నిన్నటి రోజు..
ఉదయం వాకింగ్ కి వెళ్లి వచ్చి, వరండా లో కూర్చుని పేపర్ తిరగేస్తూ.. కాఫీ తాగిన సుబ్బారావు..
భార్యని పిలిచి ..'ఛాతి' నొప్పిగా ఉందని 'చమటలు' కక్కాడు.
అప్పటి కి అందుబాటులో ఉన్న ఆర్‌ఎంపి, 'లో బిపి' అని, మరో పావుగంటలో దగ్గర ఉన్న హాస్పిటల్ కి చేరి ecg మొదలెట్టగానే , డాక్టర్ మరో పెద్ద కార్పొరేట్ హాస్పిటల్ కి తీసుకు వెళ్ల మని సలహా ఇస్తే, ఆటో లో మెయిన్ రోడ్డు ఎక్కే సరికి అతని శరీరం చల్లబడి పోయింది.
...
ఇంటి యజమాని ఒప్పుకోకపోవటం తో 'శరీరం' ఆరామక్షేత్రా' నికి చేరింది.
....
పార్దీవాన్ని చూడటానికి సహోద్యోగుల తో పాటు బందు మిత్రులందరు చేరారు. అప్పులిచ్చిన శ్రేయోభిలాషులు కూడా..
....
ఆరేళ్ళ క్రితం కూతురు పెళ్లి కోసం స్వంత ఇల్లు అమ్మేసాడు.
తన స్వంత అలవాట్లు మానుకోలేక పోయాడు. మరో ఏడేళ్ల ప్రభుత్వ సర్వీసు మిగిలిపోయింది.
పాతికేళ్ల కొడుకు ఇప్పుడే జీవితపు తొలి దశ లో ఉన్నాడు.
...
చనిపోయిన సుబ్బారావు ని కనీసం నాలుగయిదు గంటలు అద్దె ఇల్లు భరాయించలేదా??? మనం ముందుకే నడుస్తున్నామా??
...
ఒక ధర్మ సందేహం. 😖
No comments:
Post a Comment