Tuesday, 5 July 2016

కొత్త సూర్యుడు

అతనికి మెళుకువ వచ్చింది. నిజానికి మెళుకువ అనే పదమే కరెక్ట్ కాదు.
అసలు నిద్రపట్టలేదు అనటం సబబు.
గత కొన్నాళ్లుగా తల పోటుగా ఆలోచనలు . కానీ ఇప్పుడు లేదు.
ఎందుకంటే తాను నిర్ణయించుకున్నాడు.
తన నిర్ణయం లో ఎలాటి మార్పు ఉండదు.
**
తలగడ కింద చేత్తో తడిమాడు. తను తేచ్చుకున్నది అక్కడే ఉంది.
లోహం తో చేసిన చిన్న డబ్బా.. అది.
మెడలో వేసుకునే తాయత్తు సైజు లో ఉంది.
ఎక్కడ ఉండే వాడు ? ఎంత సౌకర్యంగా ?
అసలు ‘రేపు’ అనే పదానికి భయపడకుండా ?
**
ఎందుకు? అసలు ఎందుకు తన కి పరిస్థితి వచ్చింది. ఆశ .. అశేనా ?
అవును ఆశే, ఆశ కూడా కాదు అత్యాశ ,
జూదం మిగులు డబ్బుతో అడితే పర్లేదు కానీ ఎక్కడ ఆపాలో తెలీలేదు ??
నిలువుగా మునిగిపోయాడు. ఉన్న డబ్బు అంతా కుమ్మరించేశాడు. ఎంత డబ్బు? లక్షలు, కాదు కాదు రెండున్నర కోటి ?
ఆరేళ్లుగా బార్యా పిల్లలని పట్టించు కోకుండా?
పగలు రాత్రి తేడా లేకుండా, సరయిన తిండి తినకుండా, విశ్రాంతి లేకుండా సంపాదించిన డబ్బు? ఒక్క సారి గా రాష్ట్రం కా ని రాష్ట్రం లో మహాబలిపురం లో ఆరు ఎకరాలు ఎగబడి కొనేశాడు. రెండేళ్లలో రెండు రేట్లు పెరుగుతాయని ఆశ పడ్డాడు. తన జీవితం మారి పోతుందని కలలు కన్నాడు.
**
ఇప్పుడు ఏమయింది.? లాండ్ మీద సివిల్ వాజ్యం నడుస్తుంది. కోర్టు నోటీసు వచ్చింది. స్టేటస్ కొ ఇచ్చారు.
అమ్మటానికి లేదు. కొనేవాడు లేడు.
**
ఎంత డబ్బు ?? ఎంత డబ్బు? మూడు నాలుగు రూపాయల వడ్డీకి కూడా తెసుకెళ్లి ఇన్వెస్ట్ చేశాడు. ఎండా వాన తో సంభందం లేకుండా వడ్డీలు పెరుగుతున్నాయి. మొత్తం వ్యవస్థ అంతా స్తంభించింది.
ఉన్నవన్నీ అమ్మి కట్టు బట్టల్తో మిగిళ్తే చాలు అనే పరిస్తితి.
తాను ఒట్టి కుండ. గాలిలో దీపం.
**
ఇప్పుడు తనను కాపాడేది. తలగడ కింద ఉన్న తాయెత్తే ..
ఆందులో ఉన్న ‘పొటాషియం సైనేడ్’ ఒక్కటే
నాలుక మీద రుచి తెలిసే లోపు ప్రాణం పోతుంది
అంతా ప్రశాంతం ఏ సమస్యలు ఉండవు.
హాయిగా ఉంటుంది .. హా యి గా ..
**
అతను తలతిప్పి మంచం పక్కనే చాప మీద బొంత వేసుకుని పడుకున్న బార్య రాజ్యాన్ని , పాలు తాగుతూ నిద్రపోతున్న తమ గారాల పట్టి ని గాజు కళ్ళతో చూశాడు.
ఖరీదయినా జీవనం గడిపేటప్పుడు ఎలా ఉందో,
