Sunday, 18 September 2016

అప్పుడూ.. ఇప్పుడూ

ఒక యాక్సిడెంటు లో బార్యా బర్తలు సుఖంగా చనిపోయారు.
..
దయ్యాలై 'వైతరిణి' వద్ద కలుసుకున్నారు. 
..
"నువ్వేం మార్లేదు కాంతం. అలాగే ఉన్నావు" అంది మగ దెయ్యం

దైవ సహాయం

పూర్వం ఒక రాజ్యం లో ఒక వ్యాపారి ఉండేవాడు. అతను బలమయిన ఏనుగులను సేకరించి పోషిస్తూ వాటిని రాజుగారి సైన్యానికి సరఫరా చేసేవాడు. వృద్దాప్యం తో మరణ శయ్యపై ఉన్నప్పుడు తన ఆస్తి మొత్తాన్ని ముగ్గురు కుమారులకు పంచుతూ వీలునామా వ్రాయించి  కాలం చేశాడు.
కుమారులు శ్రద్దగా తండ్రికి అంత్య క్రియలు నిర్వహించారు. ఖర్మాతరం తీరిగ్గా కూర్చుని వీలునామా చూచారు. తండ్రి చెప్పిన విదంగా అన్నీ పంచుకోగలిగారు కానీ ఆస్తిలో ఎక్కువ విలువ చేసే  ఏనుగులను మాత్రం పంచుకోలేక పోయారు. పెద్ద కుమారునికి సగభాగం (1/2) అని, రెండవ వానికి మూడో వంతు(1/3) అని, చిన్న వాడికి తొమ్మితో వంతు (1/9) అని వీలునామా సారాంశం .
ఉన్న 17 ఏనుగులను ఇలా పంచుకోవటం వారికి సాధ్యం అవలేదు. తమలో తాము కలహించుకోసాగారు.
విషయం వ్యాపారి వద్ద రాజు గారి తరపున  ఏనుగులు కొనుగోలు చేసే సైన్యాధికారి వద్దకి చేరింది.
ఆయన వచ్చి కుమారులని పరామర్శించి, వీలునామాను చదివి సమస్యను పరిష్కరించడానికి పూనుకున్నాడు.
తను అదిరోహించి వచ్చిన ఏనుగును వీటితో కలిపాడు. మొత్తం 17+1=18 ఏనుగులయ్యాయి.

పెద్ద కుమారుడికి సగభాగం అంటే 18/2=9 ఏనులను పంచాడు.
రెండవ కుమారునికి ముడవబాగం అంటే 18/3=6 ఏనుగులను పంచాడు.  
మూడవవానికి తొమ్మిదవ బాగం గా 18/9=2 ఏనుగులను తీసుకోమన్నాడు.
ముగ్గురు 17 ఏనుగులను పంచుకోగా మిగిలిన తన ఏనుగు ఎక్కి తాపీగా వెళ్లిపోయాడు.
***
జీవితం తో మనకి వచ్చే సమస్యలు ఇలాటివే.
వాటిని పరిష్కరించుకోవటానికి సైన్యాదికారి గారి ఏనుగు లాటిది ఏదో కావాలి .
అదే   ‘దైవ సహాయం.’
...

మిత్రులకి శుభోదయం.  

