Monday, 29 June 2015

అత్తగారు అభిమానం

రెండురోజుల ట్రిప్ కి అన్నీ సిద్దం చేసుకున్నాక 
ముందుగా మాట్లాడు కున్న కారు ఫ్లాట్ వద్దకి వచ్చింది.
వాచ్ మెన్ సాయంతో లాగేజీ సర్దుకున్నాక .
ఫ్లాట్ లాక్ చెయ్యబోతుంటే .. గండుపిల్లి ఒకటి ఫ్లాట్ లో దూరింది. 
'అక్వేరియమ్ లోని చాపల్ని తినేస్తుందేమో' అంది ఆవిడ కంగారుగా 
"నువ్వేల్లి కార్లో కూర్చో నేను దాన్ని తరిమి వస్తాను" చెప్పడతాను .
సెల్లార్ లో వాచ్ మెన్ కి జాగర్తలు చెప్పిన ఆవిడ వచ్చి కార్లో కూర్చుంది.
లాగేజీ ఒక్కసారి చెక్ చేసుకుంది. సారువాడు పదినిమిషాలయినా రాలేదు.
ఇంట్లో ఎవరు లేని విషయం కొత్త వ్యక్తికి తెలియకూడదని.
" ఆయన అత్తగారు మందులు ఎలా వాడాలో చెబుతున్నట్టున్నారు.
ఆవిడంటే మహా అభిమానం " డ్రైవర్ తో అంది ..
మరో అయిదు నిమిషాలకి ఆయన వచ్చాడు.
కారెక్కి "పోనీ" అని .
లమ్దీ ముండ.. డోరు కర్టెను వెనుక దాక్కుంది .
కర్రతో రెండు పీకి దుప్పట్లో చుట్టి పోర్చ్ నుండి కిందవేశాను "..
ఆలస్యానికి సంజాయిషీ చెప్పడతాను
...
వీది మలుపులో కారు ఆపిన డ్రైవరు.
" సార్ మీ ఫోటో ఒకటి నాకివ్వండి సార్ ..
మా ఇంట్లో గోడకి తగిలించుకుంటాను" తడి కళ్ళతో చెప్పాడు . tongue emoticon tongue emoticon

Friday, 26 June 2015

వెంకట్రామయ్య -- నేను

ఈ రోజు అర్జంటుగా మేము దరిశి వెళ్లవలసిన పని పడింది.
మెయిల్ లో లీవు లెటర్, ఫోన్ లో పర్మిషన్ తో 
మా ఆవిడా నేను ఉదయాన్నే బయలు దేరాము. 
దరిశి అంటే సరిగ్గా దరిశి(మా శ్రీమతి ఊరు) కాదు .
అక్కడ నుండి 13 కి.మీ ల దూరం లో ఉన్న దేవారం గ్రామం.
..
అక్కడ మాకో ఆప్త మిత్రుడు ఉన్నాడు .
వెంకట్రామయ్య అని చిన్న రైతు.
నా కంటే పదేళ్ళు చిన్నవాడు. నిరక్షరాస్యుడు.

సూదంటురాయి లాటి అతని నిజాయితీ కి నేను ఫిదా అయిపోయాను.
నా ఫోన్ నెంబరు తన ఇంటి లో వేలాడే కాలండరు మీద రాయించుకుని ఫోన్ చేస్తుంటాడు.
నా మాటంటే అతనికి వేద వాక్కు,
మా కుటుంబం అంటే అంతు లేని అభిమానం.
..
మా స్నేహం 15 ఏండ్ల క్రితం ది...
నేను ముండ్లమూరు మండలం లో పని చేసేటప్పుడు
అతను పులిపాడు నందనవనం అనే గ్రామ శివార్ల లో నిర్మించే ఇండ్లకి
బిల్డింగ్ మెటీరియల్స్ తోలేవాడు. తమ ట్రాక్టరు తో ..
వ్యవసాయ పనులు లేని ఖాళీ సమయాల్లో
బిల్డింగ్ మెటీరియల్స్ తోలటం ఒక ఉపాది.
ట్రాక్టర్ కు వాటి యజమానులకు . కూడా వెసలుబాటే.
..
అతని కి తగినదే బార్య కూడా.. మాకు లాగే ముగ్గురు పిల్లలు .
పెద్ద పిల్ల కి 15 ఏండ్లు స్థానికంగా టెన్త్ పాసయ్యింది.
..
దేవారం గ్రామం సాగరు కాలవ సాగు భూమి ఉంది. ..
మాగాణి లో వరి పంట వేస్తారు.
వెంకట్రామయ్య తన స్వంత భూమి కాకుండా, కొంత కవులు భూమి కూడా సేద్యం చేస్తాడు. వ్యవసాయ పనులప్పుడు పెట్టుబడి కి మా దగ్గరకి వస్తాడు.
పంట చేతికి వచ్చాక లెక్క పూర్తిగా అప్పజెబుతాడు.
మా కోసం ఒక ఎకరం మాగాణి లో దిబ్బ ఎరువులతో వరి సాగు చేస్తాడు.
74 రకం విత్తనాలు లు వేస్తాడు. ధాన్యం తన వద్దే ఉంచుకుని,
రెండు నెలల కొకసారి అతి తక్కువ పాలిష్ తో బియ్యం మర ఆడించి తీసుకు వస్తాడు.
వచ్చే టప్పుడు, గుమ్మడికాయో, సొర కాయో, జున్ను ఫాలో , షరా మామూలే
..
మేము అక్కడి కి వెళ్లామంటే గంప కింద కోడి మాయం కావాల్సిందే...
మా ఇంట్లో శుభ కార్యాలకి , ఇద్దరు వస్తారు
రెండు మూడు రోజులు ఉండి పనులన్నీ చక్క బెట్టి వెళుతుంటారు.
..
ఒక్క మాటలో చెప్పాలంటే చాలా మంది అసూయ పడే అంత స్నేహం .మాది.
నా అదికారులు కొంత మంది ని నాకు పరిచయం ఉంది అని చెప్పుకోటానికి సిగ్గు పడతాను
కానీ అతన్ని స్నేహితుడు అని గర్వంగా చెప్పుకుంటాను.
ఈ మధ్యే తాను వారిస్తున్న వినకుండా కొంత అధునాతనంగా ఇండ్లు
నిర్మిచుకునెట్టు చేశాను. మరుగుదొడ్డి వాడకాన్ని అలవాటు చేశాను .
..
ఇంతకీ విషయం ఏమిటంటే .. ....
వెంకట్రామయ్య పెద్ద కుమార్తె నిన్న సాయంత్రం ఫోన్ చేసింది.
ఎవరో సన్న గొంతుతో తడబడుతు మాట్లాడుతుంటే ఏమి అర్ధమవలేదు “ ఆ పాప మాట్లాడుతుందని గ్రహించడానికి కొంత సమయం పట్టింది.”
“నేను చదువు కుంటాను సారు ..
మా నాన్న కి మీరు చెబితే కానీ కాలేజీ లో చేర్చడు” అంది
విషయం అర్దమయిన నేను రాత్రి మా ఆవిడ తో వెంకట్రామయ్య బార్య తో మాట్లాడించాను. ...
దగ్గర్లో దరిశి పంపి చదివించాల్సి వస్తుంది . అని పెళ్లి చేసే ఏర్పాటు లో ఉన్నాడట !!
వెళ్ళి .. వెంకట్రామయ్యను సున్నితంగా మందలించి ..
ఒప్పించి ఆ పిల్లని మా కార్లో ఎక్కిచుకుని దరిశి లో
మా బావమరిది చెప్పిన కాలేజీ లో చేర్పించి హాస్టల్ కి కావల్సిన వస్తువులు కొనిచ్చి..
నాటు కోడి బోజనమ్ తిని (ఇది తప్పదు)
దరిశి లోని బందువులకు హాయ్ చెప్పి ఇంటికి చేరామ్. శుభ రాత్రి ..

