అక్కడంతా
వెన్నెల కురుస్తుంది.
.
పచ్చగడ్డి
మీద అక్కడక్కడా గడ్డిపూలు వింతగా పరుచుకుని ఉన్నాయి.
దగ్గర్లో పంట
ఏటికాలవ ఓర ఓరా ప్రవహిస్తూ ఉంది. ప్రకృతి ప్రశాంతంగా ఆహ్లాదకరంగా ఉంది.
నారాయణ
అక్కడే పడుకొని ఉన్నాడు.
పచ్చిక మీద మెత్తగా నడుంవాల్చి తలక్రింద చేతులు
పెట్టుకుని ఆకాశంలోకి చూస్తున్నాడు.
ఏదో పిట్ట ఆకాశంలో ఒంటరిగా ప్రయాణిస్తూ ఉంది.
నారాయణ దాన్నే చూస్తూన్నాడు. ప్రక్కన ఏదో చప్పుడు వినిపించింది.
.
సన్నటి నవ్వు వినిపించింది. నారాయణ ఉలిక్కిపడ్డాడు..
ప్రక్కనే ఉన్న కొబ్బరి చెట్టుచాటున ఎవరి స్త్రీ దాక్కుని ఉన్నట్లు అనిపించింది.
నారాయణ బెరుగ్గా భయం భయంగా చూసాడు.
.
మెల్లిగా లేచి అడుగులో అడుగేస్తూ చెట్టుకి ఆ
వైపుగా వచ్చి చూసాడు..
అక్కడో స్త్రీ నిలబడి ఉంది. నునుపైన భుజాలు నగ్నంగా ఉన్నాయి.
పెదాలు తడిగా ఉన్నాయి. బిగించిన పెదాల వెనుక నవ్వు చెలియకట్ట దాటడానికి సిద్దంగా
ఉంది.
మెడ శంఖువుగా ఉంది. గుండెల మీద మల్లె దండలు ఒత్తుగా చుట్టి ఉన్నాయి.
వాటి మద్య నుండి ఆస్పష్టంగా ఎత్తైన వక్ష స్థలం కనిపిస్తూ ఉంది.
నారాయణ చూపుల చిక్కుముడిని
జాగ్రత్తగా విప్పుకుంటుంటే ఆమె నవ్వింది.
ఆ నవ్వు శ్రావ్యంగా ఉంది. నారాయణ ఆమె
కళ్ళల్లోకి చూసాడు.
ఆ కళ్ల నిండా ఆహ్వానం. బాహువులు విశాలంగా తెరిచింది.
ఒక్క ఉదుటన
నారాయణ అడుగు ముందుకు వేశాడు.
..
అప్పటివరకూ కాళ్లవద్ద పడుకున్న కుక్క కుయ్ మని మొరిగిదూరంగా
వెళ్ళి ముడుచుకుంది...
నారాయణకి
మెలకువ వచ్చింది.
చిరుగుల చాపమీద తిరిగి పడుకున్నాడు.
.
పాకలో మూలగా ఉన్న అంట్ల మీద పిల్లోకటి దూకింది..
నారాయణ లేని దాన్ని తరిమాడు.
దాసు మంచం కాళీగా కనిపించింది.
తిరునాళ్ళ నుండి ఇంకా రాలేదు
గామోను అనుకున్నాడు.
రోడ్డుమీద అప్పుడప్పుడు వెళ్ళే లారీల చప్పుడు వినిపిస్తూ
ఉంది.
.
నారాయణ అప్పటివరకు వచ్చిన కల ని నెమరు వేసుకున్నాడు..
ఆ కల అతడికి కొత్తకాదు.
రోజు రాత్రి పలకరించి నిద్ర లాక్కునే కలే !
ప్రతీసారి సరిగ్గా అక్కడే ఆగిపోతుంది.
ఆ తర్వాత ఎంత ప్రయత్నించిన కధ ముందుకు జరిగేదికాదు.
నిజానికి నారాయణకి ఆ తర్వాత ఏం
జరుగుతుందో తెలియదు.
కానీ ఏదో జరుగుతుందని మాత్రం తెలుసు.
నారాయణ కలలో కన్పించిన
స్త్రీని మరోసారి గుర్తుకు తెచ్చుకున్నాడు.
చలిమంట వద్ద కూర్చున్నట్లు వళ్లు
మెల్లిగా వేడెక్కింది.
సామ్రాజ్యం!
అవును
సామ్రాజ్యమే అనుకున్నాడు.
నారాయణకి తల్లి తండ్రి తెలియదు. తెలిసిందల్లా తను అనాధ నని
అనాధలకి
తల్లి తండ్రి ఉండరని ---
..
ఓసారి రైల్లో
చిన్న దొంగతనం చేసి పట్టుబడి తన్నులు తింటుంటే దాసు కాపాడి తనతో తెచ్చాడు...
సరిగ్గా
నాలుగేళ్ల క్రితం. నారాయణకి దాదాపు పదేళ్ళ వయసుంటుంది!
