ఒక పెద్దాయన చెప్పేవారు ..
దెబ్బ తగిలిన చోటే నొప్పి
డబ్బులేకుంటే వళ్ళంతా నోప్పే అని ..
అలాటి వళ్ళంతా నొప్పిగా ఉన్న రోజు
ఉదయాన్నే కేబుల్ కనెక్షన్ బాయ్ కాలింగ్
బెల్ కొడతాడు.
“కనెక్షన్ ఆపేయండి. ఏ ప్రోగ్రామ్ సరిగా
రాదు. వినబడేవి కొన్ని.. కనబడేవి కొన్ని
అసలు పిల్లల చదువు పాడవుతుంది “ అని కరుస్తాము
మనం.
అదేం ఖర్మో అప్పుడే వచ్చి చస్తాడు పేపర్ కుర్రాడు ..
“మొన్న మంగళవారం జిల్లా ఎడిషన్ మధ్యలో
పేపర్ వేయలేదు ..
అయిదు రూపాయలు కట్ చేస్తా ఈ నెల “ కేక
లేడతాం మనం.
మనం వెళ్ళగానే ఇంటావిడ సర్ద్ధిచెప్పి పంపుతుంది.
పొద్దుగాలే అరుగుమీద కూర్చుని అందర్నీ
పోగేస్తాం.
“వేదవది ఉల్లిపాయలు ఎంతనుకున్నారు. అప్పట్లో
హిందూ పేపర్ నెలంతా కలిపి తొమ్మిది రూపాయలు,
యబై రూపాలకీ సంచి నిండా కూరగాయలు, మరి ఇప్పుడు పచారి సామాను మండిపోతుంది,
బియ్యం కోనెట్టు లేదు, గాసు , పాలు ....” అనర్గళంగా
మాట్లాడుతూనే ఉంటాం.
ఇంట్లోంచి కాఫీ వస్తుంది. తాగాక ఎవరి దారిని
వాళ్ళు పోతారు .
మనం గడ్డం పెంచేసి (పెంచక్కరలేదు అదే పెరుగుతుంది.)
రామ కృష్ణ పరమహంస పుస్తకం దుమ్ము దులిపి
అది ఎవరు పబ్లిష్ చేశారో చూస్తుంటాము .
వంటింట్లోంచి “పెసర దోసె లోకి జీలకర్ర , అల్లం తురుము కావాలా వద్దా అని టెంప్టింగ్ ప్రశ్న వినబడింది.
మనం పది నిమిషాల్లో రెడీ అయ్యి డైనింగ్
టేబుల్ వద్ద వాళ్తాం.
దోసెలు తిన్నాక పరిస్తితి లో మార్పు వస్తుంది.
ఎవడికయినా చేబదులు ఇచ్చామేమో గుర్తుచేసుకుంటాం
మనకి ఇచ్చిన వాళ్ళే గాని మనదగ్గర తీసుకున్న
వాళ్ళు గుర్తు కు రారు .
బాంకు బుక్కులు పోగేసి , ఆకవుంటూ లో ఎంత ఉందో లెక్క చూస్తాం
అంతా కలిపినా
బండి పంచరు వేయించడానికి కూడా చాలవు .
ఇంట్లో ఆడవాళ్ళు ఎక్కడ దాస్తారో ఆలోచించి
అక్కడ వెతకటం మొదలెడతాం.
పిల్లోడు స్కూల్ కి వెళ్ళేముందు “ నాన్నా
నోట్స్ లు కావాలి “ అంటాడు.
“మొన్ననే కదరా బండెడు కొన్నాను . చించి
పడవలు చేస్తున్నావా ఏమిటి ?”
వాడు బయంగా మనవైపు చూసి వాళ్ళ అమ్మ వెనుక
చేర్తాడు..
చిట్టీల వాడికి ఫోన్ చేస్తాం . రెండు నెలల
క్రితం మొదలెట్టినది ఈ నెల పాడితే వడ్డీ ఎంత పడుద్దీ? అని
ఫోనే లోనే అంత వడ్డీనా ? అని నిట్టూరుస్తాం.
ఈ వ్యవహారం అంతా ఉదయం నుండి గమనిస్తున్న
ఇంటావిడ .
మనం ఫాంటు చొక్కా తొడుక్కునే సరికి .చేతిలో
డబ్బు పట్టుకొని వస్తుంది. రాక రకాల నోట్లు ఉంటాయి అందులో ..
“మా అమ్మ మొన్న పండక్కి చీర కొనుక్కోమని
ఇచ్చింది .(అప్పు సుమా అనే అర్ధం వఛేట్టు ) “
అది అబ్బద్దం అని మనకు తెలుసు. మనకి తెలుసని ఆమెకి తెల్సు ..
వివేకవంతుడు వివాదాల జోలికి వెళ్ళడు ..
ఒరకంట ఆవిడని చూస్తాం. ఎందుకో ఆమె అందంగా
కనబడుద్ది.
చిలిపిగా ఏదో అంటాం.”దీనికేం కొడవలేదు
“ ఆమె ఇంట్లోకి వెళ్తుంది.
మనం బండి తీసి బజార్న పడతాం. ఆడాళ్లు మీకు బాలచందర్ .!!
No comments:
Post a Comment