Saturday, 17 September 2016

యుద్దం లో గెలుపే ముగింపు

యుద్దం లో న్యాయం అన్యాయం అనేవి ఉండవు. కేవలం గెలుపే ముగింపు.
రక్తపాతమే మార్గం. ఇది చరిత్ర పుటల్లో ఎక్కడయినా తారసపడే నిజం.
షాజహాన్ తన ప్రియమయిన  మూడవ బార్య ముంతాజ్ (అర్జుమన్ భాను బేగం) 14 గవ బిడ్డకు జన్మనిస్తూ 38 వ యేట 1631 లో  గుర్రపువాతం తో చనిపోయింది.
షాజహాన్ కుంగి పోయాడు. ఆమె గుర్తుగా 22 ఏళ్లపాటు తన ధనాగారం మొత్తాన్ని  వెచ్చించి అగ్రాలో యమునా తీరం లో  తాజ్మహల్ నిర్మించాడు.
అక్కడి నుండి మైలు దూరం లో నే అతని కోట. బార్య చనిపోయిన 26 ఏండ్ల తర్వాత 1657 ప్రాంతం లో మొఘల్ చకరవర్తి ‘షాజహాన్’ కి జబ్బు చేసింది.
తండ్రి త్వరగా కాలం చేస్తే సింహాసనం ఆక్రమించవచ్చు అని నలుగురు కుమారులు కాచుకుని ఉన్నారు.
ఆదిపత్యం కోసం తమలో తాము పోరాడు కున్నారు. పెద్ద కొడుకు ‘దారాసుఖోవ్’, ఔరంగజేబ్ చేతిలో ఓడిపోయి ఆగ్రా కోటకి పారిపోయాడు. కోటలో షాజహాను తో కలిసి ఆత్మరక్షణ చేసుకున్నాడు. కోట తలుపులు మూసివేసి సైన్యం తో సహా లోపలే ఉండి పోయారు.
ఆగ్రా కోట అత్యంత బలమైనది. దానిలో ప్రవేశించడం ఔరంగజేబుకి క్లిష్టమయింది. అతనొక పన్నాగం పన్నాడు. కోటలో జబ్బుచేసి ఉన్న తండ్రికి ఒక లేఖ వ్రాశాడు. ‘నేను మహా పాపిని జహాపనా.. నీతో యుద్దం చేయటం, మహా నేరం తప్పు అని తెలుసుకున్నాను. నా మనసు దుఖం తో పూడుకుని ఉంది. నేను వచ్చి నీ కాళ్ళ మీద పడి క్షమాపణ వేడుకుంటే తప్ప నాకు మనసు కి ప్రశాంతత లేదు. కోట తలుపులు తెరిపించు. ని ఇష్టం వచ్చిన కుమారునికి సింహాసనం ఇవ్వు. నా కెటువంటి అభ్యంతరం లేదు”

ఎంతయినా తండ్రి కదా?!!, ప్రక్కనున్న పెద్ద కుమారుడు వారిస్తున్న వినకుండా కోట తలుపులు తెరిపించాడు. ఔరంగజేబు సైన్యం తో పాటు కోటలోకి ప్రవేశించాడు. మొదట తండ్రిని ఖైదు చేశాడు. అన్నకి శిరో ముండనం చేయించాడు. వీధుల్లో ఊరేగించాడు. ఆ తర్వాత అతన్ని హేయంగా చంపించాడు.
షాజహాను మరో తొమ్మిదేళ్లు జీవించాడు. అంత కాలము ఖైదీ గానే జీవించాడు. తనకు అత్యంత ప్రియమయిన తాజ్మహల్ ని చూడాటానికి పోనివ్వమంటే, ఔరంగజేబు తండ్రికి అనుమతి ఇవ్వలేదు.
ఆగ్రా కోటలో తను బంధిగా ఉన్న గదిలో ఉన్న చిన్న కంత గుండా మైలు దూరం లో ఉన్న తేజోమయమయిన తాజ్ మహల్ ని చూస్తు.. చచ్చేంత వరకు తొమ్మిది సుదీర్గ సంవత్సరాలు కాలం గడిపాడు.

అందుచేత.. యుద్దం లో గెలుపే ప్రధానం. 

ఎవరు నేర్పారు?

తేనెటీగ జాతికి చెందిన ఒక ‘కందిరీగ’ ఉంది.


