Saturday 28 October 2017

వారి సమస్య

మౌనం, చిరునవ్వు విలువైనవి.
చిరునవ్వు సమస్యలని పరిష్కరిస్తే , మౌనం సమస్యలను దూరం గా ఉంచుతుంది.
విజయాన్ని చూసిన వ్యక్తుల పెదవుల మీద వీటి చిరునామా.
చక్కెర, ఉప్పు ని కలిపి ఉంచినా చీమలు తీపినే తీసుకువెళ్తాయి.
సరైన వ్యక్తులని జీవితం లోకి ఆహ్వానించండి. మీ జీవితాన్ని ఆనందమయం చేసుకోండీ. 
పుట్టుక ద్వారా వచ్చినవి మాత్రమే మన చేతిలో లేవు. మిగిలిన మొత్తం మన చేతిలో నే ఉంది.
మన కలలని సాకారం చేసుకోలేనప్పుడు మన మార్గాలు మార్చుకుందాం. ‘గమ్యం’ ని కాదు.
ప్రకృతి లో జరిగేది ఇదే. చెట్లు ఆకులని మార్చుకుంటాయి ‘వేర్ల’ ని కాదు.
మోరిగే ప్రతి కుక్క మీద రాళ్ళు వేసుకుంటూ వెళితే.. చివరికి మనకు అది మాత్రమే చాతనవుతుంది.
విమర్శకులు ఎప్పుడూ ఉంటారు. మనం నీళ్ళ మీద నడిచేటప్పుడు వాళ్ళు మనకి ఈత రాదని గేలి చేస్తారు.
ఎవరయినా అసూయ చెందారు అంటే మనం విజయం వైపు ప్రయాణిస్తున్నట్టు
‘పంది’ తో పోట్లాట మనన్ని బురదలోకి లాగుతుంది. పైగా దానికి అది ఆనందాన్ని ఇస్తుంది.
సన్మార్గం లో జీవించడం, సమాజం గురించి భాద్యత తీసుకోవటం, నచ్చిన పనిని స్వయం గా చేయటం, జీవితాలని పరిపూర్ణం చేస్తాయి.
ఈ రోజు మంచి రోజు... మనకి మిగిలిన ప్రతి రోజు మంచి రోజే. పిల్ల వాడు మధురమయిన మామిడికాయను ఆస్వాదించినట్లు జీవితాన్ని అనుభవిద్దాం. మనం మరొకరికి నచ్చక పోవటం అనేది వారి సమస్య. మనది కాదు. వారి సమస్య కోసం మన సమయం వృధా చేసుకునేంత అవివేకం మనకి వద్దు.
నా ఆత్మీయ మిత్రులకి శుభోదయం. _/][\_

6 comments:

Anonymous said...

Good morning and thank you.

Zilebi said...


అద్భుతః

జిలేబి

Anonymous said...

జిలేబి. వాటమ్మా వాటిస్ దిస్ అమ్మా. పద్యం పుచ్చుకు కొట్టలేదేంటమ్మా.

Mamatha said...

బావుంది

Anonymous said...

ఎవరయినా అసూయ చెందారు అంటే మనం విజయం వైపు ప్రయాణిస్తున్నట్టు
‘పంది’ తో పోట్లాట మనన్ని బురదలోకి లాగుతుంది. పైగా దానికి అది ఆనందాన్ని ఇస్తుంది

సుశ్రీ said...

anonymous గారికి అనవసరపు కామెంట్లు ఉంచకండి.

www.susri.home.blog

  అందరికీ నమస్తే 66o పోస్టులు పైగా వ్రాసిన ఈ బ్లాగ్ లోని నా పోస్ట్ లలో  చాలా అచ్చుతప్పులు ఉండటం గమనించాను.  వాటన్నిటినీ ఎడిట్ చేస్తూ, modify...