Monday, 22 June 2015

కలల సౌధం

ఆఫీసు నుండి వస్తూ నా బైక్ చిన్న సమస్య రావటం తో మా మెకానిక్ వద్దకి వెళ్ళి , .
అటునుండి వెల్డింగ్ షాప్ కి వెళ్ళాను. 
నెల నుండి ఒక మిత్రుడి బార్య (నూతనంగా గృహ ప్రవేశం చేశారు) 
తమ ఇంటికి బట్టలు ఎండబెట్టు కునే సౌకర్యం లేనందుకు ( మన ప్రతిభే ) 
ఇంటికి వెళ్ళిన ప్రతిసారి సరిగ్గా టీ ఇచ్చే ముందు గుర్తు చేస్తుంది. 
ఎంత చక్కెర వేసినా టీ చేదుగానే ఉంటుంది.
..
షాపు లో కూర్చుని వాటికి అవసరమయినట్లు ఇనుప యాంగిల్స్ చేయించి
నరేశ్ కి ఫోన్ చేశాను వచ్చి తీసుకెళ్లమని.
" సార్ రేపు తెచ్చుకుంటాను." అటు నుండి అతను.
రేపటితో పెయింటింగ్ పాచ్ వర్కు పూర్తి అవుతుంది కదా
ఇప్పుడు తీసుకెళ్తే వీటికీ పెయింటు వేయించవచ్చు.
నేను ఎలెక్ట్రీషియన్ చేత బిగించే ఏర్పాటు చేస్తాను."
..
మరో పది నిమిషాల్లో వచ్చాడు అతను ...
వెల్డింగ్ పని చివర్లో ఉంది. పూర్తయి అవి తీసుకెళ్ళటానికి
సరిపడా ఆరేసరికి మరో అరగంట పట్టింది.
..
ఇంటి పని పూర్తిగా అయ్యే సరికి 28 లక్షలు దాటింది. ..
నేను మొదటి రోజు చెప్పాను. అతను నమ్మలేదు.
'అంత ఎందుకవుద్ది' అని బేలుదారు అన్న మాట అతనికి...
మందు తాగే వాడికి వచ్చే తాత్కాలిక ఆనందాన్నిచ్చింది.
...
తీరా పనివారి అమౌంట్ సెటిల్ చేయటానికి మధ్యాన్నమే
తన స్వగ్రామం వెళ్ళి. తన తండ్రి వద్ద ఒక నలబై వేలు తెచ్చానని చెప్పాడు.
'దొడ్డవరం బాంకులో తల్లి తన బంగారం పెట్టి ఇచ్చింది'
అని చెప్పెటప్పుడు అతను నవ్వటానికి చేసిన ప్రయత్నం
కళ్ళలోంచి తడిగా వచ్చింది.
..
సాలరి ఆకవుంటు ATM లోంచి డబ్బు డ్రా చేసి 40000 ఇచ్చి
పొద్దుటే వెళ్ళి అమ్మ మంగళసూత్రం బాంకు నుండి తీసిచ్చి
ఆగస్టు ఒకటికి (పెద్దమ్మాయి ఫీజు కట్టాలి) నాకు సర్దుబాటు చెయ్యమని చెప్పి
ఆటో ఎక్కించి పంపాను. మధ్య తరగతి వాడికి స్వంత ఇల్లు ఒక
L U X U R Y .. కలల సౌధం ??

Saturday, 20 June 2015

వృత్తి లక్షణం.



కార్తీకమాసం ఆఖరి సోమవారం అని 
మా ఆవిడ పొద్దుటే అంజయ్య రోడ్డు లోని పంచముఖ ఆంజనేయస్వామి గుడికి కి లాక్కెల్లింది. 
మీచేత 365 వత్తులు వెలిస్తానని అనుకున్నాను అని అంది కారులో ఒక పెద్ద బుట్ట సర్దుతూ....
జాలిగా చూసి" ఇవాళ సోమవారమే చాలా పనులున్నాయి. కొంచెం సడలింపులుంటే చూడు" ..బేలగా అడిగాను.
నవ్వి మొత్తానికి ఒకే పెద్ద మట్టి ప్రమిదలో 365 వత్తులు వేసి పైన కర్పూరం ఉంచి వెలిగించే ఏర్పాటు చేసింది.
ప్రదక్షణలు.. పూజ కార్యక్రమ్ ముగిసేసరికి 9-00 దాటింది.
ఆలయ ప్రాంగణం లో ఒక వైపుగా కూర్చున్నప్పుడు.