రెండు గదుల ఈ ఇంట్లో కి మారాక కూడా అలానే ఉంది రాజ్యం .
అదే అమాయకత్వం అదే చిరునవ్వు.
తనంటే అదే ప్రేమ అదే నమ్మకం.
**
అతడు చెదిరిన రాజ్యం పమిటని తల్లిని హత్తుకు పడుకున్న ‘నైమీ' ని చూస్తుండి పోయాడు. తన కుమార్తె చిన్ని కాలికి ఉన్న వెండి పట్టాల వద్ద అతని చూపులు ఆగి పోయాయి.
బహుశా రాజ్యానికి ఆమాత్రం ‘నగ’ కూడా మిగల్చలేదు.
వెచ్చటి కన్నీళ్లు అతని చెంపల నుండి జారీ తలగడ మీదకి జారాయి.
అతను తలగడ కింద తడిమి తాను తెచ్చుకున్న డబ్బా అందుకుని లేచి కూర్చున్నాడు.
..
హటాత్తుగా అతనికి ఒక ఆలోచన వచ్చింది . రేపు ఎలా ఉంటుంది ?
రాజ్యం లేసే సరికి తను మంచం మీద నిస్తేజంగా పడి ఉంటాడు.
రాజ్యం ఏం చేస్తుంది? గుండెలు పగిలేలా ఏడుస్తుందా? నైమీ ?? మా నైమీ ??
రాజ్యం ఏడవటం అనే ఆలోచన అతని గాయాన్ని మరింత నలిపింది.
'ఇంటి యజమాని' తన శవాన్ని ఇంట్లో ఉండనిస్తాడా? ..
శవం తో పాటు రాజ్యాన్ని .. నైమి ని బయటకి గెంటి ?? అతనికి ధూఖం ఆగలేదు
చేతుల్లో ముఖం దాచుకుని వెక్కి వెక్కి ఏడవ సాగాడు.
***
ఎప్పుడు లేచి వచ్చిందో రాజ్యం అతని పక్కన కూర్చుని ఉంది.
“ఏమయింది బావా ? “ అంది.
అతను ధూఖం ఆపుకోలేక పోయాడు . .
“రాజీ నీకు అన్యాయం చేశాను అంతా కాజేశాను . నేను వెళ్ళి పోతాను”
బార్యని కరుచుకుని ఏడ్చేశాడు.
**
ఆమె అతన్ని పొదివి పట్టుకుంది.
ఎద లోపలి భారం తగ్గేదాకా ఏడవనిచ్చింది.
..
“బావా .. నువ్వు .. ఇది చాలు నాకు. ..
మనం మళ్ళీ జీవితం మొదలెడదాం. ఎక్కడి కయినా వెళ్ళి పోదాం.
ఇక్కడ అన్నీ అప్పగించేసెద్దాం.
‘పోలిక’ ఎవర్ని అయినా చంపేస్తుంది.
మనలాటి వారిని ఇంకా త్వరగా చంపేస్తుంది.
మనకి వయసు ఉంది. ఆరోగ్యం ఉంది. దేవుడిచ్చిన కాళ్ళు చేతులు ఉన్నాయి.
ఎంతో కొంత చదువుంది. మనం మళ్ళీ మొదలెడదాం.
ఏ డబ్బయితే ఆరేళ్ళ నుండి నిన్ను మానుండి పరిగెత్తిచ్చిందో అదే డబ్బు మనని ఒకటిగా కలిపింది. బావా .. నన్ను .. మన నైమి ని వదిలి , ఎలా ? “ రాజ్యం అతన్ని చుట్టుకు పోయింది.
**
చాప మీద నైమి కదిలింది. తండ్రి లేచి పిల్లని ఎత్తుకున్నాడు.
ఆ గదికి ఉన్న చిన్న కిటికీ వద్దకి వెళ్ళి చేతి లో ఇమిడి ఉన్న డబ్బాని బయట కాలవలో పడెట్టు విసిరేశాడు.
..
దూరంగా కొత్త సూర్యుడు చీకటిని ఉచ కోత కోస్తున్నాడు.


