Thursday, 19 April 2018

If you love them...

చాలా చిన్నప్పుడు వేసవి శేలవులకి మా నానమ్మ (తాళ్ళూరు) వాళ్ళ ఉరు వెళ్లి నపుడు మా పెద్దమ్మ ఒకావిడ ఉండేవారు. మా పెదనాన్న నాగయ్య గారి భార్య. మేము వస్తున్నాం అని ఎలా తెలుసుకునేదో కాని వెళ్ళినప్పుడల్లా పెద్ద గిన్నె మీద బోర్లించిన జల్లి బుట్ట తీసి దానికింద నుండి పాల అరిసెలు తీసి ఇచ్చేది. అద్బుతం గా ఉండేవి. పిల్లలం అందరికి తలా రెండు ఇచ్చేది కాని నన్ను ప్రత్యేకం గా చూసేది అనిపించేది. “పెద్దమ్మా పాల బూరెలు బాగున్నాయి. బస్సు ఎక్కినప్పటి నుండి పాలబూరెలు గుర్తు కోస్తున్నాయి” అనే వాడిని లొట్ట లేస్తూ ...
**
చిన్నప్పుడు మా అమ్మ పాలు పోసి పొట్లకాయ కూర వండేది. రుచిగా ఉండేది. అమ్మా బలే ఉంది అంటూ “కుమ్ముకునే” వాడిని.
ఇంకొంచెం వేసుకో అని గిన్నె లో కూర వేసేది. నాన్న ‘నీకు ఉంచుకో’ అంటే వేరే గిన్నెలో ఉంది అనేది. ఆ వేరే గిన్నె ఎప్పటికి ఉండదని తండ్రి ని అయ్యాక కాని తెలియలేదు.
**
నా కంటే వయసులో మూడు ఏండ్లు పెద్దదయిన ఒక టీచర్ ని కలిసి మా నాన్న గారి స్కూల్ తాళాలు ఇవ్వటానికి వెళ్ళినప్పుడు మంచం లో ఉన్న ఆమె తల్లి శ్వాస తీసుకోటానికి ఇబ్బంది పడుతూ ఉంది. ఇద్దరం కలిసి నులక మంచం మీద ఆవిడని మోసుకుంటూ అర కిలోమీటరు దూరం లో ఉన్న ఆసుపత్రికి తీసుకెళ్ళాం. ఆ సంఘటన ప్రభావం ఆమె మీద చాలా ఉండేది.
**
పెళ్ళయిన తోలి రోజుల్లో మా ఆవిడకి మూడు గ్రాముల బంగారం తో చెవులకి వేలాడే ముత్యాల ఆభరణాలు కొని ఇచ్చాను “ఇవి నీకు నప్పుతాయి. తల ఉపేటప్పుడు ఇవి కుడా కదులుతుంటాయి. నాకు చూస్తూ ఉండాలనిపిస్తుంది” అని చెప్పాను. ఇప్పటికి ఆభరణాలు అనేకం మార్చినా వాటి జోలికి పోదు. అపురూపం గా అలంకరించుకుంటుంది.
**
నా ఫ్రెండ్ (బ్యాంకు ఉద్యోగి) ఇంటికి వెళ్ళినప్పుడు అయన కుమార్డు (GMC లో MBBS ఫైనల్ ఇయర్ లో ఉన్నాడు) ఇంట్లోకి వెళ్లి గ్లాసు తో కుండ నీళ్ళు తెచ్చి ఇచ్చి “బాగున్నారా అంకుల్” అంటాడు.
**
నా టీం మెంబర్ నా శిష్యుడు.. పల్లెలు తిరిగి మద్యానం ఆఫీస్ కి వచ్చేముందు “లంచ్ తెచ్చుకున్నారా? పార్సిల్ తేనా?” అని అడుగుతాడు. పోయిన నెలలో సర్జరీ చేయించుకున్న అమ్మ కి ఎలా ఉంది అని అడిగితె.. గుండె లోపలి నుండి నవ్వుతాడు.
**
రిలేషన్స్ ని కాపాడుకోటాని పెద్దగా ఖర్చేమి కాదు. ముసుగులు తొలగించి మనసుతో మాట్లాడు కుంటే చాలు, ఒక నవ్వు చాలు.. ఒక పువ్వు చాలు.
**
ఒక ఇరవై ఏళ్ల క్రితం అనుకుంటాను. దూరదర్శన్ లో ఒక ప్రకటన వచ్చేది. ఒక ఆరేడు వయసున్న పిల్లాడు ఒక ఇంటి కాలింగ్ బెల్ ఎగిరి మరీ మోగిస్తాడు. ఒక ముసలావిడ తలుపు తీస్తుంది. ఆ పిల్లాడిని కోపంగా చూస్తుంది. వాడు వెనక్కి దాచిన చేతుల్లో ఒక పూల గుత్తి ఉంటుంది. “హాపీ బర్త్ డే దాదీ మా ” అంటాడు ఆ పెద్దావిడ బుగ్గలు చొట్టలు పడేలా నవ్వి చేతులు చాస్తుంది. If you love them. Express it. అని ఒక ఇంగ్లిష్ కాప్షన్ మెరిసేది.
**
కొన్ని భావాలని మనసులో బంధిస్తే కుదరదు. మాటల్లోకి మార్చాల్సిందే.
మనసు  ని
సజీవంగా ఉంచుకోవాల్సిందే. <౩ <౩ <౩

No comments:

www.susri.home.blog

  అందరికీ నమస్తే 66o పోస్టులు పైగా వ్రాసిన ఈ బ్లాగ్ లోని నా పోస్ట్ లలో  చాలా అచ్చుతప్పులు ఉండటం గమనించాను.  వాటన్నిటినీ ఎడిట్ చేస్తూ, modify...