ఇంకో
రెండు నిమిషాల్లో బస్సు బస్టాండ్ కి
చేరుతుంది అనగా జరిగిందా సంఘటన.
గట్టిగా
పది పన్నెడు ఏళ్ల మద్య ఉంటుందా పిల్లాడి
వయసు. నిలబడ్డ పిల్లాడు నిలబ్డ్డట్టుగా కూలిపోయాడు. పక్కనే ముప్పై మించని మరో మనిషి, చేతిలో ఉన్న
గుడ్డల సంచి సర్దుకుని పిల్లాడిని పొదివి పట్టుకున్నాడు.
రాఘవ కూర్చున్న సీటుకి మూడు అడుగుల దూరం లో కూలబడ్డ కుర్రాడు స్కూల్ యూనిఫార్మ్ వేసుకుని
ఉన్నాడు. కుడి అరచేతి వెనుక ప్లాస్టర్ వేసిన సూది ఉంది.
అప్పటిదాకా
సెల్ లో చాటింగ్ చేస్తున్న రాఘవ చప్పున
లేచి పిల్లాడిని లేపటానికి సాయం చేశాడు. పిల్లాడు అపస్మారక స్థితి లోకి
జారుకున్నాడు. తోడుగా ఉన్నతను ఏమి అర్ధం కానీ పరిస్తితి లో ఉన్నాడు.
ఎవరో
ఒకావిడ హాండ్ బాగ్ నుండి నీళ్ళ సీసా తీసి అరచేతిలో కొంచెం వంపుకుని పిల్లాడి ముఖం
తుడిచింది.
“
రేయ్ బాబు” అంటూ కదిలించింది. ఊహూ ఏమి చలనం
లేదు.
“ఏమయింది? “ రాఘవ అడిగాడు.
“నా
మేనల్లుడు వీడు. వెలిగొండ రెసిడెన్షియల్ స్కూల్ లో ఆరో తరగతి. ఉదయం తేలు
కుట్టిందట. మార్కాపురం గవర్నమెంట్ ఆసుపత్రికి చేర్చి, మా బావ కి ఫోన్
చేశారు. నేను వెళ్ళాను. తీరా సాయంత్రం నాలుగప్పుడు మా వల్లకాదు ఒంగోలు (వంద
కిలోమీటర్ల జిల్లా కేంద్రం) తీసుకెళ్ళండి అని చెప్పారు. తీసుకొస్తున్నాను. RIMS
(Govt Hospital) కి తీసుకెళ్లమన్నారు. దుఖం తో గొంతు పూడుకు పోతూ
ఉంటే చెప్పాడు.
ఈ
లోగా బస్సు బస్ స్టాండ్ కి చేరింది. పిల్లాడిని నెట్టుకుంటూ పోలో మని జనం
దిగేశారు.
రాఘవ
అతని వద్ద ఉన్న చేతి సంచి ఒక చేత్తో, మరో చేత్తో పిల్లాడు జారవిడిచిన స్లిప్పర్లు
మరో చేత్తో పట్టుకుని బస్సు దిగాడు. “బస్ స్టాండ్ ఎదురుగా వెంకట రమణ హాస్పిటల్
ఉంది అక్కడికి తీసుకెళ్దాం అన్నాడు.”
మేనమామ
పిల్లాడిని బుజాన వేసుకుని మొహమాటం గా “రింస్ కి తీసుకు వెళ్తాను” అన్నాడు.
“అంత
టైమ్ లేదు. నా మాట విను. డబ్బు కి ఇబ్బంది లేదు నాకు తెలిసిన డాక్టర్ ఉన్నాడు”
అంటూ చక చక నడవ సాగాడు. తప్పని స్థితి లో పిల్లాడిని బుజాన వేసుకుని వెనకే నడవసాగాడు.
పొద్దుట
నుండి ఆహారం లేదు, వంట్లో తేలు నరాల్లో తిరుగుతూ ఉంది. హాస్పిటల్ కి చేరాక పావుగంట లో జెనరల్
వార్డ్ లోకి పిల్లాడిని మార్చడం. ఫ్లూయిడ్స్, ఆంటీ బయటిక్స్ ఇవ్వటం
జరిగిపోయాయి. గంటన్నరకి పరిస్తితి లో మార్పు వచ్చింది. పిల్లాడు పలకరిస్తే స్పందించే
దశ కి వచ్చాడు.