నేరము- శిక్షా



తెల్లారగట్ల చీకటి ఇంకా పూర్తిగా తొలగిపోకుండానే, నగరానికి బయట ప్రాంతం లో పాదచారుల సందడి మొదలయ్యింది.
ఆమె, ఒక హైస్కూల్ టీచరయిన బర్తని ఇష్టం లేకున్నా బలవంతాన ఉదయం నడక కోసం తీసుకొస్తుంది. మెడికల్ రిపోర్ట్స్ ప్రకారం అప్పటికే వెంకట్రావ్ వంట్లో షుగర్ లెవల్స్ ప్రమాదకర స్థాయిలో ఉన్నాయి.
ఒక వారం రోజులు గా వాళ్ళు ఇద్దరు రోజూ కొంత వ్యాయామం చేస్తూ ఉన్నారు.
సరిగ్గా ఆ రోజు పొగ మంచు ఇంకా తొలగి పోనీ ఆ రోజు, ఒక బైక్ వచ్చి వారి ముందు ఆగింది. ఇంజను ఆపని బైక్ మీద ఉన్న మనిషి కిందకి దిగి ముందు కవర్లో ఉంచుకున్న పొడవాటి కత్తి తీసి వెంకట్రావుని పొట్టలో పొడిచాడు. ఇరుక్కు పోయిన కత్తిని బయటకి లాగే ప్రయత్నం చేయకుండా ఆగంతకుడు ఎక్కిన బండి వేగంగా వెళ్ళి పోయింది..
క్షణాల్లో జరిగిపోయిందది. ఆమెకి ఏదో యాక్షన్ సినిమా చూస్తున్నట్టు ఉంది. కత్తి పోటులో ప్రోఫ్ఫెషనలిజం లేదు కానీ, కత్తి మాత్రం పదునుగా ఉన్నట్టు ఉంది.
వెంకట్రావు మట్టి రోడ్డు మీద కూలబడి పోయాడు. చిరిగిన సంచి లోనుండి పాములు కదులు తున్నట్టు అతని కడుపులో ప్రేగులు బయటకి జారుతున్నాయి. రక్తం ధారగా కారుతుంది.
నిమిషాల్లో అక్కడికి వాకర్స్ పొగయ్యారు. ఎవరో 108 కి ఫోన్ చేశారు. వాకింగ్ కి వచ్చిన డాక్టర్ చంద్రశేఖర్ ఆ అంబులెన్సే లో ఎక్కారు. వెంకట్రావు ని చంద్ర శేఖర్ గారి హాస్పిటల్ కి తరలించింది ఆ వాహనం. హాస్పిటల్ చేరే లోపు స్టాఫ్ కి ఫోన్ చెయ్యటం, నేరుగా దియేటర్ లో వెంకట్రావుని తరలించడం అన్నీ నిమిషాల్లోనే..
ప్రమాదం కి వైద్యం లబ్యత కి మద్య కాలమే చాలా సార్లు కీలకంగా ఉంటుంది.
అతన్ని మూడు రోజుల తర్వాత ICU నుండి సాధారణ వార్డ్ కి వచ్చాక చాలా మంది బందు మిత్రులు పరామర్శ కి వచ్చారు. అతను పని చేసే స్కూల్ సహచర ఉపాద్యాయులు, స్నేహితులు బందువులు ఇలా ..
నాలుగో రోజు ఒక పదమూడు లేదా పద్నాలుగు వయసు ఉండే ఒక అమ్మాయి ఉదయాన్నే వచ్చి నేరుగా రౌండ్స్ లో ఉన్న డాక్టర్ గారిని కలిసింది. ” వెంకట్రావు మాస్టారికి ఏమి ప్రమాదం లేనట్టేగా? “ ఆదుర్దా గా అడిగింది
ఆయన నవ్వి “ఆయన స్టూడెంటు వా ??” అన్నాడు.
“అవునండి. ఫోర్త్ ఫామ్ చదువుతున్నాను.”
“మీ మాస్టారంటే అంత ఇష్టమా ?”
ఆమె సమాదానం చెప్పలేదు. “ప్రాణ భయం ఏది లేదుగా “ అంది మరో సారి.
ఆయన ఆ పాప తలమీద చెయ్యి వేసి “ఔట్ ఆఫ్ డేంజర్ అన్నాడు”
“థాంక్స్ డాక్టర్.. మానాన్న ఇంటికి రావాలంటే ఈ యదవ బతికే ఉండాలని లాయర్ గారు చెప్పారు .”
“మాకు మా నాన్న కావాలి “ ఆ అమ్మాయి కళ్ళు చూడటానికి డాక్టర్ చంద్ర శేఖర్ కి దైర్యం చాల్లేదు.
(వసంతం లోకి అడుగేడుతున్న చెట్టుని వంట చెఱకుగా చూడకు – శ్రీ గుంటూరు శేషేంద్ర శర్మ)