“ మీరు గమనించారా ఆ స్వామి అక్కడున్న చిలకాకు పచ్చ రంగు 
మీద వంగ రంగు మామిడి పిందెల చెమికీల వర్కు చీర కట్టుకున్న.
.ఆవిడ మెడలో ఉన్న నగలు గమనిస్తున్నాడు ఇందాకటినుండి “ అంది.
ద్వజస్తంబానికి ఉత్తరం వైపున నమస్కారం చేసుకుంటున్న ఆవిడ అంటే 

నాకు సౌలబ్యంగా ఉండేది. తీరా చూస్తే ఆవిడ ఎగువ మద్య తరగతి మహిళా.. 
అతను నాకు పరిచయం ఉన్న మాల ధారణ స్వామి
నేనేమీ సమాదానం చెప్పకుండా వెళదామా? అన్నాను.
దారిలో “ నువ్వు గమనించావా ప్రదక్షణలు చేస్తుంటే నైరుతి మూల 

ఫ్లోరింగ్ గ్రానైట్ రాయి కదులుతుంది. బిగింపు సరిగా కుదరలేదు “ అన్నాను.
ఎక్కడికి వెళ్ళినా మీ వృత్తి లక్షణం పొదుగాదా? అంది.
ఇందాక గుడిలో నువు చూపించిన వ్యక్తి నాకు తెలుసు . 

మంచి గోల్డ్ స్మిత్ . ఆవిడ మెడలోనికొత్త మోడల్ నగల డిజైన్ గమనిస్తున్నాడు అతను... 
నవ్వుతూ చెప్పాను నేను....
ఒక్క క్షణం నాలుక్కరుచు కుంది.
ఇంటికి రాగానే త్వరగా టిఫిన్ పెట్టు. ఆఫీస్ టైమ్ అవుతుంది. తొందర పెట్టాను. ఏం టిఫిన్?
“పెసరట్టు “. అంది.
."నువ్వు ఆవిడ చీర గురించి ఏమి చెప్పావు అది పెళ్ళాం లక్షణం"--గుర్తు చేసి నవ్వాను.
నేను ఫైల్స్ అవీ సర్దుకుని డైనింగ్ టేబుల్ వద్దకు వచ్చాను...చట్నీ ఏమి చేశావ్?
“చిల్లీస్, టమోటా 1:3 మోటార్ ఫైన్ మిక్స్ విత్ సఫీషియెంట్ 60 పి‌పి‌ఎం ఎడిబులే వాటర్ ” అంది.

(టమోటా చట్నీ ని ఇంజనీరింగ్ భాషలో చెప్పాలని ప్రయత్నం చేసింది)
ఒక్క క్షణం ఏమి అర్ధమవలేదు...
పంచ్ పడింది.... శివ... శంబో...

Friday, 19 June 2015

సాయం.. అందుకోము :(

మంచి వర్షం లో 'కొండెపి' నుండి ఒక తెలిసీ తెలియని షార్ట్ కట్ రూట్లో 
ఒంగోలు బయలుదేరాము. నేను నా మిత్రుడు చెరో బండి మీద . 
చీకటి చిక్కబడుతుంది. 
రూటు చాలా కాలం క్రితం చూసిన గుర్తు. 
ఎదురుగా వచ్చే వాహనాల లైట్ వెలుగు నాలుగు కళ్లమీద 
పడి బండి నడపటం కష్టం గా ఉంది.
బయలు దేరిన రెండు కిలోమీటర్లు దాటాక నేను వేగంగా ముందుకి వచ్చాను.
మద్దులూరు దాటాక రోడ్డు మీద ఒక తను లిఫ్ట్ అడిగాడు.
చీకట్లో ఒంటరిగా వెల్లటమే కష్టం గా ఉంది ఆగకుండా వచ్చాను.
మరో అరగంట కి బాగా చీకటి పడింది.
నల్లటి తారు రోడ్డు,
సన్నగా ఎవరో అనుమతి కోసం చూస్తున్న వాన.
10 /12 కిలోమీటర్లు వచ్చాక ఆర్దమయింది.దారి తప్పానని.
గొడుగు వేసుకు వెళ్తున్నా ఒక బుడ్డోడిని అడిగా " ఏవూరు రా?"
"మా వూరే" అన్నాడు .
పల్లెటూర్లని కూడా త్రివిక్రమ్ వదల్లేదు.
మళ్ళీ అడిగితే ."ఇది వేములపాడు . అయిదు కిలోమీటర్లు
వెనక్కి వెళ్ళి చిలకపాడు నుండి సంతనూతలపాడు
మీదుగా ఒంగోలు వెళ్ళు" చెప్పాడు వాడు.
కట్ చేస్తే....
లాంగ్ రూటు కన్నా మరో పది కిలో మీటర్లు యెక్కువ ప్రయాణం చేసి ఒంగోలు వచ్చాను.
రాత్రి 8-30 దాటింది. బండి బాక్స్ లో జాగర్తగా ఉంచిన ఫోన్ బయటకు తీసి .
మిత్రుడికి ఫోన్ చేశాను.
" వచ్చి అరగంట అయింది. ఎవరో ఒకతను లిఫ్ట్ అడిగాడు .
అతను దోవ చూయించాడు
ఇప్పుడే ఫ్రెష్ అయి బోజనానికి కుర్చ్చున్నాను. "
smile emoticon grin emoticon

Tuesday, 16 June 2015

జీవన స్రవంతి కి జన్మదిన శుభాకాంక్షలు

ఒకమ్మాయికి లేటుగా మాటలొచ్చాయి.. 
ఇక కొచ్చిన్ బాంకి కి గండి పడింది...
..
అరగజమ్ ఎత్తున్నప్పుడు రోడ్డుకి ఆవల కుళాయి వద్ద 
మంచి నీళ్ళకి వెళ్ళిన అమ్మతో మాట్లాడాల్సిన అర్జెంటు పని ఉండి రోడ్డు దాటుతుంటే .. 
రోడ్డు పై వెళ్తున్నా లోడు లారీ ఒక దాన్ని చిన్ని చెయ్యెత్తి ఆపేసిన పిల్ల..
..
స్కూల్ లో మిస్ కి తనకి అభిప్రాయ బేదాలోచ్చి రేకు పలకతో కొడితే ,, ..
పాపం మిస్ వారం రోజులు సెలవు పెట్టాల్సి వచ్చింది.
మెడికల్ బిల్ నాన్న కట్టాల్సి వచ్చింది.
బియ్యపు గింజల పళ్లతో వాళ్ళమ్మని ..రక్తం కారిందాకా కొరికి..
నాన్న బండి శబ్దం వచ్చే సరికి వాకిట్లో కూర్చుని పెద్దగా ఏడుపు మొదలెట్టి
" నాన్న అమ్మ కొట్టింది " అని డిఫెన్స్ చేసుకున్న పిల్ల ....
మా ఇంటి ఆరమారాని నిండుగా కప్పులు ,
మొమెంటో లతో నింపిన పిల్ల,
చిత్రలేఖనం లో ఏకలవ్య అబినివేశం ,
వంట, హౌస్ కీపింగ్, రంగవెల్లులు,
ఎంచుకున్నది ఏదయినా తన కి సంతుప్తి ఇచ్చేంత వరకు శ్రమించే పిల్ల,
నేటితో 20 సంవత్స్రాలు పూర్తి చేసుకుంటున్న,
మా కుటుంబం లో ని యంగెస్ట్ ఇంజినీర్
తన ఇంజనీరింగ్ లో వరుసగా మూడేళ్ళ అకడమిక్ టాపర్
చిరంజీవి జీవన స్రవంతి కి
జన్మదిన శుభాకాంక్షలు... smile emoticon

Monday, 15 June 2015

తమ్ముడు ... తమ్ముడే ..


