Monday, 22 June 2015

కలల సౌధం

ఆఫీసు నుండి వస్తూ నా బైక్ చిన్న సమస్య రావటం తో మా మెకానిక్ వద్దకి వెళ్ళి , .
అటునుండి వెల్డింగ్ షాప్ కి వెళ్ళాను. 
నెల నుండి ఒక మిత్రుడి బార్య (నూతనంగా గృహ ప్రవేశం చేశారు) 
తమ ఇంటికి బట్టలు ఎండబెట్టు కునే సౌకర్యం లేనందుకు ( మన ప్రతిభే ) 
ఇంటికి వెళ్ళిన ప్రతిసారి సరిగ్గా టీ ఇచ్చే ముందు గుర్తు చేస్తుంది. 
ఎంత చక్కెర వేసినా టీ చేదుగానే ఉంటుంది.
..
షాపు లో కూర్చుని వాటికి అవసరమయినట్లు ఇనుప యాంగిల్స్ చేయించి
నరేశ్ కి ఫోన్ చేశాను వచ్చి తీసుకెళ్లమని.
" సార్ రేపు తెచ్చుకుంటాను." అటు నుండి అతను.
రేపటితో పెయింటింగ్ పాచ్ వర్కు పూర్తి అవుతుంది కదా
ఇప్పుడు తీసుకెళ్తే వీటికీ పెయింటు వేయించవచ్చు.
నేను ఎలెక్ట్రీషియన్ చేత బిగించే ఏర్పాటు చేస్తాను."
..
మరో పది నిమిషాల్లో వచ్చాడు అతను ...
వెల్డింగ్ పని చివర్లో ఉంది. పూర్తయి అవి తీసుకెళ్ళటానికి
సరిపడా ఆరేసరికి మరో అరగంట పట్టింది.
..
ఇంటి పని పూర్తిగా అయ్యే సరికి 28 లక్షలు దాటింది. ..
నేను మొదటి రోజు చెప్పాను. అతను నమ్మలేదు.
'అంత ఎందుకవుద్ది' అని బేలుదారు అన్న మాట అతనికి...
మందు తాగే వాడికి వచ్చే తాత్కాలిక ఆనందాన్నిచ్చింది.
...
తీరా పనివారి అమౌంట్ సెటిల్ చేయటానికి మధ్యాన్నమే
తన స్వగ్రామం వెళ్ళి. తన తండ్రి వద్ద ఒక నలబై వేలు తెచ్చానని చెప్పాడు.
'దొడ్డవరం బాంకులో తల్లి తన బంగారం పెట్టి ఇచ్చింది'
అని చెప్పెటప్పుడు అతను నవ్వటానికి చేసిన ప్రయత్నం
కళ్ళలోంచి తడిగా వచ్చింది.
..
సాలరి ఆకవుంటు ATM లోంచి డబ్బు డ్రా చేసి 40000 ఇచ్చి
పొద్దుటే వెళ్ళి అమ్మ మంగళసూత్రం బాంకు నుండి తీసిచ్చి
ఆగస్టు ఒకటికి (పెద్దమ్మాయి ఫీజు కట్టాలి) నాకు సర్దుబాటు చెయ్యమని చెప్పి
ఆటో ఎక్కించి పంపాను. మధ్య తరగతి వాడికి స్వంత ఇల్లు ఒక
L U X U R Y .. కలల సౌధం ??

No comments:

www.susri.home.blog

  అందరికీ నమస్తే 66o పోస్టులు పైగా వ్రాసిన ఈ బ్లాగ్ లోని నా పోస్ట్ లలో  చాలా అచ్చుతప్పులు ఉండటం గమనించాను.  వాటన్నిటినీ ఎడిట్ చేస్తూ, modify...