Sunday, 3 July 2016

హెల్మెట్

ఉదయాన్నే టిఫిన్ చేస్తూ రెగ్యులర్ గా తీసుకెల్లే బాడుగ కారు డ్రైవర్ కి ఫోన్ చేశాడు కళాసాగర్.
అతను అందుబాటులో లేనట్టు సమాచారం. 
నరసరావు పేట నుండి ఒంగోలు వెళ్లవలసిన పని. 
నెలలో రెండు సార్లు అలా వ్యాపారం పని మీద వెళ్తుంటాడు. 
ఒక ప్రభుత్వ సంస్తకి కావలసిన సానిటరి పైపులు సప్లి చేస్తుంటాడు అతను. 
వాటి తాలూకు బిల్లుల కోసం ఆదివారాలు ఇంజనీర్ల ని పట్టుకుని రికార్డ్ చేయించుకోవటానికి 90 కిలోమీటర్ల దూరం లోని ఒంగోలు కి ఒక టోల్ గెట్ దాటుకుని మరి వెళ్తుంటాడు.
**
ప్రతిసారి బాడుగ కారు ఎందుకు? బస్సుకి వెళ్లొచ్చుగా అంతగా అవసరం ఉంటే అక్కడ రోజు వారి ఆటో మాట్లాడుకుంటే చాలు గదా ? బార్య కౌటిల్యుడి సలహా ఇచ్చింది.
..
ఎలా అయితేనేం కళాసాగర్ బస్సెక్కాడు. లగ్జరీ బస్సులో గట్టి కునుకు వేసేసరికి ఒంగోలు వచ్చేశాడు. ఆటొ ఒకటి సాయంత్రం దాకా తనతో ఉండెట్టు మాట్లాడుకున్నాడు. అతను 800 అని ఇతను 400 అని. బేరం కుదర్లేదు...
..
అంతలో కళాసాగర్ కి మహత్తరమయిన ఆలోచన వచ్చింది. ..
స్థానికంగా ఉన్న మిత్రుడికి ఫోన్ కొట్టాడు. “ఈ రోజు టౌన్ లో తిరగటానికి బండి కావాలి సాయంత్రం వెళ్తూ ఇచ్చి వెళ్తాను”
..
“నేను ఆల్రెడీ బయటకి వచ్చి ఉన్నాను. ఇంట్లో మా అమ్మాయి గెర్లెస్ బండి ఉంది ఫోన్ చేసి చెబుతాను వెళ్ళి తీసుకెళ్లు”..
..
ఆటో లో ఫ్రెండ్ ఇంటికే వెళ్ళి బండి తీసుకుని టౌన్ లోకి వెళ్ళాడు. తన పనులు అన్నీ చూసుకుని లంచ్ కి బయలు దెరుతుంటే చర్చ్ వద్ద ట్రాఫిక్ యంత్రాంగం బండి ఆపారు.
“హెల్మెట్ ఏది?” కళాసాగర్ సమాదానం చెప్పేలోపు చలానా రాసి చేతిలో ఉంచారు.
బోజనమ్ చేసి మళ్ళీ మిగిలిపోయిన పని చూసుకుని బండి ఇవ్వటానికి వెళ్తుంటే సాయిబాబా గుడి వద్ద మరో మారు ట్రాఫిక్ ఎస్సై బండి ఆపేశాడు. ..
మళ్ళీ హెల్మెట్ చలానా రాస్తుంటే “ఇప్పుడే ఒక చలానా పే చేశాను” కళాసాగర్ జేబులో రశీదు తీసి చూపించాడు.
“ఆలానా అయితే మొబైల్ డ్రైవింగ్ కింద మార్చేద్దామ్”  చలానా పూర్తి చేసి చేతిలో పెట్టాడా అదికారి. 
..
బ్రతుకు జీవుడా అనుకుంటూ వీది మలుపులో పెట్రోల్ బంకు వద్ద ఆగి వంద కాగితం అతనికి ఇచ్చి బండి సీటు ఆన్లాక్ చేసి సీటు పైకి లేపేసరికి స్టోరేజ్ ప్లేస్ లో ప్లాస్టిక్ కవర్లో జాగర్త గా చుట్టి పెట్టిన హెల్మెట్ కనబడింది.