ఈ శనివారం ఏడుకొండల వాడి నిలువు బొట్లు పెట్టుకుని, ..
అహంకారాన్ని శిరో ముండనం ద్వారా వదులుకుని, 
గోవింద నామ స్మరణ ముడుగంటల పాటు చేసుకుంటూ, 
భార్యా పిల్లలతో ఆనందంగా ఆ దేవ దేవుని కనులారా దర్శించుకుని,
అఖండ ద్వీపం వద్ద కర్పూర హారతి వెలిగించి ,
బస్ స్టాండ్ వెనుక పార్క్ చేసిన వెహికల్ వద్దకు వచ్చి సెల్ చూసుకుంటే,
మిస్డ్ కాల్స్ లిస్ట్ లో ఒక సేవ్ చెయ్యని నంబరు ఉంది.
...
కాల్ బాక్ చేశాను. ...
..
ఖమ్మం నుండి పత్రికా ఎడిటర్ ది ఆ నెంబరు ...
పాతిక సరిగ్గా వస్తుందా లేదో కనుక్కుని,
సంవత్సర చందా రెన్యూవల్ గురించి గుర్తు చేశాడాయన.
ఇంటికి వెళ్ళగానే ఆన్లైన్ లో బదిలీ చేస్తానని చెప్పాను.
..
మర్నాడు, కాణిపాకం లో విఘ్నేశ్వరుని దర్శించుకుని, ..
అరకొండలో ఆంజనేయ స్వామి వారి తీర్ధం పుచ్చుకుని సాయంత్రానికి ,
తమిళనాడు సిరిపురం లోని శ్రీ లక్ష్మి నారాయణి బంగారు దేవాలయం ,
దర్శించుకుని ఈ ఉదయం ఇంటికి వచ్చాం.
..
ప్రయాణ బడలిక తీరాక, ..
మా పెద్ద పాపని సంవత్సర చందా బదిలీ చెయ్యమని చెప్పాను
,,,
ఇంతకీ పత్రిక పేరు చెప్పలేదు కదూ .. సారీ
"సైన్సు - హేతువాదం " smile emoticon grin emoticon pacman emoticon pacman emoticon

Friday, 12 June 2015

జోరు (పరవాన్నం)

నేను పనిచేస్తున్న పాలిటెక్నిక్ కాలేజి లో
మా P E T( ఫిజికల్ ఎడ్యుకేషన్ ట్యూటర్ ) సోదరుడి పెళ్ళికి
మిగితా స్టాఫ్ తో పాటు దగ్గరలో ఉన్న వారి పల్లెటూరికి అటెండ్ అయ్యాను.
..
ఊరి చివర దగ్గరలో ఉన్న వ్యవసాయ భూమి ని చదును చేసి షామియానాలు ,
వాల్ క్లాత్ లు కట్టి అన్ని వివాహ వేడుకలు ఏర్పాటు చేసారు.
ఒక వైపు కళ్యాణ మండపం , మరో వైపు బోజనాలు , వంటల విభాగం .
పెళ్లి ఇంటి వద్ద ఉన్న దగ్గరలోని చెట్ల క్రింద వాహనాలు సేద తీరుతున్నాయి.
శామియానాల తో దారి పొడవునా పండగ వాతావరణం ఉంది. ..
..
ఎండ మండిస్తుంది...
..
కళ్యాణ వేదిక వద్ద మంచి కూలర్లు ఉంచారు.
షామియానాలు ఎండనుండి కాపాడుతున్నాయి గాని ఉక్క పోత ని ఆపలేకపోతున్నాయి
అక్కడక్కడా ఉంచిన స్టాండు ఫానుల వద్ద జనం గుంపులుగా కుర్చుని ఉన్నారు.
బోజనాల సెక్షన్ లోకి తొంగి చూస్తున్నారు.
ఖాళి అవగానే మరో బంతి (వరుస ) కి కూర్చుంటున్నారు.
..
లెనిన్ చొక్కాలు , కాటన్ ఫాంటులు ఖరిదయినా ..
ఎందుకు వాడుతున్నారో అర్ధం అవుతుంది.
చమట కారి పోతుంది. లో లోపలే ..
దట్టమయిన పట్టుచీరలు , కాసులు పేర్లు, వడ్డాణాలు
,ప్రత్యెక మేకప్ లతో మహిళల ను చుస్తే పాపం బాదేస్తుంది.
..
వేదిక మీది దంపతులను ఆశీర్వదించి ఫోటో వీడియో లో ..
హాజరయ్యి మేము బోజనాలకి దూరాము.
.
ఊరు మోత్తం బంతి (బోజనాలు ) అలవాట్లు గమ్మత్తుగా ఉంటాయి . .
ఉరు ఊరంతా రావాల్సిందే .. వందలాది మందికి సమాన మర్యాదలు జరగాల్సిందే..
అప్పడాలు కొరవపడ్డా .. ఆస్తులు కాజేసినట్టు మాట్లాడుకుంటారు.
గృహస్తులకి కత్తి మీద సాము.
..
మొత్తానికి ఆ తిరునాళ్ళ లో మేము సీట్లు సాధించాం...
...
బోజనాలు వంటవాళ్లతో వండించినప్పటికీ .. ..
కాటేరింగుకి మాత్రం ప్రత్యేకంగా టీం ఏర్పాటు చేసినట్లుంది.
..
ఇరవయ్యేళ్ళలోపు వయసున్న పిళ్లల్లు చక చకా వడ్డించు కుంటూ పోతున్నారు.
పులిహార ..జిలేబి రాగానే చెయ్యి అడ్డుగా ఉంచాను . ..
షుగర్ వచ్చి రెండేళ్ళయింది. తీపి తినటం మానేసాను.
కూరలు , చట్నీలు వడ్డన వస్తున్నప్పుడు
నా ఇస్తర్లో రెండు గారెలు వడ్డించే సరికి తలెత్తి చూసాను..
..
“రాజారావ్ “ నా స్టూడెంట్. ఆరు నెలల క్రితం ప్రారంభమయిన ..
ఆటోమొబైల్ డిప్లోమో మెదటి సంవత్సరం స్టుడెంటు.
. నెలలో అయిదు రోజులు సెలవు పెడతాడు, .
ఉన్న రెండు మూడు పాంట్లు ఇస్త్రి లేకున్నా శుబ్రంగా ఉండేట్టు చూసుకుంటాడు.
సమ్మర్ క్రాఫ్ చేయించుకుని క్లాస్స్ లో వెనుక బెంచి లో కూర్చుంటాడు.
ఎప్పుడు ఫెయిల్ అవడు .. అలా అని మెరిట్ లోను ఉండను .
అబోవ్ ఆవరేజీ ..
..
“స్విటు కుడా వేసుకోలేదు .. ..
గారే అయినా మరోటి తినండి సార్ “ అన్నాడు నమస్కారం పెడుతూ
..
బోజనాలు జరుగుతూనే ఉన్నాయి వాడు క్లుప్తంగా వాడి గురించి చెప్పాడు.
తండ్రికి కి పెరాలసిస్ .. ..
తల్లి ఒక ప్రవేట్ హాస్పిటల్ లో నర్సు.
బొటాబొటి ఆదాయం.
వీడు రిజర్వేషన్ వాడుకుని హాస్టల్ సీట్ సంపాదించాడు.
పెళ్ళిళ్ళ సీజన్ లో తనలాటి మరి కొందర్ని కలుపుకుని కాటరింగు పని చేస్తాడు,
నాలుగయిదు గంటల పని , మంచి భోజనం
200 నుండి 500 వరకు ఆదాయం.
ఫంక్షన్ లలో మిగిలిన పదార్ధాలని అవసరమయిన ఆశ్రమాలకి చేరుస్తుంటాడు.
వాళ్ళ వేహికల్ లో టీం అందర్నీ వేసుకుని వస్తుంటాడు.
తనకి పుస్తకాలు, అవసరాలు చూసుకుని తల్లి కి కొంత వేడిననీల్లకి చన్నీళ్ళు ..
..
తరచు వాడేందుకు కాలేజికి రాడో అర్ధమయింది...
..
బోజనాలు చివరి కొచ్చాయి సగ్గుబియ్యం పరవాన్నం..
(మా చిన్న వయసులో జోరు అనేవారు ) చిన్న ప్లాస్టిక్ గిన్నెలలో ఇస్తున్నారు .
వాడు నాకు ఇవ్వకుండా వెళుతుంటే ..
“నాకు ఒకటివ్వరా తింటాను .. అంతగా అయితే రాత్రికి మరో టాబ్లెట్ వేసుకుంటా “
..
రాజారావు రెండు కప్పులు ఉంచి వెళ్ళాడు.
గిన్నె లు రెండు ఖాళీ చేస్తుంటే మా కొలీగ్స్ నన్ను వింతగా చూసారు smile emoticon grin emoticon

