Friday, 12 August 2016

శ్రావణ మాసం - కొన్ని జాగర్తలు


మీ చాకచక్యం అంతా ఉపయోగించి, శ్రావణ శుక్రవార నోములకి, 
తాంబూలాలకి ఆడ లేడీస్ ని పోనీయకుండా జాగర్త పడండి.
లేదో .. మీకు ఇత్తడయిపోద్ది.
..
ఒక వేళ వెళ్లారనుకోండి. వాళ్ళు ఇంటికి వచ్చేసరికి విచారంగా మొహం పెట్టి, 
ఫ్లాట్ రేపేరుకి డబ్బు కట్టాల్సి వచ్చిందనో, కార్/హౌస్ లోన్ కిస్తిలు ఆరునెలలుగా పేరుకు పోయి ఉన్నాయనో, లేక మరో రెండు నెలలు జీతం రాదనో, మరేదో ఖర్చనో బొంకండి. 
'
ఆరోగ్యం బాలేనట్టు' నటించి 'టృంప్ కార్డు' బయటకి తీయండి. 
ఎందుకు చెబుతున్నానో గమనించుకోండి.
..
పెరంటాలలో నిజానికి జరిగేది, ప్రదర్శన, ఫోటో షూట్ లు, కొత్త చీరలు, నగలు, అక్సెసరీస్, ఐ బ్రోస్ , అబ్బో అవి చెప్పేవి కాదు. ఫోటోలు, చిరునామాలు, ధరవరలు బుర్రలో సేవ్ చేసుకుని ఇంటికి వస్తారు. పదిగ్రాముల చలిబిండి చేతి లో పెట్టి అది గొంతు దిగక ముందే ..   
మీరు నేను చెప్పిన జాగర్తలు తీసుకోలేదో.. మిమ్మల్ని విజయ్ మాల్వా కూడా కాపాడలేడు. ఇక మీష్టం.
..
మా గుండమ్మ పెరంటానికి దగ్గర్లో ఉన్న పోష్ అపార్ట్మెంట్ కి వెళ్లింది.
పది పదిహేను నిమిషాల్లో రావచ్చు..ప్రిపేర్ అవ్వాల్సి ఉంది. నమస్తే..

Monday, 8 August 2016

వాస్తు హోమం _శాంతి హోమం


 శ్రీ .అభయాంజనేయ  స్వామి వారి, బింబ, ద్వజస్తంభ, విమాన కలశ ప్రతిష్టా కార్యక్రమ వాస్తు హోమం మరియు శాంతి హోమం .

Saturday, 6 August 2016

రెండు విషయాలు

'కృష్ణ మోహన్' అని స్వామి వారి దేవాలయానికి ఒక గొప్ప దాత అయిన యువకుడు ఉన్నాడు. 
స్వంత ట్రాక్టర్ ఉంది. దేవాలయానికి సంబందించి ప్రతి కార్యక్రమానికి అతను ట్రాక్టర్ పంపుతాడు. ఆయిల్, డ్రైవర్ ని అతనే ఏర్పాటు చేస్తాడు. 
ఈ రోజు తాను కూడానే ఉన్నాడు. నిలువెత్తు పూలమాలలు తీసుకు వచ్చాడు. 
మూడు గంటల పైగా ఊరేగింపు జరిగింది. దేవాలయం లో కార్యక్రమం మరో గంట. 
డ్రైవర్ ని దిగమని అతనే బండి తోలాడు. 400 కేజీ లు పై చిలుకు ఉన్న స్వామివారిని వాహనం నుండి దించి ఆలయం లోకి తీసుకు వస్తుంటే .. ఆలోచన లోని ఒకావిడ గ్రానైట్ మెట్ల మీద నీటిని వారుగా పోసింది. ముందు వరసలో ఉన్న వాళ్ళ కాళ్ళు మెట్లమీద జారాయి. అతికష్టం మీద తమాయించుకుని క్షేమంగా స్వామివారి బింబాన్ని లోపలికి తీసుకు వచ్చారు.
...
"జారీ పడి పోతానేమో నని భయం వేసిందండి. కానీ ఆయనే ఆపాడు. లేకపోతే నడుములు విరిగేవి ' అన్నాడు నా పక్కకి వచ్చి నిలబడి.
...
"ఈ మధ్య కాలంలో అయిదుగంటల పాటు సిగిరెట్టు తాగకుండా మీరు ఉండటం ఇదే చూడటం " నేను నవ్వుతూ గుర్తు చేశాను. అతను దాదాపు చైన్ స్మోకర్.
..
"అవును గుర్తే లేదండీ " అన్నాడు.
"నేను సిగిరెట్టు లేకుండా ఉండలేనేమో అని ఒక అపనమ్మకం. ఇప్పుడు నమ్మకం కుదిరింది. మానేస్తాను. లేదా ఖచ్చితంగా తగ్గిస్తాను." అన్నాడు.