అప్పటి నుండి రోడ్డుప్రక్క
ఆ పాకలో దాసుకు సహయంగా పొద్దుటినుండి సాయంత్రం వరకు
పని...... ఇడ్లీ.....
చట్నీ...... టీ, కాఫీ, బోండా, బజ్జితో
సుదీర్గమైన పగల్లు, రాత్రులు, కడుపునిండా తిండి కంటినిండా నిద్ర!
.
సామ్రాజ్యాన్ని చూసేంతవరకు నారాయణకు మరేం తెలియదు..
.
ఓ రాత్రి పాకలో చప్పుడికి మేలుకువోస్తే దీపం
వెలుగుతూ కనిపించింది..
టీ బల్ల, బెంచీలు, ప్లేట్లు, సాసార్లు, గ్లాసులు అన్నీ యధావిదిగా మౌనంగా ఉన్నాయి.
.
నులకమంచం మీద దాసు పడుకొని ఉన్నాడు. నడుంవరకు
దుప్పటి కప్పుకొని ఉన్నాడు. .
మంచం క్రింద తెల్లటి చీర ఒకటి కుప్పగా పడి ఉంది.
నారాయణకి ఆశ్చర్యం వేసింది. ఆ పాకలో తను దాసు తప్ప మరెవ్వరూ ఉండరు.
అలాంటిది, ఎవరో స్త్రీ! అదీ దాసు పక్కలో—
.
నారాయణ
మెల్లిగా లేచి మంచమ్మీదకి చూసాడు. ఎవరో స్త్రీ నగ్నంగా ఉంది. సన్నటి నడుంచుట్టు
లంగా చుట్టుకొని ఉంది. విశాలమైన ఛాతిమీద వక్షోజాలు గర్వంగా నిటారుగా మెలబడి
ఉన్నాయి. బలమైన తొడలు తెల్లగా అరటి బోదేలలాగా ----
నారాయణకి నిద్రమైకం వదిలింది. చాపని ఒకవైపుగా
లాక్కుని ఆ దృశ్యం పూర్తిగా కనిపించేట్లు పడుకున్నాడు.
ఎక్కడినుండో వచ్చేకాంతి నునుపైన ఆమె శరీరం మీద
పడి విశ్లేషిస్తూ ఉంది. నారాయణకి వెళ్ళి ఆ శరీరం తాకాలని, ఆ వంపులన్నీ కావాలని, ఆ శరీరం మీద మెత్తగా పడుకోవాలని అనిపించింది.
అదిగో
సరిగ్గా ఆనాటి నుండే నారాయణకి నిద్ర దూరమైంది.
రోజులు
గడిచేకొద్ది ఆమె పేరు సామ్రాజ్యమని, దాసుకి ఈ మద్యే పరిచయమైందని, దాసుతో
చనువుగా ఉంటుందని, అప్పుడప్పుడు రాత్రులు చీకటి పడ్డాకవచ్చి
తెల్లవారకముందే మాయమవుతుందని అర్దమైంది.
నారాయణ
ఆనాటినుండి చాలా రాత్రులు మేలుకొని సామ్రాజ్యం కోసం ఎదురుచూస్తూ పడుకునేవాడు.
నగ్నంగా ఉన్న ఆమెను దాసు ఏంచేస్తాడో చూడాలని పొంచి ఉండేవాడు. అలా ఎదురుచూస్తూనే
నిద్రపోయేవాడు. ఆ నిద్రలో అదే కలవచ్చేది. మల్లేదండలు చుట్టుకున్న స్త్రీ
ఆహ్వానించేది. తను అలాగా అడుగు ముందుకెసేసరికి మెళుకువ వచ్చేది. ఎదురుగా మంచమ్మీద
సామ్రాజ్యం నిద్రపోతూ కనిపించేది. ఆ శరీరం సృష్టి లో అందం అంతా కుప్పగా పోసినట్టు ఉండేది.
నారాయణ
ఆలోచనల్ని తరిమికొడుతూ బోర్లా పడుకున్నాడు. నేల గట్టిగా రాయిలాగా తగిలింది. తిరిగి
వెళ్లికిలా పడుకున్నాడు. సామ్రాజ్యం బోర్లా తిరిగి పడుకుంటే ఎలా ఉండేదో
గుర్తొచ్చింది. నున్నగా విశాలంగా వీపు, నడుంవద్ద మొదలైన ఎత్తైన వంపు.
నారాయణ
ముఖంమీద వాలిన దోమని తరిమికొట్టాడు.
రోడ్డుమీద ఏదో
లారీ వేగంగా వెళ్లిపోయింది.
తిరిగి
అలుముకున్న నిశబ్దాన్ని చేదిస్తూ పాక తలుపుమీద చప్పుడయింది.
దాసు
వచ్చేసినట్టున్నాడు అనుకుంటూ నారాయణ లేచాడు. లాంతరువత్తి పెద్దది చేసి
తలుపుతీశాడు.
