కాలికి అతుక్కొని ఉంది. నేను లాగినంత అది సాగుతుంది గాని కాలి నుండి వీడి రావటం లేదు.
“నాన్నా ఇదేదో పాము నిన్ను కరుస్తుంది.” నేను దాన్ని వదలకుండా నే పెద్దగా ఏడుపు లంకించుకున్నాను.
నాన్నకి ఏమి అర్ధం కాలేదు. అమ్మ ఇంట్లోంచి బాటరీ లైట్ తీసుకువచ్చి చూసింది.
“వాసు చెయ్యి తియ్యరా” అంది.
“ఏదో పామమ్మా నాన్న కాలి వేలు పట్టు కుంది.”
అమ్మ జాగర్తగా చూసి వరండా గూట్లో ఉన్న సున్నం ముగ్గు తీసి నేను పట్టుకున్న చోట పోసింది.
నిమిషం తిరగకుండా అది నా చేతిలోకి వచ్చేసింది. నాన్న కాలు వెనక్కి లాక్కున్నారు.

“అది జలగ రా, ఎక్కడో వర్షం నీళ్ళలో నుండి నడిచేటప్పుడు పట్టుకుని ఉంటుంది.”
“నాన్నా నువ్వు బండోడివా?? ఆమాత్రం తెలీదు” పెద్దగా ఏడుస్తూ  నాన్న ని కొప్పడ్డాను.
నాన్న నన్ను ఎత్తుకుని లోపలికి తీసుకెళ్ళాడు. ఏమి అనలేదు.
ఆ రాత్రి ఆయన  నన్ను దగ్గరగా పొదువుకోవటం మగత నిద్రలో నాకు గుర్తుంది.


www.susri.home.blog

  అందరికీ నమస్తే 66o పోస్టులు పైగా వ్రాసిన ఈ బ్లాగ్ లోని నా పోస్ట్ లలో  చాలా అచ్చుతప్పులు ఉండటం గమనించాను.  వాటన్నిటినీ ఎడిట్ చేస్తూ, modify...