అది జీవితం లో ఒక సారి మాత్రమే గ్రుడ్లను పెట్టి చనిపోతుంది. తన బిడ్డలని తనెప్పుడు చూడదు. కానీ పుట్టబోయే బిడ్డలకు ముందుగానే ఆహారాన్ని సమకూరుస్తుంది. 
అది గడ్డి పురుగు (grass hopper) ని సంపాదించి దాన్ని వశం చేసుకుని సరిగ్గా ఎక్కడ కుట్టాలో అక్కడ కుడుతుంది.
 దాంతో ఆ పురుగు అచేతనం (unconscious) అవుతుంది. కానీ చావదు. బద్రపరచబడిన మాంసం రూపంలో అది బతుకుతుంది. 
ఆ కందిరీగ ఆ గడ్డి పురుగుని ఒక మట్టి అరలోకి తీసుకుపోతుంది. అక్కడ పురుగునకు తగినంత దగ్గరలో తన గ్రుడ్లను పెడుతుంది. గ్రుడ్లను పెట్టి అది ఎగిరిపోయి చనిపోతుంది. తన పిల్లలను ఎప్పుడు చూడలేదు. :(
గ్రుడ్ల నుండి పిల్లలు బయటకి వచ్చినపుడు అవి దగ్గరలో ఆ 'అచేతనమయిన' పురుగును కొద్ది కొద్దిగా కోరుక్కుని తింటూ ఏదుగుతాయి. కానీ చంపవు. వాటికి చచ్చిన పురుగుల మాంసం ప్రాణాపాయకారం.
తల్లి ఈగ తన గ్రుడ్ల నుండి రాబోయే పిల్లలకు ఆహారాన్ని సమకూర్చి ఎగిరి పోయి చనిపోవటం అనే ప్రక్రియ సృష్టి ఆరంభం నుండి జరుగుతూ ఉండి ఉండాలి. ఈ విధానాన్ని అది ఎక్కడో చూసి నేర్చుకొన్నదనటానికి అవకాశం లేదు.
'సృష్టికర్తే' దానికి బోదించి ఉండాలి.
(ఈ విషయం 1960 లో ప్రచురితమయిన Readers Digest, పత్రికలో ‘భగవంతుడు ఉన్నాడు అని విజ్ఞాన శాస్త్రవేత్తలు నమ్మటానికి ఏడు కారణాలు’ అనే వ్యాసం లోనిది.)
Good Morning.

Friday, 16 September 2016

బ్రహ్మచర్యం

ఒక్కోసారి సంభందం లేని మాటలు చాలా ఇబ్బంది పెడతాయి. 
సరిగ్గా గుడి ప్రసాదాల వితరణ సమయానికి కి పక్క అపార్ట్మెంట్ లో ఒక వ్యక్తి వస్తుంటాడు. నాలాగే :) 
మాట్లాడుకునే ప్రతి విషయం శ్రద్దగా వింటాడు. 
ఖచ్చితంగా అసందర్బపు మాట ఒకటో రెండో మాటలడతాడు. 
ఎందుకో మరి. 
ప్రసాదాలు ఎక్కువగా ఉన్నప్పుడు వాటి అంతు చూసే బాద్యత మాలాటి కొంత మంది వీరులకి తప్పదు. బేసికల్ గా నేను వీరుడినే :D
గుడి బయట రోజు మాదిరిగానే చర్చ జరుగుతుంది.
మాల ధారణ, మండల దీక్ష లాటి విషయాలు ట్రైని పూజారి చెబుతున్నాడు.
రెండు పూటల స్నానము. ఒంటి పూట బోజనము, నేల పడక, సత్యవచనము, సత్య ప్రవర్తన, దీపారాధన, దైవపూజ
బ్రహ్మచర్యం ..
సరిగ్గా అప్పుడే అతను కల్పించుకుని “ఒక్కరేనా ఇద్దరూ పాటించాలా?” అన్నాడు.
***
“మాస్టారూ సుందరయ్య భవన్ రోడ్డు లో నాగేశ్వర రావు గారని మంచి చెవి డాక్టర్ ఉన్నారు, వెంటనే కలవండి” కొంచెం పెద్ద గొంతు తో చెప్పాను.

