Friday, 11 November 2016

As father as son.

హాస్టల్ లో ఉన్న తమ్ముడి తో మా ఆమ్మాయి స్పీకర్ ఫోన్ లో మాట్లాడుతుంది.
“మొన్న సండే వ్రాసిన appsc ఎక్సామ్ ఏమయిందక్కా?”
“రిజల్ట్స్ రాలేదురా? కీ ఇచ్చారు. క్వాలిఫై దాటి మరో 30 మార్కులు వస్తాయి”
“మళ్ళీ ఎక్సామ్ ఉందా? “
“అవును రౌండ్ టూ మెయిన్స్ ఉంటుంది. డిసెంబరు ఎండింగ్ లో “
“ సబ్జెక్టేనా ?
“ అవును.. GK కూడా ఉంటుంది.”
“ఇంకా ఏం చదువుతావు లే అక్కా?”
“ రేయ్ స్పీకర్ ఆన్ చేసి ఉందిరా?”
“చెప్పవే.. అక్కా బాగా చదువు  అక్కా యు కెన్ డూ ఇట్ ”.
“రేయ్ నాన్న కూడా పక్కనే ఉన్నారు. వింటున్నారు”
 “రోజు న్యూస్ పేపర్ చూడు, రెండో పేజీ లో వ్యాసాలు చదువు. ..”
“రేయ్ ఇంక చాలు గాని. పిచ్చోడిలా ఆ గడ్డం ఏమిటి క్రాఫ్ చేయించు కోలేదా?? ఫోటో చూశాను “

“అక్కా.. సిగ్నల్ బాలేదు . మళ్ళీ చెయ్యనా?”

Tuesday, 8 November 2016

బుడగ

నేనో ప్రముఖుడు తో ఉన్న ఫోటో ఆమె చూసింది.
...
అలానే చూస్తూ ఉంది.
...
నా చొక్కా బిర్రు అయింది.
...
"మీ ఫోటో అతను కుడా ఇలానే దాచుకుని ఉంటాడా??"
..
"టప్"
ఎవడు రా బుడగ పగల గొట్టీంది ??

Sunday, 6 November 2016

శివ శివా !!

మీకు మళ్ళీ చెబుతున్నా, చిన గంజాం (మా పాత ఇళాఖా.. 6 ఏండ్లు పని చేసాను) లో 
మా మిత్రుడు 'సాయని శ్రీను' వాళ్ల ఇంట్లో నేను మా పెద్దమ్మాయి భావనా భోజనం చేసాం. 
..
కంద కూర, బ్రెడ్ ముక్కల కూర పులుసు బాగున్నాయి.
శుబ్రంగా తిన్నాం.
...
తెలంగాణా ఏర్పడ్డాక, ఇక్కడ వీటిని 
నాటు కోడి కూర, చాపల పులుసు అంటున్నారట..
ఏంటో కలి కాలం.
...
శివ శివా.. ఎంత ఘోరం.!!😁😁

Friday, 4 November 2016

రచనా సహకారం.

మొన్నో పాత స్నేహితుడు (చదువుకునే రోజుల ) FB లో గుర్తు పట్టి 
కనెక్ట్ అయ్యాడు. 
ప్రేమ వివాహం చేసుకుని చక్కగా ఉంటున్న దంపతులిద్దరూ చాలా సేపు ఫోన్ లో మాట్లాడారు. 
" అప్పటి ప్రేమలేఖ లకి సహా రచయిత మిరే నటగా?" అంది ఆమె.
"హలో .. హల్లో.. హల్లో.. మీరేదో చెబుతున్నారు. సరిగా వినబడటం లేదు. సిగ్నల్ సరిగా లేనట్టు గా ఉంది.. మరో సారి మాట్లాడతాను" ఫోన్ పెట్టేసాను. .
(ఒరేయ్ .. నికుందిరా నా చేతిలో )

Wednesday, 2 November 2016

కాట్ ??

నిండు బస్సు. 
గుండమ్మ లేడీస్ సీట్లో కూర్చుని ఉంది.
వెనుక నిలబడి నేను.
టికెట్లు తననే తీసుకొమఁన్నాను.
లేడి కండక్టర్ కి నన్ను చూపించి టిక్కెట్ తీసుకుంది తను.
"సార్ మిరేనా?? క్యాట్??" అరిచింది ఆవిడ.
***
RTC వారికి విన్నపం. Concessional Annual Travel Card పెరు మార్చ గలరు. 

ఇంట్లో విషయాలు పబ్లిక్ గా అడుగుతున్నారు.

యుద్దం తర్వాత!!

బురఖా లలో భర్త వెనుక నాలుగు అడుగుల దూరం లో ఫాలొ అయ్యే భార్యలు.. ఉండే ఇరాక్ లో..
..
ఆడవాళ్ళు నడిచిన బాటలోనే పడడుగులు వెనుక మగవాళ్ళు  నడవటం చూసి ఆశ్చర్య పోయాడు కొత్తగా అక్కడికి వచ్చిన మరో దేశపు జర్నలిస్ట్ .
..
స్థానిక జర్నలిస్ట్ తో ఈ పరిణామం గురించి విచారించాడు.
..
"ఇందులో ఆశ్చర్యం ఏముంది??" ఆంగ్లం లో నిట్టూర్చాడు ఆతను.
..
"యుద్ధం తర్వాత చాలా మార్పులు వచ్చాయి."
..
అర్ధం కాలేదు అన్నాడు ఇతను.
...
"ఏమో ల్యాండ్ మెయిన్స్ ఎక్కడయినా ఉండొచ్చు."

