2004 లో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం తన పూర్తి దృష్టిని ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ (జల యజ్ఞం) మీద పెట్టింది. అనేక ప్రధాన ప్రాజెక్ట్స్ ని, పరిశీలించింది. చాలా ప్రాజెక్ట్స్ కి నిధులు మంజూరు చేసి ప్రారంభించింది.
అప్పటికే కేంద్ర ప్రభుత్వ పరిశీలనలో ఉండి ‘రామ పాద సాగర్ ప్రాజెక్ట్’ నుండి ”పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్” గా గుర్తింపు పొందిన ఈ ప్రాజెక్ట్ అప్పటి ముఖ్యమంత్రి ని ఎంతో ఆకర్షించింది. అప్పటికే దాని అంచనా వ్యయం 8200 కోట్లు.
సహజంగా భారీ ఇరిగేషన్ ప్రాజెక్ట్ లు కేంద్ర ప్రభుత్వ అధీనం లో జరుగుతాయి. కాని అప్పటి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు అనుకూలత చూసుకుని మంత్రి వర్గం రాష్ట్ర ప్రభుత్వ నిధులతో నే ప్రారంభించాలని నిర్ణయించుకుంది..
ఈ నిర్ణయం వెనుక అనేక ఆకర్షణీయమయిన/ అద్బుతమయిన కారణాలు ఉన్నాయి.
గోదావరి నది సహజసిద్దమయిన వంపు తిరిగి ప్రాజెక్ట్ కట్టుకోవటానికి అనుకూలంగా ఉండటం.
కేచ్మేంట్ ఏరియా(catchment area)* ఎక్కువగా ఉండటం, స్టోరేజ్(storage)* కెపాసిటీ ఎక్కువగా ఉండటం, గోదావరి నదికి వరద నీరు ఎక్కువగా వస్తూ ఉండటం, అనేక లక్షల cusec ల నీరు సముద్రం లో కి విడవాల్సి రావటం లాటివి.
కేచ్మేంట్ ఏరియా(catchment area)* ఎక్కువగా ఉండటం, స్టోరేజ్(storage)* కెపాసిటీ ఎక్కువగా ఉండటం, గోదావరి నదికి వరద నీరు ఎక్కువగా వస్తూ ఉండటం, అనేక లక్షల cusec ల నీరు సముద్రం లో కి విడవాల్సి రావటం లాటివి.
మరీ ముఖ్యంగా “ప్రాజెక్ట్ పూర్తి అయి పూర్తి స్థాయి లో రిజర్వాయర్ లో నీరు నిలవ ఉంచగలిగితే” అది దిగువ ప్రాంతాల కి #వరసగా#నాలుగు_కరువు_సంవత్సరాల ని తట్టుకుని పంట/ తాగు నీరు ఇవ్వగలగటం. అంత పెద్ద భారీ ప్రాజెక్ట్.
2004 లో కుడి కాలవ పనులు మొదలయ్యాయి. 2005 లో ప్రాజెక్ట్ మొదలయ్యింది.
అంతే వేగంగా 2006 మే లో డాం నిర్మాణం ఆగి పోయింది.
అంతే వేగంగా 2006 మే లో డాం నిర్మాణం ఆగి పోయింది.
అటవీ శాఖ, మైనింగ్, వన్య ప్రాణుల సంరక్షణ, ప్రకృతి, ముంపు ప్రాంత నిర్వాసితుల సమస్య లాటి అనేక కోర్టు సమస్యలు, విఘాతల కారణంగా నిర్మాణం అపెయ్యవలసి వచ్చింది.
అయితే ప్రధాన డాం పని అగినప్పటికి కాలవ పనులు మాత్రం కొనసాగాయి.
రాష్ట్ర ప్రభుత్వ చొరవ, కేంద్ర ప్రభుత్వ సహకారం తో ప్రాజెక్ట్ ఇబ్బందులు అన్నీ 2009 కి మబ్బుల్లా విడిపోయాయి.
దాదాపు నూరు శాతం అనుమతులతో ప్రాజెక్ట్ పనులు పరిగెత్తాల్సిన సమయం వచ్చింది.
తెలుగు రాష్ట్రం లో అక్టోబర్, 2009 ఒక విషాదం చోటు చేసుకుంది.
రాష్ట్రం ఒక #ముఖ్యమంత్రిని కోల్పోయింది.
రాష్ట్రం ఒక #ముఖ్యమంత్రిని కోల్పోయింది.