కూపే పిల్ల

ఒకే కూపే  లో తనతో ప్రయాణం చేస్తున్న ఆ అమ్మాయి మనోజ్ కి విపరీతంగా నచ్చింది.
.
కొద్ది పరిచయం తోనే .. వాళ్ళు తమ భావాలు , అభిప్రాయాలూ , 
అబిరుచులు షేర్ చేసుకున్నారు..
..
పురుషాదిపత్యం పైన ఆమె చీల్చి చాండాలితే.. అతను సపోర్ట్ చేశాడు.
స్త్రీని బానిసలా చూడటం మీద చిన్న తిరుగుబాటు మాటలు మాటడితే తాను తల ఉపాడు.
సోషల్ మూవింగ్ ని అపార్ధం చేసుకుంటే కళ్ళు పోతాయి అంటే డు డూ అన్నాడు.
స్త్రీని వంటింటి కుందేళ్ళ చూడటం అంటే ఆమె చెప్పేలోగా అసహ్యం అన్నాడు,
విజయవాడ లో చెరో కొబ్బరి బోండా తాగారు.
మగాడితో పాటు ఆడాల్లు కూడా "లస్సీ" ఎందుకు తాగగూడదు? అంటే ఎవడా అన్న గాడిద అన్నాడు .
చాలా సేపు కార్డ్స్ ఆడారు. ఆమె చాక చక్యానికి చాలా సార్లు హచ్చెరువొందాడు.
ఆమె లాటి గర్ల్ ఫ్రెండ్ ఉండటం అదృష్టం అన్నాడు.
తనని చేసుకునే వాడు ఎన్నో జన్మలు పుణ్యం చేసుకోవాలి అని కితాబిచ్చాడు ..
మొత్తం మీద శ్రీదేవి హీరోయిన్ అంటే బ్రహ్మానందం సామెత అయిపోయాడు.
ట్రైన్ దిగే సరికి ఎఫ్‌బి అక్కౌంట్ లో ఫ్రెండ్స్ అయిపోయారు. కలిసి స్టేటస్ అప్డేట్ చేసుకున్నారు.
వాట్స్ అప్ లో సమూహం లో యాడ్ చేసుకున్నారు...
"సీ యు లేటర్" తో భారంగా విడిపోయారు
..
ప్రయాణ బద్దకం వదిలి పొద్దుటే అమ్మ చేతి కాఫీ తాగుతుంటే..
నాన్న ఇచ్చిన " బ్రైడ్ ప్రపోజల్ " కవర్ ఓపెన్ చేశాడు. కుపీ లోని పిల్లే
"ఈ పిల్లా?? నేను కాపరం చేయాలా కాపలా ఉండాలా?" గయ్యిమన్నాడు
smile emoticon grin emoticon tongue emoticon

జనాబా పెరిగింది.!!