Saturday, 2 July 2016

సైగ

మూడంటే  మూడు నెలల్లో రిటైర్ అవబోయే ‘జోజప్ప’ మార్కాపురం నుండి పుల్లలచెరువు బస్సు దిగి ఆటో పట్టుకుని తాను పని చేసే తాసీల్దార్ కార్యాలయానికి వెళ్ళేసరికి 10.30 దాటింది.
వీకెండ్ అవటం తో, పనుల నిమిత్తం వచ్చే ప్రజలు పలచగానే ఉన్నారు.
‘ఏం యలమందా అయ్యగారు వచ్చారా?” ఆఫీసు అటెండర్ ని పలకరించాడు.
“ఇప్పుడే వచ్చారయ్యా” జోజప్పని ని విష్ చేస్తూ సమాదానం చెప్పాడతను.
రూము లోకి వెళ్ళి కూడా తెచ్చుకున్న బాగ్ లోనుండి ఒక స్వీట్ పాకెట్ తీసి
“స్వీట్ తీసుకోండి సార్ . మా ఇద్దరికీ  వీసా మంజూరయింది” సంతోషం గా  చెప్పాడు జోజప్ప.
పొద్దుటే మంచి వార్త చెప్పారు అంటూ బజర్ నొక్కి “యలమందా మనాళ్లని అందర్నీ పిలువు. జోజప్ప గారు స్వీట్స్ తెచ్చారని చెప్పు”
పది నిమిషాల్లో అందరూ ప్రోగయ్యారు.  తలో ప్రశంస. అభినందనలు తో ఆయన్ని ముంచేశారు .
“మొత్తానికి మీ కోడలు కానుపు సమయానికి ‘కెనడా’ వెళ్తారు. పోనీలెండి అంతా అనుకున్నట్లే జరుగుతుంది.” ఆర్ ఐ గోవిందు అభినందించాడు.
“ సార్ కేమిటి సార్. చక్కగా ఫారిన్ వెళ్ళి కొడుకు బిడ్డతో ఆడుకుని  రిటైర్మెంట్ కి వారం ముందు  వచ్చి జాయిన్ అయ్యారంటే చాలు. ఇక రిటైర్మెంట్. ఇప్పటినుండే అన్నీ పి ఎఫ్ కాగితాలు మూవ్  చేసుకున్నారు కాబట్టి వెంటనే ఆ 20 లక్షలు చేతికి వచ్చేస్తాయి. పిల్ల పెళ్లి చేసేసి హాయిగా కృష్ణా రామా అనుకుంటూ పెన్షన్ డబ్బుల్తో శేషజీవితం గడిపేస్తారు” ASO లలిత గారు ఆయన వర్తమానం మరియు బవిషత్తు క్లుప్తంగా చెప్పేసింది.
“అంతా భగవంతుని దయ. రిటైమెంట్ బెనిఫిట్స్ రాగానే మా ఆవిడకి హార్ట్ సర్జరీ చేయించాలి ఆ తర్వాతే అమ్మాయి వివాహం ”
 జోజప్ప నవ్వుతూ అభినందించిన  అందరికీ థాంక్స్ చెప్పాడు.
“డాల్డా స్వీటు తో సరిపెడితే కుదరదు మద్యాన్నం మంచి బోజనమ్ ఏర్పాటు చేయాలి మరి” తాసిల్దారు నవ్వుతూ అన్నాడు.
“తప్పకుండా సర్.”
“ఆ వెంకట్రామయ్య అదేనయ్యా ఆ అసైన్మెంట్ లాండ్ కేసు కోర్టు నుండి క్లియర్  చేయించున్నాడే అతన్నిపాస్ బుక్ కోసం ఇవాళ  రమ్మన్నాను. పావలా బేడా  ఇస్తాడు ఇవాల్టి ఖర్చులకి వాడుకో” తాసిల్దారు బారోసా ఇచ్చాడు.
సీట్లో కూర్చున్నాడే గాని ఇంటి నుండి మిత్రుల నుండి ఒకటే ఫోన్లు. కెనడా ఎప్పుడు వెళ్తున్నారు? అని . జీవితం లో మొదటి సారి విమాన ప్రయాణం అదీ ఇప్పుడప్పుడే స్టిరపడుతున్న కొడుకు దగ్గరకి. అసలు కోడలు ఆరోనేలలో ఉండగానే వెళ్లాలనుకున్నారు. అంతలో ఇంటావిడకి అనారోగ్యం. ఫ్యామిలి హెల్త్ కార్డు తో మనకి అవసరం అయిన వైద్యం తప్ప మిగిలినవన్నీ చేస్తామంటారు. మందుల్తో లాక్కొస్తుంది ఆవిడ. ఎలాగయినా ఆర్నెళ్లలో ఆమెకి సర్జరీ చేయించాలి.
వి ఆర్ ఏ ఒకర్ని ఊరు అవతల ఉన్న డాబా హోటల్ కి పార్సిల్ బోజనాలు, నాన్ వెజ్ వంటకాల కోసం పురమాయించాడు. జోజప్ప .
సీట్లో కూర్చుని పెండింగ్ వర్కులు పూర్తి చేస్తుంటే, టైమ్ తెలియలేదు.
రెండున్నరప్పుడు యలమంద వచ్చి “అయ్యా బోజనానికి అయ్యగారు లేచారు. మీరు రండి అందర్నీ పిలుస్తున్నారు.“ అన్నాడు. రూములో మిగిలిన అందరూ అప్పటికే బోజనాలు ఏర్పాటు చేసిన రూములో చేరారు.
చేత్తో లో ఫైల్ పూర్తి చేసి టేబుల్ మీద కాగితాలు సర్దుతుంటే ‘వెంకట్రామయ్య’ లోనికి వచ్చాడు.
చొక్కా జేబులోంచి మడత బెట్టిన వంద కాగితాలు జోజయ్య కి అందించాడు. “ఎంత ?”
“మూడు వేలు “
టేబుల్ సొరుగు లాగి అందులో ఆ డబ్బు వేసి తాళం వేస్తుంటే.. అప్పటికే

