రెండు మూడేళ్ళ పిల్ల కళ్ళ వెంట నీరు కారేట్టు గా ఏడుస్తూ ఉంది.
అలవాటు అయిన చిన్న హోటల్ వద్ద టిఫిన్ కోసం ఆగాను.
బెంచీలుగా ఉన్న నాప రాళ్ళ మీద కూర్చునే సరికి ప్లాస్టిక్ సీసాలో మంచినీళ్ళు అందించింది హోటల్ ఆమె.
ఏడుస్తున్న పాప వైపు చూసాను.
‘బుగ్గలు వత్తానని’ ఏడుస్తుంది అని సమాదానం గా అంది ఆవిడ.
సరయిన పెంపకం లేనట్లు లూజు గౌను, బలహీనంగా ఉన్న ఆ పాపని సముదాయించ బోయే లోపు ఒక ముసలావిడ వచ్చి కూర్చుని పిల్లని చేతుల్లోకి తీసుకుంది. “శేట్టెమ్మ బుగ్గ పట్టుకుంది” ఏడుస్తూనే చెప్పిందాపిల్ల.
ఈ లోగా హోటలావిడ ఒక ప్లేట్ లో ట్రాన్స్పరెంట్ కాగితం మీద దోసె ఒకటి వేసి పెద్దావిడకి ఇచ్చింది.
ఆవిడ ఒక ముక్క తుంచి నోటితో ఊది.. ఏడ్చే పిల్ల ని సముదాయించి నోట్లో ఉంచింది.
పిల్ల ఏడుపు మాని ఆడుతూ తినసాగింది.
“ఏం పేరు?” పెద్దావిడని అడిగాను.
“పసన్న” అంది ఆవిడ.
నా ప్లేట్లో ఇడ్లీ తింటూ ఆవిడతో మాట కలిపాను.
ప్రసన్న రెండో నెల బిడ్డ అప్పుడు తల్లి పొదిలి నుండి అటో లో వస్తుంటే, గిద్దలూరు నుండి అరటి కాయల లోడు మినీ లారీ కొట్టేసింది. అటో పక్కనున్న కాలవ లోకి దొర్లి పోయింది. పసన్న తల్లి వళ్ళో బిడ్డని కాపాడుకుంది కానీ, ఆమె తల బలంగా అటో రాడ్డు కి కొట్టుకుంది. దగ్గరలో ప్రబుత్వ ఆసుపత్రికి తర్వాత ప్రైవేటు ఆసుపత్రికి అటునుండి శ్మశానానికి వెళ్లి పోయింది ఆవిడ.
రెండో నెల బిడ్డ పసన్న, ఆరేళ్ళ పసన్న అక్కని నాయినమ్మ కాపాడుకుంది. పాలు మరవని బిడ్డని మేక పాలు పట్టించి. చెట్టెమ్మ ఇడ్లీ తినిపించి కాపాడుకుంది. స్కూల్ బస్సు డ్రైవర్ గా పనిచేసే కొడుక్కి, ఇద్దరు మనమరాళ్ళకి మళ్ళీ ఆవిడే దిక్కయింది.
“ఇన్సురెన్సు డబ్బు రాలేదా పెద్దమ్మా?”
“వచ్చిందయ్యా చంద్రన్న భీమా అయిదు లచ్చలు వస్తే.. రెండు లచ్చలు ఆసుపత్రి ఖర్చు అయింది. పిల్లల పేరు మీద డబ్బు వెయ్యటానికి పెద్దోళ్ళు అవాలంటగా అందుకని మిగిలినవి కొడుకు వడ్డీకి ఇచ్చాడు.”
“అబ్బాయికి ..మళ్ళీ పెళ్లి చెయ్యలేదా?”
“చేసుకోలా.. ఒకరిద్దరు పిల్లని ఇస్తామన్నారు కాని మూడు లచ్చలు కోడలు పేరు మీద వెయ్యలన్నారు.. మా వాడు వప్పుకోలేదు.
టిఫిన్ చెయ్యటం అయిపోగానే నేను కూడా ఆపిల్ల బుగ్గలు పట్టుకుని బయలు దేరాను.
**
జిల్లా కేంద్రం లో సి ఏం గారి జ్ఞాన భేరి కార్యక్రమానికి ఏర్పాట్లు కి డ్యూటీ వేసారు. ఒక పైలాన్ కట్టించే పని అప్పగించారు.
రెండు రోజులు బిజీ షెడ్యుల్ లో గడిచి పోయింది.
తీరా ముఖ్యమంత్రి ప్రోగ్రాం రోజు సెక్యురిటీ చెకప్ ఎక్కువయింది. పాస్ లు ఉంటె కాని వేదిక వద్దకి వెళ్ళే పరిస్థితి లేదు.
వెహికల్ పార్కింగ్ కూడా దూరం గా ఏర్పాటు చేసారు.
ప్రోగ్రాం రోజు ఆఫీస్ కారు పార్క్ చేసిన చోట నుండి వేదిక వయిపు నడుస్తుంటే .. దూరం నుండి ఖాకి యునిఫారం వేసుకుని ఒకతను దగ్గరకి పరిగెత్తుకు వచ్చాడు. “సార్ మాది కొనకనమిట్ల.. మీరు ఏ ఇ గారు కదా... “ అన్నాడు.
నేను అతన్ని పరిశీలనగా చూసి, సరిగా గుర్తు లేదు తమ్ముడూ.. స్కూల్ పిల్లలని తీసుకువచ్చావా?” అని అడిగాను.
“అవునండీ... ఒక్క పాస్ ఇప్పించారా .. ముఖ్యమంత్రి గారి ప్రసంగం వినాలి” అన్నాడు అభ్యర్ధన గా.
నేను నవ్వి “ సి ఎం గారికి అంత ఫాను వా ?” అన్నాను.
“అగ్రి గోల్డ్ డిపాజిట్ల సంగతి ఏమయినా చెబుతాడేమో విందామని ..” అన్నాడు.
నేనూ జేబులో స్పేర్ ఉన్న విజిటర్ పాస్ తీసి అతనికి ఇచ్చి.. లోపలికి నడిచాను.
యాబై అడుగులు నడిచి ఉంటాను ఒక సందేహం నన్ను కుదిపేసింది.
వెనక్కి తిరిగి పెద్దగా “ తమ్ముడూ నీ చిన్న కూతురు పేరు పసన్నా ?” అన్నాను.
నన్ను దుఖం లోకి నెడుతూ ఆతను ఆశ్చర్యపోవటం.. ఈ దరిద్రపు కళ్ళ తో గమనించాను.

No comments:
Post a Comment