ఏం
జరుగుతుందో తెలుసుకునే లోపు ఎవరో వచ్చీ తలుపు మూసేశారు.
వెనుదిరిగి
చూసేసరికి మంచమ్మీద సామ్రాజ్యం.
భుజం మీద
జారిన పమిటని అశ్రద్దగా సర్దుకుంటూ---
నారాయణ కళ్ళు
వణికాయి. గుండె వేగం పెరిగింది. వళ్లు వేడెక్కింధి.
సామ్రాజ్యం
కళ్ళు పెద్దవిచ్చేసి పాకంతా తేరిపార చూసింది.
“దాసులేడా!”
ఆశ్చర్యంగా అడిగింది.
నారాయణ
అడ్డంగా తలూపాడు “కుంటి గంగ
తిరునాళ్ళకెళ్లాడు.”
సామ్రాజ్యం
ఏదో గొణుక్కుంది. “
“ఎప్పుడొస్తాడు
? “
“అర్ధరెత్తిరి
కి వచ్చేస్తాడు” నారాయణ తొందర్గా చెప్పేశాడు .
“నరే
నేన్నిక్కడే పడుకుంటాను” అని సమాదానం కోసం చూడకుండా నడుం వాల్చింది.
నారాయణ తలుపు గడిపెట్టి చాపమీద పడుకున్నాడు .
సామ్రాజ్యం ఈ
వైపు తిరిగింది.
“నీ
పేరేంట్రా ? “అంది ..
“నారాయణ “
“నన్నెప్పుడయినా
చూశావా?”
నారాయణ
తలుపాడు . “ఎప్పుడూ ?” కుతూహలంగా అడిగింది సామ్రాజ్యం.
“రాత్రిపూట
చీకట్లో”
సామ్రాజ్యం
నవ్వింది. “బాగుంటానా?”
“చాలా
బాగుంటావు”
సామ్రాజ్యం, ఒక్క క్షణం సిగ్గు పడింది.
“నా దగ్గర
పడుకోవాలని అనిపించేదా?”
నారాయణ
సామ్రాజ్యం వైపు చూశాడు.
పల్చటి
జాకెట్టు లోంచి ఎత్తుగా పుష్టి గా శరీరం
కనిపిస్తుంది ఔనన్నట్లు తలుపాడు .
“రా మరి
ఇక్కడే పడుకో” మంచం మీద ప్రక్కగా జరిగింది సామ్రాజ్యం .
నారాయణ లేచి
ఒక్క అంగలో మంచం మీదికి చేరాడు.
కలలో
ప్రతిసారి ఆపే సరిహద్దుని జయించి ఆమె
బాహువుల మద్య ఒదిగిపోయాడు
మెత్తటి
శరీరపు స్పర్శ, చేతుల
నిండా ఒదుగుతుంటే నారాయణ ఉక్కిరి బిక్కిరి అయి పోయాడు .
“చూడాలని
ఉందా?” ఆ గొంతు జీరా గా ఉంది.
సామ్రాజ్యం
పల్చటి ఆచ్ఛాదనని క్షణంలో దూరం చేసి
నారాయణ
ముఖాన్ని, గట్టిగా గుండెల కదుముకుంది.
..
సంవత్సరాల
క్రితం జారవిడుచుకున్న జ్నాపకం క్షిపణై ,
మెదడు పోరాల్ని తాకినట్టు మెత్తటి ఆ స్పర్శా , చమట వాసన ....
అతడు మరిచి
పోయిన ఒక జ్నాపకాన్ని వెనక్కి తెచ్చింది.
సరిగ్గా అదే
స్పర్శా , చల్లదనం, ఆ
చేతల్లో నిండయిన ప్రేమ ,
మెత్తటి
అనురాగం , బుగ్గల్ని తాకిన ఆ పెదాలు అద్దిన
అప్యాయతా –
వెరసి అమ్మ !!!
నారాయణకి
లీలగా తల్లి గుర్తొచ్చింది.
పగలంతా శ్రమ
పడ్డాక వచ్చి తనని గుండెలకి అడుముకోవటం గుర్తొచ్చింది.
నారాయణ
చేతులు వణికాయి.
వళ్లు
చల్లబడింది. గాలి పీల్చడం కష్టమయి పోయింది.
మెల్లగా
సామ్రాజ్యానికి దూరంగా జరిగాడు. సామ్రాజ్యం వింతగా చూడబోతున్నప్పుడు –
బయట
చప్పుడయింది . అపుడే లారీ దిగి పాక వైపు వస్తూ దాసు.!!
నారాయణ తలుపు తెరిచాడు.
ఎక్కడినుండో
ఒక వెలుగు రేఖ ఆప్యాయంగా నారాయణని స్పృశించింది.
నారాయణ బయటికి నడిచాడు . వెలుగు రేఖల్ని
వెతుక్కుంటూ ,
ఆ చీకటి రాత్రి ఒంటరిగా నడక సాగించాడు.
(మయూరి
సచిత్ర వార పత్రిక, జూన్ 16, 1989)
No comments:
Post a Comment