Tuesday, 1 November 2016

పులిహోర


గుళ్ళో ప్రసాదాల వినియోగం అప్పుడు ప్రపంచం మొత్తం రివ్యూ అవుతుంది.
“అసలు కార్తీక మాసం మహిమ ఏమిటో తెలుసా?” మా వీది లో ఉండే పేపర్ డీలర్ కేశవ అడిగాడు.
మనం పురాణాల్లో సానా వీకు. పట్టుమని పాసు మార్కులు కూడా రావు. ఎందుకయినా మంచిదని ఒక చెవి అటువేసి ఆసక్తి గా చూశాను.
“సంవత్సరం మొత్తం మీదా ఆడాళ్ళు ఇంటి మగమనిషిని గౌరవించేది ఈ నెలే?” అన్నాడు.
అదేందిరా సామి కార్తీక మాసం మొదటి రోజే గౌతమి అంత స్టేట్మెంట్ ఇస్తే? పేపరు ఏజంటూవీ. మిగిలిన పేపర్లు చదివే పనిలే ??”
“అదెలా?” ఒకాయన నెత్తి తడుము కుంటూ అడిగాడు. అది అతని మేనరిజం అంది. అనవసరంగా నెత్తిన బుడిపెలు ఉన్నాయని అపార్ధం చేసుకోకండి.
“ఏం లేదండీ. ఈ నేలంతా ఏ గుడి లో ప్రసాదం తిన్నా సరిపోతుంది. మద్యాన్నం పూట అయ్యప్ప స్వాములకి బోజనం సౌకర్యం చాలా గుళ్లలో ఉందనే ఉండే.


ఒక లుంగీ, చొక్కా, టవలు ఉంటే ఎక్కడయినా బతోకొచ్చు. పెద్దగా ఇంట్లో వాళ్ళతో పని ఉండదు. అందుకే చేతుల్లో నుండి జారీ పోకుండా జాగర్తగా కనిపెట్టుకుని ఉంటారు.”
“నిజమా?” అడిగాను నేను.
“నిజం సార్.. కావాలంటే చూడండి. వందలు, వందలు పెట్టి మన చేత చీరలు కొనిపిస్తారా? ఎప్పుడు ఆ బొమ్మల గొట్టలు (నైటీలు కాబోలు) వేసుకుని జుట్టు విరబోసుకుని ఉంటారు. ఈ నెలలో చూడండి తెల్లవారగట్ల రెడీ అయ్యి రంగు రంగుల చీరలు కట్టి గుడికి వస్తారు. మన కి టయానికి టంచనుగా కారేజి రెడీ చేసి పెడతారు.” రహస్యంగా చెప్పాడు.
పిల్లాడి దగ్గర చాలా విషయం ఉంది. రెండో రౌండ్ పులిహార, అలసంద గుగ్గిళ్ళు పెట్టించుకుని మళ్ళీ సంభాషణ మొదలెట్టాము.
“ఏం సార్ ? ఈ విషయం లో మీ విలువయిన అభిప్రాయం ఏమిటి?” వచ్చే ఏడాది రిటైర్ అవబోతున్న మాస్టారిని అడిగాను.
‘అబ్బే .. దానికి దీనికి సంభందం ఏమి లేదు కేశవా .. మనం తెలివిగా ఉండాలి’ అంతే అన్నాడాయన.
“తెలివిగా అంటే?”
“మనం ఇంట్లో పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకుని , చిన్న చిన్న విషయాలు వాళ్ళకి వదిలేస్తే సరి. ఒకరి సబ్జెక్ లో మరొకరు ఇంటర్ ఫియర్ కాకూడదు. “
“మాస్టారు మాది లాస్ట్ బెంచ్. వివరంగా చెప్పండి.” పులిహారలో ఇవాళ పచ్చి మిర్చి తగిలిందే లేదు. నా బాద ఎవరూ తీర్చేది కాదు.
“ఏం లేదండీ. ఇప్పుడు అమెరికా లో ఎవరు ప్రెసిడెంటు గా గెలవాలి అనే విషయం నేను చూసుకుంటాను. ఆవిడ ఈ విషయం లో జోక్యం చేసుకోడు. అమ్మాయి పెళ్లి ఎవరితో చెయ్యాలి అనే చిన్న చిన్న విషయాలు ఆమె చూసుకుంటది. మనం జోక్యం చేసుకోం. ఇంక విలువల ప్రసక్తి ఏముంది?” చెప్పాడు మాస్టారు నవ్వుతూ.
అప్పటికే పులిహోర తినటం పూర్తయింది.
“ మాస్టారూ మీరు కదలకుండా కాళ్ళు దగ్గర పెట్టుకుని నిలబడి ఉండండి. చేతులు కడుక్కుని వచ్చి పాదాభి వందనం చేసుకుంటాను.” గబ గబా డస్ట్ బిన్ వద్దకి నడిచాను.




www.susri.home.blog

  అందరికీ నమస్తే 66o పోస్టులు పైగా వ్రాసిన ఈ బ్లాగ్ లోని నా పోస్ట్ లలో  చాలా అచ్చుతప్పులు ఉండటం గమనించాను.  వాటన్నిటినీ ఎడిట్ చేస్తూ, modify...