వాకిలి వద్ద కి చేరిన వంకట్రామయ్య జేబులోంచి ఒక ఎర్ర రంగు కర్చీఫ్ తీసి ఎవరికో సైగ చేస్తూ నిలువుగా ఊపాడు.

Friday, 1 July 2016

టైప్ వీరులం

ఒక అప్లికేషన్ స్పీడ్ పోస్ట్ చేయటానికి ఒంటిగంట లోపు పోస్ట్ ఆఫీస్ కి వెళ్ళాను.
కవర్ తూకం వేయించి స్టాంపులు అంటించి రెసిట్ తీసుకున్నాక వెనక్కి వస్తుంటే..
ఒక ‘పెన్షనర్’ అనుకుంటాను నన్ను ఆపాడు.
“ఈ పూట ఆర్థరైటిస్ ప్రాబ్లెమ్ ఎక్కువగా ఉంది. వేళ్ళు వంగటం కూడా కష్టంగా ఉంది.
ఈ కార్డ్ మీద అడ్రెస్ రాసి పెడతావూ ?? “ అన్నారు.
చెప్పిన చిరునామా ని అడ్రస్ బాక్స్ లో ఆంగ్లం లో రాశాను. పిన్ కోడ్ నెంబరు కూడా వేశాక
“అదే చేత్తో రెండు మాటలు తెలుగులో  వ్రాసి పెడతావూ “ అన్నాడాయన.
“చెప్పండి.”
అతను కొడుకు దగ్గర బెంగుళూరు లో ఉంటున్న బార్యకి. తన ఆరోగ్యం సరిగా లేనందున  వీలయినంత త్వరగా రమ్మని రెండు వాక్యాలు చెప్పాడు. అంతే.
“ఇంకేమయినా రాయమంటారా?”
కింద PS అని వ్రాసి “చేతి వ్రాత సరిగా లేనందుకు ఏమి అనుకోకు” అని మరొక్క మాట రాయండి సరిపోతుంది..