డోను గుంతకల్లు మద్య మీటర్ గేజ్ రైల్వే ట్రాకు పక్కనే ఉన్న 
ఆంద్రప్రదేశ్ లోని ఒక చిన్న గ్రామం, డిల్లీ లోని సెన్సెస్ అండ్ పాపులేషన్ అధికారి
ముఖేష్ ఖన్నాదృష్టి ని ఆకర్షించింది. 
ఆ చిన్న గ్రామంలో జనాబా వృద్ది రేటు మిగతా చోట్ల పోలిస్తే ఎక్కువగా ఉంది. 
..
ఇదే విషయాన్ని ఆంధ్రపదేశ్ రాష్ట్రం లోని తమ శాఖకీ రాస్తూ ,
ఒక బృందాన్ని పంపి కారణాలతో ఒక నివేదిక పంపమని నోట్ పంపాడాయన.
..
పరిశోదన బృందం ఆ గ్రామం చేరింది.
అది చాలా చిన్న పల్లె 2011 జనాబా లెక్కల ప్రకారం
నిండా 50 గడప, 186 మంది జనాబా దాటని ఆ గ్రామం
2015 కి 312 మందికి చేరింది.
సుమారు 120 మందికి పైగా శిశువులు.
దాదాపు ప్రతి కుటుంబం లోనూ పసి పిల్లలు ఉండటం గమనించింది ఆ బృందం.
,,
అక్కడి నీరు , గాలి , ఆహారం శాంపిల్లు సేకరించబడ్డాయి.
జీవన విధానం మీద డాక్టరేట్లు చేసిన వాళ్ళు సామాజిక ఇంటర్వ్యూ లు చేశారు.
నెల రోజులు గడిచాయి కానీ జనాబా పెరుగుదల కి
సరైన కారణం మాత్రం కనుగొన లేకపోయారు .
...
డాక్రా మహిళా గ్రూప్ లలో చర్చకి వచ్చింది ఈ వ్యవహారం.
అక్కడా ఏమి తేల లేదు.
గ్రామం లోని ప్రాధమికి పాఠశాల వద్ద ఒక కంప్లయింట్ బాక్స్ ఉంచారు.
కొంత మంది వారికి తోచిన కారణాలు రాసి ఆ పెట్టెలో వేయమన్నారు .
..
రెండో రోజే ఆపెట్టెలో ఒకే ఒక కాగితం ఉంది.
..
“ తెల్లవారు ఝామున పెద్దగా శబ్దం చేసుకుంటూ
అందర్నీ నిద్ర ..'లేపు' కుంటూ
వెళ్ళే ప్రశాంతి ఎక్స్ ప్రెస్ రైలు బండి టైమింగ్స్
మారిస్తే మాత్రం ఒప్పుకునేదే లేదు “ .. ఇట్లు గ్రామ మహిళలు
.grin emoticon tongue emoticon pacman emoticon pacman emoticon
..
ది ఫైల్ ఇస్ క్లోజ్డ్.

Monday, 8 June 2015

స్టేట్ ఆఫ్ మైండ్

ఒక చిన్న సమావేశం లో పాల్గొన్న కొంతమంది అదికార్లు
ఆంతరంగిక సంభాషణ...
" నాకు పని చేయాలని ఉంది. ఏమి చెయ్యాలి, ఎలా చెయ్యాలో అర్ధం అవట్లేదు. పాతికేళ్ళకు పైగా సమర్ధవంతంగా పని చేస్తున్నాను కానీ ఇప్పుడు పూర్తి అయో మయం గా ఉంది."
" పనులు జరుగు తుంటాయి. తరువాత విధానాలు వస్తుంటాయి.?"
"విదానాలు పాటించలేదని మొమో లు వస్తుంటాయి?"
రికార్డ్స్ ఎలా మైన్టైన్ చెయ్యాలో, మనకి చెప్పరు. అకౌంటెంటు ఉండడు. పనులు నాయకులు పురమాయిస్తారు. పే మెంట్స్ అవుతాయి. థర్డ్ పార్టీ ఎంక్వరీలు జరుగుతాయి. ఆడిటర్స్ వస్తారు.
హడావిడి చేస్తారు? "
జిల్లా అదికార్లకు ఏమికావాలో తెలీదు.వారం నిండా, మీటింగులు, వీడియో కాన్ఫరెన్స్ లు, టార్గెట్స్ , ప్రోఫార్మాలు, రిపోర్త్లు..క్షేత్రస్థాయి పరిశీలనకి వారం లో కనీసం రెండు రోజులు విడవరు"
మొత్తానికి పనిలో క్వాలిటీ పోతుంది. కాకుల లెక్కలు, దొంగ రిపోర్త్లు మళ్ళీ మొదలయ్యాయి."
బదిలీలు ఉంటాయో లేదో తెలీదు. ఉంటే ఎవర్ని ఒప్పించాలో తెలీదు.ఎందుకు మెప్పించాలో తెలీదు "
...

" ఇంతెందుకు .. సరిగ్గా పెద్దాయన స్టేట్ ఆఫ్ మైండ్ సెట్ లోనే అందరం ఉన్నాం"