-------------------------------------------------------------------------------------------------------------------------------
కొన్ని సంగతులు కాకతాళీయమో లేక దైవ సంకల్పమో తెలీదు కానీ 'జరుగుతుంటాయి' 
..
మేము స్వామివారి బింబాన్ని ఊరేగింపుగా తీసుకు వచ్చే ఏర్పాటులో ఉన్నప్పుడు ఒక ఫోన్ కాల్ వచ్చింది 'గజ్జల శ్రీనివాస రెడ్డి' అనే మిత్రుడి నుండి. విజయవాడ లో ఉన్నాను మరో పావుగంటలో కార్లో ఒక్కడినే బయలు దేరుతున్నాను." అని .. ..
..
నేను సమాదానం చెప్పేలోగా మా ఓబులురెడ్డి మాస్టారు నాదగ్గరకి వచ్చి "గోపుర శిఖరం మీద కలశం ఇస్తానన్న దాత తను తేలేక పోయాడు, మీరు తెచ్చుకోండి. బిల్లు తీసుకురండి డబ్బులు ఇస్తాను అంటున్నాడు." ..
..
నేను ఫోన్ కి చెయ్యి అడ్డుగా ఉంచి " ఎక్కువ గా ఆలోచించొద్దు.. విజయవాడ లో కలశాలు దొరుకుతాయా ?" ..
..
'పోలవరం రాము అని ఒకతను ఉన్నాడు. అతని కార్డు నాదగ్గర ఉండాలి" అన్నాడు సారు. "చూడండి చూసి నెంబరు చెప్పండి."..
..
ఫోన్ లో వెయిట్ చేస్తున్న మిత్రుడికి" కారు ఆపుకుని కాఫీ తాగు. తాగే లోపు whats app లో ఏం చెయ్యాలో వివరాలు వస్తాయి " అని చెప్పాను...
..
ఈలోగా మాస్టారు విజిటింగ్ కార్డు తీసి ఇచ్చారు. వివరాలు చెబుతూ..
కార్డ్ ని ఫోటో తీసి" 30 అంగుళాల ఎత్తు, విష్ణు చక్రం ఉండే కలశం ఈ కాంటాక్ట్ లో ఉన్న వ్యక్తి ని కలిసి తీసుకొచ్చేయ్. మేం .అతనికి ఫోన్ చేసి వివరాలు చెబుతాం ఈ లోపు. కాష్ against బిల్. ఇంతకీ డబ్బులున్నాయా?"
అటునుండి తను ' పర్లేదు 12 వేల దాకా ఉన్నాయి. సరిపోతాయా?' అని తిరుగు టపా ..
'లక్షణంగా' అని చెప్పి మా పనిలో పడిపోయామ్.
స్వామి వారి 'దాన్యాది వాసం' కార్యక్రమం చూసి ఇంట్లోకి వస్తుంటే శ్రీనివాస రెడ్డి నుండి ఫోన్ కలశాలు 'పాలిష్ చేసి రెడీగా లేవని, ఇప్పటిదాకా కూర్చుని పాలిష్ చేయించి. బిల్ చెల్లించి బయలదేరబోతున్నానని.'
'గుడ్ బయలు దేరి వచ్చెయ్ .. జాగర్త ..పొద్దుటే కలుద్దాం "
.
మాకేమిటండీ ? మా వానర సైన్యం ఉంది. ఏ ఆటంకం ఉండదు.

