'టెన్నిస్ ఎల్బో' నుండి చాలావరకు బయట పడ్డాను.
పరిస్తితి చాలా మెరుగ్గా ఉంది. ఆర్ధో డాక్టర్ OP (నెల రోజులు) గడువు ఇంకా ఉంది కదా అని హాస్పిటల్ కి వెళ్ళాను.
ఆయన సర్జరీ లో ఉన్నారు.
వెయిటింగ్ రూమ్ లో ఖాళీ చూసుకుని కూర్చున్నాను..
స్మార్ట్ ఫోను, jio సిమ్ ఎటూ ఉన్నాయిగా??
స్మార్ట్ ఫోను, jio సిమ్ ఎటూ ఉన్నాయిగా??
గంట పైగా కూర్చున్నాను.
కాంపౌండర్ వచ్చి “శ్రీనివాసరావ్.. ఒంగోలు” అని రెండు మూడు సార్లు పిలిచిందాకా గమనించనే లేదు.
హడావిడిగా లెచానా?.. కాలు తిమ్మిరెక్కింది.
అలానే లాక్కుంటూ డాక్టర్ గారి రూము లోకి వెళ్ళాను.
డాక్టర్ గారితో పాత పరిచయం బానే ఉంది. కుశల ప్రశ్నలు, ‘చేతి నొప్పి’ విషయాలు మాట్లాడుకున్నాక ఎక్కువ టైమ్ తీసుకోకుండా ఆయన చెప్పిన జాగర్తలు గుర్తు పెట్టుకుంటూ బయటకి వచ్చాను.
వెయిటింగ్ హల్లో నుండి చక చకా బయటకి నడుస్తుంటే ...
ఎవరో ఒక పెద్దావిడ నా నడకని గమనిస్తూ
“నే చెప్పలా? డాక్టర్ గారి హస్త వాసి చాలా మంచిదని” అనటం వినబడింది.
ఎవరో ఒక పెద్దావిడ నా నడకని గమనిస్తూ
“నే చెప్పలా? డాక్టర్ గారి హస్త వాసి చాలా మంచిదని” అనటం వినబడింది.
4 comments:
మళ్ళీ తప్పులు దొర్లుతున్నాయండి. కాస్త పోస్టు చేసేముందు చూసి దిద్దండి. మంచి జోకు. నాకూ ఒకప్పుడు టెన్నిస్ ఎల్బో ఉండేది. ఇప్పుడు చాలామటుకు తగ్గింది.
😀😀 సుశ్రీ గారూ.
కేకంటే ... కేక.
లేకపోతేనా ... !
:)
అక్షర దోషాల మీద శ్రద్ద తీసుకుంటాను.
Post a Comment