జలయజ్ఞం కింద మొదలయిన చాలా పనులు ఆగిపోయాయి. ఆపధర్మ ముఖ్యమంత్రులు కేంద్ర ప్రభుత్వం నుండి నిధులు మరలించలేక పోయారు. ప్రాజెక్ట్ పనులు ఆగిపోయాయి.
#నిర్మాణ_వ్యయం మాత్రం రోజు రోజుకి పెరిగి పోతూ ఉంది.
కొన్నాళ్ళకి రాష్ట్ర ప్రభుత్వం “పోలవరం ప్రాజెక్ట్” కి జాతీయ హోదా కావాలని విన్నపాలు మొదలెట్టింది.
జాతీయ హోదా అంటే ప్రాజెక్ట్ ఖర్చులో 90 శాతం నిధులు కేంద్రం ఇవ్వటం.
జాతీయ హోదా అంటే ప్రాజెక్ట్ ఖర్చులో 90 శాతం నిధులు కేంద్రం ఇవ్వటం.
అప్పటి ప్రధాని అంగీకరించలేదు. మౌన ముద్ర వీడలేదు. ఒక రాష్ట్రానికి ఆ స్థాయిలో నిధులు అందించడం సాద్యం కాదనేది ఆయన ప్రబుత్వ వాదన.
కాలం పరిగెడుతూనే ఉంది.
నాటకీయం గా తెలుగు రాష్ట్రం బహువచనం అయ్యింది.
విడిపోయిన ఆంధ్రపదేశ్ లోటు బడ్జెట్ లో ఉన్నందున పోలవరం కి నేషనల్ స్టేటస్ ఇస్తామని ప్రబుత్వం హామీ ఇచ్చింది.
విడిపోయిన ఆంధ్రపదేశ్ లోటు బడ్జెట్ లో ఉన్నందున పోలవరం కి నేషనల్ స్టేటస్ ఇస్తామని ప్రబుత్వం హామీ ఇచ్చింది.
2014 ఎన్నికల తర్వాత రాజకీయ ముఖ చిత్రం మారిపోయింది. కేంద్రం లో అధికారం లోకి కొత్త ప్రభుత్వం వచ్చింది. రాష్టం లో సీనియర్ నాయకుడి ప్రభుత్వం ఏర్పడింది.
రాష్త్రం విడిపోయే ముందు ఇచ్చిన స్పెషల్ స్టేటస్ హోదాని కొత్త ప్రబుత్వం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం వత్తిడి చేసింది.
ఎన్నికలలో సపోర్ట్ చేసిన రాష్ట్ర ప్రభుత్వ అబ్యర్ధన న ని కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. పోలవరం కి స్పెషల్ స్టేటస్ #ఇచ్చింది.
అంతా బాగుంది ఇక ఆటంకాలు లేవు ప్రాజెక్ట్ తిగిరి పట్టాలు ఎక్కే దశ లో ఒక అవాంతరం వచ్చింది.
కొంతమంది హ్యూమన్ రైట్ activist లు ...
వారి వాదన ఇలా ఉంది..
వారి వాదన ఇలా ఉంది..
ప్రాజెక్ట్ పూర్తి అయితే అప్ స్ట్రీమ్ (upstream side*) లో ఉన్న సుమారు 276 గ్రామాలు ముంపుకి గురవుతాయి. ఆ గ్రామాల ప్రజలకి నష్టం వాటిల్లుతుంది. వారి కి సరైన మార్గాంతరం చూపకుండా ప్రాజెక్ట్ పనులు కొనసాగించా రాదు.
అనేక వందల ఎకరాల అడవి ప్రాంతం నీట మునిగి పోతుంది. తిరిగి రెట్టింపు వైశాల్యం లో అడవిని పెంచాలి,
అటవీ వన్య మృగ రక్షణ కి చర్యలు చేపట్టాలి.
ముందుగా ఇవన్నీ సంతృప్తికరంగా చేసాక మాత్రమే ప్రాజెక్ట్ తిరిగి మొదలెట్టాలి ..
ప్రాజెక్ట్ పని మొదలవకుండానే ఆగి పోయింది.
1 comment:
// "నాటకీయం గా తెలుగు రాష్ట్రం బహువచనం అయ్యింది." //
I like that. ఆ బహువచనం అనే మాట నాకు బాగా నచ్చింది 👌.
పోలవరం ప్రాజక్ట్ గురించి చాలా ఆసక్తికరంగా వ్రాస్తున్నారు, థాంక్స్.
Post a Comment