Friday 12 June 2015

జోరు (పరవాన్నం)

నేను పనిచేస్తున్న పాలిటెక్నిక్ కాలేజి లో
మా P E T( ఫిజికల్ ఎడ్యుకేషన్ ట్యూటర్ ) సోదరుడి పెళ్ళికి
మిగితా స్టాఫ్ తో పాటు దగ్గరలో ఉన్న వారి పల్లెటూరికి అటెండ్ అయ్యాను.
..
ఊరి చివర దగ్గరలో ఉన్న వ్యవసాయ భూమి ని చదును చేసి షామియానాలు ,
వాల్ క్లాత్ లు కట్టి అన్ని వివాహ వేడుకలు ఏర్పాటు చేసారు.
ఒక వైపు కళ్యాణ మండపం , మరో వైపు బోజనాలు , వంటల విభాగం .
పెళ్లి ఇంటి వద్ద ఉన్న దగ్గరలోని చెట్ల క్రింద వాహనాలు సేద తీరుతున్నాయి.
శామియానాల తో దారి పొడవునా పండగ వాతావరణం ఉంది. ..
..
ఎండ మండిస్తుంది...
..
కళ్యాణ వేదిక వద్ద మంచి కూలర్లు ఉంచారు.
షామియానాలు ఎండనుండి కాపాడుతున్నాయి గాని ఉక్క పోత ని ఆపలేకపోతున్నాయి
అక్కడక్కడా ఉంచిన స్టాండు ఫానుల వద్ద జనం గుంపులుగా కుర్చుని ఉన్నారు.
బోజనాల సెక్షన్ లోకి తొంగి చూస్తున్నారు.
ఖాళి అవగానే మరో బంతి (వరుస ) కి కూర్చుంటున్నారు.
..
లెనిన్ చొక్కాలు , కాటన్ ఫాంటులు ఖరిదయినా ..
ఎందుకు వాడుతున్నారో అర్ధం అవుతుంది.
చమట కారి పోతుంది. లో లోపలే ..
దట్టమయిన పట్టుచీరలు , కాసులు పేర్లు, వడ్డాణాలు
,ప్రత్యెక మేకప్ లతో మహిళల ను చుస్తే పాపం బాదేస్తుంది.
..
వేదిక మీది దంపతులను ఆశీర్వదించి ఫోటో వీడియో లో ..
హాజరయ్యి మేము బోజనాలకి దూరాము.
.
ఊరు మోత్తం బంతి (బోజనాలు ) అలవాట్లు గమ్మత్తుగా ఉంటాయి . .
ఉరు ఊరంతా రావాల్సిందే .. వందలాది మందికి సమాన మర్యాదలు జరగాల్సిందే..
అప్పడాలు కొరవపడ్డా .. ఆస్తులు కాజేసినట్టు మాట్లాడుకుంటారు.
గృహస్తులకి కత్తి మీద సాము.
..
మొత్తానికి ఆ తిరునాళ్ళ లో మేము సీట్లు సాధించాం...
...
బోజనాలు వంటవాళ్లతో వండించినప్పటికీ .. ..
కాటేరింగుకి మాత్రం ప్రత్యేకంగా టీం ఏర్పాటు చేసినట్లుంది.
..
ఇరవయ్యేళ్ళలోపు వయసున్న పిళ్లల్లు చక చకా వడ్డించు కుంటూ పోతున్నారు.
పులిహార ..జిలేబి రాగానే చెయ్యి అడ్డుగా ఉంచాను . ..
షుగర్ వచ్చి రెండేళ్ళయింది. తీపి తినటం మానేసాను.
కూరలు , చట్నీలు వడ్డన వస్తున్నప్పుడు
నా ఇస్తర్లో రెండు గారెలు వడ్డించే సరికి తలెత్తి చూసాను..
..
“రాజారావ్ “ నా స్టూడెంట్. ఆరు నెలల క్రితం ప్రారంభమయిన ..
ఆటోమొబైల్ డిప్లోమో మెదటి సంవత్సరం స్టుడెంటు.
. నెలలో అయిదు రోజులు సెలవు పెడతాడు, .
ఉన్న రెండు మూడు పాంట్లు ఇస్త్రి లేకున్నా శుబ్రంగా ఉండేట్టు చూసుకుంటాడు.
సమ్మర్ క్రాఫ్ చేయించుకుని క్లాస్స్ లో వెనుక బెంచి లో కూర్చుంటాడు.
ఎప్పుడు ఫెయిల్ అవడు .. అలా అని మెరిట్ లోను ఉండను .
అబోవ్ ఆవరేజీ ..
..
“స్విటు కుడా వేసుకోలేదు .. ..
గారే అయినా మరోటి తినండి సార్ “ అన్నాడు నమస్కారం పెడుతూ
..
బోజనాలు జరుగుతూనే ఉన్నాయి వాడు క్లుప్తంగా వాడి గురించి చెప్పాడు.
తండ్రికి కి పెరాలసిస్ .. ..
తల్లి ఒక ప్రవేట్ హాస్పిటల్ లో నర్సు.
బొటాబొటి ఆదాయం.
వీడు రిజర్వేషన్ వాడుకుని హాస్టల్ సీట్ సంపాదించాడు.
పెళ్ళిళ్ళ సీజన్ లో తనలాటి మరి కొందర్ని కలుపుకుని కాటరింగు పని చేస్తాడు,
నాలుగయిదు గంటల పని , మంచి భోజనం
200 నుండి 500 వరకు ఆదాయం.
ఫంక్షన్ లలో మిగిలిన పదార్ధాలని అవసరమయిన ఆశ్రమాలకి చేరుస్తుంటాడు.
వాళ్ళ వేహికల్ లో టీం అందర్నీ వేసుకుని వస్తుంటాడు.
తనకి పుస్తకాలు, అవసరాలు చూసుకుని తల్లి కి కొంత వేడిననీల్లకి చన్నీళ్ళు ..
..
తరచు వాడేందుకు కాలేజికి రాడో అర్ధమయింది...
..
బోజనాలు చివరి కొచ్చాయి సగ్గుబియ్యం పరవాన్నం..
(మా చిన్న వయసులో జోరు అనేవారు ) చిన్న ప్లాస్టిక్ గిన్నెలలో ఇస్తున్నారు .
వాడు నాకు ఇవ్వకుండా వెళుతుంటే ..
“నాకు ఒకటివ్వరా తింటాను .. అంతగా అయితే రాత్రికి మరో టాబ్లెట్ వేసుకుంటా “
..
రాజారావు రెండు కప్పులు ఉంచి వెళ్ళాడు.
గిన్నె లు రెండు ఖాళీ చేస్తుంటే మా కొలీగ్స్ నన్ను వింతగా చూసారు smile emoticon grin emoticon

No comments:

www.susri.home.blog

  అందరికీ నమస్తే 66o పోస్టులు పైగా వ్రాసిన ఈ బ్లాగ్ లోని నా పోస్ట్ లలో  చాలా అచ్చుతప్పులు ఉండటం గమనించాను.  వాటన్నిటినీ ఎడిట్ చేస్తూ, modify...