ఈ ఉదయమే గుర్తుచేసింది. రేపు ఒకటో తేదీ అని.
నేను నవ్వాను.
“అయితే?” అన్నాను తనేమంటుందో నని.
“ఈ నెల తప్పదు. నల్ల పూసల దండ ఆర్డర్ ఇవ్వాల్సిందే.” అంది.
అసలు తప్పంతా నాదే. ఏదో బలహీన క్షణం లో పల్లెటూర్లో ఒకావిడ మెడలో చూసిన పాత కాలం నాటి దండ మోడల్ బాగుందని నీకయితే ఇంకా బాగుంటదని నోరు జారాను. పైగా ఒక కాగితం మీద గీసి చూపించాను.
మొన్నా మద్య బంగారం కొట్లో వాళ్ళకి చెప్పి ‘లచ్చాలు’ డిజైన్ అని తేల్చి పారేసింది.
ఖచ్చితంగా తన పుట్టినరోజు కి చేయించాలని షరతు కూడా ఉంచింది.
"చూద్దాం" .. అంటూ ఆఫీస్ కి బయలు దేరాను.
నెలాఖరు మీటింగులు చూసుకుని లేటుగా వచ్చాను.
ఫ్రెష్ అవగానే “వెంకట్రామయ్య ఫోన్ చేశాడు” అంది ఏ ఉపోద్గాతము లేకుండా.
చక్కటి, చిక్కటి టీ త్రాగుతూ.. “ఫోన్ చేసివ్వు.. నేను మాట్లాతాను” అని చెప్పాను.
వెంకటరామయ్య మా స్నేహితుడు. దేవారం అనే పల్లెటూర్లో ఉండి సిన్సియర్ గా సేద్యం చేసుకునే రైతు. మనం గొప్ప అనుకునే చదువు మాత్రమే లేని గొప్ప సంస్కారి.
“ఏం . వెంకట్రామయ్యా ఫోన్ చేసావంట.. “
“అన్నాయ్.. పొలం పనులు మొదలయ్యాయి.” చెప్పాడతను . రెండు నిమిషాలు మాట్లాడి
“నేను రెండు రోజుల్లో ఫోన్ చేస్తాను” అని చెప్పి ఫోన్ మా ఆవిడకి ఇచ్చాను.
మా కుటుంబానికి ఉన్న ఆత్మ బందువులలో అతనొకడు.
“ముందు వెంకట్రామయ్య అవసరం చూడండి. గోల్డ్ షాప్ కి మరో నెలలో వెళ్లొచ్చు” పది నిమిషాల తర్వాత నాతో అంది మా ఆవిడ.
4 comments:
బావుంది.
off the record మీరు కామెంట్స్ డిసేబుల్ చేస్తే మంచిదేమో.. మంచి పోస్ట్ కింద చేసే కామెంట్స్ బావోలేదు..
మమత గారూ, మమత గారూ అదేం సలహా 😳? ఇన్నాళ్ళకి సుశ్రీ గారు కామెంట్ల విభాగం అందరికీ అందుబాటులోకి తెచ్చారని అందరూ సంతోషించి నాలుగైదు రోజులే అయింది. బాగాలేనివనుకున్న కామెంట్స్ ని తొలగించే అధికారం బ్లాగ్ యజమానికెప్పుడూ ఉంటుంది కదా.
కమెంట్లని మోడరేట్ చేస్తే మంచిదేమో. 'వారి సమస్యా టపా కే మాత్రం సంబంధం లేని వ్యాఖ్యల ప్రచురణ వల్లే మమత గారామాటన్నారనుకుంటాను.
మమతా జీ నేను గమనించాను. తప్పనిసరి అయినప్పుడు వైద్యుల మాట 'అంటేషన్' ఉంది.
Post a Comment