*******************

(ఒక్క సారి పేపర్ మీద  ఏదో ఒకటి, పది వాక్యాలు  తెలుగు లో మీరూ  రాసి చూడండి.. ధ్యావుడా .. ఇది తెలుగేనా అనిపించక పోతే ఒట్టు. మనందరం ఇప్పుడు టైపు వీరులమే J మినహాయింపులు అరుదుగా ఉంటాయి )

థాంక్స్ చెప్పట్లేదు

అతని పేరు సుధాకర్ అనుకుందాం. అతను NMR వాచ్మేన్ అని, అతని బార్య ఒక స్కూల్ ఆయా అని అనుకుందాం.
ముగ్గురు పిల్లల్ని చదివించాలని పట్టుదల, పిల్లలకి చదివే గుణం ఉందనుకుందాం. అద్దె ఇంట్లో ఉంటూ ఎదిగిన పిల్లల్ని నెలకి 15000 లోపు ఆదాయం తో చదివించడం అంటే ఎంత కష్టం.
ఆ కష్టం తోనే పెద్దమ్మాయి ని ece చదివించాడు. అమ్మాయి బాంక్ ఎగ్జామ్స్ రాస్తుంది. కేటగిరీ కూడా ఉంది ఈ సంవత్సరం ఖచ్చితంగా జాబ్ కొట్టేస్తుంది. రెండో వాడు PACE లో ఇంజనీరింగ్ చదువుతున్నాడు మూడో సంవత్సరం, మూడో వాడు ఇప్పుడు QIS కాలేజీ లో మెకానికల్ ఇంజనీరింగ్ సీటు వచ్చింది. ఫీ రీ ఎంబర్స్మెంట్ ఉంది. కానీ అడ్మిషన్ ఖర్చులు కొన్ని ఉన్నాయి. బస్ పాస్ లాటివి, యునివర్సిటి ఫీ, యూనిఫార్మ్ లాటివి. 
అబద్దం ఆడని అతని మనస్తత్వం అంటే నాకు ఇష్టం. నాకు వ్యక్తిగతంగా తెలుసు. మా హెడ్ ఆఫీసు. ఒంగోలు లో పని చేస్తాడు. పని చేసి సాయం అడిగే మనిషి. నా గురించి తనకి, తన గురించి నాకు ఎప్పటినుండో తెలుసు. నన్నెప్పుడు పెద్ద సాయం అడగలేదు. రెండు నెలల క్రితం అడిగాడు. రెండు రోజులు టైమ్ కావాలని చెప్పాను.
మిత్రుడు Raj Kanneganti కి నేను ఇన్బాక్స్ లో కొంత డబ్బుకావాలని అడిగాను. ఎందుకు ? ఏమిటి? అని వివరాలు చెప్పలేదు. నెల రోజుల తర్వాత అవసరం అని చెప్పాను. అతను ఏమి సమాదానం ఇవ్వలేదు. మూడో రోజు నా అకౌంట్ లోకి డబ్బు జమ అయి ఉన్నాయి. 

ఇవాళ QIS లో మెకానికల్ ఇంజనీరింగ్ జాయిన్ అవుతున్న ‘సుందర్ కుమార్’ కి అభినందనలు. ఇలాటి పరంపర మా పిల్లలచేత కొనసాగిస్తాను అని సుధాకర్ చెప్పడం నాకు సంతృప్తి ని ఇచ్చింది. రాజ్ కుమార్ జీ మీకు 'థాంక్స్' చెప్పట్లేదు  
శుబోదయం. _/\_

www.susri.home.blog

  అందరికీ నమస్తే 66o పోస్టులు పైగా వ్రాసిన ఈ బ్లాగ్ లోని నా పోస్ట్ లలో  చాలా అచ్చుతప్పులు ఉండటం గమనించాను.  వాటన్నిటినీ ఎడిట్ చేస్తూ, modify...