నాలుగేళ్ల తర్వాత సంక్రాంతికి..సామర్లకోట.
కెనడా నుండి హైదరాబాదు.. అక్కడి నుండి రాజమండ్రి..
టాక్సీ లో స్వంతూరు ...
వ న జ.
రెండు జడల సీత. పల్లెటూరి పిల్ల. ఒద్దికయిన పిల్ల. పెద్ద కళ్ళతో అంతే పెద్ద బొట్టు తో తల కదిలించకుండానే చుట్టూ గమనిస్తుండేది. రెండు వీదుల అవతల.. దూరపు వరసకి మేనత్త కూతురు.
తీరా తను కెనడా వెళుతూ అమ్మా, నాన్నవద్ద గడిపిన చివరి వారం లో ..
హటాత్తుగా ‘మేనత్త’ సాయంత్రం తను ఇంట్లో ఉన్నప్పుడు “వనజ’ విషయం చెప్పింది.
అమ్మ “అంతా వాడిష్టం” అంది.
“నేను ఎంఎస్ చెయ్యాలి అత్తా.. ఉద్యోగం లో స్థిరపడాలి. కనీసం నాలుగయిదు ఏళ్ళు పట్టోచ్చు”
“నీ ఇష్టం బాబు ” అందావిడ.
**
ఎంఎస్ చేయటం అక్కడే మంచి ఉద్యోగం లో చేరటం అన్నీ అయ్యాయి.
ఇంటివద్ద ఉన్న అప్పులు తీర్చేశాను.
నాన్న కొంత పొలం కూడా కొన్నారు.

ఇన్నాళ్ళకి మళ్ళీ ఈ సంక్రాంతికి ఇంటికి వచ్చాను.
ఊరంతా తిరుగుతూ అందరినీ పలకరించాను.
వనజ కనిపించలేదు. అమ్మని అడగాలంటే బెరుకు.
ఈరోజు చింత తోపు లో కోడిపందాలు చూడటానికి వెళ్ళాను.
అక్కడ కనిపించింది.
చీరకట్టులో పెద్దరికం వచ్చింది.
నుదుటిన పెద్ద కుంకుమ బొట్టు.
చీరకట్టులో పెద్దరికం వచ్చింది.
నుదుటిన పెద్ద కుంకుమ బొట్టు.
పక్కనే ఒక పొడవాటి యువకుడు . అతని బుజాలమీద కూర్చుని ఉన్న చిన్న పాప అచ్చు వనజాలాగా... తండ్రి ఏదో చెబుతుంటే నవ్వుతుంది.
ఆమె కళ్ళకి దొరికాను.
“శేఖరం .. మా ఆయన .. మీ నాన్న కొన్న పొలం కూడా మేమే సేద్యం చేస్తున్నాం.” భర్త ని పరిచయం చేసింది.
“ఓహ్ కెనడా శేఖరమా.. ఈ రోజు మా ఇంటికి భోజనానికి రండి. స్పెషల్ ‘కోస మాంసం’ రుచి చూద్దురు.” అన్నాడతను చెయ్యి కలుపుతూ..
ఆ చెయ్యి దృడంగా .. ఆరోగ్యం గా ఉంది.
2 comments:
కోడి పందాలు చూడడానికి ఆడవాళ్ళు కూడా వెళతారా ? గోదావరి జిల్లా అంత అభివృద్ధి చెందిందా ? నాకు తెలియనేలేదండీ :)
హెడ్డింగ్ కోసా? కొసా ? అర్ధం ఏమిటీ ?
మీరు భర్త ని బర్త అని వ్రాస్తున్నారు....బ కి వత్తులు పెట్టవలసిన చోట వత్తులు పెట్టడం లేదు. బోజనం అంటే బాగులేదు.
సరిచేసుకుంటాను అండి. నా పాత పోస్ట్లు చదివినప్పుడు ఇంకా చాలా స్పెల్లింగు తప్పులు వ్రాసినట్లు గమనిస్తుంటాను. కొంత మంది సన్నిహితులు చెప్పినప్పటికీ నేను కరెక్ట్ చేసుకోలేక పోతున్నాను. "కోస' అంటే పందెపు పుంజు మాంసం అని.
గోదావరి జిల్లాలలో పై పందాలు కాసే ఆడవాళ్ళ వీడియో లు youtube లో బోలెడు. :D
Post a Comment