ధాన్యాదివాసం

ఎనిమిదేళ్ళ క్రితం దేవాలయ నిర్మాణానికి శంకుస్థాపన జరిగిన 'శ్రీ అభయంజనేయ స్వామి వారి దేవాలయం'
(మర్రిచెట్టు కాలనీ, మంగమూరు రోడ్డు, ఒంగోలు , ప్రకాశం జిల్లా, ఆంధ్ర ప్రదేశ్ ) ఈ నాటికి ఒక రూపు రేఖలు అందుకుంది. 10 తేదీ న దేవాలయం లో కొలువవటానికి 'ఆంజనేయుడు' బయలు దేరి వచ్చాడు.
మా గ్రామ ప్రజలు, ఊరేగింపుగా వెళ్ళి స్వామివారిని, మేళ తాళాలు తో బాజా బజంత్రీలతో, ఊరేగింపుగా తీసుకుని వచ్చారు. స్వామివారు నేడు దాన్యది వాసం చేస్తున్నారు. మరో ప్రక్క ఈ పండుగకి అన్నీ ఏర్పాట్లు బక్తులు చేస్తున్నారు.





ఆహ్వానం _/][\_


Friday, 5 August 2016

మరో ఏడు జన్మలు

స్వర్గం లో 'జనరల్ బాడీ' మీటింగు జరుగుతుంది. 
ఒక జటిలమయిన సమస్య చర్చకి వచ్చింది.
చిత్రగుప్తుడు ఈ సమస్యని ప్రవేశ పెట్టాడు. 
పునర్జన్మ సమస్య గురించి.
“
శ్రావణ మాసం, కార్తీక మాసం మహిళామణులు, మరో ఏడు జన్మల వరకు ఇదే భర్త కావాలని, బొల్దెంత టైమ్ & టెక్నిక్స్ వాడి ఈ జన్మలో తాము ట్రైన్ అప్ చేసుకున్నామని, కనీసం మరో ఏడు జన్మల వరకు వారి సేవలు అనుభవించే హక్కు తమకి ఉందని ఉమ్మడి ఏజండా తో ఉన్నారు.”
“
ఇందులో సమస్యేముంది?” బ్రహ్మ ఆశ్చర్యం.
“
మగాళ్ల ప్రతినిధిగా చలసాని కిశోర్ దీనికి వప్పుకోవటం లేదు. పండగ నాడు కూడా పాత పెళ్లామేనా? మేం వప్పుకోము అంటున్నాడు. జేబులో ఆల్రెడీ నెక్స్ట్ జన్మ ఛాయిస్ పోటో పెట్టుకు తిరుగుతున్నాడు”
సమస్య జఠిలమయ్యింది. అనేక వాదోపవాదాలు, సలహాలు , సూచనలు మైక్ లు విరగ్గొట్టుకోటాలూ, పత్రాలు విసురుకోటాలూ జరిగాయి. 
వెనుక బెంచీ నుండి చాణుక్యుడు లేచి నిలబడ్డాడు. అతని మీద గౌరవం తో అంతా ఒక్క నిమిషం లో సర్దుకుని అతనికి మాట్లాడే అవకాశం ఇచ్చారు. 
“
వచ్చే ఏడు జన్మలకి ఇదే బర్త ని అంగీకరించండి..”
మగాళ్ల అల్లరి మళ్ళీ మొదలయింది. చాణుక్యుడు ఆగమన్నట్లు చూసి “ అదే అత్త, వాళ్ళే ఆడబిడ్డలు కామన్ పాకేజీ అనౌన్స్ చేద్దాం”
ఆడాళ్ళ గొడవ మొదలయింది. వాళ్ళని సముదాయించడం ఎవడివళ్ళా కాదు. 
వాళ్ళు మాట్లాడుతూనే ఉంటారు కానీ మీరు రెడీ అయ్యి ఆఫీసుకి బయలుదేరండి. 
శుబోదయం. మిత్రులందరికి.

