Wednesday 13 February 2019

రామపాద సాగర్ ప్రాజెక్ట్. (Polavaram-1)


#L_వెంకట_కృష్ణ_అయ్యర్ తమిళనాడు లోని కుంభకోణం పట్టణం లో హైయ్యర్ సెకండరి స్కూల్ విద్యార్ధి. 
సివిల్ ఇంజనీరింగ్ చేసి పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ లో పని చేసేవాడు. చీఫ్ ఇంజనీరుగా పదవీ విరమణ చేసారు. 

#గోదావరి నది మిగులు జలాలని ఒక ఆనకట్ట కట్టి , రిజర్వాయర్ లోని నీటిని గ్రావిటీ ద్వారా కృష్ణా నది కి మళ్ళించి ఎన్నో ఎకరాలని సస్యశ్యామలం చెయ్యొచ్చని భావించాడు.
గుర్రాల మీద సర్వే సామాను వేసుకుని, ఆరోగ్యాన్ని లెక్కచేయ కుండా, అటవీ ప్రాంతాలలో అహోరాత్రాలు తిరిగి ధవళేశ్వరం కి యాబై కిలోమీటర్ల్ దూరం లో #పోలవరం అనే చిన్న పల్లెటూరి వద్ద మాత్రమె అనుకూలమయిన ప్రదేశం ఉందని, అక్కడ ఒక స్పిల్ వే కట్టి నీటిని నిలవ చేస్తే, గ్రావిటీ సాయం టో నీటిని కృష్ణ నది కాలవ కి మళ్ళించ వచ్చని, కరువు కాలం లో ఆంద్ర రాష్ట్రానికి ఒక జీవ ధార అవుతుందని, మొట్టమొదటగా ఒక ప్రాజెక్ట్ తయారు చేసి ప్రభుత్వానికి సబ్మిట్ చేసాడు. #అదీ_1941 లో స్వతంత్రం రాక మునుపు.
రమా రమి రెండువందల చదరపు మైళ్ళ విస్తీర్లం లో ఉండబోయే రిజర్వాయర్ పూర్తి నీటి సామర్ధం తో ఉంటె.. భద్రాద్రి రాముని పాదాలు వరకు గోదావరి ని నిలవరించ వచ్చు. #ఆరున్నర_కోటి రూపాయల పూర్తి అంచనా విలువ.
1961 లో #పద్మ_భూషణ్ గా భారత ప్రభుత్వం చేత గౌరవించబడిన ఈ తమిళ సివిల్ ఇంజనీరు (
ఈయన "అన్నా యునివర్సిటీ" లో MIT నహ స్థాపకుడు కూడా )  ఆయన మొదటగా
ప్రతిపాదించిన పేరు....
#రామ_పాద_సాగర్_ప్రాజెక్ట్

1 comment:

విన్నకోట నరసింహా రావు said...

మంచి టాపిక్ మీద మీ టపాల సీరీస్ మొదలెట్టారు, థాంక్స్.

శ్రీ వెంకట కృష్ణ అయ్యర్ గారితో బాటు రామపాదసాగర్ ప్రాజక్ట్ గురించి కృషి చేసిన అధికారి మరొకరున్నారు. వారే సర్ శొంఠి వెంకట రామమూర్తి గారు, ICS. బ్రిటిష్ వారి పాలనలో మద్రాస్ ప్రెసిడెన్సీ ప్రభుత్వంలో ఛీఫ్ సెక్రటరీగా నియమితుడైన మొదటి భారతీయుడు. ఈ క్రింది లింక్ లో "It was Sri L. Venkatakrishan Iyer who first told me of the possibility of a dam near Polavaram below the gorge through the Papikonda hills being built on the Godavary. …" పేరా నుండి ప్రాజక్ట్ గురించి వారు చేసిన ప్రయత్నాల గురించి తెలుస్తుంది.

Sir శొంఠి వెంకట రామమూర్తి, ICS

www.susri.home.blog

  అందరికీ నమస్తే 66o పోస్టులు పైగా వ్రాసిన ఈ బ్లాగ్ లోని నా పోస్ట్ లలో  చాలా అచ్చుతప్పులు ఉండటం గమనించాను.  వాటన్నిటినీ ఎడిట్ చేస్తూ, modify...