పాత డైరీలు చిత్తుకాగితలకి వేస్తుంటే కోప్పడి ఆపాను ..
తీరిగ్గా ఒక్కోటి తిరగేస్తుంటే..
***
New year resolution #1.
తీరిగ్గా ఒక్కోటి తిరగేస్తుంటే..
***
New year resolution #1.
2014 :: ఎలాగయినా సరే ఈ సంవత్సరం 80 కిలోల నుండి 68 కి తగ్గాలి
2015 ::ఈ యాడాది బాడి మిద శ్రద్ధ పెట్టాలి 85 నుండి 75 కి తగ్గాలి.
2016 :: పట్టుదల ఉంటె సాదించలేనిది ఏమి లేదు. 90 నుండి 70 కి వస్తాను.
2017 ::కళా నేను కలిసి నప్పుడు చిన్న చిన్న టార్గెట్లు పెట్టుకోవాలని అనుకున్నాం. ఎట్టి పరిస్థితుల లోను క్వింటాల్ దాటకూడదు.

New year resolution #2
2014 :: ఇవాళ ఒక కోడిని కోయటం చూసాను. అబ్బ ఎంత హింస?! నాన్ వెజ్ మానేస్తాను.
2015 :: షబ్బీర్ గాడి వద్ద వేట మాసం మంచి క్వాలిటి ఉంటుంది. అయినా సరే ఈ సంవత్సరం మాంసం ముట్టను.
2016 :: చినగంజాం లో పీతలు, బాగా దోరుకుతున్నాయి. ఆకు పచ్చగా ఉండేవి గుడ్ల సేరు తొ చాలా రుచి గా ఉంటున్నాయి. చికెన్, మటన్ మానేస్తాను. పీతలు రొయ్యలు ఎప్పుడన్నా.. పండక్కి పబ్బానికి తప్పులేదు.
2017 :: వారం లో నాలుగు రోజులు నాన్ వెజ్ తినకూడదు. అసలు ఆపేస్తాను. ఈ రోజు గెస్ట్ లు వస్తున్నారు కనుక తప్పదు .. ఈ రోజు తొ స్టాప్, అంతే స్టాప్ అంటే stop.

New year resolution #3
2014 :: చిన్న చిన్న చేబదుళ్ళు మానేయాలి.
2015 :: బ్యాంకు కి emi లు బాకీ పడ్డంత బుద్ది తక్కువ మరొకటి లేదు. ఈ ఏడాది అన్ని emi లో క్లోజ్.
2016 :: ముష్టి మూడు లక్షల అప్పుకి బజార్లో అడుగుతాడా వాడు. ఛి . వాడి మోహన కొట్టెస్తాను. బ్యాంకు వాళ్ళ నస ఎక్కువయింది. ఫోన్ తీస్తే ఒక చావు. తియ్యకుంటే మరోటి.
2017 :: ఎక్కడికయినా పారిపోతామా ఏమిటి?. లక్ష ఇచ్చినోడు కుడా అడగటమే? పది ఇచ్చినోళ్ళకి ఇంతవరకు గతి లేదు. అప్పులన్నీ లాగించేస్తాను.

New year resolution #4
2014 :: ఇదే చివరి పెగ్గు. ఇక ఈ యాడాది ముట్టితే ఒట్టు.
2015 :: వారానికి ఒక రోజు 90 పర్లేదంట. మొన్ననే ఒక డాక్టర్ చెప్పాడు. అయినా మందు మంచిది కాదు. ఆపేస్తాను.
2016 :: అబ్బే రోజు తాగటం మానేస్తాను. చంద్రబాబు మీద ఒట్టు. అంతే
2017 :: అషలు తాగితే తప్పెంటష?? నేనేమన్నా రోజంతా అదే పని మీద ఉన్నానా?? శేప్పు ??

New year resolution #5
2014 :: అబ్బే కనకం తొ మాట్లాడేదే లేదు. చ చ పరాయి .. ఎక్కడో ఫోన్ నెంబరు వ్రాసిన కాగితం ఉండాలి. దొరగ్గాన్నే చింపెస్తాను.
2015 :: కనకం .. పాపం నామీద బెంగ పెట్టుకుంది. అయినా ఏమడిగింది? ఎప్పుడన్నా ఒకసారి వచ్చి పలకరించమనేగా? ఎదో బాధల్లో ఉన్న మనిషి.
2016 :: అబ్బే కనకానికి నాకు కుదరదు. మరీ నెత్తి కి ఎక్కుతుంది. అయినా పక్కింటి పుల్లకూర తొ అసలు మనకేం పని? తనకి నాకు కటిఫ్.
2017 :: అబ్బే విశ్వాసం లేని మనిషి. నెలకి ఎంత ఖర్చు పెడుతున్నాను? ఎదో ఇబ్బందుల్లో ఉండి తనడిగిన నక్లెస్ కొనివ్వలేక పోయాననుకో .. అంతమాత్రాన .. ఛ ఛ ..

ఇదిగో నిన్నే.. ఈ అట్ట పెట్టెలో పాత డైరీలు ఉన్నాయి గాని బోగిమంట కి వాడు.

3 comments:
సిగరెట్ల తీర్మానం లేదే! ఆ అలవాటు లేదేమో బహుశః🤔?
అయినా ఇటువంటి విషయాలు అంత నిజాయితీగా డైరీలో వ్రాసుకుంటారా సుశ్రీ గారూ, మరీ అమాయకత్వం కాకపోతే? ఇంకా నయం, స్టాంప్ పేపర్ మీద వ్రాసుకుని నోటరీ చేయించలేదు ☺☺.
(సరదాగా వ్రాసిన వ్యాఖ్య. "జిలేబి" గారి పరిభాషలో చెప్పాలంటే "jk". ఈతరం వాళ్ళ ఊతపదం ప్రకారం - "లైట్ తీస్కోండి" ☺)
Funny. It is surprising jilebi onslaught has come down in recent times
నిజమే నండి. సిగిరెట్లు విషయం మర్చే పోయాను. మరో పోస్ట్ లో వాడుకుంటాను. :D
Post a Comment