Wednesday, 3 June 2015

చీకటిరాత్రి

అక్కడంతా వెన్నెల కురుస్తుంది.
.
పచ్చగడ్డి మీద అక్కడక్కడా గడ్డిపూలు వింతగా పరుచుకుని ఉన్నాయి.
దగ్గర్లో పంట ఏటికాలవ ఓర ఓరా ప్రవహిస్తూ ఉంది. ప్రకృతి ప్రశాంతంగా ఆహ్లాదకరంగా ఉంది. 
నారాయణ అక్కడే పడుకొని ఉన్నాడు.
 పచ్చిక మీద మెత్తగా నడుంవాల్చి తలక్రింద చేతులు పెట్టుకుని ఆకాశంలోకి చూస్తున్నాడు.
 ఏదో పిట్ట ఆకాశంలో ఒంటరిగా ప్రయాణిస్తూ ఉంది.
 నారాయణ దాన్నే చూస్తూన్నాడు. ప్రక్కన ఏదో చప్పుడు వినిపించింది.
.
 సన్నటి నవ్వు వినిపించింది. నారాయణ ఉలిక్కిపడ్డాడు..
 ప్రక్కనే ఉన్న కొబ్బరి చెట్టుచాటున ఎవరి స్త్రీ దాక్కుని ఉన్నట్లు అనిపించింది. 
నారాయణ బెరుగ్గా భయం భయంగా చూసాడు.
.
 మెల్లిగా లేచి అడుగులో అడుగేస్తూ చెట్టుకి ఆ వైపుగా వచ్చి చూసాడు..
 అక్కడో స్త్రీ నిలబడి ఉంది. నునుపైన భుజాలు నగ్నంగా ఉన్నాయి.
 పెదాలు తడిగా ఉన్నాయి. బిగించిన పెదాల వెనుక నవ్వు చెలియకట్ట దాటడానికి సిద్దంగా ఉంది.
 మెడ శంఖువుగా ఉంది. గుండెల మీద మల్లె దండలు ఒత్తుగా చుట్టి ఉన్నాయి. 
వాటి మద్య నుండి ఆస్పష్టంగా ఎత్తైన వక్ష స్థలం  కనిపిస్తూ ఉంది. 
నారాయణ చూపుల చిక్కుముడిని జాగ్రత్తగా విప్పుకుంటుంటే ఆమె నవ్వింది. 
ఆ నవ్వు శ్రావ్యంగా ఉంది. నారాయణ ఆమె కళ్ళల్లోకి చూసాడు.
 ఆ కళ్ల నిండా ఆహ్వానం. బాహువులు విశాలంగా తెరిచింది.
 ఒక్క ఉదుటన నారాయణ అడుగు ముందుకు వేశాడు.
..
 అప్పటివరకూ కాళ్లవద్ద పడుకున్న కుక్క కుయ్ మని మొరిగిదూరంగా వెళ్ళి ముడుచుకుంది...
నారాయణకి మెలకువ వచ్చింది. 
చిరుగుల చాపమీద తిరిగి పడుకున్నాడు.
.
 పాకలో మూలగా ఉన్న అంట్ల మీద పిల్లోకటి దూకింది..
 నారాయణ లేని దాన్ని తరిమాడు.
 దాసు మంచం కాళీగా కనిపించింది. 
తిరునాళ్ళ నుండి ఇంకా రాలేదు గామోను అనుకున్నాడు. 
రోడ్డుమీద అప్పుడప్పుడు వెళ్ళే లారీల చప్పుడు వినిపిస్తూ ఉంది.
.
  నారాయణ అప్పటివరకు వచ్చిన కల ని  నెమరు వేసుకున్నాడు..
 ఆ కల అతడికి కొత్తకాదు. రోజు రాత్రి పలకరించి నిద్ర లాక్కునే కలే !
 ప్రతీసారి సరిగ్గా అక్కడే ఆగిపోతుంది.
 ఆ తర్వాత ఎంత ప్రయత్నించిన కధ ముందుకు జరిగేదికాదు. 
నిజానికి నారాయణకి ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియదు. 
కానీ ఏదో జరుగుతుందని మాత్రం తెలుసు.
 నారాయణ కలలో కన్పించిన స్త్రీని మరోసారి గుర్తుకు తెచ్చుకున్నాడు.
 చలిమంట వద్ద కూర్చున్నట్లు వళ్లు మెల్లిగా వేడెక్కింది.
  సామ్రాజ్యం!
అవును సామ్రాజ్యమే అనుకున్నాడు.
నారాయణకి తల్లి తండ్రి తెలియదు. తెలిసిందల్లా తను  అనాధ నని
అనాధలకి తల్లి తండ్రి ఉండరని ---
..
ఓసారి రైల్లో చిన్న దొంగతనం చేసి పట్టుబడి తన్నులు తింటుంటే దాసు కాపాడి తనతో తెచ్చాడు...
 సరిగ్గా నాలుగేళ్ల క్రితం. నారాయణకి దాదాపు పదేళ్ళ వయసుంటుంది! 
అప్పటి నుండి రోడ్డుప్రక్క ఆ పాకలో దాసుకు సహయంగా పొద్దుటినుండి సాయంత్రం వరకు
 పని...... ఇడ్లీ..... చట్నీ...... టీ, కాఫీ, బోండా, బజ్జితో 
సుదీర్గమైన పగల్లు, రాత్రులు, కడుపునిండా తిండి కంటినిండా నిద్ర!
.
  సామ్రాజ్యాన్ని చూసేంతవరకు నారాయణకు మరేం తెలియదు..
.
 ఓ రాత్రి పాకలో చప్పుడికి మేలుకువోస్తే దీపం వెలుగుతూ కనిపించింది..
 టీ బల్ల, బెంచీలు, ప్లేట్లు, సాసార్లు, గ్లాసులు అన్నీ యధావిదిగా మౌనంగా ఉన్నాయి.
.
 నులకమంచం మీద దాసు పడుకొని ఉన్నాడు. నడుంవరకు దుప్పటి కప్పుకొని ఉన్నాడు. .
మంచం క్రింద తెల్లటి చీర ఒకటి కుప్పగా పడి ఉంది. 
నారాయణకి ఆశ్చర్యం వేసింది. ఆ పాకలో తను దాసు తప్ప మరెవ్వరూ ఉండరు. 
అలాంటిది, ఎవరో స్త్రీ! అదీ దాసు పక్కలో—
.
నారాయణ మెల్లిగా లేచి మంచమ్మీదకి చూసాడు. ఎవరో స్త్రీ నగ్నంగా ఉంది. సన్నటి నడుంచుట్టు లంగా చుట్టుకొని ఉంది. విశాలమైన ఛాతిమీద వక్షోజాలు గర్వంగా నిటారుగా మెలబడి ఉన్నాయి. బలమైన తొడలు తెల్లగా అరటి బోదేలలాగా ----
 నారాయణకి నిద్రమైకం వదిలింది. చాపని ఒకవైపుగా లాక్కుని ఆ దృశ్యం పూర్తిగా కనిపించేట్లు పడుకున్నాడు.
 ఎక్కడినుండో వచ్చేకాంతి నునుపైన ఆమె శరీరం మీద పడి విశ్లేషిస్తూ ఉంది. నారాయణకి వెళ్ళి ఆ శరీరం తాకాలని, ఆ వంపులన్నీ కావాలని, ఆ శరీరం మీద మెత్తగా పడుకోవాలని అనిపించింది.
అదిగో సరిగ్గా ఆనాటి నుండే నారాయణకి నిద్ర దూరమైంది.