“బాబు
ఏం పేరు?” అడిగాడు రాఘవ.
“ప్ర
భా క ర్”
“ఆకలిగా
ఉందా ఏమయినా తింటావా?” మళ్ళీ అడిగాడు.
జూనియర్
డాక్టర్ ని అడిగి మైన్ రోడ్డు లోకి వచ్చి ఇడ్లీ పార్సిల్ చేయించుకుని, వాటర్ బాటిల్ కొంటుంటే..
తన ఆఫీస్ బాగ్ లో ఉన్న బాటిల్ గుర్తు వచ్చింది. అవును అందులో ఉంది. అసలు బాగ్ ఎక్కడ?
బస్సులో
నుండి బాగ్ తీసుకున్న జ్ణాపకం లేదు.
రాఘవ
ఆసుపత్రి లోకి వెళ్ళి ప్రభాకర్ ఇడ్లీ తినేంత వరకు ఉండి, పరిస్తితి మెరుగు పడ్డాక
తన ఫోన్ నెంబరు ఇచ్చి బయటకి వచ్చాడు.
రాత్రి
పదిన్నర అయింది. నేరుగా బస్టాండ్ కి వెళ్ళి ఎంక్వరి లో డ్యూటి లో ఉన్న స్టాఫ్ “ సర్
నేను ఏడుగంటలకి శ్రీశైలం నుండి వచ్చిన బస్సు లో వచ్చాను. హడావిడిలో నా బాగ్.. ఆఫీస్ బాగ్ ..”
రాఘవ
మాటలు పూర్తి కాక ముందే కౌంటర్ కింద నుండి బాగ్ తీసి పైన పెట్టడతాను. “ఇదేనా?”
“అవును”
“ఎవరో
లేడి టీచరు గారు ఇక్కడ ఇచ్చేసి వెళ్లారు. మీకు ఫోన్ చేస్తాను అని చెప్పారు” అన్నాడు.
“థాంక్స్
అంది. ఆమె కి కూడా”
రాఘవ
బాగు తీసి చూశాడు. తన ఆఫీసు డైరీ, లంచ్ బాక్సు, అన్నీ సరిగానే ఉన్నాయి. సైడు జీప్పులో
ఉండాల్సిన ‘కాష్’ తప్ప.
ఉదయాన్నే
ఆసుపతికి వెళ్ళి ప్రభాకర్ తో మాట్లాడుతుంటే .. రాఘవ ఫోన్ మోగింది.
“సార్
నేను నిన్న మీతో పాటు బస్సులో ఉన్నాను. మీరు బాగ్ వదిలేసి పిల్లాడితో పాటు పరిగెత్తటం
చూశాను. ఎంక్వైరీ లో బాగ్ ఇచ్చాను. తీసుకోండి . డైరీ లో మీ ఫోన్ నెంబరు చూశాను. మీ
బాగ్ లో ఉన్న పదిహేడు వేలు తీసి జాగర్త చేశాను.
మీరు ఎక్కడున్నారో చెబితే మా అబ్బాయి చేత ఇప్పుడే
పంపుతాను”
5 comments:
చాలా బావుందండి. వ్యాఖ్యలుపనిచేస్తున్నాయి. కొనసాగించండి.
ఆఫీసు బ్యాగు దొరికెన్
కాఫీ పైసలు జిలేబి గావన్నదిగో
సాఫీ గా చెప్పిరహో
మాఫీ సాబ్ ! సేఫు దస్కమౌ! భళి మెరుపూ !
జిలేబి
వ్యాఖ్యలు చేసే అవకాశం జనబాహుళ్యానికి అందుబాటులోనికి తెచ్చారే (గతంలోలాగా క్లోజ్డ్ గ్రూప్ కాకుండా), చాలా సంతోషం శ్రీనివాసరావు గారు. అనానిమస్సులని నిషేధించినట్లు లేదు కూడా. ఇక మీ కొసమెరుపుల అభిమానులు మీ టపాలను ఆస్వాదించడమే కాక తమ అభిప్రాయాలను చెప్పవచ్చు. Good.
Don't ever stop anonymous comments. One can freely express one's views. In anon mode. Jilebi virus poems can drive one mad. Jilebi buchiki poems should be the weapon to tackle north Korea madcap kim
చాలా బాగా రాశారు. అభినందనలు.
Post a Comment