Sunday, 19 March 2017

సమర్పణ

రాజు గారు మందీ మార్బలం తో అడవికి వెళ్లారు. వేట కోసం.
దారి తప్పారు.. అలసి పోయి ఉన్నారు. ఆకలి, దాహం..
హటాత్తుగా పులి ఒకటి దాడి చేసింది.
కత్తి తో పోరాటం మొదలెట్టారు. అలసిన శరీరం సహకరించలేదు.
పులి పంజా విసరబోతుంది. కత్తి జారి పోయింది.
పులి మీదకి ఉరికింది.
ఈ లోగా ముగ్గురు కుర్రాళ్ళు .. వాయు వేగం తో వచ్చారు.
బరిశలతో దాడి చేశారు. పులి తోక ముడిచింది. అడవిలోకి పారి పోయింది.
ప్రమాదం తప్పి పోయింది.
ఈ లోగా పరివారం రాజుగారిని చేరింది. రాజు గారు బడలిక తీర్చుకున్నారు.
ముగ్గురికి కృతజ్ఞత తెలిపారు. ఏం కావాలో కోరుకోమన్నారు.
“నాకో ఉద్యోగం కావాలి” అని ఒకరు, బోలెడు నగదు కావాలని మరొకరు ..
రాజు గారు ఇద్దరి కోరికలు తీర్చారు.
మూడో వాడు “నాకేం వద్దు మహారాజా” అన్నాడు.
రాజుగారి అహం దెబ్బతింది. “కాదు కోరుకోవాల్సిందే అన్నాడు”
“సరే .. సంక్రాంతి కి మా ఇంటికి వచ్చి బోజనం చేయండి” అన్నాడు.
రాజు గారు అంగీకరించాడు.
అసలు కధ అప్పుడు మొదలయ్యింది.
కుగ్రామానికి రాజుగారు వెళ్లలేరు.. రోడ్డు సిద్దం అయ్యింది.
పూరింట్లో వసతులు లేవు. భవనం తయారయింది.
అల్లా టప్పా వాళ్ళింట్లో రాజా వారు బోజనమ్ చేయలేరు.
రాజా వారి సంస్థానం లో కొలువు ఏర్పాటయింది.
రాజావారి ఆహార వ్యవహారాలు తెలిసిన మనిషి కావాల్సి వచ్చింది.
అల్లుడు హోదా వరించింది.
..
కనుక ఇందు మూలంగా యావన్మంది కి తెలియచేయునది ఏమనగా..
దైవ దర్శనం కోసం వెళ్ళినపుడు  ..
సమర్పణ తో ఉండండి.

మీకేం కావాలో ఆయనకి తెలుసు. 

No comments:

www.susri.home.blog

  అందరికీ నమస్తే 66o పోస్టులు పైగా వ్రాసిన ఈ బ్లాగ్ లోని నా పోస్ట్ లలో  చాలా అచ్చుతప్పులు ఉండటం గమనించాను.  వాటన్నిటినీ ఎడిట్ చేస్తూ, modify...