రోజులు గడిచేకొద్ది ఆమె పేరు సామ్రాజ్యమని, దాసుకి ఈ మద్యే పరిచయమైందని, దాసుతో చనువుగా ఉంటుందని, అప్పుడప్పుడు రాత్రులు చీకటి పడ్డాకవచ్చి తెల్లవారకముందే మాయమవుతుందని అర్దమైంది.
నారాయణ ఆనాటినుండి చాలా రాత్రులు మేలుకొని సామ్రాజ్యం కోసం ఎదురుచూస్తూ పడుకునేవాడు. నగ్నంగా ఉన్న ఆమెను దాసు ఏంచేస్తాడో చూడాలని పొంచి ఉండేవాడు. అలా ఎదురుచూస్తూనే నిద్రపోయేవాడు. ఆ నిద్రలో అదే కలవచ్చేది. మల్లేదండలు చుట్టుకున్న స్త్రీ ఆహ్వానించేది. తను అలాగా అడుగు ముందుకెసేసరికి మెళుకువ వచ్చేది. ఎదురుగా మంచమ్మీద సామ్రాజ్యం నిద్రపోతూ కనిపించేది. ఆ శరీరం సృష్టి లో అందం అంతా  కుప్పగా పోసినట్టు ఉండేది.
నారాయణ ఆలోచనల్ని తరిమికొడుతూ బోర్లా పడుకున్నాడు. నేల గట్టిగా రాయిలాగా తగిలింది. తిరిగి వెళ్లికిలా పడుకున్నాడు. సామ్రాజ్యం బోర్లా తిరిగి పడుకుంటే ఎలా ఉండేదో గుర్తొచ్చింది. నున్నగా విశాలంగా వీపు, నడుంవద్ద మొదలైన ఎత్తైన వంపు.
నారాయణ ముఖంమీద వాలిన దోమని తరిమికొట్టాడు.
రోడ్డుమీద ఏదో  లారీ వేగంగా వెళ్లిపోయింది.
తిరిగి అలుముకున్న నిశబ్దాన్ని చేదిస్తూ పాక తలుపుమీద చప్పుడయింది.
దాసు వచ్చేసినట్టున్నాడు అనుకుంటూ నారాయణ లేచాడు. లాంతరువత్తి పెద్దది చేసి తలుపుతీశాడు.
ఏం జరుగుతుందో తెలుసుకునే లోపు ఎవరో వచ్చీ తలుపు మూసేశారు.
వెనుదిరిగి చూసేసరికి మంచమ్మీద సామ్రాజ్యం.
భుజం మీద జారిన పమిటని అశ్రద్దగా సర్దుకుంటూ---
నారాయణ కళ్ళు వణికాయి. గుండె వేగం పెరిగింది. వళ్లు వేడెక్కింధి.
సామ్రాజ్యం కళ్ళు పెద్దవిచ్చేసి పాకంతా తేరిపార చూసింది.
“దాసులేడా!” ఆశ్చర్యంగా అడిగింది.
నారాయణ అడ్డంగా తలూపాడు  “కుంటి గంగ తిరునాళ్ళకెళ్లాడు.”
సామ్రాజ్యం ఏదో గొణుక్కుంది. “
“ఎప్పుడొస్తాడు ?
“అర్ధరెత్తిరి కి వచ్చేస్తాడు” నారాయణ తొందర్గా చెప్పేశాడు .
“నరే నేన్నిక్కడే పడుకుంటాను” అని సమాదానం కోసం చూడకుండా నడుం వాల్చింది.
 నారాయణ తలుపు గడిపెట్టి చాపమీద పడుకున్నాడు .
సామ్రాజ్యం ఈ వైపు తిరిగింది.
“నీ పేరేంట్రా ? “అంది .. “నారాయణ “
“నన్నెప్పుడయినా చూశావా?”
నారాయణ తలుపాడు . “ఎప్పుడూ ?” కుతూహలంగా అడిగింది సామ్రాజ్యం.
“రాత్రిపూట చీకట్లో”
సామ్రాజ్యం నవ్వింది. “బాగుంటానా?”
“చాలా బాగుంటావు”
సామ్రాజ్యం, ఒక్క క్షణం సిగ్గు పడింది.
“నా దగ్గర పడుకోవాలని అనిపించేదా?”
నారాయణ సామ్రాజ్యం వైపు చూశాడు.
పల్చటి జాకెట్టు  లోంచి ఎత్తుగా పుష్టి గా శరీరం కనిపిస్తుంది ఔనన్నట్లు తలుపాడు .
“రా మరి ఇక్కడే పడుకో” మంచం మీద ప్రక్కగా జరిగింది సామ్రాజ్యం .
నారాయణ లేచి ఒక్క అంగలో  మంచం మీదికి చేరాడు.
కలలో ప్రతిసారి ఆపే  సరిహద్దుని జయించి ఆమె బాహువుల మద్య ఒదిగిపోయాడు
మెత్తటి శరీరపు స్పర్శ, చేతుల నిండా ఒదుగుతుంటే నారాయణ ఉక్కిరి బిక్కిరి అయి పోయాడు .
“చూడాలని ఉందా?” ఆ గొంతు జీరా గా ఉంది.
సామ్రాజ్యం పల్చటి ఆచ్ఛాదనని క్షణంలో దూరం చేసి
నారాయణ ముఖాన్ని, గట్టిగా గుండెల కదుముకుంది.
..
సంవత్సరాల క్రితం జారవిడుచుకున్న జ్నాపకం క్షిపణై ,
 మెదడు పోరాల్ని తాకినట్టు మెత్తటి ఆ స్పర్శా , చమట వాసన ....
అతడు మరిచి పోయిన ఒక జ్నాపకాన్ని వెనక్కి తెచ్చింది.
సరిగ్గా అదే స్పర్శా , చల్లదనం, ఆ చేతల్లో నిండయిన ప్రేమ ,
మెత్తటి అనురాగం , బుగ్గల్ని తాకిన ఆ పెదాలు అద్దిన అప్యాయతా –
 వెరసి అమ్మ !!!
నారాయణకి లీలగా తల్లి గుర్తొచ్చింది.
పగలంతా శ్రమ పడ్డాక వచ్చి తనని గుండెలకి అడుముకోవటం గుర్తొచ్చింది.
నారాయణ చేతులు వణికాయి.
వళ్లు చల్లబడింది. గాలి పీల్చడం కష్టమయి పోయింది.
మెల్లగా సామ్రాజ్యానికి దూరంగా జరిగాడు. సామ్రాజ్యం వింతగా చూడబోతున్నప్పుడు –
బయట చప్పుడయింది . అపుడే లారీ దిగి పాక వైపు వస్తూ దాసు.!!
 నారాయణ తలుపు తెరిచాడు.
ఎక్కడినుండో ఒక వెలుగు రేఖ ఆప్యాయంగా నారాయణని స్పృశించింది.
 నారాయణ బయటికి నడిచాడు . వెలుగు రేఖల్ని వెతుక్కుంటూ ,
 ఆ చీకటి రాత్రి ఒంటరిగా నడక సాగించాడు.

(మయూరి సచిత్ర వార పత్రిక, జూన్ 16, 1989)

www.susri.home.blog

  అందరికీ నమస్తే 66o పోస్టులు పైగా వ్రాసిన ఈ బ్లాగ్ లోని నా పోస్ట్ లలో  చాలా అచ్చుతప్పులు ఉండటం గమనించాను.  వాటన్నిటినీ ఎడిట్ చేస్తూ, modify...