ఓనం విందు

‘ఓనం’ పండగ కి తమ ‘అరబ్’ బాస్ ని బోజనానికి ఆహ్వానించాడు సౌదీ లో మంచి కంపెనీ లో మంచి హోదా ఉద్యోగం చేస్తున్న పద్మనాభన్. 
పద్మనాభన్ అంటే మంచి అభిప్రాయం ఉన్న బాసుడు అంగీకరించాడు.
క్యూరియాసిటీ తో “veg ఆర్ non-veg” అడిగాడు.
“ఇది మా ట్రెడిషనల్ పండగ అండీ పూర్తి శాకాహారం. స్వామి ప్రసాదం వడ్డించినవి ఏమి వదలకుండా భక్తితో స్వీకరిస్తాం”
ఆయనకి అర్ధం అయ్యేట్టు ఆయన భాషలో పద్మనాభన్ వివరించాడు. 
ఎంతో గొప్ప బాసుడు అయినా ‘ఇంట్లో బాస్’ కి ఫోన్ చేసి బోజనానికి వెళ్తున్నవిషయం చెప్పాడు.
సంప్రదాయాలంటే విలువ ఉన్న బేగమ్ గారు “ వారు వెజిటబుల్స్ ఎక్కువగా వాడతారు మీకు నచ్చినా నచ్చక పోయినా సర్వ్ చేసినంతవరకు శుబ్రంగా తినండి “ అని హుకుం జారీ చేసింది.
***
మద్యాన్నం బాసుడు బోజనానికి వచ్చారు..
అలసందల తో చేసిన చిట్టి వడలు స్టాటర్ గా మొదలెట్టారు.
డైనింగ్ టేబుల్ మీద అరిటాకు పరిచి, రాగి గ్లాసుతో నీళ్ళు ఉంచారు.
వంట గదిలోనుండి కొబ్బరి వంటకాలు తీసుకు రావటానికి పద్మనాభం జంట లోపలికి వెళ్ళి వచ్చేసరికి
బాసుడు కష్టం గా గ్లాసులో నీళ్ళు తాగుతున్నాడు.
***
టేబుల్ మీద అరిటాకు మాయం.

(ఎత్తిపోతల పదకం .. నా మాటల్లో )

Thursday, 15 September 2016

చాయస్

ఫ్లయిట్ టెక్నికల్ క్లియరెన్స్ సమస్య వలన లేటయింది. 
గాల్లోకి ఎగరగానే, అనౌన్స్మెంట్ వినిపించింది. “ లేటయినందుకు క్షమాపణలు, నష్టపరిహారం గా మీకు ఫ్రీ డ్రింక్స్ సర్వీస్ ఉంది.”
అందమయిన ఫ్లయిట్ అటెండెంట్ వయ్యారంగా నడుచుకుంటూ డ్రింక్స్ సర్వ్ చేస్తుంది. 
చివరి సీట్లో ఒక ‘పెద్ద మనిషి’ కూర్చుని ఉన్నారు. 
ఆయన ముఖం గంభీరంగా పెట్టి “ నేను adulteration కి అయినా సిద్దమే కానీ ప్రాణం పోయినా మధ్యం ముట్టుకోను” అన్నాడు. 
అప్పటికే డ్రింకు తాగేసిన పక్క సీటు అతను కంగారుగా ముందుకు వంగి తెల్లటి హోస్టేస్ ని ఆసక్తి గా చూస్తూ..
“ చాయస్ ఉందని నాకు తెలీదు.. ఇది తొండి .. నేనొప్పుకొను” బోరు మన్నాడు.
(పెద్ద పిల్ల కాయలకోసం :D :p :p )

www.susri.home.blog

  అందరికీ నమస్తే 66o పోస్టులు పైగా వ్రాసిన ఈ బ్లాగ్ లోని నా పోస్ట్ లలో  చాలా అచ్చుతప్పులు ఉండటం గమనించాను.  వాటన్నిటినీ ఎడిట్ చేస్తూ, modify...