Wednesday, 3 August 2016

మనం చేస్తున్నది కరెక్టేనా?

శ్రావణ మాసం తొలి ఉదయం నేనో విషయం చర్చకు తీసుకు రాదలిచాను.
వ్యక్తిగతంగా నాకు భగవంతుని పూజా విధానాలు కానీ మంత్రాలు  కానీ తెలియదు . కానీ మనసు నిండా భగవంతుని ‘ఉనికిని’ విశ్వసిస్తాను. పూజా కార్యక్రమాలప్పుడు మా శ్రీమతి పూజ చేస్తుంటే నేను లిప్ మువ్మెంట్ J ఇస్తుంటాను.
అభయంజనేయ స్వామి వారి ఆలయ నిర్మాణం లో నేను టెక్నికల్ విషయాల భాద్యత మాత్రమే తీసుకున్నాను, ఆగమ విషయాలు తెలిసిన పెద్దలు మిగిలిన విషయాలు చూస్తున్నారు. నేను కేవలం సర్వీస్ ప్రొవిడర్ ని. ఇది నిజం.
మంచి భావాలు, ఆలోచనలు ఎక్కడున్నా చదువుతాను వాటిని ఆస్వాదిస్తాను; వీలయితే మీతో పంచుకుంటుంటాను.
నాకో విషయం చెప్పాలని ఉంది.
ఆ మధ్య కాలికి వాడే చెప్పుల మీద, శరీరం కప్పుకునే బికినీల మీద హిందూ దేవుళ్ళ బొమ్మలు ప్రచురించారని వాళ్ళని నానా తిట్లు తిట్టాము. ఆ వస్తువులు ఆన్ లైన్ లో అమ్మే సంస్థల సేవలు కూడా రద్దు చేయాలని ఆవేశపడ్డాం.









మరి మనం చేస్తున్న పని ఏమిటి?
శ్రావణ మాసం ఉదయాన్నే దేవాలయానికి వెళ్ళండి. అప్పటికే చాలా మంది బక్తులు, దీపారాదన చేసి ఉంటారు, పసుపు, కుంకుమ పాకెట్లు, సాంబ్రాణీ కడ్డీలు, కర్పూరం, నూనె పాకెట్లు ఎక్కడివక్కడ కాలితో తొక్కకుండా నడవ లేకుండా పడి ఉంటాయి లేదా కొంచెం శ్రద్ద గలవాళ్లు చెత్తబుట్టలో వేస్తారు.




వాటన్నిటి మీదా భగవంతుని రూపాలు ముద్రించి ఉండవా?
ప్రసాదం పాకెట్లు, కేరి బాగులు వీటిమీద ఏం ముద్రిస్తున్నాం ??  చివరికి ఇవన్నీ ఎక్కడికి చేరుతున్నాయి? చెత్త లోకి లేదా మురికి కాలవలోకి.
మరి హిందువులుగా మనం మన దేవతా రూపాలని  నిజంగా గౌరవిస్తున్నామా?
మనసు లగ్నం కావటం కోసం ఏర్పాటు చేసుకున్న దేవతా మూర్తుల పాత్రలని  మన సినిమాల్లో _____ (మాటల్లేవు)
మన ఇంట్లో పెద్దని మనం గౌరవించకుండా పక్కింటి వాళ్లనుండి పూజలు అందుకోవాలనటం ఎంతవరకు సబబు?

03/08/16

www.susri.home.blog

  అందరికీ నమస్తే 66o పోస్టులు పైగా వ్రాసిన ఈ బ్లాగ్ లోని నా పోస్ట్ లలో  చాలా అచ్చుతప్పులు ఉండటం గమనించాను.  వాటన్నిటినీ ఎడిట్ చేస్తూ, modify...